పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు.
- AP Teachers TV
- Nov 18, 2023
- 2 min read
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు.
----------------------------------
ఆంధ్రప్రదేశ్ SSC బోర్డు నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వివిధ రకాల రాయితీలు, సదుపాయాలు, మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వంGO.MS. No. 86 ప్రకారం కల్పించింది. దివ్యాంగులయిన విద్యార్థులు అందరికీ పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడింది. హెచ్ఎంలు నామినల్ రోల్స్ పంపేటప్పుడు దివ్యాంగుల వివరాలను తప్పక పంపాలి. లేనిపక్షంలో, వారిని సకలాంగులుగా గుర్తించి వీరికి ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. కనుక అన్ని స్కూళ్లలో దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించి, వారికి ఉన్న ప్రత్యేక సదుపాయాలు గురించి తప్పక తెలియజేయాలి.
అందులో ముఖ్యమైనవి1) శారీరక వికలాంగులైన విద్యార్థులకు( Orthopedic) ఏదైనా ఒక భాష(Language) నుండి పరీక్ష రాయకుండా మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన పరీక్షలు అన్నిట్లో 35 మార్కులు తప్పక సాధించాలి.
2) అదేవిధంగా అంధులకు( Blinds) కూడా ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. కానీ మిగిలిన 5 సబ్జెక్టులలో కనీసం 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.
3) వినికిడి లోపం( Deaf) గల విద్యార్థులకు రెండు భాషల నుండి మినహాయింపు ఇవ్వబడినది. మిగిలిన 4 సబ్జెక్టులలో 20 మార్కుల సాధిస్తే వారు పాస్ అయినట్లే.
4) మాటలోపం( Speech Problem) గల విద్యార్థులకు అన్ని (6) సబ్జెక్టులలో 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే.
5)మానసిక వికలాంగులైన విద్యార్థులకు అన్ని పరీక్షలు రాయవలసిందే ,-కానీ వీరికి అన్ని సబ్జెక్టులలో 10 మార్కులు చొప్పున సాధిస్తే పాస్ అయినట్లే.
6) అదేవిధంగా కుష్టు వ్యాది నయగ్రస్తులు ( Leprosy Cured), సెరిబ్రల్ పాలసీ(CP), మరుగుజ్జులు( Dwarf), కండర పక్షవాతం( Muscular Distrophy) మరియు యాసిడ్ దాడికి గురైన వారు మొదలగు వర్గాలకు ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. అన్ని సబ్జెక్టులలో కనీస మార్కులు 10 సాధిస్తే పాస్ అయినటట్లే.
7)బహుళవైకల్యం, దీర్ఘకాలిక నరాలకు సంబంధించిన వైకల్యం, పార్కిన్ సన్స్, హిమోఫిలియా, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా తదితర వైకల్యాలు గల విద్యార్థులకు మూడో భాష ఇంగ్లీష్ నుండి మినహాయింపు ఇవ్వబడింది. వీరు 35 మార్కులు సాధిస్తేనే పాస్
8) అభ్యసన వైకల్యం( Learning Disabled Students) కు ఇంగ్లీషు భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన 5 సబ్జెక్టులలో 15 మార్కులు చొప్పున వస్తే పాస్ అయినట్లే.
9) అందులకు, చేతులకు సంబంధించిన వైకల్యం గల శారీరక వైకల్యం గల వారికి , MR, CP. న్యూరో సమస్యలు గలవారిలో చేతులు స్వాధీనం లో లేనివారికి మాత్రమే ( Scribe) ఒక సహాయకుడిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రతి గంటకు 20 నిమిషాలు చొప్పున అధనపు సమయం కేటాయిస్తారు.
CWSN. విద్యార్థుల కు వారి అవసరాన్ని బట్టి వివిధ పరికరాలు, కుర్చీలు, కంటి అద్దాలు, క్యాలిక్యులేటర్లు, శ్రావణ యంత్రాలు, కృత్రిమ అవయవాలు, Care Takers సేవలను ఉపయోగించుకోవచ్చు. Scribe, ప్రత్యేక పరికరాలు, సదుపాయాలు కావాలనుకునే వారు ముందుగా విద్యాశాఖ అధికారులకు, పరీక్ష కేంద్రం Chief Examiner కు రాతపూర్వకంగా తెలిపి అనుమతి తీసుకోవాలి.
పై సదుపాయాలు అన్నింటిని వైకల్యాల ఆధారంగా విద్యార్థులకు తప్పక అవగాహన కల్పించాలి. వికలాంగ విద్యార్థులు సధరం వైకల్య సర్టిఫికెట్ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అందించిన మెడికల్ సర్టిఫికెట్లు అందజేయాలి.
హెడ్మాస్టర్లు నామినల్ రోల్స్ పంపే సమయంలోనే దివ్యాంగుల కు ఆయా వైకల్య కోడ్ వేసి పంపితే , వారి వైకల్యాల ఆధారంగా వారికి మినహయింపులు ఇచ్చిన సబ్జెక్టు మినహా మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు మాత్రమే పరీక్ష కేంద్రాలకు పంపబడును.
Locomotor Disability means Orthopaedically Handicapped.
Intellectual Disability means MR.












Comments