top of page

బైజూస్‌ చూసి పాఠాలు ఎలాచెప్పాలో నేర్చుకోవాలి: పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి




ప్రభుత్వ ఉపాధ్యాయులకు సూచించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌

ree

ఏపీ టీచర్స్ టీవీ, జనవరి 26 : బైజూస్‌ కంటెంట్‌ నుంచి చూసి పాఠాలు మెరుగ్గా ఎలాచెప్పాలో నేర్చుకోవాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉపాధ్యాయులకు సూచించారు. 6 నుంచి 10 తరగతులు బోధించే టీచర్లంతా బైజూస్‌ కంటెంట్‌ చూసేందుకు సమయం కేటాయించాలని, అందులో ఏది అవసరమవుతుందో అది తీసుకోవాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి దాని ఆధారంగా బోధనకు పాఠ్య ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలన్నారు. త్వరలో పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని, ఈ నేపథ్యంలో ఈ కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరారు. ‘ఫ్రం ది డెస్క్‌ ఆఫ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ పేరుతో బుధవారం ఆయన ఉపాధ్యాయులకు వర్చువల్‌ సందేశం ఇచ్చారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం ఏటా రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి 6, 7 తరగతులకు గణితం, ఇంగ్లిష్‌, సైన్స్‌ పుస్తకాలు ఎన్‌సీఈఆర్‌టీ ఇస్తుందని, వాటికి ఎస్‌సీఈఆర్‌టీ తెలుగు అనువాదం చేస్తుందని చెప్పారు.


 
 
 

Comments


bottom of page