భారత్ లో చైనా HMPV వైరస్ తొలి కేసు నమోదు!
- AP Teachers TV
- Jan 6
- 1 min read
భారత్ లో చైనా HMPV వైరస్ తొలి
కేసు నమోదు!

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్ కు చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది. ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తమ ల్యాబులో దీన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపింది.
Update:
ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే
భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.












Comments