రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు జమ ఎప్పుడంటే?PM Kisan
- AP Teachers TV
- Feb 19
- 1 min read
రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు జమ ఎప్పుడంటే?PM Kisan

అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు తేదీ ఖరారైంది.
PM Kisan 2025| ఇంటర్నెట్ డెస్క్: రైతులకు గుడ్‌న్యూస్! అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి. అలాగే, ఇ-కేవైసీ చేసి ఉండాలి.
ఒకవేళ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి.












Comments