రేపు ఏపీ కేబినెట్.. ఉద్యోగులకు సంక్రాంతి కానుకలు
- AP Teachers TV
- Jan 1
- 1 min read

ఉద్యోగులకు సంక్రాతి కానుకను ఏపీ ప్రభుత్వం అందించడానికి సిద్ధమయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటకే నెలలో మొదటి రోజు వేతనాలను చెల్లిస్తూ కూటమి ప్రభుత్వం కొంత వారి నుంచి సానుకూలతను తీసుకున్నట్లయింది.
అదే సమయంలో ప్రభుత్వోద్యోగులకు మరిన్ని వరాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు.
రెండు డీఏలు...ఈ మేరకు రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. పీఆర్సీ, ఐఆర్ లపై కూడా చర్చించి రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. నెలకు రెండుసార్లు ఏపీమంత్రి వర్గం సమావేశం కావాలని నిర్ణయించిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గం.కు వెలగపూడి సచివాలయం, 1వ బ్లాక్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది












Comments