top of page

విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఏమన్నారంటే..

Updated: Jul 5

ree

పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ఈ నెల 10న మెగా పిటిఎం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని.. డిగ్రీ విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికకు సంబంధించి ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు, దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ను సుదీర్ఘంగా చర్చించానని.. విద్యార్థులపై భారం తగ్గేవిధంగా యుజిసి నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించానని.. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని అన్నారు.


» పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలి

» ఆగస్టు నాటికి 'మెగా డీఎస్సీ' నియామకాలు

» విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేశ్ ఆదేశాలు


నెల 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన విద్యాశాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ పర్యావర ణంపై అవగాహన కల్పించేలా పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలను పరిరక్షిం చేలా చూసి విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్టులు అందించా లన్నారు. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు, భవిత సెంటర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని మారు మూల పాఠశాలలకు మొబైల్ నెట్వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

గిరిజన విద్యార్థులు బడులకు వెళ్లే దారులపై అధ్యయనం చేయాలని, అవస రమైన చోట్ల నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు నాటికి మెగా డీఎస్సీలో ఎంపి కైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందించేలా చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు. హైస్కూల్ ప్లస్లలో అధ్యాపకులను నియమించాలని, షెడ్యూలు ప్రకారం అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తిచేసి అడ్మిషన్లు చేపట్టాల న్నారు. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు నెలకొల్పేందుకు ముం దుకొచ్చిన యాజమాన్యాలతో చర్చించాలని, వర్సిటీల ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


 
 
 

Comments


bottom of page