top of page

విధి నిర్వహణ సమయంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు 1000 రూపాయలు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి. ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తుల నియమావళిలో తాము విధినిర్వహణలో ఉన్నప్పుడు తమ వద్ద 500 రూపాయలు లోపు మాత్రమే డబ్బు ఉండాలి అనే నిబంధన ఉండేది. అవినీతి నిరోధక శాఖ సిఫార్సుల మేరకు ఈ పరిమితిని వెయ్యి రూపాయల వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖల అన్ని కేడర్ల ఉద్యోగస్తులు విధి నిర్వహణ సమయంలో తమ వద్ద వెయ్యి రూపాయల వరకు డబ్బు కలిగి ఉండవచ్చు. అంతకుమించి తమ వద్ద డబ్బు ఉంటే పై అధికారికి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఏదైనా క్యాంపులో గాని యాత్రలో గాని ఉంటే పదివేల రూపాయల వరకు ఉంచుకోవచ్చు. ఈ ఉత్తర్వులను కింద చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు.


ree

 
 
 

Comments


bottom of page