వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ
- AP Teachers TV
- Mar 16
- 1 min read
విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు.. ప్రజా సమస్యలపై మాట్లాడరు.. కానీ జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటారు. నెలకు రూ. లక్షా 75వేలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అసెంబ్లీ (Assembly)కి రారు.. ప్రజా సమస్యలపై మాట్లాడరు.. కానీ జీతాలు (Salaries) మాత్రం సమయానికి తీసుకుంటారు. నెలకు రూ. లక్షా 75 వేలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ (AP)లో కూటమి (Kutami)కి 164 స్థానాలు లభించగా వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమం తర్వాత అసెంబ్లీ గడప కూడా తొక్కలేదు. ఇటీవల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైఎస్సార్‌సీపీ సభ్యులు నానా హంగామా సృష్టించి 10 నిముషాల తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు.



Comments