వారంలో మెగా డీఎస్సీ! నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం
- AP Teachers TV
- Apr 5
- 1 min read
వారంలో మెగా డీఎస్సీ!
» నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం
అమరావతి, ఏప్రిల్ 4: వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికే షన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతంచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్భవ ను పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపా లన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫి కేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరు సటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలౌ తుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభు త్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరు ద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికే షన్ విడుదలకు మార్గం సుగమమైంది.












Comments