top of page
విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన  MLC రఘువర్మ

విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన MLC రఘువర్మ

Nov 26, 2023
1 min read



విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన MLC రఘువర్మ


పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులో విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌ"శ్రీ పాకలపాటి రఘువర్మ* గారు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయులు తాము దాచుకున్న DA బకాయిలు, PF, APGLI, CPS మినహాయింపులు ప్రభుత్వం వారి వారి ఖాతాలలో జమ చేయకుండా పక్కదారి పట్టించడం దారుణమైన చర్య.



ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని, వారి సంక్షేమం చూడకపోగా ఆర్దికంగా నష్ట పరుస్తోంది అని, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కోట్లు, విజయనగరం జిల్లాలో PF పెండింగ్ బకాయిలు 40 కోట్లు, APGLI బకాయిలు 10 కోట్లు వెంటనే విడుదల చేసి చెల్లింపులు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పై దాడులకు ఈ ప్రభుత్వం పూనుకున్నదని, విద్యా నాణ్యత పెంచడం లో చిత్త శుద్ది లేక హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.


Video


ఈ పోస్ట్ నచ్చితే పోస్ట్ కింద గల గుండె గుర్తుమీద నొక్కి లైక్ చేయండి


 
 
 

Comments


bottom of page