సీఎస్ఈ సమావేశం - నిర్ణయాలు ఇవే!
- AP Teachers TV
- Jul 25
- 3 min read
సి.ఎస్.ఈ సమావేశం అడిషనల్ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు

2022లో ప్రారంభించిన 294 ప్లస్ టు పాఠశాలల్లో 249 పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులు ఉన్నారని, వాటిలో 30 కి పైగా విద్యార్థులు ఉన్న ప్లస్ టు పాఠశాలలను జూనియర్ కాలేజీలకు అప్పగిస్తామని, అందులో పని చేస్తున్న టీచర్లను కొనసాగిస్తామని, ప్లస్ టు తరగతుల్లో 30 లోపు విద్యార్థులు ఉంటే అవి ప్లస్ టు పాఠశాలలుగానే కొనసాగిస్తామని తెలిపారు. అయితే ప్లస్ టు పాఠశాలలను ప్రస్తుత విధానంలో కొనసాగించి ఖాళీలను భర్తీ చేయాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్ రెండు రోజుల్లో నమోదు చేస్తామన్నారు.
డీఎస్సీ నియామకాలు ఆగస్టు 20 నాటికి పూర్తి చేస్తామని తర్వాత అవసరాన్ని బట్టి మిగిలిన ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
బోధనేతర కార్యక్రమాల భారం గతంలో కన్నా పెరిగిందని, బోధనేతర కార్యక్రమాలు, యాప్ ల భారం తగ్గించకపోతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమని తెలపడం జరిగింది. సోమవారం మంత్రిగారి సమక్షంలో బోధనేతర కార్యక్రమాలు, యాపుల భారంపై చర్చిస్తామని, సానుకూల నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు.
విద్యా శక్తి కార్యక్రమంలో పాల్గొనడం ఐచ్చికమని తెలిపారు. జిల్లాలలో తప్పనిసరిగా పాల్గొనాలని చేస్తున్న ఒత్తిడిపై ప్రస్తావించగా డిఈఓ లకు వెబెక్స్ ద్వారా ఐచ్చికమని తెలుపుతామని హామీ ఇచ్చారు.
పురపాలక ఉపాధ్యాయులకు పిఎఫ్, స్పెషల్ టీచర్లకు జీవో 28 మేరకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, అంతర యాజమాన్య బదిలీలు చేపట్టాలని కోరడం జరిగింది.
పురపాలక పాఠశాలల్లో భాషా పండితుల ఖాళీలలో ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించుటకు వీలుగా సర్వీస్ రూల్స్ సవరించాలి.
ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయుటకు గతంలో హామీ ఇచ్చిన విధంగా కమిటీని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
రిలీవర్ లేక పాత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయుటకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
చిత్తూరు జిల్లాలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది.
విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్లకు సంబంధించి తల్లిదండ్రుల ధ్రువీకరణ బయోమెట్రిక్ యంత్రం, ఓటిపి రెండింటి ద్వారా ధ్రువీకరించడానికి అవకాశం కల్పించాలని, పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాన్ని సరఫరా చేయాలని కోరడం జరిగింది.
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల పని వేళలు, పి.ఎస్.హెచ్.ఎం, క్లస్టర్ ఉపాధ్యాయుల విధులు, ఎవరి ఆధ్వర్యంలో పనిచేయాలి, గణిత ఉపాధ్యాయుల పీరియడ్ల భారంపై స్పష్టత ఇవ్వాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
2008, 1998 డీఎస్సీ ఎం.టి.ఎస్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.
డైట్ ప్రిన్సిపల్ ఎఫ్.ఎ.సి బాధ్యతలను సీనియర్ లెక్చరర్లుగా FSTC పై పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
ఎంఈఓ బదిలీలు, నియామకాలపై వస్తున్న వార్తలపై స్పష్టతనివ్వాలని కోరడం జరిగింది.
అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల సమస్యపై చర్చించడం జరిగింది.
గతంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు పాఠశాలలను సందర్శించిన సందర్భంలో కొందరు ఉపాధ్యాయులపై విధించిన పనిష్మెంట్లను రద్దు చేయాలని కోరడం జరిగింది.
అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాల నిర్మాణం ప్రాధాన్యత వారీగా చేపట్టి పూర్తి చేయాలని కోరడం జరిగింది.
డీఈఓ పూల్ ఉపాధ్యాయుల సమస్యపై చర్చించడం జరిగింది.
వివిధ జిల్లాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న వారిని ఒక సంవత్సరం పూర్తయిన తరువాత తొలగించకుండా రెండు సంవత్సరాలు కొనసాగించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
Version 2 :
ఈ రోజు జరిగిన CSE సమావేశం అడిషనల్ డైరెక్టర్ MV సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.
294 హైస్కూల్ ప్లస్ పాఠశాలలో 249 పాఠశాలలలో 30 పైన రోల్ ఉన్న +2 తరగతులను ఇంటర్ బోర్డ్ కి ఇస్తామని, ఇక్కడ ఖాళీలను ఇంటర్ బోర్డ్ పూర్తిచేస్తారు. ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకులను కొనసాగిస్తారు. మిగిలిన పాఠశాలలు స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తుంది.School Education Department లోనే కొనసాగించాలి.PGT ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరాము.
బోధనకు మాత్రమే పరిమితం చేయాల్సిన ఉపాధ్యాయుల చేత బోధనేతర కార్యక్రమాలు చుట్టూ తిప్పుతూ అధికారులు పాఠశాలకు వచ్చి ఏ అంశాలు పరిశీలిస్తారని సూటిగా ప్రశ్నించింది. కనుక భోదనకే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని, బోధనేతర కార్యక్రమాలు అన్ని రద్దు చేయాలని కోరాము.
విద్యాశాఖ అధికారులు కూడా కనీసం వారం రోజులు పాఠశాలకు విజిట్ ద్వారా యాప్ కార్యక్రమాల యొక్క ఇబ్బందులు గమనించాలని కోరాము.
పాఠశాలలో అన్ని రకాల యాప్ ల కోసం ప్రభుత్వం డివైజ్ సప్లై చేయాలని, ఉపాధ్యాయులు పాఠశాలలో సెల్ఫోన్ వినియోగించకుండా చూడాలని కోరాము.
పదవ తరగతి పరీక్షలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రాసుకునే అవకాశం ఇవ్వాలని, ఇంగ్లీష్,సోషల్ సిలబస్ తగ్గించాలని కోరాం.
MEO 1,2 బదిలీలు నిర్వహించాలని,సర్వీస్ రూల్స్ పై కమిటీ వేయాలని కోరాము
మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్ ఖాతాలు ప్రారంభించేలాగా విద్యాశాఖ చొరవ చూపాలని కోరాము
భవిత సెంటర్లో పని చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేలు ఇవ్వాలని కోరాము.
నర్సరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయులు 12 మంది తెనాలి క్లస్టర్ పోస్టుల పరిధిలో పనిచేస్తున్నారని, నరసరావుపేట మున్సిపల్ పరిధిలో ఖాళీగా ఉన్న క్లస్టర్ కు బదిలీ చేయాలని కోరాము
డీఎస్సీ కంటే ముందే అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని కోరాము.
పదవ తరగతి పరీక్షల్లో వివిధ కారణాలతో సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని కోరాము.
బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు సకాలంలో తీసుకురావడంలో విద్యాశాఖ ఆలస్యం చేసిందని తెలిపాము.
విద్యా శక్తి కార్యక్రమం ఆప్షనల్ మాత్రమేనని, ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.
డీఎస్సీ తర్వాత రిలీవర్ రాని వారిని రిలీవ్ చేస్తామని తెలిపారు.
జీతాలపై 2,3 రోజులలో GO విడుదల చేస్తామని తెలిపారు.
యాప్ లను కుదించడానికి మంత్రి గారు వారంలో నిర్ణయం చేస్తారని చెప్పారు.
ఒకటి - పది తరగతులు ఉన్న పాఠశాలలు ఒకే డైస్ కోడ్ ఉంటుందని పూర్తి బాధ్యత ఉన్నత పాఠశాల HM గారు చూస్తారని చెప్పారు.
బదిలీ సంబంధం సందర్భంగా టీచర్స్ ఇచ్చిన గ్రీవెన్స్ ని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నామని ఇంకేమైనా ఉంటే పరిష్కారం చేస్తామని తెలిపారు.
అకడమిక్ Forum ను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేస్తారు.ఈ కమీటీలు విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలిస్తారు.
1 to 10 ఉన్నత పాఠశాలల్లో PS HM ఉన్నా HS HM మాత్రమే HM గా వ్వవహారిస్తారు. PS HM 1-5 తరగతుల నిర్వహణ. HM ఇచ్చిన మరికొన్ని బాధ్యతలు నిర్వహించాలి












Comments