స్కూల్‌కు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు #bombthreattoschool
- AP Teachers TV
- Aug 2, 2024
- 1 min read
దక్షిణ దిల్లీలోని ఓ పాఠశాలలో బాంబు పెట్టినట్లు దుండగులు పంపిన మెయిల్స్ కలకలం సృష్టించాయి.
కొంతకాలంగా దిల్లీలోని విమానాశ్రయాలకు, ఆసుపత్రులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపుల కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణ దిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అయితే శుక్రవారం పాఠశాలకు వచ్చిన అనంతరం స్కూల్ యాజమాన్యం ఈ మెయిల్‌ను గమనించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను బయటకు పంపించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల పలు ఆసుపత్రులు, పాఠశాలలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఇది కూడా బూటకపు మెయిల్ అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.













Comments