top of page

స్నేహితురాలి పుట్టినరోజు వేడుక.. స్కూల్లో బీరు తాగిన విద్యార్థినులు :Viral Video


school girls beer party in classroom at CG
school girls beer party in classroom at CG

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో కొందరు విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది.

బిలాస్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ జిల్లాకు చెందిన భట్‌చౌరా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల్లో కొందరు విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. అమ్మాయిలు తరగతి గదిలో కూర్చొని బీరు తాగిన దృశ్యాలు అందులో ఉన్నాయి. జులై 29న చిత్రీకరించిన ఈ వీడియోలు, ఫొటోలను ఆ విద్యార్థుల్లో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.



దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఈవో టి.ఆర్‌.సాహు మంగళవారం తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్‌ ప్రిన్సిపల్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ కమిటీ సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. సరదాగా బీరు బాటిళ్లను చేతుల్లోకి తీసుకొని ఊపామని, తాగలేదని విద్యార్థినులు కమిటీ ఎదుట చెప్పారు. ఈ ఘటనతో ప్రమేయమున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం నోటీసులు పంపి, వివరణ కోరుతామని డీఈవో చెప్పారు.




 
 
 

Comments


bottom of page