సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశ వివరాలు
- AP Teachers TV
- Aug 21
- 2 min read
సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశ వివరాలు

ఈరోజు ఆం.ప్ర. సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయనంద్ గారి అధ్యక్షతన జరిగింది. 15 నెలల అనంతరం నిర్వహించిన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో క్రింది అంశాలు చర్చించడం జరిగింది.
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గతంలో ప్రాతినిధ్యం చేసిన 230 సమస్యలకు గాను 115 సమస్యలను పరిష్కరించామని 114 సమస్యలు పెండింగ్లో ఉన్నాయని నివేదిక అందజేయడం జరిగింది
12వ పి.ఆర్.సి కమిటీని ఏర్పాటు చేయాలని, ఐ ఆర్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. అలాగే పెండింగ్లో ఉన్న 4 డీఏలకుగాను కనీసం 2 డిఏలు మంజూరు చేయాలని కోరడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ మెమో 57 మేరకు అర్హులైన 11000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరడం జరిగింది.
11వ పిఆర్సి బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, డీఏ బకాయిలు, ఇతర బకాయిల చెల్లింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరడం జరిగింది.
రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందు వారసులైన పిల్లలకు 2022 పిఆర్సి ప్రకారం గరిష్ట పరిమితిపై ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది.
అంతర్ జిల్లా బదిలీలు సాధారణ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని అంతర యాజమాన్యం బదిలీలు కూడా చేపట్టాలని కోరడం జరిగింది.
హెల్త్ కార్డు మెడికల్ రియంబర్స్మెంట్ సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరడం జరిగింది.
ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిల చెల్లింపు పై చర్చించడం జరిగింది.
పెన్షనర్లకు గ్రాట్యూటీ, లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లింపుల జాప్యంపై చర్చించడం జరిగింది.
ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి కమిటీని నియమించాలని కోరడం జరిగింది.
జీవో 302 ను పునరుద్ధరించి జేఎల్ పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది.
2025 డిఎస్సి నియామకాల అనంతరం కూడా చాలా జిల్లాలలో ఖాళీలు ఉన్నందున ప్రస్తుత డీఎస్సీ ద్వారానే ఖాళీలన్నీ భర్తీ చేయాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
అరియర్ బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరడం జరిగింది.
గత ఐదు డీఎస్సీల నుంచి డి రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల ఉర్దూ పోస్టులు భర్తీ కావడం లేదని, డి రిజర్వు చేసి ఉర్దూ పోస్టులను భర్తీ చేయాలని కోరడం జరిగింది.
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బందిని రేష్మలైజేషన్ చేసి అన్ని పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
కారుణ్య నియామకాలు జిల్లా/ యూనిట్ గా చేపట్టి నియామకాలు సత్వరం చేపట్టాలని కోరడం జరిగింది.
ప్లస్ టు పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరడం జరిగింది.
పురపాలక పాఠశాలలకు సంబంధించి పిఎఫ్ సౌకర్యం, అర్బన్ ఎంఈవోలు నియామకం చేపట్టాలని కోరడం జరిగింది.
గురుకుల ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు, 98, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు అమలు చేయాలని కోరడం జరిగింది.
గురుకుల, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు, 2004కు మునుపు పనిచేస్తున్న గురుకుల ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరడం జరిగింది.
కేజీబీవీ ఉపాధ్యాయులకు శాసనమండలిలో హామీ ఇచ్చిన విధంగా ఎంపిఎస్ అమలు చేయాలని కోరడం జరిగింది.
కొంతమంది ఉపాధ్యాయులకు ఇంకా సప్లిమెంటరీ బిల్లులు జమ గాని విషయము ఆర్థిక కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా 130 కోట్ల బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేస్తామని తెలిపారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై చర్చించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి గారు తెలిపారని, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు తెలిపారు.












Comments