top of page

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ ప్రభుత్వం నోటీసులు


ap secratariat venkatramireddy
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ ప్రభుత్వం నోటీసులు

అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి(అప్సా) రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాంటూ అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ కోరింది. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు సమాధానమిచ్చారు.



వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారు వివరణ ఇచ్చారు. 

సచివాలయానికి వెలుపల కార్యకలాపాలపై ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు తెలిపారు. ఎన్నికల్ కోడ్‌ ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు

ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఫాలో అవండి APTTV WhatsApp Channel 👈




 
 
 

Comments


bottom of page