Search Results
Search this site
738 results found with an empty search
- No-detention policy: 5, 8 తరగతి విద్యార్థులకు ‘నో డిటెన్షన్ విధానం’ రద్దు చేసిన కేంద్రం
పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. No-detention policy: 5, 8 తరగతి విద్యార్థులకు ‘నో డిటెన్షన్ విధానం’ రద్దు చేసిన కేంద్రం దిల్లీ: దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్ విధానం’ (No-detention policy) రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టానికి 2019 మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని కేంద్రం పేర్కొంది. రెండు నెలల్లో మళ్లీ పరీక్ష రాసేందుకు ఛాన్స్! ఇవి కూడా చదవండి : శుభవార్త: 1998 డీఎస్సీలో మిగిలిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ టీచర్ డేటా అప్డేషన్ తాజా ముఖ్య సమాచారం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్‌లోనూ ఫెయిల్ అయితే.. సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని.. ఇప్పటికే 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు. హరియాణా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం)పై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఇక్కడ ‘నో డిటెన్షన్ విధానం’ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
- పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్
ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిలు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు శ్రీకాకుళం క్రాంతి భవన్ నందు ఎస్టీయు శ్రీకాకుళం జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించారు.గత ప్రభుత్వమే 21,980 కోట్లు రూపాయలు బకాయిలు పడినట్టు ఆర్థిక శ్వేత పత్రంలో శాసనసభ సాక్షిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వెల్లడించారు. అయితే వాటి విడుదలకై ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదని 2023 జూలై నాటికి 11వ వేతన సవరణ గడువు ముగిసి17నెలలు గడుస్తున్నా వేతన సవరణ చైర్మన్ రాజీనామా చేసిన పిదప నూతన చైర్మన్‌ను నియమించలేదని, మధ్యంతర భృతి ఊసే లేదని సరెండర్ లీవ్ చెల్లింపులు,పిఎఫ్ లోన్లు, ఏపీజిఎల్ఐ లోన్లు పెండింగ్ బకాయిలపై నిమ్మకి నీరు ఎత్తినట్లు ఈ ప్రభుత్వ విధానం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ పదోతరగతి యాక్షన్ ప్లాన్ పై సెలవు రోజుల్లో పనిచేసేలా ఉపాధ్యాయలపై అనవసర ఒత్తిడి తగదని వివిధ రకాల ఆన్లైన్ యాప్‌ల డాటా నమోదును పూర్తిగా తగ్గించాలని ఉపాధ్యాయుని తరగతి గదికి దూరం చేసే బోధనేతర పనులను పూర్తిగా తొలగించాలని, ప్రాధమికోన్నత పాఠశాలలను కొనసాగించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ మంజూరు చేయాలని, MTS ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని సిపిఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల ఆగ్రహం తప్పదని ఎస్టీయూ దశలివారీ ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి డి. శ్యామ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి జి.రమణ, ఆర్ధిక కార్యదర్శి పి.రామకృష్ణ, వివద మండలాల నాయుకులు,పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- టీచర్ డేటా అప్డేషన్ తాజా ముఖ్య సమాచారం
టీచర్ డేటా అప్డేషన్ ఆబ్జెక్టివ్ ఉపాధ్యాయుల డేటా నవీకరణ యొక్క లక్ష్యం డేటాబేస్‌లో ఖచ్చితమైన, పూర్తి మరియు సంబంధిత ఉపాధ్యాయ సమాచారాన్ని నిర్ధారించడం. కొంత సమాచారం పూర్తిగా అందుబాటులో లేనందున వివిధ నిర్వహణలు, సంక్షేమ శాఖలు మరియు సొసైటీల నుండి తప్పిపోయిన వివరాలను సేకరించడం కూడా దీని లక్ష్యం. డిపార్ట్మెంట్ నియంత్రణలో ఉన్న నిర్దిష్ట డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, వివిధ ప్రయోజనాల కోసం అవసరమైన డేటా ఇంకా పూర్తి రూపంలో అందుబాటులో లేదు. ప్రయోజనం అందుబాటులో ఉన్న డేటా అవసరమైన చోట ధృవీకరించడానికి మరియు నవీకరించడానికి అభ్యర్థనతో స్వయంచాలకంగా ఉంటుంది. శాఖ వద్ద అందుబాటులో లేని డేటా కూడా సేకరిస్తారు. పూర్తయిన తర్వాత, నవీకరించబడిన డేటా బదిలీలు, పదోన్నతులు మరియు సేవా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయడానికి ఉపయోగించబడుతుంది. సింగిల్ యాప్ మైగ్రేషన్ అన్ని మాడ్యూల్లను సులభంగా యాక్సెస్ చేయడానికి అన్ని అప్లికేషన్లను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో విలీనం చేయడానికి విభాగం కసరత్తు చేస్తోంది. ఇది బహుళ ఆధారాలు లేదా యాప్‌ల అవసరాన్ని తొలగిస్తుంది, ఒకే సైన్-ఆన్‌తో సరళమైన మరియు మరింత సమర్థవంతమైన సిస్టమ్‌ను అందిస్తుంది. టైమ్లైన్లు ఉపాధ్యాయుల డేటా అప్డేషన్ కోసం మాడ్యూల్ 23.12.2024, 5 PM నుండి 31.12.2024, 5 PM వరకు అందుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయులందరికీ వారి డేటాను ధృవీకరించడానికి మరియు నవీకరించడానికి తగిన సమయం ఇవ్వబడుతుంది. అప్డేట్లను ఖచ్చితత్వం కోసం సమీక్షించడానికి మరియు ఆమోదించడానికి అపాయింటింగ్ అథారిటీకి డేటా వెరిఫికేషన్ మెకానిజం కూడా అందించబడుతుంది. ఆక్షేపణలు ధృవీకరణ తర్వాత, అభ్యంతరాల కోసం డేటా ప్రచురించబడుతుంది. స్వీకరించిన ఏవైనా అభ్యంతరాలు సంబంధిత పత్రాలతో ధృవీకరించబడతాయి మరియు తదనుగుణంగా చెల్లుబాటు అయ్యే సవరణలు చేయబడతాయి.
- Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..
Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు తీపికబురు అందింది. కొత్త ఏడాదికి ముందు వాళ్లకు ఓ గిఫ్ట్ రెడీ అయిపోయింది. న్యూ ఇయర్ ముందు ఇది ఉపాధ్యాయులకు బంపర్ న్యూస్ అనే చెప్పాలి. Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ.. AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు చాన్నాళ్లుగా ఓ తీపికబురు కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ క్షణం వచ్చేసింది. టీచర్లకు సర్కారు శుభవార్త చెప్పేసింది. త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ల కోసం ఓ గిఫ్ట్‌ను రెడీ చేసింది. అదే పదోన్నతులు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాళ విద్యాశాఖ మొదలుపెట్టింది. ఈ మేరకు ఏపీవ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల లిస్ట్‌ను అధికారులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో తీపికబురు ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి శనివారం సాయంత్రం 3 గంటల లోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని టీచర్లు గమనించాలని సూచించారు. మొత్తానికి ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు మున్సిపల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు నుంచి తీపికబురు అందింది. కాగా, మున్సిపల్ పాఠశాలలకు సంబంధించి ఇటీవల కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ స్కూళ్లలో కారుణ్య నియామకాలకు రూటు క్లియర్ చేసింది. ఆ నియామకాలకు లైన్ క్లియర్! మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన కారుణ్య నియామకాల అమలుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నియామకాల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా నియామకాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనారోగ్యానికి గురైన, మృతి చెందిన టీచర్ల కుటుంబసభ్యుల దరఖాస్తుల మీద చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించింది. ఏపీవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,114 పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈ రూల్స్ వర్తిస్తాయని సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
- 10th CLASS MODEL PAPERS AND QUESTION BANKS RELEASED BY AP GOVT : DOWNLOAD
10th CLASS MODEL PAPERS AND QUESTION BANKS RELEASED BY AP GOVT : DOWNLOAD స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు 10వ తరగతి విద్యార్థుల కోసం విడుదల చేసిన మోడల్ పేపర్స్ మరియు Question బ్యాంక్ మెటీరియల్ Good morning, all the DEOs and RJDSEs in the State are informed that: 1. The question banks and Model Papers for class X students for Languages, Non-Languages and Minor media have been released. 2. This material will be key to success for the class X students in the ensuing SSC Public Examinations, March 2025. 3. Therefore, the DEOs and RJDSEs are requested to disseminate the same to all the High School HMs. 4. It shall be ensured that the material is used effectively and the students should practice it vigorously. All the very best!!!! Regards Krishnareddy Director,SCERT. DOWNLOADS 10_Success_Languages_Book_20.12.2024 10_Success_Minor-Languages_Book_20.12.2024 10_Success_Non-Languages_Book_20.12.2024 SCERT 10th Telugu Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th Hindi Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th English Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th Maths Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th Physics Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th Biology Chapter-wise Imp Questions-Model Papers SCERT 10th Social Chapter-wise Imp Questions-Model Papers
- 10th, Inter Exams Preparation | పది, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మార్కుల్ని పెంచే ‘3పీ’ వ్యూహం ఇదిగో!
10th, Inter Exams Preparation | పది, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మార్కుల్ని పెంచే ‘3పీ’ వ్యూహం ఇదిగో! తెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ వచ్చేసింది. విద్యార్థులు ఇప్పట్నుంచే సరైన ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు 3పీ వ్యూహం బాగా పనికొస్తుందని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు షెడ్యూళ్లు వచ్చేశాయి (10th, Inter Exams). ఏపీలో మార్చి 17 నుంచి 31వరకు పదో తరగతి; మార్చి 1 నుంచి 20వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వరకు పదో తరగతి; మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల కెరీర్‌ని మలుపు తిప్పే ఈ కీలక పరీక్షలకు ఇప్పట్నుంచే పకడ్బందీ ప్రణాళికతో సన్నద్ధమైతేనే (Preparation)మంచి మార్కులు సాధించగలరు. ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉండటంతో సబ్జెక్టుల వారీగా సమయం కేటాయించుకొని చదివితే సత్తా చాటొచ్చంటున్నారు నిపుణులు. ఇంకా కొద్ది నెలల్లో జరగబోయే టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షల్లో మంచి మార్కుల కోసం 3 ‘పీ’ వ్యూహాన్ని అనుసరించండి. అదే ప్లానింగ్ (ప్రణాళిక), ప్రిపరేషన్ (సన్నద్ధత), ప్రెజెంటేషన్ (సమర్పణ). కచ్చితమైన ప్రణాళిక వేసుకొని చదవి పరీక్షల్లో చక్కని ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా టాపర్‌గా నిలిచేందుకు ఈ 3పీ వ్యూహం బాగా పనిచేస్తుంది. పాఠ్యాంశాల పునశ్చరణకు వీలుగా సొంతగా టైం టేబుల్ రూపొందించుకోండి. సమయం దగ్గరపడుతున్నకొద్దీ చదవాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందొద్దు. ఇంతకుముందు చదివినవే అయినా ప్రణాళిక ప్రకారం ఆయా పాఠ్యాంశాలను అవగాహనతో చదివి ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో అన్ని పాఠ్యాంశాల్నీ చదివినా సరే.. వాటిలోని కీలకాంశాలు, వ్యాకరణాంశాలు, ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలపై దృష్టి పెట్టండి. పాఠాలను చదివిన తర్వాత ప్రశ్నలను ఊహించుకొని ‘ఫలానా ప్రశ్న వస్తే జవాబు రాయగలనా?’ అని కళ్లు మూసుకొని మననం చేసుకోవడం ఉత్తమం. ఎక్కడైనా బ్రేక్ పడితే దానిపై మరింత దృష్టి సారించి మరోసారి చదివి పట్టు సాధించే ప్రయత్నం చేయండి. పరీక్షల ప్రిపరేషన్లో ముఖ్యంగా కావాల్సింది టైం మేనేజ్మెంట్. టైమ్‌టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించాలి. మూడ్ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ వెళ్లొద్దు. ప్రిపరేషన్ సమయంలో వ్యక్తిగత క్రమశిక్షణ, అంకితభావం ఎంతో అవసరం. ఒకేసారి అన్నీ చదివేయాలనే ఆత్రుత అస్సలు పనికిరాదు. వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను ఏర్పాటుచేసుకోండి. వాటి సాధనకు నిరంతరం కృషిచేయాలి. చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా వాటిని తట్టుకుని ఏకాగ్రతతో చదవండి. ప్రాక్టీస్ ప్రశ్నలూ, పాత ప్రశ్నపత్రాలనూ సాధన చేయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయడానికి ప్రయత్నించాలి. ఇలాచేస్తే పరీక్ష విధానాన్ని అర్థంచేసుకోవడం సులువు. అవగాహన పెరగడంతో పరీక్ష ఎలా ఉంటుందోననే ఆందోళన కూడా తగ్గుతుంది. సమస్యా పరిష్కార నైపుణ్యమూ పెరుగుతుంది. ప్రశ్నపత్రం చేతికొచ్చాక ప్రజెంటేషన్ సరిగా లేకపోతే ఇన్నాళ్లూ మీరు పడిన కష్టం వృథా అవుతుంది. అందువల్ల ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి. అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చిన మార్కులు, జవాబు ఎలా? ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకోవడం అవసరం. సైడ్ హెడ్డింగ్‌లను పెన్నుతో అండర్లైన్ చేయండి. మార్జిన్లను పాటించండి. కోడ్ పదాలను రాయొద్దు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయండి. ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడికి మీ పేపర్ పట్ల మంచి ఇంప్రెషన్ ఏర్పడటంతో పాటు మీరు రాసే జవాబుల్ని త్వరగా గుర్తించగలుగుతారు. జవాబులు రాయడం పూర్తయిన తర్వాత అన్నింటికీ రాశారా? ప్రశ్నల సంఖ్య సరిగా వేశారా లేదా? జవాబుల్లో అంకెలు సరిగ్గా రాశారో? లేదో? సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఇచ్చిన సమయంలోనే అన్ని అంశాలూ రాయగలుగుతున్నారో లేదో చూసుకోండి. ఉదాహరణకు పరీక్ష సమయం రెండు గంటలైతే.. పాత ప్రశ్నపత్రాన్ని ఆ వ్యవధిలోనే పూర్తిచేసేలా ప్రాక్టీస్ చేయండి. ప్రిపరేషన్ సమయంలో కొంతమంది విద్యార్థులు విపరీతమైన ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. అలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. వీలైతే యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు. సరిగా నిద్ర ఉండేలా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చదివే సమయంలో మొబైల్ ఫోన్, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలరు.
- CBSE: సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ‘డమ్మీ’ విద్యార్థులు!
CBSE: సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలు.. వెలుగులోకి ‘డమ్మీ’ విద్యార్థులు! దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. దిల్లీ: దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ‘డమ్మీ’ విద్యార్థుల నమోదును పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో దిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో 29 పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ అంశంపై సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా మాట్లాడుతూ.. సీబీఎస్ఈ ఆఫీసర్, అనుబంధ పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడిన 29 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయన్నారు. అనేక పాఠశాలల్లో వాస్తవిక హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్రోల్ చేయడం ద్వారా బోర్డు నిబంధనలను వారంతా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని హిమాన్షు గుప్తా తెలిపారు. నిబంధనలు పాటించకపోవడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించి.. ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకొనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల జాబితాలో దిల్లీలోనే 18 ఉండగా.. వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్‌పుర్‌లలో రెండు చొప్పున ఉన్నయని తెలిపారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అనేకమంది విద్యార్థులు డమ్మీ పాఠశాలల వైపు ఆసక్తి చూపుతుంటారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లకుండా నేరుగా బోర్డు పరీక్షలకే హాజరై తమ దృష్టంతా పోటీ పరీక్షలపైనే పెట్టేలా ఈ స్కూళ్లు విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంటాయి.
- AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, విద్యా, వ్యవసాయ సంబంధిత పథకాలు సహా పలు అంశాల గురించి చర్చించారు. AP Cabinet: సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. ఏంటో తెలుసా.. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం 21 అంశాలు పరిశీలనలోకి వచ్చాయి. ఈ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. జల్ జీవన్ మిషన్: కేంద్ర ప్రభుత్వం 26,800 కోట్ల రూపాయలతో 77,917 పనులను ఆమోదించింది. వీటి ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించబడుతోంది. గత ప్రభుత్వ దుష్ట పాలన కారణంగా ఈ ప్రాజెక్టులపై సరైన దృష్టి పెడకపోవడంతో రాష్ట్రం నష్టపోయింది. కేరళా రాష్ట్రం 70 వేల కోట్ల రూపాయల సమర్థనతో ప్రయోజనాలు పొందగా, ఏపీలో కేవలం 4000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి పూర్తి కొరకు అనుమతులు మంజూరు చేసామని మంత్రి పేర్కొన్నారు. అమరావతి రాజధాని: గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా నిర్మించడంలో చాలా సమయం గడిచింది. ప్రస్తుతం, అమరావతిలో నిర్మాణ పనులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడానికై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇతర కీలక నిర్ణయాలు: ఇంజనీరింగ్ పనులు: 3 3,137 కోట్ల రూపాయలతో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. గ్రామకంఠం భూములు: భూములు సర్వే రికార్డింగ్, సబ్ డివిజినింగ్కు ఫీజులు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. చిత్తూరు జిల్లా: నూతన కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూమిని ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీకి బదిలీ చేయడం. రుణాలు రీ షెడ్యూల్: వరద ముంపునకు గురైన రైతులకు రుణాలు రీ షెడ్యూల్ చేయడం, స్టాంప్ డ్యూటీ లేకుండా అవకాశం ఇవ్వడం. పోలవరం ప్రాజెక్టు: ప్యాకేజీ నెంబర్ 3, 5 కింద పోలవరం లెప్ట్ మెయిన్ కెనాల్ పనులకు జుడీషియల్ రివ్యూ లేకుండా అనుమతులు విద్యా పథకాలు: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్నం భోజనం పథకాన్ని పునరుద్దరించడం, 475 కాలేజీలకు బడ్జెట్ కేటాయింపు. పాఠ్య పుస్తకాలు: రూ. 32.45 కోట్లు ఖర్చు చేస్తూ పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం. ఈ నిర్ణయాలు 2025 మార్చి 31వరకు అమల్లో ఉంటాయని, ఇందుకు కావలసిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. ఏపీ స్టేట్ కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (APSCMS): 2024-25 సంవత్సరంలో 1000 కోట్లు బుణానికి అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని సివిల్ సప్లైస్ శాఖకు అందించి, ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతులకు డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో రైతుల పాలన, ధాన్యం కొనుగోలులో వేగవంతమైన చర్యలు తీసుకునే అవకాశాలను కల్పిస్తుంది. పోలవరం ప్రాజెక్టు: పోలవరం ప్రాజెక్టులో ప్యాకేజీ నెంబర్ 3, 5 కింద లెప్ట్ మెయిన్ కెనాల్ పనులకు జుడీషియల్ రివ్యూ లేకుండా అనుమతి ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పోలవరం ప్రాజెక్టు వేగంగా కొనసాగించేందుకు సహకారం లభిస్తుంది. ఇంతకు ముందు జ్యూడీషియల్ రివ్యూ తప్పనిసరి ఉండగా, ఇప్పుడు చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హంద్రీనివా ప్రాజెక్టు: హంద్రీనివాలో పుంగనూరు కెనాల్‌కు లైనింగ్ చేయాలని ప్రతిపాదనకు పాత రేట్ల ప్రకారం ఆమోదం ఇచ్చారు. దీని కోసం రూ. 482 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజనం పథకం: 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్నం భోజనం పథకానికి బడ్జెట్ అంచనాల ప్రకారం కేటాయింపు. ఈ పథకాన్ని పునరుద్దరించడం వల్ల లక్షా 40 వేల మంది విద్యార్థులకు భోజన సదుపాయం అందించబడుతుంది. తద్వారా డ్రాపవుట్ తగ్గే అవకాశం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర పథకం: రూ. 32.45 కోట్లు ఖర్చు చేస్తూ పాఠ్య పుస్తకాలను కొనుగోలు చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం విద్యార్థుల అభ్యాసానికి సహకారం అందిస్తుంది. నైతిక విలువల క్లాసులు: చాగంటి కోటేశ్వరరావుతో నైతిక విలువల గురించి అవగాహన కల్పించే తరగతులు పాఠ్యాంశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలు 2024-25 సంవత్సరానికి సంబంధించినవి, రైతులు, విద్యార్థులు, పౌరులకు ఉన్న అవకాశాలను పెంచేలా రూపకల్పన చేయబడ్డాయి.
- టీచర్ల సర్వీసు రికార్డుల నవీకరణకు 3 అవకాశాలు
AP Teachers SERVICE REGISTER అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి టీచర్ల సర్వీసు వివరాల నవీ కరణకు శనివారం నుంచి అవకాశం కల్పించను న్నారు. బదిలీలు, పదోన్నతులను వేసవి సెల వుల్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు పర్యాయాలు టీచర్ల సర్వీసు వివరాల నవీకరణ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రక టించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పదోన్నతుల కోసం సీని యారిటీ జాబితాను డీఈఓలు విడుదల చేసి, మూడు పర్యాయాలు సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. బదిలీలకు గతంలో ఉన్నట్లే నాలుగు కేటగిరీలు ఉంటాయి. వీటి ఆధారంగా స్టేషన్ పాయింట్లు ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే ప్రధానో పాధ్యాయుడు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులనుమంజూరు చేస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 60మందికి పైగా విద్యా ర్థులు ఉంటే ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరి స్తారు. 31 నుంచి 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కి.మీ.లోపు ఉన్నత పాఠశాల అందుబాటులో లేకపోతే అక్కడ కొనసాగిస్తారు. బేసిక్ ప్రాథమిక పాఠశా లలో ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు 20 మంది విద్యార్థులకు ఒక టీచర్, 21-60 వరకు ఇద్దరు, 61-90 వరకు ముగ్గురు చొప్పున ఉపా ధ్యాయులను కేటాయిస్తారు. జీఓ 117 రద్దు అనంతరం మెమో రూపంలో నిబంధనలు విడు దల చేసి, విద్యార్థులు, పాఠశాలల సంఖ్య, తల్లి దండ్రుల కమిటీ తీర్మానం తీసుకున్న తర్వాత తుది జీఓ విడుదల చేస్తారు. క్లస్టర్ పాఠశాలల పైన అభ్యంతరాలు స్వీకరించి, రెండో జాబితా విడుదల చేస్తారు.
- టీచర్ల బదిలీలు, పదోన్నతులు సందడి మొదలు ! Teachers Transfers and Promotions
ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల డైరెక్టర్ సమావేశం Teachers Transfers and Promotions అమరావతి:ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో చేపట్టడానికి వీలుగా వివరాలు అప్డేట్ చేయనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు. అందుబాటులో లేకపోతే అక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగిస్తారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్లో 1:30 ప్రకారం ఉపాధ్యాయులను నియమించనున్నారు. బేసిక్ ప్రైమరీ స్కూల్ నందు ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు 20 మంది విద్యార్థుల వరకు ఒకరు, 21 నుండి 60 వరకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తారు. 117 జీవోరద్దు అనంతరం ఇవ్వబోయే నిబంధనలను మెమో రూపంలో విడుదల చేసి ప్రస్తుత విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య, పేరెంట్స్ కమిటీ తీర్మానం అన్నీ తీసుకున్న తర్వాత తుది జీవో విడుదల చేయనున్నారు. క్లస్టర్ పాఠశాలలను ఎంఈఓ లు పంపిన ప్రతిపాదనల మేరకు జాబితా విడుదల చేశామని, దీనిలో అభ్యం తరాలను స్వీకరించి తర్వాత రెండో జాబితా విడుదల చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత తుది క్లస్టర్ పాఠశాలల జాబితా విడుదల చేస్తామని సంఘాల నేతలకు తెలిపారు. అర్హత గల ఎస్జీటీలకు బీపీఈడి కోర్సు చేయడానికి అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎస్సీ ద్వారా నియమించే వారిని మూడు నాలుగు కేటగిరీలో మాత్రమే నియమిస్తామన్నారు. వైద్య కారణాలపై ప్రాధాన్యతకేటగిరి ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికెట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుండి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రధానో పాధ్యా యుల పని భారం తగ్గించడానికి సిఆర్పీల ద్వారా సమాచారాన్ని పంపించే ఏర్పాటు చేస్తామన్నారు.గురువారం తాడేపల్లిలోని సీఎస్ఈ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. బదిలీల కొరకు రెండు లేదా మూడు రోజుల్లో టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. మూడుసార్లు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డిఇవోలు ద్వారా విడుదల చేసి మూడుసార్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు రీఅపోర్షన్‌మెంట్ ద్వారా బదిలీ అయ్యే వారికి 8 సంవత్స రాలకు మించకుండా పాయింట్లు కేటా యిస్తారు. బదిలీలలో గతంలో నిబంధనల వలె 1,2,3,4 కేటగిరీలుగా పరిగణించి స్టేషన్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఉన్నత పాఠశాలల్లో 75 మంది విద్యార్థులు దాటినచోట హెచ్ఎం, పిడి పోస్టు లను మంజూరు చేస్తారు. పిడి పోస్టులు అదనంగా ఉంటే 75 మంది లోపు విద్యార్థులకు డిసెండింగ్ ఆర్డర్ లో ఇస్తారు. ప్రాథమికోన్నత తరగతులలో 60 మంది పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిసా మన్నారు. 31-60 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు.
- IMMS App New Update Here
IMMS App New Update Here కొత్తగా ఏమి ఉంది? 1) పాస్‌వర్డ్‌ను మార్చిన తర్వాత లాగిన్ సమస్య పరిష్కరించబడింది. 2) MEO లాగిన్‌లో రసాయనాలను క్లీనింగ్ చేయడానికి ఇండెంట్ విలువ జోడించబడింది. ఈ యాప్ గురించి APలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు మానిటర్ & మధ్యాహ్న భోజన పథకాన్ని రికార్డ్ చేయడానికి యాప్ మధ్యాహ్న భోజన పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది, ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి పేద విద్యార్థులకు సహాయం చేస్తుంది మరియు పోషకాహార లోపం, ఆహార భద్రత మరియు విద్యను పొందడం వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. IMMS మొబైల్ అప్లికేషన్ అనేది మొబైల్ అప్లికేషన్ ద్వారా పాఠశాలలు అప్డేట్ చేయడానికి రోజువారీ మరియు నెలవారీ మధ్యాహ్న భోజన డేటా యొక్క సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ఉద్దేశించబడింది. మొబైల్ అప్లికేషన్ ఒకసారి ఆండ్రాయిడ్ పరికరంలో ఇన్స్టాల్ చేయబడితే, MDM ఇన్చార్జికి సంబంధించిన రోజువారీ హాజరును యాప్ ద్వారా పంపే అవకాశం ఉన్నందున, MDM గణాంకాలను పంపడానికి ఇంటర్నెట్ అవసరం. ఇది MDM ఇన్ఛార్జ్ ఉద్యోగాన్ని సులభతరం చేస్తుంది, అతను డేటాను అందించడానికి యాప్‌లో తన లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. బ్లాక్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నత అధికారులు తమ అధికార పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలల ద్వారా రోజువారీ మరియు నెలవారీ డేటా ప్రసారాన్ని సమర్థవంతంగా మరియు సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చాలా సులభమైన వెబ్ పోర్టల్‌ను కలిగి ఉన్నారు. పాఠశాలలకు ఆహార ధాన్యాల కేటాయింపులను లెక్కించేందుకు అధికారులు హాజరు డేటాను విశ్లేషిస్తారు. ఈ వ్యవస్థ దెయ్యం విద్యార్థులు/ఉపాధ్యాయులను పూర్తిగా తొలగించడం ద్వారా ఫుడ్ డెలివరీ మరియు యుటిలైజేషన్ మెకానిజంలో పారదర్శకతను పరిచయం చేస్తుంది.
- పాఠశాల విద్యలో 4 రకాల బడులు
గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు-117ను రద్దు చేసి, కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. AP Government Schools ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్‌లు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేశ్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు గ త ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు-117ను రద్దు చేసి, కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలో మంత్రి లోకేశ్ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు. వాటిపై ఆయా నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు రకాల పాఠశాలల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రాథమిక పాఠశాలలే మూడు రకాలుగా ఉండనున్నాయి. ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలను రద్దుచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైస్కూల్ ప్లస్ పేరుతో 3-12 తరగతులు నిర్వహిస్తున్నారు. మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. వీటిల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండగా.. ప్రయోగశాలలు లేవు. రెగ్యులర్ అధ్యాపకులను నియమించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు-117 కారణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మార్చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3,448 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులను తరలించారు. దీంతో 12,247 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి. దీంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు వెళ్లిపోయిన 3, 4, 5 తరగతులను తిరిగి వెనక్కి తీసుకురానున్నారు. ఆరు నుంచి నాలుగుకు తగ్గింపు పూర్వ ప్రాథమిక విద్య-1, 2 (ఎల్కేజీ, యూకేజీ), ఒకటి, రెండు తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్‌గా పిలుస్తారు. వీటిలో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయిస్తామని అధికారులు ప్రతిపాదించారు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న 20మందికి ఒక టీచర్ విధానాన్ని కొనసాగించాలని కోరాయి. పూర్వ ప్రాథమిక విద్య-1, 2.. ఒకటి నుంచి ఐదు తరగతులున్నవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు. విద్యార్థులు బడికి వెళ్లే మార్గంలో నదులు, వాగులు, వంకలు, జాతీయ రహదారులను దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. సామాజిక కేటగిరి కాలనీల్లో వీటిని నిర్వహిస్తారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామస్థుల అనుమతి మేరకు నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పూర్వ ప్రాథమిక విద్య-1, 2, ఒకటి నుంచి ఐదు తరగతులను కలిపి మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతి తరగతికీ ఒక్కో టీచర్ చొప్పున గరిష్ఠంగా ఐదుగురిని ఇస్తారు. పిల్లల సంఖ్య 120 మించితే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు. 6-10 తరగతులతో ఉన్నత పాఠశాలలు ఉంటాయి. అంగన్వాడీలు పూర్వ ప్రాథమిక విద్య-1, 2తో శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా కొనసాగుతాయి. ఆ రెండు విధానాలు రద్దు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత బడుల విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే దాని గ్రేడ్ తగ్గిస్తారు.. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఉన్నతీకరిస్తారు. 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. ఒకవేళ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోయినా, విద్యార్థులు వెళ్లేందుకు సహజ, కృత్రిమ అవరోధాలు ఏమైనా ఉంటే స్థానికంగానే ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తారు. 6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు. ఇక్కడ ఉండే 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలిస్తారు. ఒకవేళ 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉన్నప్పుడు దాని గ్రేడ్ తగ్గించడమా? పెంచడమా? అనే దాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 60 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే దాన్ని ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరిస్తారు. హైస్కూల్ ప్లస్‌లోని ఇంటర్మీడియట్‌ను ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా శాఖకు అప్పగిస్తారు. దీంతో హైస్కూల్ ప్లస్ విధానం ఉండదు.











