Search Results
Search this site
738 results found with an empty search
- ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమాచారం
నేడు జీతాలు జమ "అక్టోబర్" నెలకు సంబంధించిన జీతాల చెల్లింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.. నేడు ఏ క్షణంలో అయినా "అక్టోబర్" నెల "జీతాలు" జమ కానున్నాయి.. పెండింగ్ బకాయిల గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.. ఏ బకాయిలు అయినా, 6 వ తేదీ నుండి, 24 వ తేదీ లోపు మాత్రమే జమ చేస్తారు, 25 వ తేదీ నుండి 5 వ తేదీ వరకూ ఎటువంటి పెండింగ్ బకాయిలు అయినా అత్యవసరం అయితే తప్ప జమ కావు, మీకు వచ్చిన ఫేక్ న్యూస్ ను ఇతరులకు పంపడం, నిజమా కాదా అని అడగడం చేయకండి.. మీ విలువైన సమయం వృధా అవుతుంది..
- 70 ఏళ్లు దాటినవారికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా.. ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి?AB-PMJAY
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా రూ.5 లక్షలు బీమా కల్పించేందుకు ఉద్దేశించిన పీఎం జేఏవై పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం కావాలి? దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న పథకాన్ని పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద ఏడు పదులు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఇంతకీ ఈ పథకానికి ఎలా నమోదు చేసుకోవాలి? ఏమేం పత్రాలు కావాలి? ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి? ఎవరు అర్హులు..? భారత్‌లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకం కింద అర్హులే. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ పథకం కింద వైద్యబీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరుంటే తలా రూ.2.50 లక్షల వైద్య సాయం పొందొచ్చు. ఇందులో మూడు రోజులపాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు తదితర సేవలు పొందొచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి. ఎలా చేరాలి? ఏమేం కావాలి? ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేరాల్సిన వారు ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా చేరొచ్చు. ముందు www.beneficiary.nha.gov.in వెబ్సైట్లోకి వెళ్లి క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత మీ రాష్ట్రం ఎంచుకున్నాక అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకుంటే.. ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒకవేళ ఇదివరకే కేవైసీ పూర్తయ్యి ఉంటే.. నేరుగా ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వృద్ధుల తరఫున వారి కుటుంబ సభ్యులు సైతం వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఈ ప్రక్రియ చేయొచ్చు. లేదా ఎంప్యానెల్డ్ ఆస్పత్రికి వెళ్లి కూడా నమోదు చేయించొచ్చు. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల జాబితా తెలుసుకోవడం ఎలా? ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు 30 వేల ఆస్పత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల జాబితా dashboard.pmjay.gov.in వెబ్సైట్లో లభిస్తుంది. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా ఎంచుకుంటే ఆస్పత్రి వివరాలు కనిపిస్తాయి. ఫిర్యాదులు ఉంటే ఏం చేయాలి? ఈ పథకం కింద 70 ఏళ్లు వయసు దాటిన వారికి ఆస్పత్రులు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం చెబుతోంది. చికిత్స విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ ఫిర్యాదులు ఉంటే.. పైన పేర్కొన్న వెబ్సైట్, యాప్‌లో గానీ లేదా నేషనల్ కాల్ సెంటర్ 14555ను సంప్రదించొచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యను పరిష్కారం లభిస్తుంది. ఇతర హెల్త్స్కీముల్లో ఉన్న వారి మాటేంటి? సీజీహెచ్ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు.. వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని (AB-PMJAY) గానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు మాత్రం ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.
- స్కూల్ అటెండెన్స్ యాప్ కి అప్డేట్ వచ్చింది ఇప్పుడే అప్డేట్ చేసుకోండి
Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. స్కూల్ అటెండెన్స్ యాప్ వెర్షన్ 2.5.9 అప్డేట్ చేసుకొనుటకు కింద బటన్ నొక్కండి కొత్తగా బేస్ లైన్ అసెస్మెంట్ మాడ్యూల్ చేర్చడం జరిగింది.
- స్కోచ్ అవార్డు కోసం మన రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ కి ఓటు వేద్దాం. ఓటు వేసే విధానం ఇదే
భారతదేశంలో పారిశ్రామికవేత్తలు ప్రజా నాయకులు విద్యావేత్తలు సామాజిక సంఘ సేవకులు జాతీయస్థాయిలోని skoch social media అవార్డు ద్వారా ప్రోత్సహించబడతారు. ఈ అవార్డు పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్... ఎన్నో వినూత్న విద్యా విధానాలను రూపొందించిన. విద్యావేత్త. శ్రీ డి దేవానంద్ రెడ్డి గారు DGE AP నాలుగవ రౌండ్ వరకు వచ్చి ఉన్నారు పరీక్షల నిర్వహణ లో మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శప్రాయం గా ఎదిగినది...... మీరు ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా వారికి ఓట్ చేసి.. మన Education department ను ముందుకు తీసుకు రావడానికిదోహదపడగలరు. చివరి తేదీ తేదీ.29.10.2024 సాయంత్రం ఏడు గంటల వరకు... Vote చేసే విధానం LINK 👈 పై లింక్ ను ఓపెన్ చేసి 👇 కొంచెం క్రిందికి వస్తే CLICK HERE TO VOTE FOR THE PROJECT! ను క్లిక్ చేయండి 👇 Beacons of Hope voting అని ఉంటుంది. దానిలో పై నుండి 3వ దానిని అంటే Beacons of Hope voting(Govt)- 25th October 2024(19.00 hrs)ను క్లిక్ చేయండి. 👇 వచ్చిన గూగుల్ ఫాంలో మీ వివరాలతో పాటు, Andhra Pradesh ను ఆప్షన్ ఇచ్చిన తర్వాత List of Projects లో లాస్ట్ నుండి 4వ అయిన Integrity in Assessments: Safeguarding the future of India - Directorate of Government Examinations, Government of Andhra Pradesh ను choose చేసుకొని, సబ్మిట్ చేయండి. ఇది మా రాష్ట్ర ప్రాజెక్టు, దీనిని ప్రమోట్ చేసే బాధ్యత మన అందరిదీ. మీ ఓటింగ్ తో మన రాష్ట్రానికి అవార్డు రావడంలో మీ వంతు ప్రయత్నం, కృషిను అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Demo Video Your Support Matters! Help DGE, A.P. win the SKOCH Award! We’re thrilled to announce that our Directorate of Government Examinations, A.P., has been nominated to enter the 4th round of the prestigious SKOCH Award! We are one step closer towards recognition at National level, but to reach the semi-final stage, we need your support! In addition to the Jury Votes, Popular votes carry a 15% weightage and play a vital role in securing the SKOCH Order-of-Merit certificate for our department. So all are requested to please take a moment to cast your vote for the DGE, A.P. by using the following link and forward the link to your friends, acquaintances, teachers and share in the groups which you may know and persuade them to vote for our project: Link to Vote: 👈 (You are requested to enter your details and vote) VOTING CLOSES AT 07:00 PM on 29-10-2024 For any clarifications or doubts, please call 9035503109.
- మున్సిపల్ టీచర్స్ ప్రమోషన్స్ షెడ్యూల్ ఇదే!
మునిసిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వడానికి మరియు స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు ఇవ్వడానికి నేడు షెడ్యూల్ విడుదల అయింది. మునిసిపల్ పాఠశాలల పర్యవేక్షణ మరియు పరిపాలన బాధ్యతలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసినందున సర్వీస్ రూల్స్ లో ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలతో సమానంగా నిబంధనలను మునిసిపల్ పాఠశాలలకు కూడా వర్తింప చేస్తూ సవరణలు చేసి ఉన్నారు. దీనికి అనుగుణంగా మునిసిపల్ పాఠశాలలో పనిచేస్తున్న అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా మరియు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి ఈ కింది విధంగా షెడ్యూల్ ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి షెడ్యూల్ కాపీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
- ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల కోసం కొత్త చట్టం - ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సిద్ధం అయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి అనుమతి తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఉద్యోగంలో చేరినప్పటి నుండి పట్టణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. బదిలీలకు గరిష్టంగా 8 సంవత్సరాల సర్వీస్ నిర్ణయించనున్నారని, కనీస సర్వీస్ సమయం ఎంత అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉండే ప్రాంతాలను నాలుగు కేటగిరులు విభజించడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం వచ్చిన తరువాత సిఫారసు బదిలీలు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. బదిలీల చట్టంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యక్ష ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారని సమాచారం. ఇలాంటి ప్రత్యేక చట్టం ఇప్పటికే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మెరిట్ కమ్ రోస్టర్ పద్దతి అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారి సమస్యలు, టీచర్ల బదిలీల గురించి, ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాల గురించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు పలు సూచనలతో పాటు వారి సమస్యలపై మనవి చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపి ఓ వేదిక సిద్ధం చేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సమర్పించనున్నారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు మనవి చేశారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
- ఎలిమెంటరీ స్కూలును ఆకష్మికంగా సందర్శించిన ఏపీ విద్యా మంత్రి లోకేష్
ఎలిమెంటరీ స్కూలును సందర్శించిన మంత్రి లోకేష్ విశాఖపట్నం: సుందర నగరం విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్... కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఎబిసిడి లు, రైమ్స్ వచ్చా అని అడగ్గా... వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి లోకేష్ ఫోటో దిగారు. గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసినమంత్రి లోకేష్ మంత్రి అంతకుముందు నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ... 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
- జియో కొత్త యాప్.. స్మార్ట్ టీవీ చిటికెలో కంప్యూటర్‌గా! Jio Cloud PC app
Jio Cloud PC: జియో కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. ఒక్క యాప్ సాయంతో మీ స్మార్ట్ టీవీని కంప్యూటర్‌లా మార్చుకోవచ్చని చెబుతోంది. Jio Cloud PC | దిల్లీ: రిలయన్స్ జియో ( Jio ) మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది. ఒక్క యాప్ సాయంతో స్మార్ట్ టీవిని కంప్యూటర్‌లా మార్చుకునే సౌకర్యాన్ని రూపొందించింది. ఈ టెక్నాలజీని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ - 2024 ఈవెంట్లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీగా (Jio Cloud PC) పిలిచే ఈ సాంకేతికతో కొన్ని వందల రూపాయలతోనే మీ స్మార్ట్ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇంటర్నెట్ సౌకర్యం, కీబోర్డు, మౌస్, స్మార్ట్‌టీవీ ఉంటే చాలు.. జియో క్లౌడ్ పీసీ యాప్ ఉపయోగించి టీవీని కంప్యూటర్‌లా మార్చుకోవచ్చని జియో పేర్కొంది. యాప్‌లో లాగిన్ అయ్యి కంప్యూటర్ తరహాలోనే ఈ-మెయిల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం క్లౌడ్‌లో స్టోర్ అవుతుంది. మధ్యతరగతి కుటుంబానికి కంప్యూటర్ కొనుగోలు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఈ కొత్త సాంకేతికను తీసుకొచ్చినట్లు జియో తెలిపింది. జియో క్లౌడ్ పీసీతో స్మార్ట్ టీవీ, కంప్యూటర్ రెండు వేర్వేరు డివైజులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని టీమ్ పేర్కొంది. సాధారణ టీవీలను జియో ఫైబర్/ జియో ఎయిర్‌ఫైబర్ సెట్ టాప్ బాక్స్ అమర్చడం ద్వారా స్మార్ట్‌గా మార్చుకోవచ్చని పేర్కొంది. మొబైల్లో సైతం ఈ కొత్త సర్వీసును వాడుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ యాప్‌ను ఎప్పుడు విడుదల చేసేది? ఎంత ధర ఉంటుందనే వివరాలు వెల్లడించలేదు.
- ఏపీలో కొత్తగా ఆరు పాలసీలు.. 20 లక్షల ఉద్యోగాలపై చంద్రబాబు ప్రకటన
ఏపీలో ఒకేసారి ఆరు విధానాలను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త పాలసీలపై ఎంతో కసరత్తు చేశామన్నారు. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. దీనిలో భాగంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొత్తగా ఆరు పాలసీలను తీసుకురావాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈకొత్త విధానాలు రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందన్నారు. ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎమ్ఈ ఎంటర్‌ప్యూనర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రీయల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ 4.0 పాలసీలను తీసుకొస్తున్నామన్నారు. త్వరలో మరికొన్ని పాలసీలను తీసుకువస్తామన్నారు. ఐటీ, టూరిజానికి సంబంధించిన పాలసీలను తీసుకొస్తామన్నారు. ఒకేసారి ఆరు విధానాలను తీసుకొచ్చామన్నారు. కొత్త పాలసీలపై ఎంతో కసరత్తు చేశామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు.. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనిలో భాగంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని పాలసీలను రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి పాలసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. గతంలో చేసిన పాలసీల్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయని అడిగేవారని, తాము కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే విషయాన్ని చూస్తున్నామన్నారు. ఉద్యోగాలకు, ఉపాధి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందిస్తుందన్నారు. ఏపీ యువత ధింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఉద్యోగాలు కల్పించాలి.. నాలెడ్జ్ ఎకనమీలో ప్రపంచానికి సేవలు అందిచడంతో పాటు ఉపాధి కల్పించడమే కాకుండా డబ్బులు సంపాదించే మార్గం వచ్చిందని, అందుకే వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్‌ప్యూనర్ నినాదంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. యువత ఉద్యోగాలు చేయడం కాదని, ఉద్యోగాలు కల్పించే వ్యక్తులుగా మారాలన్నారు. 25 ఏళ్లకంటే ముందు ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని, వీటిలో ఒకటి ఐటీ పాలసీ అని తెలిపారు. ఈ పాలసీ వచ్చినప్పుడు ఎన్నో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేశామని, ఎన్నో కంపెనీలను తీసుకొచ్చామన్నారు. ప్రపంచంలో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు పాలసీలు రానున్న రోజుల్లో రాష్ట్ర, యువత భవిష్యత్తుకు సంబంధించి పెనుమార్పులు రానున్నాయన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రగతినే మారుస్తుందన్నారు. ఆరు పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం తెలియజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నీతి, నిజాయితీగా వ్యాపారం ఎలా చేయాలనేదానికి రతన్ టాటా నిదర్శనమన్నారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ లేదా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకు తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలుకు సంబంధించి అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ప్రధాన కేంద్రం అమరావతిలో ఉంటుందని.. మిగతా ఐదు జోన్లలో ఐదు కేంద్రాలను రతన్ టాటా పేరుతో ఏర్పాటుచేస్తామని చంద్రబాబు తెలిపారు.
- పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ Skill Development
రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు.. 9-10ల్లో కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు యూజీలో అప్రెంటిస్‌షిప్‌తో లోతైన పరిజ్ఞానం రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కోర్సులను పాఠశాల నుంచి ప్రారంభించి, ఉన్నత విద్య వరకు కొనసాగించాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదువు పూర్తికాగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా వాటిని రూపొందించనుంది. ఆరో తరగతి నుంచే నైపుణ్య కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చి, వాటిని అంచెలంచెలుగా 6-8, 9-10, 11-12 తరగతులు, ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల నైపుణ్యాలకు మధ్య అంతరాలను తగ్గించేందుకు వీటిని తీసుకొస్తోంది. ఉన్నత విద్యలో ఒకేసారి నైపుణ్యాలు అందించడం కంటే పాఠశాల స్థాయి నుంచే అనుభవపూర్వక బోధన పద్ధతిలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తోంది. బడి నుంచే ఇలా.. 6-8 తరగతుల్లో వృత్తి విద్య/నైపుణ్య కోర్సులు, తరగతులను ప్రవేశపెడతారు. క్షేత్రస్థాయి సందర్శనలు, పని ఆధారిత అభ్యాసం, ఇతర ప్రాక్టికల్స్ ఉంటాయి. 9-10 తరగతుల్లో ఒకటి లేదా రెండు నైపుణ్య/వృత్తి విద్య కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇస్తారు. ఆయా పాఠశాలలకు సమీపంలోని నైపుణ్య కేంద్రాలను అనుసంధానం చేస్తారు. నైపుణ్య కేంద్రాల్లో తరగతులు, అనుభవపూర్వక సెషన్లు కలిపి నిర్వహిస్తారు. 11-12 తరగతుల్లో వృత్తి విద్య/నైపుణ్య కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అలవడేలా తర్ఫీదిస్తారు. ఎంపిక చేసుకున్న కోర్సుల్లో 50 శాతం వరకు కరిక్యులమ్‌కు సమయాన్ని కేటాయిస్తారు. అనుభవపూర్వక బోధన, ఉన్నతమైన ప్రాక్టికల్స్ మదింపునకు 20%-30% వెయిటేజీ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ)లో అప్రెంటిస్‌షిప్‌లతో ఒక అంశంలో వృత్తి నైపుణ్యం అందిస్తారు. నైపుణ్యం, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామ్‌లు, కోర్సులు ఉంటాయి. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో అనుసంధానమైన ఉపాధి కల్పన ప్రోగ్రామ్స్‌ను ప్రారంభిస్తారు. నైపుణ్య క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్, సర్టిఫికేషన్ ఉంటుంది. 11 అంశాల్లో నైపుణ్యాలు పాఠశాల స్థాయికి సంబంధించిన వృత్తి విద్య/ నైపుణ్య కోర్సులను 11 అంశాల్లో ఇవ్వాలని విద్యాశాఖ గుర్తించింది. ఇవి నాలుగు స్థాయిల్లో ఉండేలా కరిక్యులం రూపొందించనున్నారు. సాఫ్ట్ స్కిల్స్, ప్రాథమిక కమ్యూనికేషన్, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, పని ప్రాంతానికి సంసిద్ధత, కెరీర్ ప్లానింగ్-ఎదుగుదల, సమస్య పరిష్కారం-తార్కిక ఆలోచనపై నాలుగు స్థాయుల్లో శిక్షణ ఇస్తారు. నాయకత్వం-నిర్వహణ నైపుణ్యాలు, వినియోగదారుడి ఆధారమైన నైపుణ్యాలు, ఔత్సాహిక వ్యాపారవేత్త, వృత్తి నిర్దిష్టంగా నైపుణ్యాలు అందిస్తారు. సాఫ్ట్ స్కిల్స్‌లో మొదట దృక్పథం, ప్రవర్తన నైపుణ్యాలతో వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తారు. ఆ తర్వాత వ్యక్తిత్వంలో మార్పు, తనను తాను తెలుసుకోవడం, ఒత్తిడి, భావోద్వేగం, ఆరోగ్య నిర్వహణతో జీవించడం, ఇతరులతో పరస్పర సంబంధాలపై శిక్షణ ఇస్తారు. ఇలా ఒక్కో వృత్తి విద్య/ నైపుణ్య కోర్సులపై శిక్షణ ఉంటుంది.
- బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం CM Chandrababu
చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతి, అక్టోబర్ 15: చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇక 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ ప్రతిపాదనపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ చేసేందుకు పలు ప్రతిపాదనకు రానున్నాయి. వాటిపై చర్చించి.. కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాల పాలక మండలిలో 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై ఈ సందర్భంగా చర్చించనుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి పచ్చ జెండా ఊపే అవకాశముందని తెలుస్తుంది. దీపావళి నుంచి ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై చర్చ.. రాష్ట్రంలో స్వర్ణకారుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఈ క్యాబినెట్లో ఆమోదముద్ర పడనుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ జిఓలు ఉండే goir.ap.gov.in వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైసీపీ హయాంలో అప్ లోడ్ చేయకుండా మాన్యువల్‌గా జారీ చేసిన జీవోలను సైతం జీవో ఐఆర్ సైట్లో అప్ లోడ్ చేయాలని ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వైసీపీ హయాంలో రహస్యంగా ఇచ్చిన జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచేందుకు సైట్లో ప్రత్యేక బటన్ తీసుకు రావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుంది. తద్వారా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రమ జీవోలు, అడ్డగోలు నిర్ణయాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ద్వారా వచ్చే కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పెషల్, ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలు ఏర్పాటు చేసేందుకు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు సవరణలు చేయనుంది. వరదలు వచ్చిన ప్రాంతంలో తనకా... స్టాంపు డ్యూటీ మాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. నూతన ప్రభుత్వం రూపొందించిన పాలసీలపై ఈ కేబినెట్లో చర్చించి.. వాటికి సైతం ఆమోద ముద్ర వేసే అవకాశముందని సమాచారం.
- ఉద్యోగుల క్యాష్ ఎరియర్స్ పై మంత్రివర్గ సభ్యులు ఏమన్నారంటే!
ఉద్యోగుల క్యాష్ ఎరియర్స్ పై మంత్రివర్గ సభ్యులు ఏమన్నారంటే! ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సభ్యులు స్పందన ఐఆర్ పై చర్చించుకొని మరళా చెపుతాం.. 2003 న లోపు నోటిఫికేషన్ ద్వారా CPS లో ఉన్న ఉద్యోగులకు OPS ఇచ్చే ఆలోచనన పరిశీలిస్తాం. జిపియఫ్ బకాయిలు రూః940 కోట్లులలో రూః60 కోట్లు క్లాష్ 4 ఉద్యోగులకు ఈరోజే చెల్లించాం..మిగిలిన డబ్బులు మొత్తం మార్చి31 లో చెల్లిస్తాం. APGLI బకాయిలు రూః313 కోట్లు,అఫ్ లోడ్ అయినవి,ఇంకా అఫ్ లోడ్ కావల్సిన రూః200 కోట్లు మొత్తం మార్చినెల 31 లోగా చెల్లిస్తాం. టిఏ/డిఏ బకాయిలు పోలీసువారికి ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన రూః274 కోట్లు మార్చి 31 లోగా చెల్లిస్తాం. మెడికిల్ రీయంబర్స్మెంట్ మొత్తం ఇప్పటివరకు పెండింగ్ ఉన్న రూః 118 కోట్లు ఈనెలాఖరులోగా చెల్లిస్తాం. సరెండర్ లీవులు/లీవ్‌ఎన్ క్యాష్ మెంటుకు మొత్తం రూః 2250 కోట్లు బకాయిలు ఉన్నాయి. జూన్ నాటికి కొంత మొత్తం చెల్లిస్తాం. 2020/2021 సంః సరండర్ లీవులు( రూః300 కోట్లు బకాయిలు) మార్చినెలాఖరులో చెల్లిస్తాం సిపియస్ ఉద్యోగులకు పెండింగు ఉన్న రూః2800 కోట్లు ఉద్యోగుల అకౌంట్లలో మార్చినెలాఖరులోగా జమచేస్తాం. డిఏ అరియర్సు( 1-7-2018 & 1-1-2019) బకాయిలు పెన్షనర్లకు రుః1200 కోట్లు,సిపియస్ వారికి రూః 900 కోట్లు జున్ నాటికి ధశలవారిగా చెల్లిస్తాం. డిఏ బకాయిలు సుమారు రూః 4500 కోట్లు(1-1-2022 & 1-7-2022) త్వరలో & షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తారు. పిఆర్సీ అరియర్సు రూః7500 కోట్లు రానున్న నాలుగేళ్లలో 16 వాయిదాలలో చెల్లిస్తారు. మొత్తం సుమారుగా 20,000కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి.









