Search Results
Search this site
738 results found with an empty search
- ఉద్యోగ ఉపాధ్యాయుల ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ శుభవార్త AAS Automatic Advancement Scheme
#AAS_Automatic_Advancement_Scheme ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం సంబంధించి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను తెలుగు లో అనువదించడం జరిగింది. ఆ అనువాదాన్ని కింద చదువుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖజానాలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెమో.సంఖ్య: FIN02-18069/143/2024-H SEC-DTA 10/10/2024 విషయం : PS - T&A శాఖ - ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (AAS) - 12/24 సంవత్సరాల తర్వాత అవసరమైన అర్హతలను పొందడం - AAS కు నియామకం - వివరణ ఇస్తున్నది - సంబంధితం సూచనలు: ఈ కార్యాలయ లేఖ నెం. M1/14078/2010, తేదీ 24-08-2010 నుండి సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్, ఫైనాన్స్ శాఖకి అందజేయడం జరిగింది. మెమో.నెం. 17509/146/PC.II/A1/2012, ఫైనాన్స్ (PC.I) శాఖ, తేదీ 09-08-2012. ఈ కార్యాలయ మెమో H1/6697/2014 తేదీ 05-08-2015. ఈ కార్యాలయ లేఖ నెం. FIN02-18022/29/2018-H Sec-DTA, తేదీ 11-03-2020 నుండి APUTF కి అందజేయడం జరిగింది. లేఖ ROC NO. E1/Education/2024, తేదీ 24-08-2024 నుండి DTAO, తిరుపతి. విషయంపై ప్రత్యేక అవగాహన ఇవ్వబడింది: అన్ని రాష్ట్ర డిటిఏఓలకు సబ్జెక్టు మరియు సూచనలు వివరించబడింది. వివిధ సందర్భాలలో ఉద్యోగుల AAS క్లెయిమ్‌లను 1 నుండి 4వ సూచనల ప్రకారం క్లెయిర్ఫికేషన్ అని పేర్కొంటూ తిరస్కరించడం జరిగింది. డిటిఏఓలు ఈ క్లెయిర్ఫికేషన్లను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గతంలో, 16/24 సంవత్సరాల పూర్తయిన తేదీ నుండి SPP-I/SPP-II కు ఉద్యోగిని నియమించేందుకు AAS లో ఎలాంటి నిబంధన లేదు అని స్పష్టం చేయబడింది. కానీ, ఇందులో ఉద్యోగుల్ని వారి విద్యా అర్హతలు పొందిన తేదీ నుండి నియమించడానికి ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేయబడింది, కానీ కొంత నియామకాల షరతులను పాటించాలి. కొన్ని షరతులు: (a) ఉద్యోగి ప్రొమోషన్లో దరఖాస్తు చేసుకున్నతేదీ మరియు అవసరమైన అర్హతలు పొందిన తేదీ తర్వాత ఏవైనా అవకాశాలు లేని విధంగా నిర్దేశించాలి. (b) ఉద్యోగి ముందు ప్రొమోషన్‌ను స్వీకరించకపోవాలి. మరిన్ని సూచనలు: డిటిఏఓలు శాసన ఉత్తర్వుల్లో పై షరతులను తప్పనిసరిగా చేర్చాలి మరియు వారి పరిధిలోని అన్ని DDOలకు తెలియజేయాలి. ప్రస్తుత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలుపరచడం గురించి అందరికీ తెలియజేయాలి మరియు దీనిని పాటించాలి. (ఈ క్రింది దృవీకరణ డిటిఏ నుండి అభిప్రాయం పొందింది) ఫైలు నెం. FIN02-18069/143/2024-H SEC-DTA జి.వి.ఎస్. తిరుపతి రాజు ఖజానాలు మరియు ఖాతాల డైరెక్టర్ తరఫున సకల రాష్ట్ర డిటిఏఓలకు (FTP/e-mail ద్వారా మాత్రమే) ఫైలు నెం. FIN02-18069/143/2024-H SEC-DTA ఇది చేస్తే అర్హత తీసుకుంటుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పై ఖజానా శాఖ తీపి కబురు ఫలించిన ఎపిటిఎఫ్ కృషి ఎట్టకేలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు దసరా కానుకగా ఆర్ధిక శాఖ ఖజానా శాఖ 18069 మెమో ద్వారా తీపి కబురు అందించింది. ఈ మెమో ప్రకారము శాఖాపరమైన పరీక్ష / బేసిక్ అర్హత ఉత్తీర్ణత సాధించలేదని పదోన్నతి అవకాశం ఇంతవరకు కోల్పోని (Forefiet) వారికి మరియు ఇప్పటి వరకు పదోన్నతి (Relinquish ) "తిరస్కరించటం చేయని వారికి మాత్రమే 12/24 సంవత్సరాల సర్వీసు నిండిన తేదీ "తర్వాత కూడా శాఖాపరమైన పరీక్ష పాసయితే ఆ పరీక్ష పాసైన నాటి నుంచి 12/24 స్కేళ్ళలో వేతన స్థిరీకరణ ద్వారా ప్రభుత్వ దాని ఆర్థిక లాభం వర్తింప చేయబడుతుంది". ఈ మెమో వలన 12/24 ఏళ్ల సర్వీసు నిండిన తేదీకి శాఖాపరమైన పరీక్ష / బేసిక్ అర్హత ఉత్తీర్ణత పొందక 12/24 సంవత్సరాల స్కేలు పొందని వేలాది మందికి ఆర్థిక లాభం చేకూరనుంది. అలాగే పాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం /పదోన్నతికి సంబంధించిన ఎఫ్ ఆర్ 22(బి) / ఎఫ్ ఆర్ 22 (ఏ) లను రివైజ్ చేసుకోవచ్చు. 12 ఏళ్ళ స్కేలు ఇవ్వలేదని 18 యేళ్ళ స్కేలు పొందని వారు కూడా 12&18 ఏళ్ళ స్కేలులో వేతన స్థిరీకరణ చేసుకోవచ్చు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులకు ఈ ఉత్తర్వు కళ్ళు తెరిపించనుంది. మొదటి పదోన్నతి పోస్టులో 12/24 AAS స్కేళ్ళలో వేతన నిర్ణయానికి 50 సంవత్సరాలు సర్వీస్ నిండిన వారికి శాఖాపరమైన పరీక్షల నుండి కూడా పదోన్నతికి ఇచ్చే మినహాయింపు ఏ ఏ ఎస్ కు ఇవ్వవలసివుంది. ఒక్కొక్కసారి అవసరం లేని విషయాలలో కూడా గెలికి సమస్యను జటిలం చేయడం, తదుపరి ఆ సమస్యపై కంటితుడుపు ప్రాతినిధ్యాలు చేయడం, కొంతకాలం తర్వాత దానిని భూస్థాపితం చేయడం చూశాం. ఇదే పని గతంలో ఒక ఉపాధ్యాయ సంఘం చేసింది. సీనియారిటీ వున్నప్పటికీ అర్హతలు లేకపోతే, సంబంధిత విద్యార్హతలు సాధించిన నాటి నుండే ప్రమోషన్ ఇవ్వడం ఆనవాయితీ. ఇదే సూత్రం ప్రమోషన్ స్కేళ్లకు కూడా వర్తిస్తుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం ద్వారా 12/24 సంవత్సరాలు పూర్తయిన నాటికి అవసరమైన విద్యార్హతలు పొంది వుండకపోతే, అవి సంపాదించిన నాటి నుంచి ఇవ్వడం ఎంతోకాలంగా అమలవుతున్న పద్ధతి. కానీ ఈ విషయంలో కూడా క్లారిఫికేషన్ కోసం రాసి,12/24 సంవత్సరాలు పూర్తయిన నాటికి విద్యార్హతలు లేని వాళ్ళందరికీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ను ఆపేందుకు ట్రెజరీ శాఖకు ఓ సంఘం పెట్టిన లేఖ పునాది వేసింది. ఇది అన్యాయం అంటూ గతంలో వివిధ సంఘాలు ట్రెజరీ అధికారుల ద్వారా, మరియు నేరుగా కూడా ట్రెజరీ శాఖ డైరెక్టర్ కు పరిస్థితిని నివేదించడం జరిగింది. చివరకు పరీక్ష పాసైన తేదీ నుండి ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగని ఇది మొదటి ఉన్న పరిస్థితి కూడా కాదు. సీనియారిటీ ఉండి విద్యార్హతలు లేకపోవడం వల్ల ప్రమోషన్ పొందని వాళ్లకు ఈ 12/24 స్కేలు విద్యార్హతలు పొందిన నాటి నుండి కూడా వర్తించవని తాజాగా ఇచ్చిన క్లారిఫికేషన్ లో తెలియజేశారు. మొదట ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. ఆ ఉపాధ్యాయ సంఘం చపలచిత్త లేఖ ఫలితం ఉపాధ్యాయలోకం యావత్తూ అనుభవించాల్సి వచ్చింది. (AAS) సంబంధించి 12 ఇయర్స్ కానీ, 24 ఇయర్స్ కానీ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే గతంలో AAS -12 కానీ 24 సంవత్సరాల స్కేలు గాని ఇచ్చే వీలుంది . DTA గారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా శాఖ చూపిన చొరవ ఫలితం ఆంధ్ర ప్రదేశ్ లో వేలాది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించింది. కొమ్ములు తిరిగిన సంఘాలు, సుదీర్ఘ కాలంగా పదవుల్లో వున్న నాయకులు సాధించలేని ఒక కీలక సమస్యను ఎపిటీఎఫ్ జిల్లా శాఖ ఫైలు నడిపి విజయం సాధించింది. పై క్లారిఫికేషన్ లో "various instances have come to the notice of the undersigned" అని ఉంది. అనవసరమైన నిర్వచనాలు ఇచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని కూడా. పేర్కొనడం జరిగింది. వివరాల్లోకి వెళితే...... తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పునరావాసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే సులోచన గారికి 12 సంవత్సరాల సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఏఏఎస్ (12 సంవత్సరాల స్కేలు) ఇవ్వకపోవడంపై తిరుపతి జిల్లా శాఖను సంప్రదించగా ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు స్పందించారు. సమస్య మీద రాష్ట్ర సంఘం సూచనల మేరకు చంద్రగిరి ఎస్టిఓ ను కలిసి సమస్య మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చంద్రగిరి STO తిరుపతి DTO కి ఎపిటీఎఫ్ ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం మీద క్లారిఫికేషన్ కోరుతూ తిరుపతి డిటిఓ విజయవాడ DTA క్లారిఫికేషన్ కోసం పంపడం జరిగింది. ఆమేరకు DTA ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన చంద్రగిరి STO మరియు తిరుపతి DTO కు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న ఒక కీలక సమస్యకు ఎపిటీఎఫ్ తిరుపతి జిల్లా శాఖ పరిష్కారం కనుగొనడం శుభసూచకం. - మోహన్ దాస్, రాష్ట్ర నాయకులు, ఎపిటిఎఫ్
- తామర గింజలు తిన్నారా
తామర గింజలు తిన్నారా ఫూల్ మఖానా ఈ పేరు వింటే ఎవరికైనా దాంతో చేసే కూర మాత్రమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాటిని మనం పెద్దగా వాడం. దాంతో అవేంటో కూడా పెద్దగా పట్టించుకోం కానీ వాటిని దేవతల ఆహారంగా భావించి ఇష్టంగా తినేవాళ్లు ఎందరో. ఎందుకో ఏమిటో ఓసారి చూద్దామా తామరపువ్వు బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీ... ఇలా దేవతల ఆసనంగా అందరికీ సుపరిచితమే. పూజాదికాల్లోనూ దానిదే అగ్రాసనం. ఆ తామరపువ్వు గింజలే ఈ ఫూల్ మఖానా. వీటినే తామరగింజలు, ఫాక్స్ నట్స్ అనీ పిలుస్తారు. తాజాగానూ, వేయించుకునీ, ఎండబెట్టి ఉడికించుకునీ ఇలా రకరకాలుగా వీటిని తింటుంటారు. ఉత్తరాదిన అన్ని రకాల పండగలూ పూజల్లో వీటితో ప్రత్యేకంగా వంటల్ని తయారుచేసి నైవేద్యంగానూ పెడతారు. కేవలం మనదేశంలోనే కాదు, తూర్పుఆసియా దేశాలన్నింటిలోనూ డెజర్ట్‌లూ స్వీట్ల తయారీలోనూ వాడుతుంటారు. చైనా కొత్త సంవత్సరానికి చేసుకునే స్వీట్లలో ఇది తప్పనిసరి. అక్కడి సంప్రదాయ వైద్యంలోనూ వీటి వాడకం చాలా ఎక్కువ. తాజా గింజలు అంతటా దొరకవుగానీ ఎండబెట్టినవి మాత్రం అన్నిచోట్లా మార్కెట్లో దొరుకుతాయి. మనదేశంలో ఈ తామరగింజల పంటకి బీహార్ పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా దొరికే మఖానాలో 63 శాతం అక్కడే పండుతాయి. తాజా తామరగింజల్లో ఎండిన వాటిల్లోకన్నా శాచురేటెడ్ ఫ్యాట్స్, సోడియం తక్కువ. ప్రొటీన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్... వంటివి ఎక్కువ. అందుకే మణిపురి వాసులు వీటిని పచ్చిగానే ఎక్కువగా తింటారు. ఎండినవాటినే మఖానా అని హిందీలో పిలుస్తారు. ఇవి ముదురు గోధుమరంగులోనూ తెలుపురంగులోనూ రెండు రకాలుగా దొరుకుతాయి. నిజానికి రెండూ ఒకటే. కానీ బాగా పండి కాయ ఎండాక తీసేవి ముదురురంగులో ఉంటే, గింజ పూర్తిగా తయారై, కాయ ఆకుపచ్చరంగులో ఉండగానే తీసేవి తెలుపురంగులో ఉంటాయి. అయితే కొందరు రంగుకోసం గింజల్ని హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వంటి వాటితో బ్లీచ్ చేసి మరీ విక్రయిస్తుంటారు. అందుకే తెల్లగా ఉండే వాటికన్నా చూడ్డానికి అందంగా లేకున్నా ముదురురంగులో ఉండేవి కొనుక్కోవడమే ఉత్తమం. ఎండు బఠాణీల మాదిరిగానే వీటిని కూడా ముందురోజు రాత్రే నానబెట్టుకుని కూరల్లోనూ, సూపుల్లోనూ, పుడ్డింగుల్లోనూ, పాయసాల్లోనూ, స్నాక్స్‌లోనూ వాడుకోవచ్చు. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై... వంటి వాటితో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి స్నాక్. పాప్‌కార్న్‌ను తలపించే తామరగింజల్లో పోషకాలూ ఔషధగుణాలూ లెక్కలేనన్ని. అందుకే అనేక ప్రాంతాల్లో ఈ గింజలకోసమే తామర పంటను పండిస్తుంటారు. ఉపయోగాలేంటి అన్ని వయసుల వాళ్లకీ తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండటం వల్ల వీటిని చిన్నా పెద్దా ఎవరైనా తినొచ్చు. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. ఇందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు వయసుని మీదపడనీయవు. అందుకే మఖానాను ఓ యాంటిఆక్సిడెంట్‌గా పేర్కొంటారు పోషకనిపుణులు. ముఖ్యంగా ఇందులో ఎల్-ఐసొయాస్పార్టిల్ మిథైల్ట్రాన్స్ఫెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను బాగుచేస్తుంది. దాంతో యాంటీ ఏజింగ్కోసం తయారుచేసే క్రీముల్లోనూ మందుల్లోనూ వాడేందుకూ ప్రయత్నిస్తున్నారు. వీటిల్లో అధికంగా ఉండే పీచు మలబద్ధకానికీ మంచి మందే. శరీరంలోని వ్యర్థాలనూ టాక్సిన్లనూ తొలగిస్తుంది. తామరగింజల్ని తరచూ తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. సోడియం తక్కువ. పొటాషియం ఎక్కువ. అందుకే బీపీరోగులకు ఇది చాలా మంచి ఆహారం. తామరగింజల్లో క్యాలరీలు తక్కువ కావడంవల్ల మధుమేహులకి ఎంతో మంచి ఆహారం. పీచు ఎక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గాలనుకునేవాళ్లకీ ఇది మంచి స్నాక్ ఫుడ్. అనీమియా రోగులకి దీన్ని మందుగా ఇస్తారు సంప్రదాయ వైద్యులు. గర్భిణులకీ బాలింతలకీ వీటిని ఆహారంలో ఇవ్వడంవల్ల నీరసం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, ప్లీహం పనితీరుకి దోహదపడతాయి. నిద్రలేమి, చికాకులతో బాధపడేవాళ్లు వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల చక్కని ఫలితం ఉంటుంది. డయేరియాను నివారించడంతోబాటు ఆకలినీ పెంపొందిస్తాయి. తరచూ మూత్రానికి వెళ్లేవాళ్లకీ అమీబిక్ డిసెంట్రీతో బాధపడేవాళ్లకీ ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడేవాళ్లకీ మంచిదే. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలవల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే ఆ రెండింటినీ తగ్గించే గుణం దీనికి ఉండటం విశేషం. చూశారా మరి మనం ఏ విందు భోజనాల్లోనో ఏ ఒక్కసారో కూర రూపంలో తినే ఫూల్ మఖానాలో ఎన్ని మంచి గుణాలో. వీలైతే ఇకనుంచైనా వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి
- Spoken English Skills | ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!
ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా? మాట్లాడాలని ఉన్నా.. తప్పులొస్తే నలుగురూ ఏమనుకుంటారోనని జంకుతున్నారా? ఈ కింది టిప్స్ ప్రయత్నించి నేర్చుకోవడం ఆరంభిస్తే ఇంట్లోనే ఈజీగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఉన్నత చదువులు అభ్యసించినా చాలా మంది ఆంగ్లం(English)లో మాట్లాడాలంటే హడలెత్తిపోతుంటారు. భాష పట్ల అవగాహన ఉన్నా అవతలివారు తప్పులు ఎత్తిచూపుతారేమోనని ఒకవైపు.. పదాలు దొరక్క ఇంకో వైపు.. వెనకడుగేస్తుంటారు. ఈ భయాలకు సమాధానం ఒక్కటే.. అదే ఇంగ్లిష్ నేర్చుకోవడం! ఈ బిజీ లైఫ్‌లో కొత్తగా నేర్చుకోవడం జరిగే పని కాదులే అనుకుంటే ఎప్పటికీ నేర్చుకోలేరు. ఇంట్లో రోజువారీ కార్యకలాపాల్లో భాగంగానే కొన్ని టిప్స్ పాటించి ఆడుతూ పాడుతూ మీ ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మరి, ఆ మెళకువలేంటో చూద్దామా! మీ చుట్టూ ఉన్నవారితో వీలైనంత మేరకు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇంగ్లిష్‌లో సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం వంటివి అలవాటు చేసుకోండి. ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఇంగ్లిష్ పుస్తకాలూ చదవడం మొదలుపెట్టండి. ఇంగ్లీషు సినిమాలు అనగానే ‘స్పైడర్ మ్యాన్’, ‘సూపర్‌మ్యాన్’, ‘అవెంజర్స్’ వంటి సూపర్ హీరోల చిత్రాలే చాలా మందికి గుర్తొస్తాయి. అవి చూసేది కేవలం యాక్షన్ సీన్ల కోసం మాత్రమే. కానీ అంతకంటే ఎన్నో మంచి సినిమాలు ఉన్నా అవి ఇంగ్లిష్‌లో ఉండటంతో చాలా మంది వాటి జోలికెళ్లరు. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనే సామెతలా ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ ఉంటే అదే వస్తుంది. వారు పలికేది అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్ పెట్టుకుని చూస్తే చాలా ఉపయోగం ఉంటుంది. తెలుగు సినిమాలకు కూడా ఈ మధ్య ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వస్తున్నాయి. వాటిని ఆన్‌లో పెట్టుకుని చూడడం మేలు. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇయర్‌ఫోన్స్ కామన్‌గా ఉంటున్నాయి. తీరిక దొరికినప్పుడల్లా చాలా మందికి సంగీతం వినడం అలవాటే. వినోదంలో కొంత భాగం విజ్ఞానానికి (ఆంగ్లం) ఉయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని మ్యూజిక్ ప్లేయర్లలో పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అప్పుడప్పుడూ మీకిష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలను ఆంగ్లంలో వింటూ ఉండండి. అలానే వీలైతే ఆడియో బుక్స్ కూడా వినండి. దీని వల్ల ఇంగ్లీష్ పదాలు పలికే విధానం తెలుస్తుంది. చాలా మందికి తాము పదాలు తప్పుగా పలుకుతామోనన్న భయం ఉంటుంది. వినడం ద్వారా ఆ అనుమానం తొలగిపోతుంది. మీకు వార్తలంటే ఇష్టముంటే రోజూ ఆంగ్ల దినపత్రికలను తిరగేయండి. మీ చుట్టూ జరిగే సంఘటనల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే వచ్చేస్తాయి. ఏవైనా తెలియకపోతే రిఫరెన్స్ నిఘంటువు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మొబైల్స్‌లోనూ నిఘంటువులున్నాయి. టైప్ చేసిన వెంటనే పదానికి అర్థం తెలుస్తుంది. రోడ్లపై కనిపించే ప్రకటనల బిల్‌బోర్డులు ఎక్కువగా ఆంగ్లంలో ఉంటాయి. వీటిని చదివి అర్థం తెలియకపోతే నిఘంటువులో వెతికితే ఎప్పటికీ గుర్తుంటాయి. అలాగే, ఎక్కువగా కార్లను గమనించండి. వీటి పేర్లు అనేకం ఉంటాయి. omni అనేది మారుతి వాహనం. దీని అర్థం a vehicle used for several purposes.ఇలా కొత్త పదాలు, అర్థాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అందరి ఫోన్లలో వాట్సాప్ ఉంటోంది కదా. ఏదో ఒక గ్రూపులో మీరూ సభ్యులుగా ఉండే ఉంటారు. అప్పుడప్పుడూ అందులో ఇంగ్లీషులో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. అలాగని గ్రూపులో ఎవరో మీ తప్పుల్ని ఎత్తి చూపుతారని భయపడకండి. చాలా మంది ఇలా భయపడే ముందడుగు వేయరు. ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫోరమ్‌లు, సోషల్‌మీడియా గ్రూప్‌లు, లాంగ్వేజ్ ఎక్స్ఛేంజ్ వేదికల్లో చేరండి. తద్వారా స్థానిక స్పీకర్లతో పాటు తోటి అభ్యాసకులతో మీరు మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. అలా చేయడం ద్వారా మాండలికాలు తెలియడంతో పాటు ఉచ్చారణ మెళకువలు అలవడతాయి. మీ మాటలు, ఆలోచనలు అన్నీ ఆంగ్లంలోనే ఉండేలా చూసుకోండి. మీరు అవతలి వ్యక్తులతో జరిపే చర్చలు, మీ ఆలోచనలను ఆంగ్ల భాషలోనే వ్యక్తపరచండి. మీ భాషా ఉచ్ఛారణపైనా దృష్టిపెట్టండి . అప్పుడప్పుడూ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతుండండి. మనకు ఉచితంగా లభించే సర్వీసు ఇది. మీరు మాట్లాడే వ్యక్తి ఎవరో తెలీదు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారన్న మీమాంస ఉండదు. ఆంగ్లం నేర్చుకొనేందుకు Duolingo, fluentU, hello English, Babbel, Memrise, Rosetta Stone వంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్‌లను వినియోగించవచ్చు. ఇవి మీ ప్రాక్టీసును మరింతగా మెరుగుపరుచుకొనేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్లు, అభ్యాససన ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా భాష నేర్చుకోవచ్చు. మీ దిన చర్యను ఇంగ్లిష్‌లో రాయడం అలవాటు చేసుకోండి. మీ అనుభవాలు, ఆలోచనలు మీకు ఇష్టమైన అంశాలను ఒక పుస్తకంపై రాయడం ద్వారా మీ పద సంపద పెరుగుతుంది. వాక్య నిర్మాణం మెరుగుపడుతుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే వారితో స్నేహం చేయండి. వారితో ప్రతిరోజూ ఆంగ్లంలో మాట్లాడటం ద్వారా త్వరగా నేర్చుకోగలుగుతారు. ఈ ప్రాక్టీస్ వల్ల మీరు ఏదైనా తప్పులు మాట్లాడితే వారు మిమ్మల్ని సరిచేయడం ద్వారా ఇంకా బాగా నేర్చుకోవచ్చు. లోకల్ స్పీకర్లను అనుకరించండి. వాళ్లు ఏం చెబుతున్నారో గమనించి అలాగే మీరూ పలకడం ప్రాక్టీసు చేయండి. తద్వారా భాషలో సహజత్వం అలవడుతుంది. మరీ ముఖ్యంగా.. ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని భారం అనుకోవద్దు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకోండి. నేర్చుకోవడం ఆరంభించి మధ్యలో ఆగిపోవడమూ మంచిది కాదు. నేర్చుకోవాలన్న తపన నిత్యం కొనసాగాలి. ప్రారంభంలో కష్టం అనిపించినా కొన్నాళ్లకు కొద్దికొద్దిగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆ కిక్కు అనిర్వచనీయం! ఇంకెందుకు ఆలస్యం ఇంగ్లిష్ నేర్చుకోవడం ఇప్పటి నుంచే ఆరంభించండి!!
- నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం..రతన్ టాటా కన్నుమూత! RATAN TATA PASSED AWAY
నిష్క్రమించిన వ్యాపార దిగ్గజం..రతన్ టాటా కన్నుమూత! RATAN TATA PASSED AWAY వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్... వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రతన్ టాటా మరణించిన విషయాన్ని హర్ష గొయెంకా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రతన్ టాటా. కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు రతన్ టాటా. రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి. 86ఏళ్ల రతన్ టాటా 28 డిసెంబర్ 1937న జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రతన్ టాటా మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు.. శిక్షణ పూర్తయిన తర్వాత, రతన్ టాటా తన బాధ్యతలను నిర్వహించడం ప్రారంభించాడు. మొదట టాటా గ్రూప్‌లో అసిస్టెంట్‌గా చేరారు. రతన్ టాటా..1991 మార్చి నుండి డిసెంబర్ 2012 వరకు టాటా సన్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను నడిపించారు. 2008లో, రతన్ టాటాను భారత ప్రభుత్వం దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఫాలో అవండి 👈 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు.. తొలుత టాటా స్టీల్‌లో చేరిన రతన్ టాటా.. అనంతరం గ్రూప్‌ను అంచెలంచెలుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ, దిశ చూపించారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని రూ.లక్షల కోట్లకు చేర్చిన ఆయన.. టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60-65 శాతం దాతృత్వానికే కేటాయించారు. బిజినెస్ టైకూన్‌గా పేరున్న రతన్ టాటా.. టాటా గ్రూప్‌ను రెండు దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. జేఆర్డీ టాటా నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా.. గ్రూప్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసమాన్యమైనది. 2000లో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన.. ప్రపంచంలోనే ‘టీ’ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్‌ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్‌కు పరిచయం చేశారు. దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్‌గా మారింది. దాతృత్వంలో రతన్ టాటాకు సాటిరారు.. కొవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం రూ. 1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. ‘‘అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కొవిడ్-19పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం" అని రతన్ టాటా తన ప్రకటనలో స్పష్టంచేశారు.
- నవంబరు 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
నవంబరు 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్! అమరావతి: మెగా డీఎస్సీ-2024 నోటిఫికే షన్ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయపోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న'టెట్ ' ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. 'వందరోజుల పరిపాలన'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులపై సమీక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్రాలస్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, నీట్, జేఈఈ, ఇతరవాటికి విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 102 స్కిల్ హబ్స్క అదనంగామరో 8 ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 26 స్కిల్ కళాశాలలు ఉండగా అదనంగా మరో ఆరింటి ఏర్పాటుకుచర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 54స్కిల్ స్పోక్స్ (పరిశ్రమలు) ఉండగా కొత్తగా మరో ఆరుఏర్పాటవుతాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 23వేలమంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ శిక్షణ ఇవ్వనున్నారు. పోస్టుల వివరాలు... తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి. మెగా డీఎస్సీ-2024 నోటిఫికే షన్ను నవంబరు 3న జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయపోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న'టెట్ ' ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు. 'వందరోజుల పరిపాలన'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాలను అమలుచేసే చర్యలు మొదలయ్యాయి. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులపై సమీక్షిస్తున్నారు. జాతీయ, రాష్ట్రాలస్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, నీట్, జేఈఈ, ఇతరవాటికి విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 102 స్కిల్ హబ్స్క అదనంగామరో 8 ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం 26 స్కిల్ కళాశాలలు ఉండగా అదనంగా మరో ఆరింటి ఏర్పాటుకుచర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 54స్కిల్ స్పోక్స్ (పరిశ్రమలు) ఉండగా కొత్తగా మరో ఆరుఏర్పాటవుతాయి. 2024-25 విద్యా సంవత్సరంలో 23వేలమంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ శిక్షణ ఇవ్వనున్నారు.
- భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ Nobel Prize 2024 - Physics
#NobelPrize2024_Physics భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు 2024 ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది స్టాక్‌హోం: భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. గతేడాది (2023) భౌతికశాస్త్రంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతి వ్యక్తి ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్‌లు ఆ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 1901 నుంచి ఇప్పటివరకు 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు భౌతికశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024), అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.
- వైద్యశాస్త్రంలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్ Nobel Prize in Medicine 2024
#nobelprize2024 #Nobel_Prize_in_Medicine_2024 # VictorAmbrosandGaryRuvkun వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌కు ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది. స్టాక్‌హోం: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్‌స్ర్కిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరి అమెరికన్ కాటలిన్ కరికో (Katalin Kariko), అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్ (Drew Weissman)లకు గతేడాది వైద్యశాస్త్రంలో నోబెల్ వచ్చింది. వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024), అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.
- నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, అటెండర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, అటెండర్ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
- వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయాలు.
వాలంటీర్లు , ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగనుంది.
- టీచర్లు, కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ పూర్తి చేయవలసిన ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే ప్రశ్నలు ఇవే !
#trainingneedsanalysissurvey #TNA #TNA_Syurvey #TNA_Syurvey_Questionnaire టీచర్లు, కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ పూర్తి చేయవలసిన ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే ప్రశ్నలు ఇవే ! TRAINING NEEDS ANALYSIS QUESTIONS 1. What according to you is the easiest topic to teach in the Grades 1-2 and subjects you are teaching. Why? Topic example: Units & Sub-units from textbook, Skills for languages Discuss as a group and mention one topic per subject Minimum 2 responses for each grade to be mentioned. Separate individual responses of teachers with a comma 1. What according to you is the easiest topic to teach in the Grades 3-5 and subjects you are teaching. Why? Topic example: Units & Sub-units from textbook, Skills for languages Discuss as a group and mention one topic per subject Minimum 2 responses for each grade to be mentioned. Separate individual responses of teachers with a comma 1. What according to you is the easiest topic to teach in the Grades 6-8 and subjects you are teaching. Why? Topic example: Units & Sub-units from textbook, Skills for languages Discuss as a group and mention one topic per subject Minimum 2 responses for each grade to be mentioned. Separate individual responses of teachers with a comma 1. What according to you is the easiest topic to teach in the Grades 9-10 and subjects you are teaching. Why? Topic example: Units & Sub-units from textbook, Skills for languages Discuss as a group and mention one topic per subject Minimum 2 responses for each grade to be mentioned. Separate individual responses of teachers with a comma 2. What according to you is the most difficult topic to teach in the Grades 1-2 and subjects you are teaching. Why? Topic example: Units & Sub-units from textbook, Skills for languages Discuss as a group and mention one topic per subject Minimum 2 responses for each grade to be mentioned. Separate individual responses of teachers with a comma 2. What according to you is the most difficult topic to teach in the Grades 3-5 and subjects you are teaching. Why? 2. What according to you is the most difficult topic to teach in the Grades 6-8 and subjects you are teaching. Why? 2. What according to you is the most difficult topic to teach in the Grades 9-10 and subjects you are teaching. Why? 3. What is the most effective teaching strategy you have applied in your classroom that has shown improvement in the student learning outcomes? Discuss as a group and provide a minimum of 2 responses for each row Separate individual responses of teachers with a comma 4. A. How many of you are aware about the following assessments? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant is aware of an option 4. B. How many of you have access to a CBA school based report and used them for your classroom instructions? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant is aware of an option Each participant can only vote for one option 4. C. How many of you have access to the Misconception posters and used them for your classroom instructions? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant is aware of an option Each participant can only vote for one option 5. Rate yourself on explaining the concepts of the chapter using the new textbooks. Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 5. Rate yourself on performing the activities and exercises of the chapters in the new textbooks. Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 5. Rate yourself on creating/modifying lesson plans for classroom instructions using the new textbooks. Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 6. Provide the specific support you would like to receive on usage of technology for classroom instructions? Discuss as a group and mention at least 1 and maximum of 3 Separate individual responses of teachers with a comma Key words: IFPs, Smart TVs, Creating presentations, QR codes 7. Provide the specific support you would like to receive in non-academic areas? Discuss as a group and mention at least 1 and maximum of 3 Separate individual responses of teachers with a comma Key words: Cultural activities, Quizzes, School clubs 8. Training on specific subjects, assessments, school leadership, foundation literacy and numeracy, life skills etc, are already planned or conducted. Apart from these training , is there any other training you would like to receive? Discuss as a group and mention at least 1 and maximum of 3 Separate individual responses of teachers with a comma 9. There are three modes of delivery used for training: Online, In-person and Blended. Could you share out of these three - purely online, purely offline and blended which mode would you prefer? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 10. How much time would you be able to spend on the online training in a week? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 11. What is your preferred language in which to consume online modules? Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 12. Please rank your teaching effectiveness for each area listed below. Mark the area where you're strongest as 'first priority' and the area needing most improvement as 'fourth priority'. Make sure each area gets a different priority. Rate yourself in the area of Time on Learning . Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 12. Please rank your teaching effectiveness for each area listed below. Mark the area where you're strongest as 'first priority' and the area needing most improvement as 'fourth priority'. Make sure each area gets a different priority.Rank yourself in the area of Classroom Culture . Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 12. Please rank your teaching effectiveness for each area listed below. Mark the area where you're strongest as 'first priority' and the area needing most improvement as 'fourth priority'. Make sure each area gets a different priority.Rank yourself in the area of Lesson Facilitation . Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 12. Please rank your teaching effectiveness for each area listed below. Mark the area where you're strongest as 'first priority' and the area needing most improvement as 'fourth priority'. Make sure each area gets a different priority.Rate yourself in the area of Socio-emotional Skills . Count the participants for each option, and write the number next to the option Write 0 if no participant prefers an option Each participant can only choose one option 13. What challenges or barriers do you face that hinder your ability to show professional ethics in the classroom? Discuss as a group and mention at least 1 and maximum of 3 Separate individual responses of teachers with a comma Section D 14. Please upload a photo of the meeting with all the participants Collection : AP Teachers TV ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే చేయు విధానం వీడియో ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఫాలో అవండి 👈
- 10, 12 బోర్డు పరీక్షలు ఇక సీసీటీవీ నిఘాలోనే
CBSE: 2025లో జరగనున్న 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలోనే నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. CBSE Board Exam 2025 | ఇంటర్నెట్ డెస్క్: రానున్న ఏడాదిలో నిర్వహించబోయే 10, 12 బోర్డు పరీక్షలు సీసీటీవీ నిఘాలోనే జరపాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) నిర్ణయించింది. ఈ మేరకు అనుబంధ పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. 2025లో జరగనున్న బోర్డు పరీక్షా కేంద్రాల్లో నిఘా కెమెరాలు తప్పనిసరి చేసినట్లు అందులో పేర్కొంది. ఈవిషయాన్ని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. 2025లో సీబీఎస్ఈ నిర్వహించే పరీక్షల్లో భారత్‌తో పాటు 26 దేశాల్లో కలిపి సుమారు 44 లక్షల మంది హాజరవుతారని బోర్డు అంచనా వేసింది. ఈమేరకు పెద్దఎత్తున వసతి కల్పించాలని సుమారు 8,000 పాఠశాలల్ని పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసింది. వాటిలో సీసీటీవీ నిఘాని తప్పనిసరి చేస్తూ ఆయా పాఠశాలలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీసీటీవీ సౌకర్యం లేని ఏ పాఠశాలను పరీక్షా కేంద్రంగా పరిగణించేది లేదని అందులో స్పష్టంచేసింది. రికార్డ్ ఫుటేజీ సంబంధిత అధికారులు మాత్రమే చూసేందుకు వీలుంటుందని పరీక్షా ఫలితాలు వచ్చిన రెండు నెలల వరకు ఈ ఫుటేజీ భద్రంగా ఉంటుందని పేర్కొంది. ప్రతీ పది గదులకు లేదా 240 మంది విద్యార్థుల బాధ్యత తీసుకొనేందుకు ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమిస్తున్నట్లు తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సీసీటీవీ విధానం ద్వారా పారదర్శకత, పర్యవేక్షణ సామర్థ్యాలు పెరుగుతాయని సీబీఎస్ఈ భావిస్తోంది. వీటి సాయంతో ఎటుంటి ఆటంకం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన మంత్రి లోకేష్
స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన AP: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు. ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక రోజు సెలవు దినాన్ని పెంచినట్లు అనగా అక్టోబర్ 3వ తేదీ సెలవు ప్రకటించినట్లు కమీషనర్ , పాఠశాల విద్య వారు తెలియజేశారు. (అక్టోబర్ 2 గాంధీ జయంతి & మహాలయ అమావాస్య సెలవు వుంటుంది) దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుండి 13 వరకు వుంటాయి. - హృదయ రాజు , చిరంజీవి, ఏపిటీఎఫ్ అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని తెలిపారు. OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు. పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు. (చివరి పని దినం అక్టోబర్ 1 అందరూ విధి గా హాజరు కావాలి.) స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ పై కెపిఎంజి ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది. స్వర్ణాంధ్రలో భాగంగా స్కూల్ వారీగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అంశంపైనా సమాలోచనలు జరిపారు. వరదలు కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ను ఘనంగా నిర్వహించి ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.










