top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యుళ్లు!

    #factchecking #textbooks #kerala #keralaeducation #apeducation నకిలీ వార్తలు గుర్తించేందుకు ఏఐ సాయం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి. ఈ సందర్భంగా కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్‌) సీఈఓ కె.అన్వర్‌సాదత్ మాట్లాడుతూ..‘ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి ఐదు, ఏడో తరగతి విద్యార్థుల ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఆన్‌లైన్‌ ‘ఫ్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టాం. గతంలో ఏర్పాటు చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. నకిలీ వార్తలు, హానికరమైన కంటెంట్‌ను గుర్తించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చదువుకునే దశలోనే నకిలీ సమాచారంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆరు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సహాయం తీసుకుంటున్నాం. ఏడో తరగతికి సంబంధించిన కొత్త ఐసీటీ పుస్తకంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకునే అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మలయాళం, ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు. 2022లో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోని కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్‌) ‘డిజిటల్ మీడియా లిటరసీ కార్యక్రమం’ను చేపట్టింది. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 19.72 లక్షల మంది విద్యార్థులకు నకిలీ వార్తలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇందులో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంత భారీ శిక్షణ ఇవ్వడం దేశంలో అదే మొదటిసారి. ఈ ‍కార్యక్రమంలో 5920 మంది శిక్షకుల పాల్గొన్నారు. ‘సత్యమేవే జయతే’ పేరుతో 2.5 గంటలపాటు సాగిన ఈ శిక్షణలో ‘రోజువారీ జీవితంలో ఇంటర్నెట్‌ వినియోగం’, ‘సోషల్ మీడియా అవసరం’, ‘సోషల్ మీడియాలో హక్కులు-తప్పులు’ అనే నాలుగు విభాగాలపై దృష్టి సారించారు. విద్యార్థి దశలో సమాచారాన్ని విపులంగా అర్థం చేసుకోవాలి. అందులో నకిలీ వివరాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంపొందించుకుంటే ‘క్రిటికల్‌ థింకింగ్‌’ వృద్ధి చెందుతుంది. దానివల్ల చదువుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో మేలు జరుగుతుంది. ఇది కేవలం నకిలీ వివరాలు గుర్తించడానికి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది.

  • పగవాడికీ వద్దు... మగవాడి కష్టాలు!

    కౌమారంలో మీసాన్నీ, యవ్వనంలో రోషాన్నీ.. గిఫ్ట్‌బాక్స్‌లో పెట్టి మరీ అందించిన టెస్టోస్టిరాన్‌ హఠాత్తుగా సహాయనిరాకరణ చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కౌమారంలో మీసాన్నీ, యవ్వనంలో రోషాన్నీ.. గిఫ్ట్‌బాక్స్‌లో పెట్టి మరీ అందించిన టెస్టోస్టిరాన్‌ హఠాత్తుగా సహాయనిరాకరణ చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆ రసిక శిఖామణిని ఉత్తుత్తి మన్మథుడిగా మార్చేస్తుంది. ప్రతి యాభైమంది పురుషుల్లో ఒకరు టెస్టోస్టిరాన్‌ టెస్టులో విఫలం అవుతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్య సంక్షోభానికి అనేక కారణాలున్నా.. జీవనశైలి లోపాన్నే ప్రధాన ముద్దాయిగా బోన్లో నిలబెడుతున్నారు వైద్య నిపుణులు.   ఇతను.. అతనేనా?ఒకటో నంబరులా నిటారుగా ఉండేవాడు. ఇప్పుడేమో, ప్రశ్నార్థకంలా ఓ పక్కకి వాలిపోయాడు. వేడి తగ్గింది. వాడి మాయమైంది. ఆత్మవిశ్వాసం ఆవిరైంది. కండబలం కరిగిపోయింది. పెద్ద వయసూ కాదు. తీవ్ర అనారోగ్యాలూ లేవు. అయినా ఎందుకిలా? చిత్తుగా  ఓడిపోయిన మత్తగజంలా? ఊహించని ఆ మార్పు అతడినీ కుంగదీస్తోంది. ఎంత మథనపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో? ఏ ఆడపిల్లో అయితే అక్కకో, చెల్లికో చెప్పుకుని బరువు దించేసుకుంటుంది. నాలుగు కన్నీళ్లు రాల్చి నిశ్చింతగా నిద్రపోతుంది. అతనేమో చెట్టంత మగాడాయె! ఏకంగా తన పురుషత్వమే ప్రమాదంలో పడిందని ఎలా చెప్పుకుంటాడు పాపం? మొహమాటం పక్కనపెట్టి ఆ ప్రయత్నమూ చేశాడు. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తే మగ మెనోపాజ్‌.. ఆండ్రోపాజ్‌ లక్షణమని సమాధానం వచ్చింది. ఊబకాయం వల్ల కావచ్చని ఒకరూ, మధుమేహం దాడి చేసిందని మరొకరూ జోస్యం చెప్పారు. అన్నీ నిజాలు కాదు. అలా అని, అబద్ధాలూ కావు. అర్ధ సత్యాలు. అరకొర సమాచారాలు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాక కానీ స్పష్టత రాలేదు.. టెస్టోస్టిరాన్‌ లోపమని. ప్రతి యాభైమంది పురుషుల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. నిన్న మొన్నటి వరకూ టెస్టోస్టిరాన్‌ లోపాన్ని పెరిగే వయసుతో ముడిపెట్టేవారు. నడివయసు సంక్షోభంగా చిత్రించేవారు. ఇప్పుడు, పాతికేళ్ల యువకుల్లోనూ కనిపిస్తోంది.   మగతనానికి బండగుర్తు! టెస్టోస్టిరాన్‌.. పురుషుడికి మగతనాన్ని ప్రసాదించే దమ్మున్న హార్మోను. ఆమె నుంచి అతడిని వేరుచేసే స్పష్టమైన విభజన రేఖ. కండబలాన్నిచ్చి భౌతికంగా శక్తిమంతుడిని చేస్తుంది. గుండెబలాన్నిచ్చి ఉద్వేగ పరంగానూ బలవంతుడిగా మారుస్తుంది. తొంభై అయిదుశాతం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ వృషణాల్లోనే తయారవుతుంది. మిగతా ఐదుశాతాన్ని అడ్రినల్‌ గ్రంథి సిద్ధం చేస్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తాన్నీ మెదడు ఒంటిచేత్తో నియంత్రిస్తుంది. అబ్బాయిలు కౌమారంలోకి ప్రవేశించగానే.. మీసాలూ గడ్డాలూ మొలవడం, పీలగా ఉన్న గొంతు కాస్తా గంభీరంగా మారిపోవడం, లేలేత శరీరం దృఢంగా తయారుకావడం.. టెస్టోస్టిరాన్‌ ప్రభావాలే. ప్రతి డెసీలీటరు రక్తంలో 300 నానోగ్రాముల కంటే తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉన్నప్పుడు.. దాన్ని ‘హైపోగోనాడిజం’గా పరిగణిస్తారు. పురుషుడిలోని టెస్టోస్టిరాన్‌ స్థాయిని నిర్ధారించడానికి చిన్నపాటి రక్తపరీక్ష సరిపోతుంది. మగాడికి నలభై దాటాక ఏడాదికి ఒక శాతం చొప్పున టెస్టోస్టిరాన్‌ ఊట మందగిస్తుంది. ఆరుపదుల తర్వాత మరింత వేగంగా పడిపోతుంది. కానీ, నేటితరం విషయానికి వచ్చేసరికి నాలుగు పదులు నిండకుండానే నిండుకుంటోంది. వృత్తి ఉద్యోగాల ఒత్తిడి, వేళాపాళాలేని భోజనాలు, నిద్రలేమి.. తదితర జీవనశైలి సమస్యలు ప్రధాన కారణాలని చెబుతున్నారు. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన రుగ్మతలూ దీనికి తోడవు తున్నాయి. ఏమైంది రావుగారూ? పాల్‌ ఉరఫ్‌ గోపాల్ర్‌ావు.. ఓ ఐటీ కంపెనీలో టీమ్‌ లీడర్‌. వయసు నలభై లోపే. పక్కా ప్రొఫెషనల్‌. లక్ష్యాల వెంట పరుగులు తీస్తాడు. అవసరమైతే, రాత్రీ పగలూ ఆఫీసులోనే ఉంటాడు. ఆరునెలలకో ఇంక్రిమెంటు, ఏడాదికో ప్రమోషను అతని ఖాతాలో పడాల్సిందే. ఎన్ని ఒత్తిళ్లున్నా.. మొహం మీద చిరునవ్వు చెదరదు. శరీరానికి అలసట తెలియదు. ఇదంతా గతం. తనిప్పుడు పూర్తిగా మారిపోయాడు. తరచూ డ్యూటీకి డుమ్మా కొడతాడు. అకారణంగా మీటింగ్స్‌ వాయిదా వేస్తాడు. చిన్న విషయాలకే సిబ్బంది మీద విరుచుకు పడతాడు. ఆ ప్రవర్తన మేనేజ్‌మెంట్‌కూ నచ్చడం లేదు. అతణ్ని తప్పించే ఆలోచనలో ఉంది. టెస్టోస్టిరాన్‌ లోపం గోపాల్‌ అసలైన వ్యక్తిత్వాన్ని మబ్బులా కమ్మేసింది. ఈ హార్మోన్‌ లోపం నేరుగా మనసు మీద దాడి చేస్తుంది. మన ప్రవర్తనను శాసిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత లోపిస్తుంది. మతిమరుపు మొదలవుతుంది. ఇట్టే అలసిపోతారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఓ దశలో డిప్రెషన్‌లోకి వెళ్లినా వెళ్తారు. దీంతో ఆఫీసులో మెమోలూ, ఇంట్లో చివాట్లూ తప్పవు. గోపాల్‌ ప్రస్తుతం ఈ దశలోనే ఉన్నాడు. టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు రెండూ సమస్యలపాలైన లక్షలమంది యువకులకు ప్రతినిధి అతను. మాజీ ‘మన్మథుడు’! రాజారామ్‌కు ఇంకా నడివయసు  రాలేదు. కానీ, రూపం మారిపోయింది. జుట్టు రాలిపోయింది. పొట్ట పొడుచు కొచ్చింది. ఛాతీ ఎత్తుగా, సున్నితంగా మారింది. అడుగుతీసి అడుగేసినా ఆయాసమే. లైంగిక జీవితమూ ఏమంత సాఫీగా సాగడం లేదు. తరచూ అంగస్తంభన సమస్య వేధిస్తోంది. ఇవన్నీ తాజా పరిణామాలే. అప్పట్లో సన్నగా కరెంటుతీగలా ఉండేవాడు. పడకగదిలో అయితే.. కుర్ర గుర్రమే. ఇంతలోనే ఎంత మార్పు! జీవనశైలిలో చిన్నపాటి తేడా కూడా లేకపోయినా.. బరువు మాత్రం భారీగా పెరిగిపోవడమనేది టెస్టోస్టిరాన్‌ లోపానికి తొలి సంకేతం. లైంగిక జీవితంలోని స్తబ్ధతనూ తేలిగ్గా తీసుకోలేం. చాలామంది ఆఫీసు ఒత్తిడిని సాకుగా చూపించి.. సర్దుకుపోతారే కానీ, దాన్నొక హార్మోన్‌ సమస్యగా గుర్తించరు. చికిత్స అవసరమనీ అంగీకరించరు. టెస్టోస్టిరాన్‌ తగ్గినప్పుడు, శారీరక దృఢత్వమూ దెబ్బతింటుంది. నిస్సత్తువ ఆవరిస్తుంది. చిన్నచిన్న బరువుల్నీ ఎత్తలేరు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ వీర్యం నాణ్యతనూ ప్రభావితం చేస్తుంది. సంతాన లేమికి దారితీయవచ్చు. రాజారామ్‌ ప్రస్తుతం ఓ వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. క్రమంగా మునుపటి ఉత్సాహాన్ని సొంతం చేసుకుంటున్నాడు. సొంతవైద్యం వద్దు.. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా టెస్టోస్టిరాన్‌ లోపాన్ని సరిచేస్తారు వైద్యులు. ఇందుకు రెండురకాల వ్యూహాలు అనుసరిస్తారు. మొదటి పద్ధతిలో ఇంజెక్షన్లూ,  పట్టీల ద్వారా టెస్టోస్టిరాన్‌ అందిస్తారు. రెండో మార్గంలో.. తనంతట తాను తయారు చేసుకునేలా శరీర వ్యవస్థకు కొత్తశక్తిని ప్రసాదిస్తారు. కాకపోతే, ఏ ప్రక్రియ అయినా నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. సొంత వైద్యం పనికిరాదు. చాలామంది యువకులు టెస్టోస్టిరాన్‌ మాత్రల్ని లైంగిక ఉద్దీపన ఔషధాలుగా భావిస్తారు. మరింత చురుకైన శృంగార జీవితం కోసం ఆన్‌లైన్‌లో దొరికే క్రీములు, మాత్రలు యథేచ్ఛగా వాడేస్తారు. ఇందులో చాలావాటి తయారీలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతిలేని హానికర రసాయనాల్ని జోడిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి దీర్ఘకాలంలో హానిచేస్తాయి. ప్రాణాలనూ మింగేస్తాయి. అంగస్తంభన సమస్యో, శీఘ్రస్ఖలన సమస్యో కనిపించగానే.. హార్మోన్‌ లోపం వల్లనే ఇలా జరుగుతోందనే నిర్ణయానికి వచ్చేయకూడదు. కొన్నిసార్లు గుండె జబ్బుల కారణంగానూ అంగస్తంభన ఆగిపోవచ్చు. ఒత్తిడినీ తేలిగ్గా తీసుకోలేం. ఒత్తిడితోపాటు కార్టిసాల్‌ హార్మోన్‌ ఊట కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం వల్ల కూడా టెస్టోస్టిరాన్‌ తయారీ మందగిస్తుంది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య ఉన్నప్పుడు సైతం ఆ ఉత్పత్తి పడిపోతుంది. మూల కారణం తెలుసుకోకుండా.. కృత్రిమంగా డోసేజీ పెంచుకుంటూపోతే.. ఓ దశలో వృషణాల్లో టెస్టోస్టిరాన్‌ తయారీ పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కూ దారితీస్తుంది. అకారణ బిడియాలతో, అర్థంలేని భయాలతో అసలు వైద్యమే చేయించుకోనివారు ఎంతోమంది. ఈ నిర్లిప్తత సొంతవైద్యం కంటే హానికరం. మురగబెట్టేకొద్దీ జటిలం అవుతుంది. కొందరిలో జన్మతః లోపాలు ఉంటాయి. ఏ ప్రమాదంలోనో రెండు వృషణాలూ దెబ్బ తిన్నప్పుడూ, క్యాన్సర్‌ కారణంగా ఏదో ఓ వృషణాన్ని తీసేసినప్పుడూ, వృషణాల పరిమాణం మరీ చిన్నగా ఉన్నప్పుడూ.. ఇలా అనేక సందర్భాల్లో  టెస్టోస్టిరాన్‌ పనితీరు మందగిస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్‌ దుష్ప్రభావాన్నీ విస్మరించలేం. కొన్నిసార్లు సమస్య వారసత్వమైందీ కావచ్చు. జీవనశైలిని మార్చుకుంటే.. ప్రతి పదిమంది ఊబకాయ పురుషుల్లో ఒకరిలో టెస్టోస్టిరాన్‌ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికో బలమైన కారణం ఉంది. ఊబకాయుల కొవ్వు కణజాలంలోని కొన్ని ఎంజైమ్‌లు టెస్టోస్టిరాన్‌ను క్రమంగా.. స్త్రీ హార్మోన్‌ అయిన ప్రొజెస్టెరాన్‌గా మార్చేయగలవు. కొన్ని అధ్యయనాలు టెస్టోస్టిరాన్‌ సమస్యను అధిక రక్తపోటుతోనూ ముడిపెడుతున్నాయి. పెయిన్‌ కిల్లర్లను యథేచ్చగా వాడటమూ ప్రమాదకర ధోరణే. మద్యపానం, ధూమపానం కూడా పురుషత్వ హార్మోన్‌కు శత్రువులే. ఆహారంలో జింక్‌ లోపం  టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని అడ్డుకుంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుడ్లు, మాంసం, చిక్కుడు జాతి గింజలు, సిరిధాన్యాలు సమృద్ధిగా తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. అదే సమయంలో విటమిన్‌-డి ప్రాధాన్యాన్నీ విస్మరించకూడదు. కాకపోతే, ఆ విటమిన్‌ను శరీరం శోషించు కోవాలంటే.. తగినంత మెగ్నీషియం కావాలి. మెంతికూర, పాలకూర, గోధుమ గడ్డి.. తదితరాలు ఆ కొరతను తీరుస్తాయి. ఆయుర్వేద ఔషధమైన అశ్వగంధనూ సిఫార్సు చేస్తారు సంప్రదాయ వైద్యులు. కొంతమంది వ్యాపారులు గేదెలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచుకుంటారు. ఇలాంటి పాలు టెసోస్టిరాన్‌ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. సిక్స్‌ప్యాక్‌ కోసం కొందరు, పతకాల మోజులో కొందరు.. దొడ్డిదారిని ఆశ్రయిస్తున్నారు. టెస్టోస్టిరాన్‌ను వినియోగిస్తున్నారు. మొదట్లో అంతా బావున్నట్టే అనిపించినా.. క్రమంగా శరీర వ్యవస్థ మొరాయిస్తుంది. ఆరోగ్య స్పృహ బాగా పెరిగిపోయాక.. కొలెస్ట్రాల్‌ను మనం పెద్ద విలన్‌లా ఊహించుకోవడం మొదలుపెట్టాం. పన్లోపనిగా మంచి కొలెస్ట్రాల్‌నూ దూరం పెడుతున్నాం. మన శరీరానికి కొద్దిపాటి కొలెస్ట్రాల్‌ కూడా అవసరమే. అందులో కొంత టెస్టోస్టిరాన్‌ తయారీలోనూ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను పూర్తిగా విస్మరిస్తే.. ఆ మేరకు టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు, మనిషి ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్లని చెబుతారు. ఆ తర్వాత వందేళ్లకు స్థిరపడింది. ఇప్పుడు.. డెబ్భై, ఎనభై. గత యాభై ఏళ్లలో ఆయుర్దాయమే కాదు, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. అప్పట్లో అరవై ఏళ్ల వ్యక్తి టెస్టోస్టిరాన్‌ స్థాయి ఎంతో.. ప్రస్తుతం పాతికేళ్ల యువత స్థాయి కూడా దాదాపుగా అంతే!                           * కేవలం టెస్టోస్టిరాన్‌ కోసమే ప్రయత్నిస్తే.. టెస్టోస్టిరాన్‌ మాత్రమే దక్కుతుంది. అవసరమైన కీలక హార్మోన్లను కోల్పోతాం. అదే పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తే..అన్నీ దక్కుతాయి. టెస్టోస్టిరాన్‌ సహా! ఇంత చిన్న కోడింగ్‌ చిట్కాను ఎందుకు మిస్‌ అవుతోందో నవతరం! నాగరికతకు మూలం అరవై అయిదువేల సంవత్సరాల క్రితం.. అనేకానేక కారణాల వల్ల ఆదిమ పురుషుడిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కొంతమేర తగ్గిందట. ఫలితంగా అతని పశుప్రవృత్తికి పగ్గాలు పడ్డాయి. అప్పటివరకూ ఓ వ్యసనంగా ఉన్న లైంగిక వాంఛ కాస్తా ఓ అవసరం స్థాయికి చేరింది. ప్రేమ, అనుబంధం.. ఉద్వేగాల జాబితాలో చోటు సంపాదించాయి. దీంతో మహిళతో బంధాన్నీ, సహజీవనాన్నీ కోరుకున్నాడు. క్రమంగా ఇల్లు కట్టుకున్నాడు. సేద్యం మొదలుపెట్టాడు. జీవితం సాఫీగా సాగేందుకు అవసరమైన ఆవిష్కరణలు ఆరంభించాడు. పురావస్తు నిపుణుల తవ్వకాల్లో దొరికిన పురుషుల పుర్రెలలో తేడాలను విశ్లేషించడం ద్వారా డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. అతిప్రాచీనమైన పుర్రెలతో పోలిస్తే.. ఆ తర్వాతి పుర్రెలలో పురుషత్వ లక్షణాలు కొంతమేర తగ్గినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు. టెస్టోస్టిరాన్‌ మోతాదుకూ, మనిషి ప్రవర్తనకూ మధ్య ప్రత్యక్ష సంబంధాన్నీ గుర్తించాయి అంతర్జాతీయ అధ్యయనాలు. దాదాపు వందమంది కరడుగట్టిన నేరస్థులకు రక్త పరీక్ష చేసినప్పుడు.. అందులో తొంభైమందిలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అసాధారణ స్థాయిలో ఉన్నట్టు తేలింది. క్షణక్షణముల్‌.. మహిళల్లో హార్మోన్లు నెలవారీగా మారిపోతుంటాయనీ, అదే పురుషుడిలో రోజువారీగా మార్పుకు గురవుతుంటాయని చెబుతారు నిపుణులు. టెస్టోస్టిరాన్‌ స్థాయి పూటపూటకూ మారుతుంది. పొద్దున్నే గరిష్ఠంగా ఉంటుంది. మధ్యాహ్నానికి నలభైశాతం పడిపోతుంది. భోజనం తర్వాత అయితే.. ఆ అంకెలు స్టాక్‌ మార్కెట్‌ పతనాన్ని తలపిస్తాయి. కారణం, ఆ సమయంలో మనలోని శక్తి  మొత్తం జీర్ణ ప్రక్రియలో తలమునకలై ఉంటుంది. దీంతో టెెస్టోస్టిరాన్‌ తయారీ ఏమంత వేగంగా జరగదు. గుండెకు మంచి చేసేవన్నీ, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ పెంచుతాయి. కాబట్టి, టెస్టోస్టిరాన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, గుండెనూ కాపాడుకున్నట్టే. కొన్ని మార్పులు.. ‘కంప్లీట్‌ గైడ్‌ టు టెస్టోస్టిరాన్‌’ రచయిత ఫ్రాన్సిస్‌ తన జీవితానుభవాన్ని జోడించి మరీ, జీవనశైలిలో కొన్ని మార్పులను సూచిస్తున్నారు. అందులో కొన్ని..1. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన పాక్షిక ఉపవాస విధానం టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తికి ఎంతోకొంత సహకరిస్తుంది. ఈ పద్ధతిలో రోజులోని ఇరవైనాలుగు గంటల్లో పదహారు గంటలు ఉపవాసం పాటిస్తారు. మిగతా ఎనిమిది గంటల సమయంలోనే భోజనం.   2. ఆధునిక జీవితాల్లో నిద్రలేమి అతిపెద్ద సమస్యగా మారుతోంది. మనం నిద్రలో ఉన్నప్పుడే టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. కలత నిద్రతో సర్దుకుపోకుండా.. ఎనిమిది గంటలు ఆదమరిచి పడుకోవాల్సిందే. 3. పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడే రసాయనాలు.. హార్మోన్‌ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి, వాటి ఎంపికలో జాగ్రత్తలు అవసరం. 4. మిగతా శరీరంతో పోలిస్తే.. వృషణాలకు కొంత చల్లని వాతావరణం అవసరం. కానీ,బిగుతైన డెనిమ్స్‌ ఆ భాగంలో గాలి చొరబడకుండా చేస్తాయి. దీనివల్ల కూడా టెస్టోస్టిరాన్‌ తయారీకి విఘాతం కలుగుతుంది. 5. ఒత్తిడి ప్రాథమికంగా మానసికమైంది. నెగెటివ్‌ ఆలోచనల సమాహారం. మనం ఏం ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోగలిగితే.. చెత్తను వదిలించుకోవచ్చు. ఆలోచనల మీద నియంత్రణ సాధించడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. 6. భోజన విధానంలోనూ కొన్ని మార్పులు అవసరమే. అల్లం, ఉల్లి, వెల్లుల్లి,  ఆలివ్‌ ఆయిల్‌ మొదలైన టెస్టోస్టిరాన్‌ పదార్థాలను వంటల్లో విరివిగా వాడాలి.

  • చదువు.. చట్టుబండలు

    #apeducation #ysjagan చదువు.. చట్టుబండలు వైసీపీ సర్కారు తీరుతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గత ఐదేళ్లలో అమలుచేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి. వైసీపీ సర్కారు తీరుతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గత ఐదేళ్లలో అమలుచేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి. ఫలితంగా ఈ ఏడాది ఏకంగా 4.24లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో తగ్గిపోయారు. వారంతా ఏమయ్యారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఇంటర్మీడియట్‌లోనే విద్యార్థుల సంఖ్య ఏకంగా 2లక్షలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనూ 1.55లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలు వదిలేసినా ప్రైవేటు బడుల్లో చేరి ఉంటారనే అంచనా ఉండగా, ఇప్పుడు అక్కడ కూడా లేరని తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇంత తేడా ఎందుకు వచ్చిందనే దానిపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. 4992 పాఠశాలల్లో పది మంది పిల్లలూ లేరు 20 మందీ లేని బడులు 12 వేలకు పైనే ఇంటర్‌లో భారీగా తగ్గిన విద్యార్థులు ఏకంగా 2లక్షల మంది దూరం తీవ్రంగా దెబ్బతిన్న విద్యా వ్యవస్థ గత ప్రభుత్వం తీరుతో ప్రతికూలత గత వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ఠ విధానాల కారణంగా ప్రభుత్వ బడుల పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టుమని పది మంది కూడా లేని పాఠశాలలు ఏకంగా 4992 ఉన్నట్లు తేలింది. అలాగే, కనీసం 20 మంది కూడా విద్యార్థుల్లేని బడులు 12252 ఉన్నట్లు కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. 2023-24లో 12,32,342 మంది విద్యార్థులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 10,76,690కి పడిపోయింది. అంటే 1,55,652 మంది విద్యార్థులు ఈ స్థాయిలోనే తగ్గిపోయారు. ఇంత స్థాయిలో అడ్మిషన్లు పడిపోవడానికి కారణాలేంటనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో తరగతి నుంచి టెన్త్‌ వరకు చూస్తే 67,752 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈ కేటగిరీలో ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 9,939 మంది తగ్గారు. ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో అడ్మిషన్లు తగ్గాయంటే శిశు మరణాలు తగ్గడం కొంతవరకు కారణం కావొచ్చు. కానీ గతేడాది బడుల్లో ఉన్నవారు ఇప్పుడు పై తరగతులకు ఎందుకు రాలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియట్‌లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 10,13,057 మంది ఇంటర్‌ కాలేజీల్లో ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 812377కు పడిపోయింది. అంటే 2,00,680 మంది తగ్గిపోయారు. వీరిలో ఎంతమంది పక్క రాష్ర్టాలకు వెళ్లిపోయారు? ఎంతమంది డ్రాపౌట్‌ అయ్యారు? అనేది తేలాలి. మొత్తంగా ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు 4,24,084 మంది విద్యార్థులు తగ్గారు. ఉన్నత విద్య ట్రెండ్‌ గతంలో ఉన్నత విద్యలో మాత్రమే రాష్ర్టానికి చెందిన విద్యార్థులు పక్క రాష్ర్టాలకు వలస వెళ్లి చదువుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్‌లోనూ ఆ ట్రెండ్‌ కనిపిస్తోంది. 2లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటే వారిలో చాలా మంది తెలంగాణ, ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదివే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖలో గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యార్థులు వలస బాట పట్టే పరిస్థితులు వచ్చాయి. విలీనంతో దెబ్బతీశారు ప్రాథమిక విద్యను జగన్‌ ప్రభుత్వం విలీనంతో దెబ్బతీసింది. 4వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇది ప్రాథమిక పాఠశాలలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పుడేం చేయాలి? విద్యార్థుల సంఖ్య పడిపోవడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒకేసారి పిల్లలు భారీగా తగ్గిపోవడంతో వారిని తిరిగి బడులకు తీసుకురావాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వం టీచర్లపై బోధనేతర పనులను రుద్ది, బోధన అంశాలను పక్కనపెట్టడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంకా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. జీవో 117తో చేసిన ప్రయోగాలు కూడా బెడిసి కొట్టాయి. ఒకే తరగతికి ఒక బడిలో సబ్జెక్టు టీచర్లతో బోధించడం, మరో బడిలో ఎస్జీటీలతో పాఠాలు చెప్పించడం విమర్శలకు దారితీసింది. దానివల్ల ప్రయోజనం లేదని తెలిసినా కొనసాగించడంతో విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే పరిస్థితి వచ్చింది.

  • మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు #diabetes #Gymnema_sylvestre #gurmar

    మధుమేహాన్ని తగ్గించే మొక్క..గుర్తింపు #diabetes #Gymnema_sylvestre #gurmar బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్‌ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీనికి సొంతం. బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్‌ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీనికి సొంతం. ఈ వ్యాధి చికిత్స కోసం బీజీఆర్‌-34 అనే ఔషధ తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) పరిశోధకులు గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. తద్వారా తీపి పదార్థాలను తినాలన్న ఆకాంక్షను తగ్గించేస్తుంది. ఇది అంతిమంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రహ్మయొని పర్వతంపై పిథెసెలోబియం డుల్సే, జిజుఫస్‌ జుజుబా వంటి మొక్కలు కూడా కనిపించాయి. వీటిలోని ఔషధ గుణాలపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ పర్వతంపై కనిపించిన వనమూలికలు అంతరించిపోకుండా.. స్థానికుల సాయంతో వాటిని సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చికిత్సల కోసం ఆ ప్రాంతవాసులు ఉపయోగించే మొక్కలను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నారు.

  • డీఎస్సీలో అవకాశం కల్పించాలి

    #PET #PD #apdsc ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరమవుతోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా యూజీడీ పీఈటీ (అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌) చేసిన నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. యూజీడీ పీఈటీ అభ్యర్థుల విన్నపం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాయామ విద్య దూరమవుతోంది. ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రవ్యాప్తంగా యూజీడీ పీఈటీ (అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌) చేసిన నిరుద్యోగ పీఈటీ అభ్యర్థులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2000 వరకు యూజీడీ పీఈటీ, డిగ్రీ తర్వాత బీపీఈడీ, ఆపై ఎంపీఈడీ చేసిన వారంతా ఉన్నత పాఠశాలల్లో పీఈటీలుగా నియమితులయ్యేవారు. ఆ తర్వాత ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ)గా ఉద్యోగోన్నతి పొందేవారు. 2004, 2010, 2012, 2016 డీఎస్సీలలో యూజీడీ పీఈటీ చేసిన వారంతా డీఎస్సీ రాశారు. గత వైకాపా ప్రభుత్వం తన హయాంలోని చివరి ఏడాదిలో ఆర్భాటంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో కేవలం పీడీ (ఫిజికల్‌ డైరెక్టర్‌) పోస్టుల ఖాళీలనే చూపించింది. దీంతో వేల మంది యూజీడీ పీఈటీలు ఉపాధికి దూరమయ్యారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు రాష్ట్రంలో సుమారు 15 పీఈటీ శిక్షణ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో వంద మంది చొప్పున పదేళ్లలో సుమారు 15 వేల మంది శిక్షణ పొందిన వారున్నారు. అందులో దాదాపు 550 మంది పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక డీఎస్సీ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. 2024 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎస్‌ఎ (పీఈ) పేరుతో 1,691 పోస్టులు ప్రకటించినా ప్రస్తుత విధానంలో యూజీడీ పీఈటీ చేసిన అభ్యర్థులు డీఎస్సీకి అనర్హులవుతారు. పీఈటీ చేసిన వారికి కేవలం 132 ఖాళీలనే చూపించి సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్, గిరిజన విద్యాలయాల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. పీఈటీల డిమాండ్లు ఇవీ.. ఉన్నత పాఠశాలల్లో పీడీలనే నేరుగా నియమించాలన్న నిబంధన ఉన్నందున 3 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీలను నియమించాలి. తర్వాత అర్హత, ప్రతిభ ఆధారంగా పీడీలుగా ఉద్యోగోన్నతి ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల ప్రాథమికోన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. అందులో పీఈటీలను నియమించాలి. 250 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో పీడీ, 500 దాటితే పీడీ, పీఈటీ, వేయి వరకుంటే ఇద్దరు పీడీలు, ఇద్దరు పీఈటీలను నియమించాలి.

  • DA Update: ఉద్యోగులకు ఆ 18 నెలల డీఏ బకాయిలు? కీలక ప్రకటన!

    #DA_arrears #apteacherstvtelugu #apemployees DA Update: కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిచిపోయిన 18 నెలల డీఏ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతులు పంపించాయి. ఇప్పుడు పార్లమెంటులోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రధానాంశాలు: ఉద్యోగులు, పెన్షనర్ల డీఏపై కీలక ప్రకటన పెండింగ్‌లో ఉన్న 18 నెలల బకాయిలు పార్లమెంటులో ఆర్థిక శాఖ కీలక ప్రకటన DA Update: కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేసింది ప్రభుత్వం. 18 నెలల డీఈ, డీఆర్ బకాయిలు రావాల్సి ఉంది. వీటి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. డియర్‌నెస్ అలవెన్సు బకాయిల విడుదలపై పార్లమెంట్ వర్షకాల సమావేశంలో చర్చకు వచ్చింది. పార్లమెంటు సభ్యుల్లో ఇద్దరు డీఏ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. కోవిడ్-19 వైరస్ విజృంభించిన సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు విడుదల చేస్తున్నారా? ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకోసం బకాయిలు ఇవ్వడం లేదనే కారణం వెల్లడించాలని ప్రశ్నించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్సులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. 2024లో ఇప్పటి వరకు అందిన వినతులు, ఫిర్యాదుల వివరాలు వెల్లడించాలని, వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో సభకు తెలియజేయాలని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ' 2020, జనవరి 1, 2020, జులై 1, 2021 జనవరి 1వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు చెల్లించాల్సిన మూడు విడతల డియర్‌నెస్ అలవెన్స్/ డియర్‌నెస్ రిలీఫ్ స్తంభింపజేయాలనే నిర్ణయం.. కోవిడ్ -19 నేపథ్యంలో తీసుకోవాల్సి వచ్చింది. తద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం ఈ మేరకు నిర్ణయించింది. 2024లో ఇప్పటి వరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి వినతులు వచ్చాయి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యల ఫైనాన్సింగ్ కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ కారణంగానే డీఏ లేదా డీఆర్ బకాయిలు చెల్లించడం ఆచరణీయంగా పరిగణించలేదు.' అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మూడు విడతలుగా విడుదల చేయాల్సిన డీఏ, డీఆర్ బకాయిల విలువ సుమారు రూ. 34,402.32 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఫండ్స్‌ని ప్రభుత్వం కోవిడ్-19 తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కోసం వినియోగించినట్లు తెలిపాయి. మరోవైపు.. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో తమకు డీఏ బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగాలు భావించారు. ఈ క్రమంలోనే ఎన్సీజీసీఎం ఆధ్వర్యంలో 14 డిమాండ్లతో కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు.

  • స్కూళ్లలో గుడ్ మార్నింగ్‌కు బదులు జై హింద్ అని చెప్పాలి.. కీలక ఆదేశాలు

    #jaihind #nogoodmorning ఇకపై స్కూళ్లలో(schools) ఉపాధ్యాయలకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు(No Good Morning). అవును మీరు విన్నది నిజమే. కానీ దానికి బదులుగా జై హింద్ అని చెప్పాలి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి. ఇకపై స్కూళ్లలో(schools) ఉపాధ్యాయలకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు(No Good Morning). అవును మీరు విన్నది నిజమే. కానీ దానికి బదులుగా జై హింద్ అని చెప్పాలి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి. అందుకే విద్యార్థుల్లో జాతీయ ఐక్యత, దేశభక్తి భావనను పెంపొందించే లక్ష్యంతో హర్యానా ప్రభుత్వం( Haryana government ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇప్పటికే రెండు పేజీల నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, నోటిఫికేషన్ ప్రకారం విద్యార్థులు పాఠశాలలో 'గుడ్ మార్నింగ్'కి బదులుగా 'జై హింద్' అని ఉపయోగించాలని తెలిపింది. కారణమిదే.. ఈ నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పలు వాదనలు చేసింది. ఏ ప్రాతిపదికన పిల్లలకు ‘జై హింద్’ అని చెప్పడం తప్పనిసరి చేశారో ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వ నోటిఫికేషన్‌లో 'జై హింద్' ప్రాముఖ్యతను కూడా వివరించారు. చిన్నతనంలోనే పిల్లల్లో దేశం పట్ల భావాలు మెలగాలని హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా, బ్లాక్‌ అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని ప్రిన్సిపాల్‌, ప్రధానోపాధ్యాయులు త్వరగా అమలు చేయాలని సూచించారు. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ముందు పాఠశాలల్లో(schools) ఈ విధానం ప్రారంభించాలని పాఠశాలలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలువురు మాత్రం పిల్లల్లో(children) దేశభక్తి, జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నొక్కి చెబుతూ, జై హింద్ చెప్పడం పాఠశాల విద్యార్థులకు జాతీయ ఐక్యత, మన దేశ చరిత్ర గురించి స్ఫూర్తినిస్తుందని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించిన సమయంలో జై హింద్ నినాదం ఇచ్చారని ఈశాఖ తన నిర్ణయంలో తెలిపింది. అందుకే దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి పట్ల మన పిల్లలు కూడా గౌరవ భావాన్ని పెంపొందించుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తుండగా, మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

  • క్రిప్టో కరెన్సీ ఏ దేశాల్లో అమల్లో ఉంది.. ఇండియాలో పరిస్థితి ఏంటి? #cryptocurrency

    #cryptocurrency ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ( Crypto Currency )తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. తక్కువ సమయంలో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులు కావాలని అనేక మంది వీటిలో పెట్టుబడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ(telangana), ఆంధ్రప్రదేశ్(AP) సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోట్ల రూపాయల్లో క్రిప్టో వ్యాపారం చేస్తున్నారు. దీని ద్వారా అనేక మంది లాభపడుతుండగా, నష్టపోతున్న వారు సైతం ఉన్నారు. నియంత్రించే దిశగా అయితే 2021లో క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం అధికారికంగా క్రిప్టోకరెన్సీని నియంత్రించే దిశగా అడుగు వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అన్ని ఇతర ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను కూడా నిషేధిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 2022 యూనియన్ బడ్జెట్‌లో వర్చువల్ డిజిటల్ ఆస్తులు లేదా క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే లాభాలపై ప్రభుత్వం 30% పన్ను, 1% TDS విధించింది. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీని బహుమతిగా స్వీకరించినా లేదా బదిలీ చేసినా బహుమతి పొందిన వ్యక్తికి పన్ను విధించబడుతుంది. అయితే వర్చువల్ కరెన్సీపై పన్ను విధించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం స్వీకరించినప్పటికీ బిట్‌కాయిన్ వంటి కరెన్సీలు భారతదేశంలో చట్టబద్ధమైనవా కాదా అనే దానిపై మాత్రం ప్రభుత్వం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే క్రిప్టోకరెన్సీ నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం. అమెరికాలో USలో పన్ను ప్రయోజనాల కోసం క్రిప్టోకరెన్సీలను ఆస్తులుగా పరిగణిస్తారు. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఏవైనా లావాదేవీ జరిగితే తప్పనిసరిగా పన్ను రిటర్న్‌లో నమోదు చేయాలి. యూఎస్‌లో, ఫియట్, టోకెన్ ఎయిర్‌డ్రాప్‌లు, మైనింగ్ లేదా స్టాకింగ్ క్రిప్టో కోసం క్రిప్టోను విక్రయించడం, ఒక టోకెన్‌ను మరొకదానికి కొనుగోలు చేయడంపై పన్నులు వర్తిస్తాయి. మూలధన లాభాలు, ఆదాయపు పన్నుల రేట్లు 0 నుంచి 37 శాతం మధ్య ఉంటాయి. యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో క్రిప్టో లేదా క్యాపిటల్ గెయిన్స్‌లో ఆదాయంపై పన్నులు అమల్లో ఉంటాయి. దీనిపై వర్తించే పన్ను రేట్లు 10 శాతం నుంచి 20 శాతం మధ్య ఉన్నాయి. ఫియట్‌ను ఉపసంహరించుకోవడానికి క్రిప్టోను విక్రయించడం, మరొక టోకెన్ కోసం టోకెన్‌లను వర్తకం చేయడం, నిజమైన ఆస్తులకు చెల్లించడానికి క్రిప్టోను ఉపయోగించడం, క్రిప్టోలో లాభాలు ఆర్జించడం అన్నింటికీ ఇక్కడ పన్నులు వర్తిస్తాయి. ఇటలీ ఇటలీలో క్రిప్టోకరెన్సీలు ఆర్థిక సాధనంగా పరిగణించబడతాయి. ఇవి మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటాయి. పోర్ట్‌ఫోలియో విలువ 2000 యూరోలు దాటితే 26 శాతం మూలధన లాభాల పన్ను ఉంటుంది. జర్మనీ జర్మనీలో క్రిప్టోకరెన్సీలు వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడతాయి. ఇవి ఆదాయపు పన్నుకు లోబడి ఉంటాయి. మూలధన లాభాల పన్ను సాధారణంగా వ్యక్తులకు కాదు వ్యాపారాలకు వర్తిస్తుంది. ఒక వ్యక్తి సంపాదించిన లాభం 600€ కంటే తక్కువగా ఉంటే అది పన్ను రహితం. జర్మన్ పన్ను చట్టం ప్రకారం వ్యక్తిగత ఆస్తిపై ఆదాయపు పన్ను వర్తిస్తుంది. పన్ను రేటు 0 నుంచి 45 శాతం. పోర్చుగల్ పోర్చుగల్లో క్రిప్టోకరెన్సీలను మూలధన ఆదాయం లేదా స్వయం ఉపాధి ఆదాయంగా పరిగణిస్తారు. క్రిప్టో నుంచి వచ్చిన ఆదాయంపై 28 శాతం చొప్పున పన్ను విధించబడుతుంది. క్రిప్టో మైనింగ్, వెరిఫికేషన్, టోకెన్ జారీపై 14.5 శాతం నుంచి 53 శాతం మధ్య పన్నులు విధించబడతాయి. క్రిప్టోకరెన్సీని నిషేధించబడిన దేశాలు ఆఫ్ఘానిస్తాన్ అల్జీరియా బంగ్లాదేశ్ బొలీవియా చైనా ఈజిప్ట్ ఘనా ఇరాక్ కువైట్ లెసోతో లిబియా మొరాకో మయన్మార్ నేపాల్ ఉత్తర మాసిడోనియా రిపబ్లిక్ ఆఫ్ కాంగో సౌదీ అరేబియా సియెర్రా లియోన్ ట్యునీషియా

  • ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు పాటించవలసిన మార్గాలు

    ఆధునిక తరగతి గదిలో సవాళ్ళను అధిగమించడానికి ఉపాధ్యాయులు పాటించవలసిన మార్గాలు ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ఆధునిక తరగతి గదిలో ఉపాధ్యాయులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్ళను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి: 1. వివిధ నేర్చుకునే శైలులను అర్థం చేసుకోవడం ప్రతి విద్యార్థి నేర్చుకునే విధానం వేరు. అందువల్ల, ఉపాధ్యాయులు పాఠాలను రూపొందించేటప్పుడు వివిధ నేర్చుకునే శైలులను పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు విద్యార్థులు విజువల్ లెర్నర్స్, మరికొందరు ఆడిటరీ లెర్నర్స్, ఇంకొందరు కినెస్టెటిక్ లెర్నర్స్. ఈ విధంగా, పాఠాలను రూపొందించడం ద్వారా ప్రతి విద్యార్థి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. 2. సమర్థవంతమైన కమ్యూనికేషన్ విద్యార్థులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి విద్యార్థి తన అవసరాలను సరిగ్గా తెలియజేయలేకపోవచ్చు. అందువల్ల, ఉపాధ్యాయులు వివిధ కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించాలి. ఉదాహరణకు, క్లాస్ డిస్కషన్స్, గ్రూప్ ప్రాజెక్ట్స్, మరియు వ్యక్తిగత చర్చలు ద్వారా విద్యార్థులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయవచ్చు. 3. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ మార్పులను అనుసరించి, కొత్త సాంకేతిక పద్ధతులను నేర్చుకోవాలి. ఉదాహరణకు, ఆన్‌లైన్ లెర్నింగ్ టూల్స్, ఎడ్యుకేషనల్ యాప్స్, మరియు డిజిటల్ రిసోర్సెస్ ఉపయోగించడం ద్వారా పాఠాలను మరింత ఆకర్షణీయంగా మరియు సమర్థవంతంగా చేయవచ్చు. 4. విద్యార్థుల మధ్య సహకారం పెంపొందించడం విద్యార్థుల మధ్య సహకారం మరియు సమన్వయం పెంపొందించడం ద్వారా తరగతి గది వాతావరణం మెరుగుపడుతుంది. టీమ్ వర్క్ మరియు గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. విద్యార్థులు ఒకరితో ఒకరు సహకరించడం ద్వారా, వారు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు మరియు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. 5. వ్యక్తిగత సమయాన్ని కేటాయించడం ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సమయాన్ని కూడా కేటాయించుకోవాలి. ఇది వారికి మానసిక శాంతిని ఇస్తుంది మరియు మరింత సమర్థవంతంగా పాఠాలు బోధించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ధ్యానం, యోగా, మరియు ఇతర రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా ఉపాధ్యాయులు తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 6. విద్యార్థుల ప్రోత్సాహం విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది వారి విద్యలో మెరుగుదలకు దారితీస్తుంది. ఉదాహరణకు, చిన్న విజయాలను గుర్తించడం, ప్రశంసించడం, మరియు ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. 7. నిరంతర అభ్యాసం ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి. ఇది వారికి తమ బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవడానికి మరియు విద్యార్థులకు మరింత సమర్థవంతంగా పాఠాలు బోధించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, వర్క్‌షాప్స్, సెమినార్స్, మరియు ఆన్‌లైన్ కోర్సులు ద్వారా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. 8. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకోవడం ప్రతి విద్యార్థి వ్యక్తిగత అవసరాలు వేరు. అందువల్ల, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుగుణంగా పాఠాలను రూపొందించాలి. ఉదాహరణకు, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వడం ద్వారా, వారు కూడా సమర్థవంతంగా నేర్చుకోవచ్చు. 9. పాజిటివ్ క్లాస్‌రూమ్ ఎన్విరాన్‌మెంట్ పాజిటివ్ క్లాస్‌రూమ్ ఎన్విరాన్‌మెంట్ సృష్టించడం ద్వారా విద్యార్థులు మరింత ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉంటారు. ఉదాహరణకు, తరగతి గదిలో స్నేహపూర్వక వాతావరణం, మరియు విద్యార్థుల మధ్య పరస్పర గౌరవం పెంపొందించడం ద్వారా పాజిటివ్ ఎన్విరాన్‌మెంట్ సృష్టించవచ్చు. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయులు ఆధునిక తరగతి గదిలో ఎదురయ్యే సవాళ్ళను సులభంగా అధిగమించవచ్చు. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి!

  • ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు(గైడ్‌లైన్స్) విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

    #workadjustmentguidelines ఏపీ టీచర్స్ టీవీ : ఏపీలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నివారించడానికి అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టుటకు నిబంధనలు విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్లను వారి యొక్క సబ్జెక్ట్‌లకు అనుగుణంగా అవసరమైన పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులు బోధించుటకు నియమిస్తారు. అలాగే అదనంగా ఉన్నటువంటి ఎస్జీటీలను వారి యొక్క మెథడాలజీ ఉన్న సబ్జెక్టు బోధనకు అవసరమైన పాఠశాలల్లో నియమిస్తారు .ఏదైనా పాఠశాలల్లో ఇద్దరు పీడీలు గానీ పీజీటీలు గానీ ఉంటే ఒకరిని అవసరమున్న వేరే పాఠశాలకు సర్దుబాటు చేస్తారు ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి గైడ్‌లైన్స్ మరియు ముఖ్యాంశాలను పూర్తిగా తెలుసుకొనుటకు ఈ క్రింది బటన్ నొక్కి వర్క్ అడ్జస్ట్‌మెంట్ గైడ్‌లైన్స్లు డౌన్లోడ్ చేసుకోగలరు. *♻️సర్దుబాటు ప్రమాణాలు* *సబ్జెక్ట్ టీచర్లు (SAs) మరియు SGTలు ఒకే సబ్జెక్ట్‌లోని అన్ని మేనేజ్‌మెంట్‌ల (ప్రభుత్వం/ZPP/MPP/మున్సిపల్) పరిధిలోని పాఠశాలల అవసరాల ఆధారంగా సర్దుబాటు చేయబడతారు.* *మిగులు పాఠశాల సహాయకులు వారి సంబంధిత పద్ధతుల ప్రకారం ఇతర సబ్జెక్టులకు సర్దుబాటు చేయబడతారు.* *కలిగిన మిగులు SGTలు, సంబంధిత డిగ్రీ మరియు B.Ed కలిగి ఉన్నారు. సంబంధిత సబ్జెక్టులోని మెథడాలజీ, ప్రీ-హై స్కూల్‌లు మరియు హైస్కూళ్లలో సంబంధిత సబ్జెక్టులను బోధించడానికి సర్దుబాటు చేయబడుతుంది.* *ఒకటి కంటే ఎక్కువ SA(PD) లేదా PET ఉన్న పాఠశాలలను గుర్తించండి మరియు అదనపు సిబ్బందిని పని సర్దుబాటు కింద ఏదైనా SA(PD) లేదా PET లేని పాఠశాలలకు పునఃపంపిణీ చేయండి.* *ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం సర్దుబాటు అవసరాన్ని లెక్కించాలి.* *✳️సర్దుబాటులో ప్రాధాన్యత* *నిబంధనల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను (SAs) సర్దుబాటు చేయండి.* *అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో, 98 కంటే తక్కువ నమోదు అయినట్లయితే, 3 నుండి 8 తరగతులు మరియు 1 నుండి 2 తరగతులను విడిగా విభజించి ఉపాధ్యాయులను కేటాయించండి.* *ప్రాథమిక పాఠశాలల్లో, నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించండి.* *మిగులు ఉపాధ్యాయులను ఇప్పటికీ గుర్తించినట్లయితే, వారు గుర్తించిన మిగులు పరిధి ఆధారంగా ఒకే ఉపాధ్యాయ పాఠశాలల్లో అవరోహణ క్రమంలో సర్దుబాటు చేయబడతారు.* *గుర్తించబడిన SA(PD) మరియు PETలు అవరోహణ క్రమంలో SA(PD) లేదా PET లేని పాఠశాలలకు కేటాయించబడతాయి.* *✳️పేర్కొన్న ప్రమాణాలు క్రింది దశల్లో తీసుకోబడతాయి* *Phase-I:* *Inter Management with in the Mandal.* *Same subject within Mandal* *Inter subject within Mandal* Qualified SGTs within Mandal Phase-II: In Division level first preference within Management, if still surplus teachers available then inter management. Same subject with in Division Inter subject with in Division మిగులు ఉపాధ్యాయులను గుర్తించేందుకు మార్గదర్శకాలు పాఠశాలలో జూనియర్-అత్యంత ఉపాధ్యాయుడు మిగులుగా గుర్తించబడతారు. సబ్జెక్ట్ టీచర్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ లభ్యత లేని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మిగులు ఉపాధ్యాయులను గుర్తించిన తర్వాత, పైన పేర్కొన్న @పాయింట్ నెం.(iii)లో పేర్కొన్న దశల కోసం ఇంటర్-మేనేజ్‌మెంట్‌లోని కేడర్ సీనియారిటీ పరిగణించబడుతుంది. కేడర్ సీనియారిటీ ఒకేలా ఉంటే, ప్రాథమిక నియామకం తేదీని ముందుగా పరిగణించాలి, తర్వాత పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. పని సర్దుబాటు ప్రక్రియ UDISE నుండి 07/08/2024న నమోదు చేయబడిన డేటా ఆధారంగా నిర్వహించబడుతుంది. పని సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల లభ్యతను నిర్ధారించుకోండి. గమనిక: మిగులు ఉపాధ్యాయులను ఎత్తైన ప్రాంతం/ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు డిప్యూట్ చేయడం మానుకోండి. ఏప్రిల్ 30, 2025న లేదా అంతకు ముందు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు మరియు 100% దృష్టి లోపం ఉన్నవారు పని సర్దుబాటు ప్రక్రియ నుండి మినహాయించబడ్డారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఈ ప్రక్రియ నుండి మినహాయించబడ్డాయి. వితంతువులు, అవివాహిత మహిళా ఉపాధ్యాయులు, చట్టబద్ధంగా విడిపోయిన మరియు జీవిత భాగస్వామి మైదానాలు డివిజన్ స్థాయిలో పని సర్దుబాటు నుండి మినహాయించబడతాయి. అయినప్పటికీ, వారు సిద్ధంగా ఉంటే, వారు దశ-II సమయంలో డివిజన్‌లో పరిగణించబడవచ్చు. ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ మొత్తం 11.08.2024న లేదా అంతకు ముందు పూర్తవుతుంది.

  • Gaddar: గద్దర్ గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు..?

    ‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! ‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..! నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు.. వేల ఆందోళనల్లో కదంతొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసి నేటికి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఆయన తాలుకూ కొన్ని గురుతులు ఇప్పుడు చూద్దాం వచ్చేయండి..! జననం.. గుమ్మడి విఠల్‌.. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాబ్యాసం చేసిన గద్దర్.. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్‌లో చదివాడు. ఆంధ్రమహాసభ ఉద్యమస్ఫూర్తితో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉబికి వచ్చినట్టే, 1969 ఉద్యమం మిగిల్చిన నిరాశానిస్పృహల నుంచి విప్లవోద్యమ లావా ఎగిసిపడిందన్న అవగాహన ఉన్నవాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశాడు. కేవలం పాటలు రాసి, పాడి కోట్లాది జనం గుండె చప్పుడు కాలేదాయన. ఆచరణ ప్రక్రియకు వెనుకాడక అజ్ఞాతంలోకి వెళ్లి సంవత్సరాల పాటు ఉద్యమ యుద్ధరంగంలో సైనికుడై ముందు నడిచినవాడు గద్దర్‌. అందుకే తిరిగి మైదానంలోకి అడుగిడినా ప్రజాసైనికుని పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్.. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్‌కే సాధ్యం! సృజనశక్తితో భౌతికశక్తిని మమేకం చేసి, ఆ రాపిడి నుంచి పాటల నిప్పురవ్వలను, ఆ రవ్వల నుంచి అగ్నిజ్వాలలను సృష్టించినవాడు. అందుకే లక్షలాది ప్రజలలో వ్యవస్థ పట్ల అసహనం కలిగించగలగటం ఒక్క గద్దర్‌కే సాధ్యమైంది. అంతేకాదు నిజాయితీతో, నిబద్ధతతో తన అడుగుజాడలలో నడిచే అనుయాయులను కూడా గద్దర్‌ తయారుచేశాడు. ఎన్ని ఒత్తిడులున్నా, అనారోగ్యం బాధించినా, దేహంలోని తూటాను రెండవ గుండెగా ధరించి ముందకు సాగాడే కాని వెనుకంజ వేయలేదు. కర్షక, కార్మిక లోకం శోకం, ఆదివాసీ గిరిజనుల దుఃఖం తన పాటల గాలి కెరటాలతో తుడిచినవాడు గద్దర్‌. ఎంత అట్టడుగు నుండి ఉద్యమం మొదలుపెడితే అన్ని అడ్డంకులు ఎదురవుతాయి. గద్దర్‌ ఉద్యమ జీవితంలో ఎదురైన సవాళ్లు కూడా ఇవే. ఇదంతా ఆయన జీవితానుభవ సంపద అయింది. నిరంతర తాజా సమాచారం కోసం వాట్సాప్ చానెల్ ని ఫాలో అవండి 👈 సామాన్యుడు సైతం! విప్లవోద్యమానికి, అస్తిత్వ ఉద్యమానికి అభేదం చెప్పి పాటపాదాలతో తన పాదాలను ఆటపాదాలుగా మానవీకరించినవాడు గద్దర్‌. అందుకే ప్రేక్షకుడు యాంత్రికంగా గద్దర్‌ను రంగస్థలం మీద వీక్షించలేడు. తన సర్వేంద్రియాలను ఏకం చేసి నవరసాలను అనుభూతి చెంది, తనను ఆత్మీయంగా గద్దర్‌కు అంకితం చేసుకుంటాడు. గద్దర్‌ చేతిలో ఒక ఎర్ర రుమాలు ఉంటుంది. అది పేరుకు బట్టపేగు. అయినా ఆయన సృజన ప్రక్రియలో అది ఒక పాత్రధారి అయింది. మహాత్మాగాంధీ తర్వాత ఒక ప్రత్యేకమైన ఆహార్యంతో జనసామాన్యుల ప్రతీకగా ప్రసిద్ధికెక్కాడు. కారల్‌ మార్క్స్‌ గతితార్కిక భౌతికవాదం చదవకుండానే ఉన్న వర్గాలు లేని వర్గాలను ఎట్లా దోచుకుంటున్నాయో గద్దర్‌ పాటల ద్వారా చదువురాని సామాన్యుడు తెలుసుకున్నాడు. నిమిషాల్లోనే పాట..! పాట కట్టడం మౌఖిక సంప్రదాయం. సాంప్రదాయికంగా ఇది సృజనశక్తికి సంబంధించిన అంశమే. గద్దర్‌లో ఈ శక్తి ఎంతో అనితరసాధ్యంగా, అద్భుతంగా ఉండేది. ఆయన ఏ సందర్భంలోనైనా నిమిషాలలో పాటకట్టేవాడు. పాటకట్టడం, దాన్ని స్వరపరచడం, పాడటం అన్న ప్రక్రియలు అవ్యవధిగా సాగేవి. సమకాలికులలో ఈ శక్తిగలవారు మరెవరూ లేరు. దీంతో ‘పాట’ను నిర్వచించే పనిని పరిశోధకులు కొత్తగా మొదలుపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే గద్దర్‌ బౌద్ధికశక్తి కూడా అసాధారణమైనది. ‘ప్రజల నుండి ప్రజలకు’ అన్న సూత్రాన్ని అనుసరించి ఆయన ముందుకు సాగాడు. అందుకే ఆయన స్వాయత్తం చేసుకున్న జానపద కళారూపాలు సార్థకమయ్యాయి. మరణం..! 1980 దశకం నాటి దళిత స్త్రీవాద ఉద్యమాలు సంచలనశీమైనవి. స్వయంగా దళితవర్గానికి చెందినవాడు కావడం వల్ల వర్గపోరాటంతో పాటు వర్ణపోరాటం కూడా అవసరమనుకున్నాడు. దళితవాదాన్ని స్వీకరించి అసంఖ్యాకంగా పాటలు పాడాడు. డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఉత్సవాలలో పాల్గొన్నాడు. ఆ రకంగా సమన్వయవాదం వైపు అడుగులు వేశాడు. ఫలితంగా సమకాలీన రాజకీయాలలో కూడా తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. పెత్తందారీల పాలిట బందూకుగా.. అణగారిన వర్గాలకు బాసటగా నిలిచిన గుమ్మడి విఠల్‌ అలియాస్‌ గద్దర్‌ (74) కన్నుమూశారు. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్‌ అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది.. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని భావిస్తుండగా.. అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. ఏదిఏమైనా అర్ధ శతాబ్ది సాహిత్య సాంస్కృతిక రాజకీయ చరిత్రలో మార్పు కోసం కృషి చేసిన చరిత్రపురుషునిగా గద్దర్‌ సుస్థిరంగా నిలిచివుంటారు.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ సోమవారం రాత్రి అప్డేట్ అయ్యింది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఏం చేర్చారంటే...

    #schoolattendanceapp ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు నమోదు చేసి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్ సోమవారం రాత్రి మళ్ళీ అప్ డేట్ అయింది. ఈ అప్ డేట్ లో ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్‌లోని అటెండెన్స్ అప్లికేషన్ ద్వారా అప్‌డేట్ చేసిన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డేటాను ధ్రువీకరించుటకు డీడీఓలకు, అధికారులకుఆ ప్షన్‌ని ఈ అప్ డేట్ లో చేర్చడం జరిగింది. డీడీవోలు తమ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వారి మొబైల్ ఫోన్లలో స్కూల్ అటెండన్స్ యాప్ నందు నమోదు చేసుకున్న వివరాలను ఈ యాప్ లో వారి లాగిన్ నందు ధృవీకరించవలెను (Approve ). ఈ అప్డేట్ ని కింది బటన్ నొక్కి డౌన్లోడ్ /అప్డేట్ చేసుకోవచ్చు . TIS in ఫేషియల్ యాప్: Individual లాగిన్ లో సబ్మిట్ చేసిన TIS వివరాలు అటెండెన్స్ యాప్ నందలి Reporting officer యొక్క లాగిన్ లో కి తదుపరి confirmation కొరకు పంపబడినవి. 1. రిపోర్టింగ్ ఆఫీసర్ తన పరిధిలో ని స్టాఫ్ వివరాలకు సంబంధించిన సదరు ఉద్యోగి ఫిర్యాదు ఏమైనా ఉంటే దానిని తగు విచారణ చేసి,తగు ఆధారముతో....కోరిన మార్పులు చేయాలి. 2. ముఖ్యంగా ప్రతి ఉద్యోగి Designation సరిగ్గా ఉందో లేదో‌ తప్పక చూడాలి. మార్పులు అవసరమైతే చేయాలి. 3. ఇప్పుడు Reporting ఆఫీసర్ సమర్పించే వివరాలపైనే సర్దుబాటు జరుగుతుంది కావున Data లో తప్పు లకు సదరు అధికారే బాధ్యులు. 4. Reporting ఆఫిసర్ confirmation తదుపరి డేటా లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. 5. తేదీలు,ఆప్షనల్స్,మెధడాలజీలు తప్పక వెరిఫై చేయాలి.అవసరమైతే తగు మార్పులు చేయాలి. 6. High school,High school Plus designation లు జాగ్రత్తగా చూసి సబ్మిట్ చేయాలి.వివరాలకు యూజర్ మాన్యువల్ చూడండి. 7. School Asdistant(Physics),School Assistant (Physical Science) మరియు school Assistant (Physical Education) ఓకేలా ఉంటాయి.జాగ్రత్తగా వారి వారి డిజిగ్నేషన్ పదాలు కూడా తప్పు లు దొర్లకుండా చూడాలి. 8. MTS టీచర్స్ అందరూ తప్పక MTSగా నమోదు చేయాలి.SGTగ నమోదు చేయరాదు. 9. వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కావున designation తప్పుగ ఉంటే ఆ సమస్య వస్తుంది. 10. తమ పరిధిలో ఉపాధ్యాయులు నమోదు కాకపోయినా, వివరాలు ‌సరిగా సమర్పించకపోయినా ఏదైనా సేవలు అందించేటపుడు తన వివరాలు తప్పుగా ఉన్నాయి ఇప్పుడు మార్చండి అని అడిగినా...సంబంధిత Reporting officer బాధ్యత వహించాలి. Reporting officers తొందరపడి తప్పులు చేయకండి. మీరు‌తప్పు సబ్మిట్ చేస్తే ఇహ ఎడిట్ లేదు.

bottom of page