top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • YSRCP Manifesto 2024#ysrcpmanifesto

    YSRCP Manifesto 2024 📌#YSRCPManifesto రెండు పేజీలతో కూడిన YSRCP మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టో చదివి వినిపించారాయన. రెండు విడతల్లో పెన్షన్‌  రూ.3,500 దాకా పెంపు(2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం) 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదు. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు వైఎస్సార్‌ చేయూత పథకం గత ఐదేళ్లలో 4 విడతల్లో రూ.75 వేలు అందించాం. వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు విడతల్లో మరో రూ.75వేలు అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో రూ. లక్షా 50 వేలు లబ్ది చేకూరుతుంది అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం రాబోయే ఐదేళ్లలో వైద్యంపై స్పెషల్‌ ఫోకస్‌. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ(ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం) వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కొనసాగిస్తాం. గత ఐదేళ్లలో నాలుగు దఫాల్లో రూ.60 వేలు అందించాం. వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు దఫాల్లో మరో రూ.60వేలు అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో రూ.1,20,000 లబ్ది చేకూరుతుంది. గత ఐదేళ్లలో ఈబీసీ నేస్తం కింద ఒక్కో లబ్దిదారుకు రూ.45 వేల సాయం అందించాం. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.60 వేలు అందిస్తాం. మొత్తంగా ఒక్కో లబ్దిదారుకు ఈబీసీ నేస్తం కింద రూ.1,05,000 లబ్ది చేకూరుతుంది. వైఎస్సార్‌ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు వాహన మిత్ర పథకం కింద గత ఐదేళ్లలో ఒక్కో లబ్ది దారుడికి రూ.50 వేలు అందించాం. ఈ పథకాన్ని వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో మరో రూ.50వేలు అందిస్తాం. మొత్తంగా పదేళ్లలో ఒక్కో లబ్దిదారుకు రూ.1 లక్ష వాహన మిత్ర కింద లబ్ది చేకూరుతుంది. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు లా నేస్తం కొనసాగింపు అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌ ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ స్విగ్గీ, జొమాటో లాంటి గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌ ఇస్తాం వీటితో పాటు.. వివిధ వర్గాలకు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ప్రస్తావన YSRCP మేనిఫెస్టో కాపీని డౌన్లోడ్ చేయుటకు కిందకి స్క్రోల్ చేయగలరు. రాజధానుల విషయంలో మళ్లీ అధికారంలోకి రాగానే.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాం రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతాం అమరావతిని శాసన రాజధానిగా అభివృ‍ద్ధి చేస్తాం కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తాం మొత్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉంది. 👉అమ్మఒడి 17000 👉డ్వాక్రా సంఘాలకు 3లక్షలవరకు సున్నా వడ్డీ 👉కళ్యాణమస్తు 👉అర్హులకు ఇళ్ల స్థలాలు 👉పెన్షన్స్ 3000 నుండి 3500 👉కాపు నేస్తం 60000 నుండి 120000 పెంపు 👉ఈబీసీ నేస్తం 45000 నుండి 105000 పెంపు 👉YSR చేయూత 75000 నుండి 150000 పెంపు 👉రైతుభరోసా 13500 నుండి 16000 వరకు పెంపు 👉మత్స్యకార భరోసా 👉వాహనమిత్ర 50000 నుండి లక్షకు పెంపు 👉లారీ టిప్పర్ అలాగే సొంత వాహనంకు డ్రైవర్ గా నడిపే అందరికీ వాహనమిత్ర 👉డ్రైవర్ల ప్రమాద భీమా 1000000 👉లా నేస్తం 👉చేనేత నేస్తం 120000 నుండి 240000 కు పెంపు 👉యువత ఉపాధికి ప్రతీ నియోజకవర్గంకు స్కిల్ హబ్ 👉విద్యాదీవెన,వసతిదీవెన 👉విద్యలో సంస్కరణలు 👉3590 అధ్యాపకుల నియామకాలు 👉ఆరోగ్యశ్రీ 👉స్పెషలిస్ట్ డాక్టర్స్ నియామకాలు 👉దేవాలయ నిర్వహించడం కోసం ప్రత్యేక నిధి 👉జగనన్న తోడు చిరు వ్యాపారులకు 10000 నుండి 15000 కి పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు సంభందించిన విషయాలు 👉విదేశీ విద్యకు అయిన ఖర్చుకు వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది 👉25000 లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపు మిగతా అంశాలు 👉స్విగ్గి జోమాటో వంటి గిగ్ workers కి YSR జీవన భీమా 👉జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు 👉ప్రతీ జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ 👉విశాఖపట్నం పరిపాలన రాజధాని 👉అమరావతి శాసన రాజధాని 👉కర్నూలు న్యాయ రాజధాని 👉పెండింగ్ ప్రాజెక్ట్స్ త్వరితగతిన పూర్తి.

  • ప్రభుత్వ ఉద్యోగులకోసం వైఎస్సార్సీపీ మానిఫెస్టోలో ఏముంది?#ysrcpmanifesto

    ప్రభుత్వ ఉద్యోగులకోసం వైఎస్సార్సీపీ మానిఫెస్టోలో ఏముంది? #ysrcpmanifesto ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు ఇప్పటికీ పెంచాం 🔸 ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా.. ఉద్యోగుల భద్రత, భవిష్యత్తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని. పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం గ్యారెంటీడ్ పెన్షన్ విధానం (జీపీఎస్) తీసుకొచ్చాం. 🔸 అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు, 108, 104 వాహనాల డ్రైవర్లు, ఆశా వర్కర్లు.. ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికి భిన్నంగా భారీగా పెంచాం. ఫలితంగా 3 లక్షలకుపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. 🔸 ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం. ఏటా రూ.3,600 కోట్ల భారం. తద్వారా 52 వేల మందికి మంచి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్. తద్వారా 10 వేల మందికి మంచి చేశారు. 🔸 పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాడు. 🔸పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చాం. అమలులో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ కమీషన్లు, దళారీలు లేకుండా జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వారికి అందేలా చూస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో..... 🔸 జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో రూ.30 లక్షల వరకు.. పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్లపాటు చెల్లిస్తాం. #ysrcpmanifesto 🔸 రూ.25 వేల వరకు జీతం పొందే అప్కాస్, అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్య, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలూ వారికీ వర్తింపు. 🔸 ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు. 60 శాతం ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. #ysrcpmanifesto

  • టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి #10thResults2024#SSCResults2024

    టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి #10thResults2024 #SSCResults2024 టెన్త్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి: AP SSC Results 2024.. ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం: 84.32 బాలికల ఉత్తీర్ణత శాతం: 89.17 ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్‌ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. రికార్డుస్థాయిలో తక్కువ రోజుల వ్యవధిలోనే పరీక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారాయన. పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితా.లను విద్యార్థులకు ఒక్క క్లిక్‌దూరంలో విద్యార్థులకు సాక్షి అందుబాటులోకి తెస్తోంది. https://results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా, మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్‌a తెలిపారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్‌ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేసినట్లు, విద్యా సంవత్సరం ముగియక ముందే ఫలితాలు ప్రకటిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 6.23 లక్షల మంది విద్యార్థుల టెన్త్‌ పరీక్షలు పరీక్షలు రాశారు టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి బాలుర ఉత్తీర్ణత శాతం 84.32, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17 మొత్తంగా 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారు ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌.. 93.7 శాతం రిజల్ట్‌ ఫలితాల్లో చివరి స్థానంలో కర్నూలు జిల్లా (67 శాతం) 2,300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత ఒక్కరూ పాస్‌కాని స్కూల్స్‌ 17 మే 24 నుంచి జూన్‌ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు కింది లింకుల ద్వారా పదోతరగతి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు ➡️ https://results.bse.ap.gov.in/ ➡️www.eenadu.net ➡️www.Eenadupratibha.net/ ➡️ www.sakshieducation.com/ పూర్తి వివరాలు 1.ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024 పత్రికా ప్రకటన, 2.ముఖ్యాంశాలు, 3.ఇతర గణాంకాలు, 4.నమోదైన మరియు హాజరైన అభ్యర్థులు హాజరు శాతం, 5.బాల బాలికల వారీగా ఉత్తీర్ణత శాతం, 6.సబ్జెక్టు వారీగా ఉత్తీర్ణత శాతం, 7.మీడియం వారీగా హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు ఉత్తీర్ణత శాతం, 8. 0% నుంచి 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, 9.మేనేజ్మెంట్ వారీగా పాఠశాలల నుండి హాజరైన ఉత్తీర్ణులైన అభ్యర్థులు మరియు ఉత్తీర్ణత శాతం, 10.జిల్లాల వారీగా హాజరైన ఉత్తీర్ణులైన బాలబాలికలు వివరాలు, 11.జిల్లాల వారీగా వివిధ శ్రేణుల్లో ఉత్తీర్ణులైన వారు, 12. అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం, 13.రీకౌంటింగ్ & రివెరిఫికేషన్ పై సూచనలు, 14.మైగ్రేషన్ సర్టిఫికెట్ వివరాల కోసం కింది పూర్తి వివరాలు బటన్ నొక్కండి పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల లైవ్ వీడియో

  • స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ చేసుకోండి! #schoolsttendanceapp

    స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ చేసుకోండి! #schoolsttendanceapp ఈరోజు 16.04.24 న స్కూల్ అటెండెన్స్ యాప్ (SIMS) అప్డేట్ వచ్చింది. పాత యాప్ పనిచేయదు. కావున ఇప్పుడే ఇక్కడే యాప్ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ అప్ డేట్ తరువాత యాప్ స్మూత్ గా పనిచేస్తుంది. స్కూల్ అటెండన్స్ యాప్ అప్డేట్ చేసుకోండి! #schoolsttendanceapp CLICK HERE TO DIRECT DOWNLOAD

  • SCHOOL ATTENDANCE APP UPDATE DOWNLOAD

    School Attendance (SIMS-AP) UPDATE Details: About this app: Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance App permissions: Version 2.4.0 may request access to Camera: take pictures and videos Location: precise location (GPS and network-based): approximate location (network-based) Phone: directly call phone numbers read phone status and identity Storage: modify or delete the contents of your SD card read the contents of your SD card Other: read audio files from shared storage read video files from shared storage Advertising ID Permission run foreground service read image files from shared storage • run at startup full network access view network connections prevent phone from sleeping Play Install Referrer API Access to Adid API access AdServices Attribution APIs show notifications receive data from Internet You can disable access for these permissions in Settings. Updates to School Attendance (SIMS-AP) may automatically add additional capabilities within each group.

  • ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం: ఈ కోర్సు లింకుల నుంచి జాయిన్ కావచ్చు #careerguidance #diksha

    ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం #careerguidance #diksha స్కూల్ అసిస్టెంట్లకు, TGT, PGT, హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాల్ అందరూ కూడా కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది. Diksha App link : https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app కోర్సు ప్రారంభం అయ్యే తేదీ: 01.04 2024. రిజిస్ట్రేషన్ చివరి తేది : 10.04.2024 కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఐదు రకాల కోర్సులను దీక్ష యాప్ ద్వారా పైన తెలిపిన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. #careerguidance #diksha ఆన్లైన్ కోర్స్ కు సంబంధించిన లింకులు ఇవి 👇 Course - 1 https://diksha.gov.in/explore-course/course/do_313915615285305344112561 Course - 2 https://diksha.gov.in/explore-course/course/do_313915389774897152112120 Course - 3 https://diksha.gov.in/explore-course/course/do_313918481517600768119365 Course - 4 https://diksha.gov.in/explore-course/course/do_313914625361149952117193 Course - 5 https://diksha.gov.in/explore-course/course/do_313914747295064064111469

  • Navodaya.gov.in లో 6, 9వ తరగతుల నవోదయ JNVST 2024 ఎంట్రన్స్ రిజల్ట్స్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్‌లు ఇవే !

    నవోదయ ఫలితాలు 2024 ప్రకటించబడ్డాయి : NVS navodaya.gov.inలో 6 మరియు 9 తరగతులకు సంబంధించిన JNVST 2024 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా స్కోర్‌లను ధృవీకరించవచ్చు. ఈ దశలను అనుసరించండి: వెబ్‌సైట్‌ను సందర్శించండి, "JNV results 2024," ఇన్‌పుట్ రోల్ నంబర్ మరియు DOB క్లిక్ చేయండి, submit చేయండి , ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి.డౌన్ లోడ్ కోసం డైరెక్ట్ లింక్‌లు అందుబాటులో ఉన్నాయి. నవోదయ ఫలితం 2024 అవుట్: నవోదయ విద్యాలయ సమితి ( NVS) 6వ తరగతికి సంబంధించిన జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) 2024 మరియు 9వ తరగతికి సంబంధించిన లాటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ ఫలితాలను navodaya.gov.inలో తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది . జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6 మరియు 9 తరగతుల్లో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వారి లాగిన్ ఆధారాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. JNVST 2024 ఫలితాన్ని తనిఖీ చేయడానికి , ఈ step లను అనుసరించండి: step 1: నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ని navodaya.gov.in లేదా cbseitms.nic.in లో సందర్శించండి. step 2: హోమ్ పేజీలో, "JNV results 2024" లింక్‌ని గుర్తించి, దానిపై క్లిక్ చేయండి. step 3: పేర్కొన్న ఫీల్డ్‌లలో విద్యార్థి రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి. step 4: కొనసాగడానికి "Check Result " బటన్‌పై క్లిక్ చేయండి. step 5: జవహర్ నవోదయ విద్యాలయ 2024 ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు కోసం కాపీని ఉంచుకోండి. ప్రత్యక్ష లింక్‌లు: ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు ప్రత్యామ్నాయంగా క్రింది డైరెక్ట్ లింక్‌లను ఉపయోగించవచ్చు- 6వ తరగతికి ప్రత్యక్ష లింక్ - జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) ఫలితం 2024 9వ తరగతి కోసం ప్రత్యక్ష లింక్ - పార్శ్వ ప్రవేశ ఎంపిక పరీక్ష ఫలితం 2024

  • విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాలు వాయిదా! కారణమిదే!!

    విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రవీణ్‌ప్రకాశ్‌ సమావేశాలు వాయిదా. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్‌ 2, 23న నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్సులను అత్యవసర కార్యక్రమాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఏప్రిల్‌ 2 ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో, ఏప్రిల్‌ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో వీసీలు నిర్వహిస్తానంటూ ఆయన ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, ఓటర్లు అయిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేసేందుకే ఇవి ఏర్పాటు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన వాటిని వాయిదా వేసుకోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల విధుల శిక్షణ, పదో తరగతి పరీక్షల మూల్యాంకనం.. రెండూ ఏప్రిల్‌ 1నే ఉండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు దేనికి హాజరుకావాలా? అనే సందిగ్ధంలో ఉన్నారని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి తెలిపారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కోరారు. జిల్లా విద్యాధికారులతో చర్చించాక సమాచారమిస్తామని ఆయన తెలిపినట్లు శనివారం ఓ ప్రకటనలో సంఘ నాయకులు తెలిపారు.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయింది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లు ఇవే! #schoolattendanceappupdate

    స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయింది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్లు ఇవే! #schoolattendanceappupdate ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు నమోదు చేసే ఫేషియల్ అటెండెన్స్ యాప్... స్కూల్ అటెండెన్స్ (సిమ్స్ యాప్) అప్డేట్ చేశారు. ఈ అప్డేట్ ఈ కింది డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి కొత్త అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. #schoolattendanceappupdate కొత్త ఫీచర్లు: ఈ అప్డేట్లో కొత్తగా 11వ తరగతి మరియు 12వ తరగతి బైజుస్ కంటెంట్ ని యాక్టివేట్ చేసే టైల్ ని పొందుపరిచారు. హై స్కూల్ ప్లస్ గా అప్గ్రేడ్ అయిన పాఠశాలలకు ఈ ఫీచర్ వాడకం తప్పనిసరి. ఈ టైల్ ఓపెన్ చేసి 11 మరియు 12 తరగతుల బైజుస్ కంటెంట్ ని యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ అప్డేట్ లో కొన్ని మైనర్ బగ్స్ ని ఫిక్స్ చేశారు. ఏపీ టీచర్స్ కి సంబంధించిన సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ అన్ని రకాల ఉపయోగకరమైన సమాచారం ఈ వెబ్సైట్ నందు , ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ లోనూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏపీ టీచర్స్ టీవీ నెట్వర్క్ అన్ని సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉన్నది. ఆయా మాధ్యమాలలో ఫాలో కావడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ పొందవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ నొక్కి మీ ప్రోత్సాహం అందించగలరు.

  • రెండు డీ.ఏ. లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం #DA,#APEmployees

    రెండు డీ.ఏ. లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.#DA, #APEmployees BIG BREAKING: ఉద్యోగులకు 2 డీఏలు విడుదల #DA, #APEmployees AP: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం చొప్పున రెండు డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్ నెల జీతంతో ఒక డీఏ, జులై నెల జీతంతో మరో డీఏ ఉద్యోగులకు అందనుంది. దీంతో మొత్తం డీఏ 33.67 శాతానికి చేరనుంది. ఎరియర్స్ డబ్బులను మూడు విడతల్లో సెప్టెంబర్, డిసెంబర్, మార్చి-2025లో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. 1) G.O.MS.No.28 DA Hike from 26.39 to 30.03 (3.64%) effect from 1.1.2023. Cash from April 2024 salary (To be paid in May) Arrears shall be paid in three equalle installments... Aug 2024, Nov 2024 & Feb 2025. 2) GO.MS.No.30 Fin Dept Dated: 15-03-2024. DA Hike from 30.03 to 33.67 (3.64%).. effect from 1.7.2023. Cash from July 2024 salary (To be paid in August) Arrears shall be paid in three equalle installments. Sep 2024 , Dec 2024 & March 2025.

  • మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు

    మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక జీవోలు రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారి కోసం ప్రభుత్వాలు ఎన్నో రాయితీలు కల్పించడమే కాకుండా సౌకర్యాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సౌకర్యాలకు సంబంధించి జీవోల వివరాలు.. 1 మహిళా ఉద్యోగులకు 5 సీఎల్ లు అధికం. (జీవో. ఎంఎస్.నెం.374, ఈడీఎన్, తేది 16-3-1996) 2. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు. (జీవో.ఎంఎస్.నెం.1415, ఎంఅండెచ్, తేది 10-06-1968) 3. మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్కు కూడా 14 రోజులు సెలవు ఇస్తారు (జీవో. ఎంఎస్.నెం.124, ఎఫ్ఎండ్, తేది 13-04-1982) 4. లూప్ వేయించుకున్న రోజు స్పెషల్ సీఎల్ ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం.128, ఎఫ్ఎండ్పీ, తేది 13-04-1982) 5. ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రికానలైజేషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం. 102, ఎం అండ్చ్, తేదీ 19-02-1981) 6. గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు. (జీవో. ఎంఎస్.నెం.52, ఎఫ్ఎస్ఐఎన్, తేది 01-04-2011) 7. 180 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించియున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. (జీవో. ఎంఎస్.నెం. 152, ఎఫ్ ఐఎన్, తేది 04-05-2010), (జీవో.ఎంఎస్ .నెం. 38, ఎఫండ్ పి, తేది 13-08-1992) 8. సమ్మర్ హాలిడేస్లో ప్రసవించిన, ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు. (జీవో. ఎంఎస్.నెం. 762, ఈడీఎన్, తేది 04-05-1979) 9. అబార్షన్ అయితే ఆరువారాలు సెలవు ఇస్తారు. (జీవో ఎంఎస్.నెం.762, ఎఫ్ sod 3, 36 11-08-1976) 10. వివాహం కొరకు రూ. 75 వేలు అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదాలలో తిరిగి 5.50 శాతం వడ్డీతో సహా చెల్లించాలి. (జీవో ఎంఎస్.నెం.39, ఎఫ్ఎండ్పి, తేదీ 15-04-2015) 11. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సులోని నిబంధన 22 ద్వారా వెసలుబాటు కల్పించినది. (జీవో.ఎంఎస్.నెం.237, జీఏడీ, తేది 28-05-1996) 12. ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలవుతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు (జీవో ఎంఎస్. నెం. 27. తేది 09-01-2004) 13. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తెకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. (జీవో. ఎంఎస్.నెం. 350, తేది 30-07-1999) 14. అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం. (మెమో 30.17897, 38 20-04-2000) 15. పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు. (జీవో.ఎంఎస్ . నెం. 322, జీఏడీ, తేది 19-07-1995). 16. ఎస్ఎస్సి సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు చేర్చు ఉత్తర్వులు. (353 30.7679 38 14-09-2010) 19. మహిళా ఉద్యోగులకు సర్వీసులో 60 రోజులు శిశు సంరక్షణ సెలవు మంజూరు. (జీవో.ఎం.ఎస్.నెం. 132, తేది 06-07-2016)

  • బై బై.. బైజూస్..! byjus huge shares took back

    బై బై.. బైజూస్..! byjus huge shares took back :బైజూస్‌లో గతంలో కొన్ని వందల మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థ తన పెట్టుబడిని భారీగా తగ్గించింది.ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్(Byjus) పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం పెట్టుబడిదారులతో ఒప్పందం వివాదం కారణంగా కష్టంగా మారిందని ఇటివల బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్(Byju Raveendran) ప్రకటించారు. మార్చి 10లోపు చెల్లిస్తామని చెప్పిన క్రమంలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతంలో బైజూస్‌లో పెట్టుబడి పెట్టిన ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ సంస్థ Macquarie Capital తన మొత్తం పెట్టుబడిని 98 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. స్విస్ బ్యాంక్ జూలియస్ బేర్ గ్రూప్(Julius Baer group) లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో Macquarie Capital బైజూస్‌లో పెట్టుబడిని తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ edtech సంస్థ Macquarie Capital నుంచి 2021లో పెద్ద ఎత్తున పెట్టుబడిని పొందింది. ఇది వందల మిలియన్ల డాలర్లుగా ఉండగా ఇప్పుడు 98 శాతం విలువ తగ్గింపు అనేది బైజూస్‌కు పెద్ద భారమనే చెప్పవచ్చు. అయితే కాలం చెల్లిన వాల్యుయేషన్‌ను పేర్కొంటూ బైజూస్ వసూలు చేసిన ఫీజులను ప్రశ్నించడంతో ఈ చర్య స్విస్ బ్యాంక్ జూలియస్ బేర్ గ్రూప్ అంశాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ చర్య ఇప్పుడు బైజూస్(Byjus) వాల్యుయేషన్, పెట్టుబడులపై మరింత ప్రభావం చూపనుంది. దీంతోపాటు ఫీజులు, వాల్యుయేషన్‌కు సంబంధించిన చిక్కులను కూడా కలిగి ఉండవచ్చు. దీంతో బైజూస్ భవిష్యత్తు(future) ఆర్థిక పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు జీతాల చెల్లింపు కష్టమేనని పలువురు అంటున్నారు.

bottom of page