top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • విద్యార్థుల పుట్టుమచ్చలు నమోదు ఏమని రాయాలి ?

    విద్యార్థుల పుట్టుమచ్చలు నమోదు ఎలా ? పుట్టుమచ్చల నమోదు... వివరాలు. ★ Be careful about their location on the body ( left or right) ★ మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి ★ మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి. ★ అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి. నుదురు- forehead కనుబొమ్మ- Eyebrow కనురెప్ప- eyelid కణత -temple చెవి -ear చెంప -cheek పై పెదవి - upper lip కింది పెదవి - lower lip గడ్డం- chin భుజం-shoulder ఛాతి- Chest భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm { భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు} మణికట్టు- wrist బొటన వేలు- thumb చూపుడు వేలు- index finger ఉంగరం వేలు- ring finger మధ్య వేలు- middle finger చిన్న వేలు- little finger అరచేయి- palm మోచెయ్యి- elbow బొడ్డు- navel పొట్ట- abdomen నడుము- waist Hip = either side of the body below the waist and above the thigh. తొడ- thigh మోకాలు- knee అరికాలు -foot కాలివేలు- toe కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe రెండవ కాలి వేలు = long toe మూడవ కాలి వేలు= third toe/ ring toe నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe పాదం కింద భాగం- foot sole Examples: ☞︎︎︎ A dark mole on the upper lip. ☞︎︎︎ A light mole on near the right ear. ☞︎︎︎ A black mole on the right collar bone. ☞︎︎︎ A light mole on the left cheek. ☞︎︎︎ A scar on the right forearm. ☞︎︎︎ A dark mole on the chest ☞︎︎︎ A light mole on the left abdomen. IF YOU LIKE THIS POST HIT ON HEART

  • డీఎస్సీ-98 టీచర్లు బడికి వెళ్లాలా వద్దా?

    డీఎస్సీ-98 టీచర్లు బడికి వెళ్లాలా వద్దా? గందరగోళంగా డీఎస్సీ-98 టీచర్ల పరిస్థితి బడికి వెళ్లాలా? వద్దా? అనే ఆందోళనలో వారున్నారు. డీఎస్సీ-98 టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలలు ఈనెల 12నుంచి పునఃప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం పాఠశాల తెరి చిన రోజునే వెళ్లాల్సి ఉన్నా... విద్యాశాఖ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఉపాధ్యాయుల బదిలీల్లో వీరు పని చేస్తున్న పోస్టులను ఖాళీగా చూపడంతో చాలాచోట్ల రెగ్యులర్ వాళ్లు వచ్చి చేరిపోయారు. ఇప్పుడు ఆ బడికి వెళ్లాలో.. లేదో సమాధానం చెప్పేవారు లేరు. కొందరు మండల విద్యాధికారులు తర్వాత చెబుతామని, మరికొందరు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత రావా లని సూచిస్తున్నారు. విశాఖపట్నంలో ఎస్జీటీల బదిలీలకు సంబంధించిన ఉత్త ర్వులను ఆలస్యంగా ఇచ్చారు. కొత్త పాఠశాలల్లో చేరేందుకు ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డీఎస్సీ- 98కు చెందిన 4,072 మందిని ఏప్రిల్ 12న తీసుకోగా.. వీరిలో 16 మంది ఆ నెల చివరికే, మేలో 256 మంది పదవీ విర మణ చేశారు. ఈ నెలాఖరుకు మరో 400 మంది పదవీ విరమణ చేయను న్నారు. వేసవి సెలవుల ముందు కాంట్రాక్టు సర్వీసు పూర్తయినా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి సందిగ్ధంలో ఉంది. తాజా వార్త: 1998 డిఎస్ సి మినిమమ్ టైంస్కేల్ ఉపాధ్యాయులకు 2,3 రోజులలో ఉత్తర్వులు ఇస్తారు. 2008, 1998 డిఎస్ సి మినిమం టైంస్కేల్ వారిద్దరికి త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి బ్లాక్ చేసిన ఎస్ జిటి ఖాళీలలో నియమిస్తారు.

  • 1998 DSC MTS TEACHERS SERVICE RENEWAL

    GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT School Education - DSC-1998 Contract Teachers - Renewal of the services of the DSC-1998 Contract Teachers for a period of 11 months with effect from 01.06.2023 to 30.04.2024, with a break of one month, in principle as 'no work - no pay', for the Academic Year, 2023- 2024 Permission - Accorded - Orders - Issued. SCHOOL EDUCATION (Ser.I) DEPARTMENT G.O.Rt.No:98 1. G.O.Ms.No. 27, School Education (Exams) Dept., dt. Dated: 13.06.2023 Read the following: 15.03.2023. 2.Govt. Memo.No. 1527176/Services.I/A2/2023, Dt. 02.06.2023. 3. From the Commissioner of School Education, Lr.Rc.No.ESE02- 20/24/2021-RECTMT-ESE 3, dt.10.06.2023. *** ORDER: In the circumstances reported by the Commissioner of School Education, in the reference 3rd read above, Government, after careful consideration of the matter, hereby accord permission to him to renew the services of the DSC-1998 Contract Teachers for a period of 11 months with effect from 01.06.2023 to 30.04.2024, with a break of one month, in principle as 'no work - no pay', for the Academic Year, 2023-2024, for smooth running of academic class work and administrative works in the Government School, on the same analogy as was ordered in the reference 2nd read above, in respect of DSC- 2008 Contract Teachers. 2. The Commissioner of School Education, shall take further necessary action accordingly, in the matter. (BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) PRAVEEN PRAKASH PRINCIPAL SECRETARY TO GOVERNMENT To The Commissioner of School Education, A.P., Ibrahimpatnam. Copy to: The Director of Treasuries and Accounts, A.P., Ibrahimpatnam. The Accountant General, A.P., Vijayawada. The Pay and Accounts Officer, A.P., Mangalagiri. The OSD to Hon'ble Minister(Edn.). The PS to Prl.Secretary to Govt. (SE) // FORWARDED: BY ORDER // जिन SECTION OFFICER

  • ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు అందుకున్న టీచర్స్ కొత్త స్కూళ్లలో చేరుటగురించి అధికారులకు కమీషనర్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి

    #apteacherstransfers2023 #apteacherstv #joiningschool కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ :: ఇబ్రహీంపట్నం ప్రస్తుతం: శ్రీ S. సురేష్ కుమార్, I.A.S., Rc.No.ESE02-14/11/2022-EST4-CSE Dt:10/06/2023 ఉప : పాఠశాల విద్య – ప్రీహై స్కూల్‌లు, హై స్కూల్‌లు & హైస్కూల్ ప్లస్‌లలో సబ్జెక్ట్ టీచర్లను నిర్ధారించడం మరియు ఫౌండేషన్ స్కూల్స్ మరియు ఫౌండేషన్ స్కూల్ ప్లస్‌లో అవసరమైన టీచర్ల సంఖ్య – ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ (నియంత్రణ) బదిలీలు) నియమాలు – జారీ చేయబడిన కొన్ని సూచనలు– సంబంధించి. చదవండి: 1) G.O.Ms.No.47, School Education (Ser.II) Dept., Dt:22.05.2023. 2) ఈ కార్యాలయం Procgs.Rc.No.ESE02-14/11/2022-EST4-CSE, Dt:22.05.2023. 3) ఈ కార్యాలయం Procgs.Rc.No.ESE02-14/11/2022-EST4-CSE, Dt:07.06.2023. 4) రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు (Gr.II), స్కూల్ అసిస్టెంట్ల కోసం రూపొందించబడిన బదిలీల ఉత్తర్వులు. &&&& O R D E R: పైన చదివిన 2వ & 3వ సూచనలలో జారీ చేయబడిన సూచనల కొనసాగింపుగా మరియు హెడ్‌మాస్టర్‌లు (Gr.II)/స్కూల్ అసిస్టెంట్‌లు (SAs)/సెకండరీ కోసం రూపొందించబడిన బదిలీ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని గ్రేడ్ టీచర్లు (SGTలు), రాష్ట్రంలోని పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు రిలీవ్ మరియు ప్రధానోపాధ్యాయులు (Gr.II)/పాఠశాలలో చేరేందుకు G.O.Ms.No.47లోని 15వ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఇందుమూలంగా సూచించడం జరిగింది. సంబంధిత సహాయకులు (SAs)/సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు). అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని RJDSEలు మరియు DEOలు క్షేత్ర స్థాయి కార్యనిర్వాహకులకు అంటే, Dy.EOలు/MEOలు/HMలు మొదలైన వారికి సూచనలు జారీ చేయాలని మరియు HMలు/ఉపాధ్యాయులందరూ తమ బదిలీ చేయబడిన స్థలాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిపోర్ట్ చేసేలా చూడాలని అభ్యర్థించారు.< /p> a. అన్ని సమర్థ అధికారులు ప్రధానోపాధ్యాయులు (Gr.II) మరియు ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తారు మరియు చేర్చుకుంటారు. #apteacherstransfers2023 #apteacherstv #joiningschool బి. ప్యానెల్ గ్రేడ్ హెడ్‌మాస్టర్ లేని చోట, సంబంధిత మండల విద్యా అధికారి ఉపాధ్యాయులను రిలీవ్ చేసి, అడ్మిట్ చేసుకోవాలి. సి. ఒకే సబ్జెక్ట్ టీచర్ లేదా SGT పాఠశాలలో పనిచేసి బదిలీ చేయబడితే, అతను/ఆమె ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయబడరు. #apteacherstransfers2023 #apteacherstv #joiningschool మువ్వా రామలింగం జాయింట్ డైరెక్టర్, O/o.CSE.,ఎ.పి రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యా అధికారులకు. రాష్ట్రంలోని పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ, A.P. సెక్రటేరియట్, వెలగపూడికి కాపీ సమర్పించబడింది.CSE పేషీకి కాపీ చేయండి. ఎస్సీ

  • స్కూల్స్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లుఇవే!

    స్కూల్స్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లుఇవే! స్కూల్ రోల్ & హెడ్ మాస్టర్స్ ఫోన్ నెంబర్లు: #schoolroll #Headmasterphonenumbers #apteacherstransfers2023 2023 ఉపాధ్యాయుల బదిలీల అంకం పూర్తి కావచ్చింది. దాదాపుగా ఉపాధ్యాయులు అంతా బదిలీ ఆర్డర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులంతా కొత్త పాఠశాలల్లో చేరోపోయారు. ఉపాధ్యాయులు కూడా మూడొంతులమంది కొత్త పాఠశాలల్లో చేరివుండవచ్చు.రెండు, మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఆర్డర్లు అందుబాటులోకి రావాల్సిఉంది. కొత్త పాఠశాలలో చేరబోయే ముందు ఆ పాఠశాల రోలు తెలుసుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు అనుకోవడం సహజం. అలాగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని తో ఫోన్లో మాట్లాడాలి అనుకోవడం సహజం. ఈ కింద చూపిన ఫైల్స్ లో వివిధ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ చూపించడం జరిగింది. సంబంధిత ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకొని ఆయా వివరాలను అనగా డివిజన్, మండలం, పాఠశాల పేరు ,విద్యార్థుల సంఖ్య ,ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ ,ప్రధానోపాధ్యాయుల పేరు తెలుసుకోవచ్చు. #schoolroll#Headmasterphonenumbers#apteacherstransfers2023 బదిలీలకు దరఖాస్తు చేసుకోక ముందే ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల రోలు పాఠశాలకు దూరం తదితర వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నారు. తీరా వెబ్ ఆప్షన్ల అంకం ముగిసిన తర్వాత బదిలీ దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లాయని, కొందరు తప్పుడు వివరాలు సమర్పించారని మండల విద్యాశాఖ అధికారులు కూడా సరిగా తనిఖీ చేయలేదని కొన్ని జిల్లాల్లో ఆరోపణలు వచ్చాయి. అందుకే బదిలీ ఆర్డర్లు ఆలస్యం అవుతూ వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే బదిలీ అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. పాఠశాల రోలు తేడాగా ఉండవచ్చు. కొన్ని చోట్ల రద్దు అయిన పోస్టులను కూడా వేకెన్సీ లో చూపడంతో ఆ వేకెన్సీ కోరుకున్నవారు గాలిలోకి వెళ్లిపోవడం జరిగింది. అందుకని మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం. 106 మంది టీచర్లు, 27 మంది ఎంఈఓలకు తాఖీదులు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అధికారికి సమాచారం పోర్టల్లో పొరపాట్లు నమోదు చేసిన 106 మంది ఉపాధ్యాయులకు, వాటిని గుర్తించడంలో విఫలమైన 27 మంది ఎంఈఓలకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తాఖీదులు జారీ చేశారు. ఈ పొరపాట్లలో కొన్ని పాఠశాలల్లో ఖాళీ పోస్టుల సంఖ్య పెరగడం, మరికొన్ని పాఠశాలల్లో ఖాళీలు సంఖ్య తగ్గింది. వీరి అలసత్వంతో బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బదిలీ ఆర్డర్ అందుకున్న తర్వాత చేరబోయే పాఠశాల వివరాలు వాతావరణం తెలుసుకొని వెళ్లడం ఉత్తమం.మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం. అందుకు అవసరమైన వివిధ పాఠశాల రోలు, ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్లు ఈ కింద చూపించాము. ఓపెన్ చేసి వివరాలు చూసుకోవచ్చు అలాగే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తుపై నొక్కి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పోర్టల్ లో ప్రచురించబడే తాజా సమాచారం వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి రావడానికి అలాగే ఆటోమేటిక్ ఈమెయిల్ అందుకోవడానికి పోర్టల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023 ఉపాధ్యాయుల బదిలీల అంకం పూర్తి కావచ్చింది. దాదాపుగా ఉపాధ్యాయులు అంతా బదిలీ ఆర్డర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులంతా కొత్త పాఠశాలల్లో చేరోపోయారు. ఉపాధ్యాయులు కూడా మూడొంతులమంది కొత్త పాఠశాలల్లో చేరివుండవచ్చు.రెండు, మూడు జిల్లాల ఉపాధ్యాయుల ఆర్డర్లు అందుబాటులోకి రావాల్సిఉంది. కొత్త పాఠశాలలో చేరబోయే ముందు ఆ పాఠశాల రోలు తెలుసుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు అనుకోవడం సహజం. అలాగే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని తో ఫోన్లో మాట్లాడాలి అనుకోవడం సహజం. ఈ కింద చూపిన ఫైల్స్ లో వివిధ పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ చూపించడం జరిగింది. సంబంధిత ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకొని ఆయా వివరాలను అనగా డివిజన్, మండలం, పాఠశాల పేరు ,విద్యార్థుల సంఖ్య ,ప్రధానోపాధ్యాయుని ఫోన్ నెంబర్ ,ప్రధానోపాధ్యాయుల పేరు తెలుసుకోవచ్చు. బదిలీలకు దరఖాస్తు చేసుకోక ముందే ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల రోలు పాఠశాలకు దూరం తదితర వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నారు. తీరా వెబ్ ఆప్షన్ల అంకం ముగిసిన తర్వాత బదిలీ దరఖాస్తుల్లో పొరపాట్లు దొర్లాయని, కొందరు తప్పుడు వివరాలు సమర్పించారని మండల విద్యాశాఖ అధికారులు కూడా సరిగా తనిఖీ చేయలేదని కొన్ని జిల్లాల్లో ఆరోపణలు వచ్చాయి. అందుకే బదిలీ ఆర్డర్లు ఆలస్యం అవుతూ వచ్చాయి. కొందరు ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే బదిలీ అయిన తర్వాత కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు. పాఠశాల రోలు తేడాగా ఉండవచ్చు. కొన్ని చోట్ల రద్దు అయిన పోస్టులను కూడా వేకెన్సీ లో చూపడంతో ఆ వేకెన్సీ కోరుకున్నవారు గాలిలోకి వెళ్లిపోవడం జరిగింది. అందుకని మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం. 106 మంది టీచర్లు, 27 మంది ఎంఈఓలకు తాఖీదులు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అధికారికి సమాచారం పోర్టల్లో పొరపాట్లు నమోదు చేసిన 106 మంది ఉపాధ్యాయులకు, వాటిని గుర్తించడంలో విఫలమైన 27 మంది ఎంఈఓలకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తాఖీదులు జారీ చేశారు. ఈ పొరపాట్లలో కొన్ని పాఠశాలల్లో ఖాళీ పోస్టుల సంఖ్య పెరగడం, మరికొన్ని పాఠశాలల్లో ఖాళీలు సంఖ్య తగ్గింది. వీరి అలసత్వంతో బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా బదిలీ ఆర్డర్ అందుకున్న తర్వాత చేరబోయే పాఠశాల వివరాలు వాతావరణం తెలుసుకొని వెళ్లడం ఉత్తమం.మీరు చేరబోయే పాఠశాల రోలు వివరాలు వేకెన్సీ వివరాలు ఒకసారి చూసుకోవడంతో పాటు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కూడా మాట్లాడటం అవసరం. అందుకు అవసరమైన వివిధ పాఠశాల రోలు, ప్రధానోపాధ్యాయుల ఫోన్ నెంబర్లు ఈ కింద చూపించాము. ఓపెన్ చేసి వివరాలు చూసుకోవచ్చు అలాగే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తుపై నొక్కి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పోర్టల్ లో ప్రచురించబడే తాజా సమాచారం వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి రావడానికి అలాగే ఆటోమేటిక్ ఈమెయిల్ అందుకోవడానికి పోర్టల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Download Schools Roll & HeadMaster Phone numbers : Click Below Buttons

  • స్కూల్ అసిస్టెంట్లకు ట్రాన్సఫర్ ఆర్డర్లు ఆలస్యానికి కారణం ఇదే!

    ప్రభుత్వం ఈ సంవత్సరం ఉపాధ్యాయ బదిలీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలల ఆరంభానికి ముందే పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. మరోవైపు బదిలీలపై వివిధ కేసులు హైకోర్టులో పెండింగ్ ఉండి త్వరలో అవి బెంచ్ కి రాబోతుండడంతో హీరోగాని ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బదిలీలు పూర్తి చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే ప్రధానోపాధ్యాయులకు షెడ్యూల్లో ప్రకటించిన దానికి కంటే రెండు రోజులు ముందుగానే ఆర్డర్లను పంపిణీ చేసింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లకు కూడా అదే వేగంతో ఆర్డర్లు జారీ చేస్తుందని భావించారు కానీ ఇప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు. దీనికి కారణం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్ని జిల్లాల కంటెంట్ మెడికల్ కమిటీ అప్రూవల్ చేయాల్సిన డిసీజెస్ కలెక్టర్ల వద్ద నిన్న సాయింత్రం వరకు ఉండిపోవడం వల్ల, అవి పట్టుకొని జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఐటీ సెల్ కొరియర్ విజయవాడ వెళ్ళారు.అవి సంబంధిత అధికారులు సీనియారిటీ కల్పించి చెక్ చేయాల్సి ఉంది. ఈ కారణంవల్లనే స్కూల్ అసిస్టెంట్లకు ట్రాన్సఫర్ ఆర్డర్లు ఇంకనూ అప్లోడ్ చేయలేదు. ఇదిలా ఉండగా ఈరోజు మద్యాహ్నంలోగా ట్రాన్సఫర్స్ ఆర్డర్స్ ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని ఐటీ సెల్ నుంచి మెసేజ్ సర్కులేట్ అవుతోంది. ఏదేమైన ఈ రోజు ఆర్డర్స్ డౌన్ లోడ్ అవుతాయి . రేపు కొత్త పాఠశాలల్లో విధులలో చెరవలసి ఉంటుంది. Update: 👉School Assts& PSHMs Transfer Orders Ready To generate by This Evening. Verification is going On 👉Transfered SAs Tomorrow Joining in new places 👉SGT web option provision Still Continue 👉After Generation &Verification Expecting SGT orders Tomorrow./Sunday? 👉Manual Transfers Councling to Rest of the Teacher Caders.Dates to be declared by DEO 👉Manual Councling with left over Vacancies for Promotion Relinquished Teachers if the old place is filled in transfers Update: We (Govt) have started generating the School assistant transfer orders of 9 districts. Krishna, Visakhapatnam, Chittoor and Anantapur are pending as the DEOs are yet to confirm the vacancies and posts. Request them to close it in next half hour. Update: విల్లింగ్ ఇచ్చి ప్రమోషన్ (తెలుగు,హిందీ) రాకుండా మిగిలిపోయిన SGT లకు SGT వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. వెంటనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. సైట్ close అయిపోతుంది.

  • విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష #CMJaganreviewoneducationdepartment

    #CMJaganreviewoneducationdepartment CM Jagan review on Education Department తాజా వార్త:: విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌ 10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని తెలిపిన అధికారులు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామన్న అధికారులు. యూనిట్‌ టెస్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి.. వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్‌ 10 ర్యాంకులను 27 మంది విద్యార్ధులు సాధించినట్టు వెల్లడించిన అధికారులు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....: ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలి: సీఎం. ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ఉండాలి. జనాభా అధికంగా ఉన్న ఆమండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి. వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలి నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి. సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలి. #CMJaganreviewoneducationdepartment వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం. సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామన్న అధికారులు. నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు. ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారు. సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్న అధికారులు. రెండో సెమిస్టర్‌ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధంచేశామన్న అధికారులు. మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష. ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా. ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలన్నదానిపై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలన్న సీఎం. కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామన్న అధికారులు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్‌ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తారని వెల్లడించిన అధికారులు. వీరు ప్రతినెలా వెళ్లి.. టీచర్లకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపిన అధికారులు. ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్‌ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్‌ యాప్‌పైనా టీచర్లకు శిక్షణ అందిస్తామన్న అధికారులు. రోజువారీగా, పాఠ్యాంశాలవారీగా బోధనపై స్కూళ్లకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు. అన్ని స్కూళ్లలో ఒకేలా బోధనకోసం ఇది ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్న అధికారులు. *ట్యాబ్‌ల వినియోగంపై సమీక్షించిన సీఎం..* ట్యాబ్‌ల నిర్వహణ, వినియోగంపై సీఎం ఆదేశాలమేరకు నిరంతరం సమీక్షలు చేస్తున్నామన్న అధికారులు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారన్న అధికారులు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై సీఎం సమీక్ష. సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. తొలిదశ నాడు నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించే కార్యక్రమం పూర్తయిందన్న అధికారులు. సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. నాడు – నేడు రెండోదశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం. నాడు – నేడు రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు. 22,224 స్కూళ్లలో రెండోదశ నాడు నేడు పనులు. డిసెంబరు నాటికి పనులు పూర్తవుతాయన్న అధికారులు. నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబులు పంపిణీతో పాటు, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ ఏర్పాటు పూర్తికావాలన్న సీఎం. ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్‌ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం ఆదేశాలు. డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. డ్రాపౌట్స్‌ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్టు తెలిపిన అధికారులు. పదోతరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్‌ ఇచ్చి వారిని ముందుకు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ల పై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకోవాలన్న సీఎం. ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్న సీఎం. థర్డ్‌పార్టీ వెరిఫికేషన్‌ ఉండాలన్న సీఎం. ఇంటర్మీడియట్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి కూడా సన్నద్ధంగా ఉండాలన్న సీఎం. దీనికోసం ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్న సీఎం. కేజీబీవీల్లో కూడా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం. అకడమిక్‌ స్ట్రెంగ్త్‌ కోసం పనిచేయాలన్న సీఎం. అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం. జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు. ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు. 2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు. జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్‌ పరిశీలించిన సీఎం. స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2023 లను అందించనున్న ప్రభుత్వం. మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సత్కారం. నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్‌ 15న, జిల్లా స్ధాయిలో జూన్‌ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న అవార్డులు అందజేయనున్న ప్రభుత్వం. రాష్ట్ర స్ధాయి అవార్డులు అందించనున్న ముఖ్యమంత్రి. CM Jagan review on Education Department #CMJaganreviewoneducationdepartment

  • వేసవి సెలవులు పొడిగింపు

    దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా ఎండ తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. భ‌య‌టికి రావాలంటే.. భ‌యం ప‌డుతున్నారు. అలాగే పగటి ఉష్ణోగ్రతలతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే ప్ర‌స్తుతం త్వ‌ర‌లోనే స్కూల్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ‌శాల‌ను ఓపెన్ జంకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాఠశాలల వేసవి సెలవులను పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ మేరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి ప్ర‌క‌టించారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా సెలవులను పొడిగిస్తే మంచిదని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. ఈ మేరకే సెలవులను పొడిగించినట్లు ఆయన తెలిపారు. తొలుత వార్షిక పరీక్షల అనంతరం రాష్ట్రంలో 1 నుంచి ఐదు తరగతులకు జూన్‌ 5న, ఆరు నుంచి పదో తరగతి వరకు జూన్‌ 1న పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారుల పర్యవేక్షణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకరణాలను, పాఠ్యఫుస్తకాలను సరఫరా చేశారు. కానీ అధిక ఎండల నేపథ్యంలో.. వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. జూన్‌ 6వ తేదీ వరకు పాఠశాలల సెలవును పొడిగిస్తూ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి ప్రకటన జారీ చేశారు. జూన్ 1 నుంచి ఎండలు మరింత పెరగడంతో.. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు కూడా జూన్‌ 15 తర్వాతే ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. వేసవి సెలవుల పొడిగింపు పై మంత్రి అన్బిల్ సీఎం స్టాలిన్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూన్ 11 వరకూ సెలవులను పొడిగించారు. సీఎం సూచన మేరకు.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జూన్ 12 నుంచి, 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు జూన్ 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని వెల్లడించారు. తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల వచ్చిన పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపించడం లేదు. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది. ఇక ఆంధ‌ప్ర‌దేశ్‌, తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఎండ తీవ్రత ఇలానే కొనసాగితే తెలుగురాష్ట్రాల్లో కూడా వేసవి సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది. #SummerHolidaysExtended2023 #SummerHolidays #APSchoolsHolidays

  • కేబినెట్ మీటింగ్ విశేషాలు

    కేబినెట్ మీటింగ్ విశేషాలు: ✍️ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలక అంశాలకు ఆమోదం. మొత్తం 63 అంశాలకు ఈ కేబినెట్‌ సమావేశం ఆమోదం. ✒️ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు, ✒️12వ PRC ఏర్పాటు ✒️కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు HRA 12% నుంచి 16% కి పెంపు, ✒️10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ ✒️జగనన్న ఆణిముత్యాలు పథకం, ✒️D.A పెoపు ఆమోదం ✒️ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1, 2 పోస్టుల భర్తీకి ✒️కొత్త మెడికల్‌ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీకి, ✒️జగనన్న అమ్మ ఒడి జూన్ 28 ✒️గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్లు, ✒️జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు

  • వెబ్ ఆప్షన్స్ యూజర్ మాన్యువల్: టీచర్స్ ట్రాన్సఫర్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొను విధానము

    వెబ్ ఆప్షన్స్: టీచర్స్ ట్రాన్సఫర్స్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొను విధానము తెలిపే యూజర్ గైడ్ Single arrow పై click చేస్తే ఒకటి వెళ్తుంది. Double arrow పై click చేస్తే అన్ని ఒకే సారి కుడి వైపుకు వెళ్తున్నాయి. Compulsory వాళ్ళు ముందుగా అన్ని మండలాలు లేదా అన్ని డివిజన్లు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. అలా కొడితే order of preference మీద ఆ స్కూల్స్ open అవుతున్నాయి. ఆ తరువాత ఆ స్కూల్స్ order of preference ప్రాప్తిగా సెలెక్ట్ చేసుకొని కుడి వైపుకు పంపాలి. అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసిన తరువాతే సబ్మిట్ అవుతుంది.

  • ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చల సారాంశం #GovernmentMeetingwithEmployeesunionsanddecisions

    #GovernmentMeetingwithEmployeesunionsanddecisions 2-6-2014 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టు బేసిస్ వారిని రెగ్యులర్ చేస్తారు CPS అంశం 2003 DSC వారికి పాత పెన్షన్ అమలు బేసిక్ పే మీద 33% హామీగా GPS గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ,ద్రవ్యోల్బణం ను బట్టి పెన్షన్ గ్యారెంటీ లో మార్పు చేసేలా అలోచిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం. PRC కమీషన్ ను ఏడవ తేది నాటి కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తారు యూనివర్సిటీలలోని నాన్ టీచింగ్ సొసైటీలలోని ఉద్యోగులకు 60 నుండి 62 సంవత్సరాలకు పదవీవిరమణ వయస్సు పెంపు. ఇంకను కొన్ని కార్పొరేషన్ ఉద్యోగుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటారు PRC బకాయిలు ఈ బకాయిలను quarterly once గా 4 years లో 2024 లో 10% 2025 లో 20% 2026 లో 30% 2027 లో 40% చొప్పున ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం. పాత పింఛను అమలుకు ప్రభుత్వం అనాసక్తి ♦️గ్యారెంటీ పెన్షన్పై చర్చించి నిర్ణయిస్తాం ♦️డీఏ, పీఆర్సీ బకాయిలు 2027 వరకు వాయిదాల్లో చెల్లింపు* ♦️ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్‌ పథకం(జీపీఎస్‌) అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సీపీఎస్‌ ఉద్యోగులకు 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఉండేలా జీపీఎస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని, దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని అనుసరించి మార్పుచేసేలా ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి హాజరయ్యారు. 'ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు కలిపి రూ.7 వేల కోట్లకుపైగా ఉండగా, వాటిని 2027వరకు చెల్లిస్తామంది. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది. ఇది కేవలం కంటితుడుపు చర్యే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనల వల్ల చాలామంది అర్హత కోల్పోతున్నారు' అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించారు. పీఆర్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మను నియమిస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించగా సంఘాల నాయకులు తిరస్కరించారు. ఆయన సీఎస్‌గా ఉన్నప్పుడే 11వ పీఆర్సీలో అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించాలని కొందరు ప్రతిపాదించారు. ♦️ఓపీఎస్‌ అమలు చేయాలి - బండి శ్రీనివాసరావు, ఛైర్మన్‌ ఏపీ ఐకాస సీపీఎస్‌ ఉద్యోగులకు జీపీఎస్‌లో రాయితీలు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. పాత పింఛను (ఓపీఎస్‌) విధానమే అమలు చేయాలని కోరుతున్నాం. పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు పెంచడాన్ని పరిశీలిస్తామన్నారు. గతంలో ఏపీ ఐకాస ఇచ్చిన 71డిమాండ్లలో చాలావరకు పరిష్కారమయ్యాయి. డీఏ, పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలో వాయిదా పద్ధతుల్లో 2024 జనవరి నుంచి చెల్లిస్తామని చెప్పారు. ఐఆర్‌ ప్రకటించడంగాని, ఫిట్‌మెంట్‌ ఇవ్వడంగాని చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ♦️8 తర్వాత ఉద్యమ కార్యాచరణ - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్‌, ఏపీ ఐకాస అమరావతి చర్చల్లో సానుకూలత రావడంతో అదే వాతావరణంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తాం. ఈనెల 8న గుంటూరులో ప్రాంతీయ సదస్సు యథావిధిగా ఉంటుంది. ఆ రోజున అన్ని జిల్లాల ఛైర్మన్లతో భేటీ అయి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. వీఆర్‌ఏలకు రూ.300 డీఏను పునరుద్ధరించడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తామన్నారు. కొత్తగా చేరిన మహిళా ఉద్యోగి రెండేళ్లలోపు 180 రోజులు ప్రసూతి సెలవులు వాడుకుంటే, వారి ప్రొబేషన్‌ పొడిగించడం దుర్మార్గమని చెప్పాం. దీనిపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామన్నారు. 2003లో నియమితులై, 2004 సెప్టెంబరు ఒకటి తర్వాత ఉద్యోగాల్లో చేరిన 9వేల మందికి చట్టప్రకారం పాత పింఛన్‌ను అమలు చేయాలని కోరాం. ♦️బిల్లుల జాప్యం కారణంగానే - వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఈహెచ్‌ఎస్‌ అమలు కాకపోవడానికి ఆస్పత్రుల బిల్లుల్లో జాప్యమే కారణం. ఉద్యోగుల వాటాతో కలిపి ప్రభుత్వ వాటాను ఏ నెలకు ఆ నెల ట్రస్టు ఖాతాలోకి మళ్లిస్తే ఆస్పత్రులకు చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవు. దీన్ని ఈనెల నుంచి అమలు చేస్తామని మంత్రులు చెప్పారు. సీపీఎస్‌ ఉద్యోగులకు భద్రత కల్పించేలా పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మేలు చేస్తామని, దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1993కి ముందు ఐదేళ్లు పూర్తిచేసుక్ను ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని జీవో ఇచ్చారు. అయితే ఐదేళ్ల నిబంధనతో క్రమబద్ధీకరణ కాని 4వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తే ప్రభుత్వంపై ఏటా కేవలం రూ.20 కోట్ల భారం పడుతుందని చెప్పాం. దీనిపై ఈ కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఈ కేబినెట్‌లో కాకపోతే ఆ ఉద్యోగులు అసంతృప్తి చెందొద్దు. సీఎంను కలిసి రెగ్యులర్‌ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ♦️చట్టబద్ధ పీఆర్సీ వేయాలి* - సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రోపాధ్యాయ సంఘం చట్టబద్ధతతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. 2003లో నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి ఓపీఎస్‌ అమలు చేస్తామని గత సమావేశంలో చెప్పారు. ఇప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయాలని కోరాం. జీపీఎస్‌లో కొన్ని రాయితీలపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. మేం జీపీఎస్‌ను అంగీకరించడం లేదు. పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామన్న ప్రభుత్వం.. నాలుగేళ్లలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌ ఉద్యోగులను విస్మరించింది - మరియాదాస్‌, అధ్యక్షుడు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్రంలో 3 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించింది. జీపీఎస్‌ విధానంలోనే కొంత మెరుగ్గా చేస్తామని చెబుతున్నారు. ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. రాజస్థాన్‌ సహా ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడా చేయాలి. జీపీఎస్‌కు తుది మెరుగులు *మంత్రి బొత్స సత్యనారాయణ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్‌ ఇచ్చేలా జీపీఎస్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నాం. కేబినెట్‌లో చర్చించాక ప్రకటిస్తాం. 2014 జూన్‌ 2నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని రెగ్యులరైజ్‌ చేస్తాం. జనవరిలోపే ఉత్తర్వులు ఇస్తాం. 12వ పీఆర్సీ ఏర్పాటును కేబినెట్‌లో పెట్టి, ఛైర్మన్‌ను నియమిస్తాం. సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడంపై కోర్టులో కేసులున్నాయి. వాటిని పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాం. గత పీఆర్సీలో స్పెషల్‌ పే ఇచ్చేందుకు అనుమతించాం. కొత్త జిల్లా కేంద్రాల్లో 16% హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తాం. గతంలో పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీవిరమణ తర్వాత ఇస్తామని చెప్పాం. వీటిని నాలుగేళ్లలో ఏటా నాలుగు వాయిదాల చొప్పున చెల్లిస్తామని చెప్పాం. వైద్య విధాన పరిషత్తు సిబ్బందికి 010 కింద జీతాలు ఇవ్వాలని నిర్ణయించాం. కేబినెట్‌లో పెట్టిన తర్వాత ఆయా విభాగాలు ఉత్తర్వులు ఇస్తాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కొంత ఆలస్యమైంది.

  • టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వేకెన్సీ లిస్టులు విడుదల #apteacherstransfers2023vacancyreportsdownload

    టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వేకెన్సీ లిస్టులు విడుదల చేశారు. మీ కేడర్ వేకెన్సీ రిపోర్టుని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు*వీడియో చూడడానికి ఈ కింది లింకు మీద నొక్కండి. #apteacherstransfers2023vacancyreportsdownload ఈ సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ పోస్ట్ నచ్చితే కింద హార్ట్ సింబల్ నొక్కి లైక్ చేయండి. #apteacherstransfers2023vacancyreportsdownload

bottom of page