top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఫ్రీ సీట్లకి అప్లై చేసిన వారి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల.

    ప్రైవేట్ స్కూల్స్ లో 25% ఫ్రీ సీట్లకి అప్లై చేసిన వారి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల. ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే సమాచారం కోసం సబ్ స్క్రైబ్ చేసుకోండి.

  • ఫేషియల్ అటెండెన్సా? జాగ్రత్త మాస్టారు!

    జాగ్రత్త మాస్టారు! ఫేషియల్ అటెండెన్స్ యాప్ ని ఒక గట్టి హ్యాకర్ తో చెక్ చేయించడం మంచిది. వాళ్ల దగ్గర ఉన్న సెక్యూరిటీ టూల్స్, ఫైర్ వాల్,అన్ని ఏంటి వైరస్ ఏంటి మాల్ వేర్ స్కానింగ్ సాఫ్ట్వేర్ లతో స్కానింగ్ చేయించాలి. ఏ లోపము లేకపోతే ఓకే! లేదంటే ఆ మధ్య దేశవ్యాప్తంగా దుమారం రేపిన "పెగాసస్" సాఫ్ట్వేర్ గుర్తుందిగా ! ప్రశాంత్ కిశోర్ "ఐ-ప్యాక్" టీమ్ ఇలాంటి సాంకేతిక సాధనాలే వాడుతోందట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే! మన ఫోన్లోని యాప్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అవును మీరు విన్నది నిజమే యాప్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయి. డేటా షేర్ చేసుకుంటాయి. మనం దైనందిన అవసరాలకు కొన్ని ఆన్లైన్ పేమెంట్ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్, చాటింగ్ వీడియో కాలింగ్, పర్సనల్ మెసేజ్ , మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వాడుతుంటాము. ఇలాంటి కొన్ని యాప్స్ కొన్ని వేరే యాప్స్ తో సమాచారం పంచుకుంటాయి. కొన్ని ఆప్స్ సమాచారాన్ని సేకరించి వారి యజమానులకు చేరవేస్తాయి. ప్లే స్టోర్ లో అప్లోడ్ అయ్యే యాప్స్ ని ప్లే స్టోర్ స్కాన్ చేసి పెడుతుంది. గూగుల్ పర్యవేక్షణలో ఎప్పుడైనా ఏవైనా యాప్స్ లోని లోపాలు తారసపడితే ఆ యాప్స్ ని గూగుల్... ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేస్తుంది కూడా. మనం ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మన ఫోన్ లో ఉన్న డిఫాల్ట్ స్కానర్ వాటిని స్కాన్ చేసి అవి సేఫా కాదా చెబుతుంది. అప్పుడు మనం వాటిని ఉంచుకోవాలా రిమూవ్ చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు. అయినప్పటికీ ఇన్ని దశలుగా సెక్యూరిటీ అమలుపరిచిన ప్పటికీ అవి 100% సేఫ్ అని చెప్పలేము. ఒక్కోసారి థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ లలో ఉన్న కొన్ని యాప్స్ సురక్షితమైనవి కావని హెచ్చరిస్తుంది. ఆ సూచనలు పాటించి గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వాటిని తమ ప్లాట్ఫారాల నుంచి రిమూవ్ చేస్తాయి. మనం కొన్ని యాప్స్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా కొన్ని వెబ్సైట్లో దొరికే APK రూపంలో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాము. APK అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్. ఇవి చాలా ప్రమాదకరం. వీటిని డౌన్లోడ్ చేసుకునేటప్పుడే "ఇవి మీ డివైస్ కి ప్రమాదకరం కంటిన్యూ ఎనీవే? " అని అడుగుతాయి. మనం ఏదైనా ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలంటే సంబంధిత వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడం క్షేమకరం. ఎందుకంటే రకరకాల వెబ్సైట్లో మాడిఫై చేసిన ఏపీకేలు ఉంటాయి. అంటే ఒరిజినల్ ఏపీకే లకు రకరకాల మార్పులు చేసి వెబ్సైట్లో ఉంచుతారు. ఇంతకుముందు చెప్పినట్లుగా వేరే యాప్స్ తో ఇంటరాక్ట్ అయ్యేలాగా సంభాషణలు జరిపి సమాచారం సేకరించేలాగా, మరికొన్ని డైరెక్ట్ గా బ్యాంకు సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేలాగా, యూజర్నేమ్, పాస్వర్డ్ తస్కరించేలాగా ఈ APKలకు మార్పులు చేసి ఆన్లైన్ ప్రపంచంలోకి వదులుతారు. వీటిలో వైరస్లు, మాల్ వేర్లు, ఫిషింగ్ ఫైల్స్ రకరకాల బగ్స్ ఉండవచ్చు. ప్రీమియం యాప్స్ ని అన్లాక్ చేసి, వివిధ యాప్స్ యొక్క ప్రో వెర్సన్స్ ని అన్ లాక్ చేసి పూర్తి ఫ్రీగా వాడుకునేలా కూడా ఈ APK లను మోడిఫై చేస్తారు. ఇవి కొన్ని సేఫ్. కొన్ని అన్ సేఫ్! ఇక మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన వెంటనే వివిధ పర్మిషన్లు అడుగుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే మనం చాలా మెలకువగా వ్యవహరించాలి. లేదంటే డేటా , ప్రైవసీ తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఒక యాప్ మనం ఎందుకు వాడతామో అందుకు తగిన పర్మిషన్లు మాత్రమే ఇవ్వాలి అదనపు పర్మిషన్లు ఇవ్వకూడదు. మనం వాడుతున్న ఫేషియల్ అటెండెన్స్ యాప్ కి కెమెరా, స్టోరేజ్, లొకేషన్ పర్మిషన్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. వీడియో, కాల్స్, మెసేజెస్ ఆడియో రికార్డింగ్ లాంటి పర్మిషన్లు అడిగితే అనుమానించాల్సిందే! ఎందుకంటే మన అటెండెన్స్ కి ఈ అదనపు పర్మిషన్లకి సంబంధం లేదు. మరి మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ ఈ అదనపు పర్మిషన్లు అడుగుతుందే! ఎందుకోసం ఈ అదనపు పర్మిషన్లు? సమాధానం లేని ప్రశ్న. నీటిలోకి దూకే ముందు లోతు ఎంతో తెలుసుకోవాలి . అక్కడ రాళ్ళూరప్పలు ఉన్నాయేమో చూసుకోవాలి. అలాగే యాప్స్ వాడే ముందు దాని భద్రత, పర్మిషన్లు వంటివి తప్పనిసరిగా పరిగణించాలి. అందుకే మన ఉపాధ్యాయులు వాడుతున్న యాప్స్ ని మన సంఘాలు సైబర్ సెక్యూరిటీ నిపుణులతో చెక్ చేయించడం చాలా ఉత్తమం. కొన్ని ప్రభుత్వ వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు వాటి అడ్రస్ బార్ మొదట్లో "నో సెక్యూర్" అని కనిపించడం గమనించారా? ఒకప్పుడు సీఎస్ఈ వెబ్ సైట్, స్టూడెంట్ ఇన్ఫో వెబ్ సైట్ లో ఇలాగే నో సెక్యూర్ అని కనిపించేది. ఔరా! లక్షల మంది పిల్లల ఆధార్ నంబర్లు వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు బ్యాంకు ఎకౌంటు డీటెయిల్స్ వారి మార్కుల వివరాలు వేల మంది ఉపాధ్యాయుల సమాచారం ఇలా తలుపులు వేయకుండా ఓపెన్ గా ఉంచేసారే అని ఆశ్చర్య పోవడం జరిగింది. హ్యాకర్లకి ఇలాంటి వెబ్ సైట్లే లోకువ.మరి ఏ వెబ్సైట్ అయినా సెక్యూరా కాదా అని ఎలా కనిపెట్టాలి? వెబ్ అడ్రస్ ప్రారంభంలో http:// కి బదులుగా https:// అని ఉంటే అది సురక్షితమైన వెబ్ సైట్ అన్నమాట. ఇక స్కూల్లోనూ ఇంట్లోనూ ఎన్నో పనులు సాంకేతిక సహకారంతోనే చేసుకోవలసిన రోజులొచ్చిన తరుణంలో మన ఉపాధ్యాయులం తప్పనిసరిగా టెక్నాలజీ మీద అవగాహన, పట్టుసంపాదించవలసిన అవసరం ఉంది. మీకు ఏ సాంకేతిక సహకారం కావాలన్నా మన apttv.co.in వెబ్ సైట్ మరియు www.youtube.com/apteacherstvtelugu మీకు అండగా ఉంటుంది. ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.ఈ పోస్ట్ పై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. తాజా పోస్ట్ లు మిస్ కాకుండా అప్ డేట్స్ పొందడానికి సబ్ స్క్రైబ్ చేసుకోండి.

  • ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ తాజా సర్క్యులర్

    పాఠశాల మ్యాపింగ్, రేషనలైజేషన్ పై గౌరవ ఎమ్మెల్యేలు అందించిన రిప్రజెంటేషన్స్ అనుసరించి కొన్ని పాఠశాలలను యధావిధిగా కొనసాగించడం గురించి మరియు రిపోర్ట్ పంపడం గురించి సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

  • Post your opinions here

    You can tell your Ideas and Opinions here, You can discuss your thoughts here...!

  • డీఎస్సీ 1998 అన్ని జిల్లాల అభ్యర్థుల జాబితా; హాల్ టికెట్ నెంబర్స్

    ప్రభుత్వం నేడు అనగా ఆగస్ట్ 4 2022న డీఎస్సీ 1998 అన్ని జిల్లాల అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. హాల్ టికెట్ నెంబర్స్ తో సహా అన్ని వివరాలతో అభ్యర్థులు ఈ క్రింద లింక్ నొక్కి చెక్ చేసుకోండి . డౌన్ లోడ్ చేసుకోవచ్చు. https://drive.google.com/file/d/1UV7oZffbd_Rc3_S0R8TevIqJPsnSRYkm/view?usp=drivesdk ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

  • ఏపీ టీచర్స్ ప్రమోషన్స్ కోసం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

    10/08/2022 లోపు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులకు, పాఠశాల సహాయకుల తుది సీనియారిటీ జాబితాలు తయారు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. స్కూల్ ఎడ్యుకేషన్ APESS - యొక్క పోస్ట్‌లకు ప్రమోషన్లు SGT నుండి స్కూల్ అసిస్టెంట్లు,స్కూల్ అసిస్టెంట్ల నుండి ప్రధానోపాధ్యాయులు Gr-II పోస్టులకు అడహాక్ ప్రాతిపదికన నిర్వహణ వారీగా మార్గదర్శకాలు. ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

  • పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ

    పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్‌ అంశాలు, వాటిలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులైన సజ్జల, బొత్స సత్యనారాయణ చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ అమలులో సమస్యల పరిష్కారం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపును సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాలతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు వర్తింపచేయడం, కొత్త జిల్లాలకు పాత జిల్లాల హెచ్‌ఆర్‌ఏ వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కోవిడ్‌ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్‌వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్‌ జీవో జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక అంశాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల క్లియరెన్సు, పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో జీఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • డాక్యుమెంట్, పీడీఎఫ్ ల నుండి వాటర్ మార్క్ ఎలా తీసేయాలి?

    వాట్సాప్ లో వచ్చే లెస్సన్ ప్లాన్స్, యాన్యువల్ ప్లాన్స్, జీవోలు వంటి ఫైల్స్ వాడుకుందాం అనుకుంటాం.అవసరానికి ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటాం. కానీ వాటిలో ఎవరిపేరో, వెబ్ సైట్ పేరో,లోగోనో వాటర్ మార్క్ గా ఉంటుంది.అలాంటప్పుడు ఆ Google Doc,MS Word, పీడీఎఫ్ లపై వాటర్ మార్క్ లను పూర్తిగా పర్ఫెక్ట్ గా ఎలా తీసేయాలి? మనం ఏదైనా డాక్యుమెంట్ ఫైల్ కి వాటర్ మార్క్ గానీ లోగో గానీ యాడ్ చేయాలంటే ఏంచేయాలి? వీటన్నిటికీ ఈ చిన్న వీడియోలో సులువైన మార్గం చూపించడం జరిగింది. ఈరోజుల్లో ప్రతీ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని తెలివిగా డిజిటల్ ఆన్ లైన్ సోర్స్ ని ఉపయోగించుకుంటున్నారు.తమ సమయాన్ని,శ్రమని తగ్గించుకుంటూ డిజిటల్ సోర్స్ వాడకంతో ప్రభావవంతంగా బోధిస్తూ పిల్లలు, తోటి గురువులు,అధికారుల మెప్పు పొందుతున్నారు. నిండైన వృత్తిగత సంతృప్తి (Professional Satisfaction) పొందుతున్నారు.ఈ నేపథ్యంలో క్లాస్ రూమ్ డిజిటల్ వైట్ బోర్డ్ సాఫ్ట్ వేర్, ఏనిమేషన్ వీడియోల తయారీ సాఫ్ట్ వేర్, 3D, AR(జంతువులు, వస్తువులను క్లాస్ రూమ్ లో రియల్ గా ప్రత్యక్షం చేసే ఆగ్మెంటెడ్ రియాలిటీ) వీడియోలతోపాటు ఉపాధ్యాయుల వర్క్ లోడ్ తగ్గించే ఎన్నో మొబైల్ యాప్స్,సాఫ్ట్ వేర్ లను పరిచయం చేయబోతున్నాం తదుపరి వీడియోలలో! వీటిని మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్ స్క్రైబ్ చేసుకోండి. టీచర్స్ వర్గానికి రికమెండ్ చేయండి. వివిధ రకాల డాక్యుమెంట్ ఫైల్స్ నుంచి వాటర్ మార్క్ తొలగించే వీడియో కింద చూడవచ్చు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోలరాకను ప్రోత్సహించగలరు. కింద టచ్ చేసి వీడియో చూడండి. షేర్ చేసి మీ ప్రోత్సాహం అందించండి

  • డిజిటల్ లెసన్ ప్లాన్స్/ప్రింటెడ్ లెస్సన్ ప్లాన్స్ వాడవచ్చా?

    డిజిటల్ లెసన్ ప్లాన్స్/ప్రింటెడ్ లెస్సన్ ప్లాన్స్ వాడవచ్చా? రాత ప్రణాళికలే వాడాలా? కమీషనర్ గైడ్ లైన్స్ ఏం చెపుతున్నాయి? పూర్తి క్లారిటీ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. షేర్ చెయ్యండి

  • ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలు, సంఘాల డిమాండ్లు.

    నేడు అనగా జూలై 7న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు తో కూడిన రెండు పేజీల సమాచారాన్ని ఫ్యాప్టో విడుదల చేయడం జరిగింది ఈ క్రింద ఆ తాజా సమాచారాన్ని చదవవచ్చు

  • 2008 MTS టీచర్లకు శుభవార్త

    వీడియో చూడడానికి కింది లింక్ పై క్లిక్ చేయండి. 2008 డీఎస్సీ మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు అభినందనలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం https://apttv.co.in వెబ్ సైట్ కి మరియు AP TEACHERS TV YOUTUBE CHANNEL కి సబ్ స్క్రైబ్ చేసుకోండి.

bottom of page