AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
- AP Teachers TV
- Aug 28, 2024
- 1 min read
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.
సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు ఆమోదం.
కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ- పాస్ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం.
రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం.
పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ తీర్మానం.
పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు ఆమోదం. 21.86లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నం.
ఇవి కూడా చదవండి :
Follow AP Teachers TV













Comments