top of page

ఒక్కరోజు నిద్ర తగ్గినా...


ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది?’... చాలామంది నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు.

ఒక్కరోజు నిద్ర తగ్గినా...
sleeplessness - insomnia

ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది?’... చాలామంది నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. శారీరక ఆరోగ్యం బాగుండాలంటే చక్కని ఆహార నియమాలు పాటిస్తూ, మంచి వ్యాయామం చేస్తే చాలనుకుంటారు... కానీ వీటితోపాటూ మంచి నిద్రకూడా ముఖ్యమేనంటోందీ పరిశోధన. కువైట్‌లోని డాస్‌మేన్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ విశ్రాంతికీ, దీర్ఘకాలిక వ్యాధులకూ ఉండే సంబంధంపైన పరిశోధన చేసింది. మనం నిద్ర పోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామేమో అనుకుంటుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్‌ అనే హార్మోన్‌ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ‘ఒక్కరోజే కదా’ అని సర్దిచెప్పుకుంటూ మనం పదేపదే నిద్రకు దూరమవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్‌ ఎక్కువగా జమవుతూ చివరికి శరీరంలో కొన్ని వాపులకి కారణం అవుతుంది. మరోపక్క నిద్రలేమితో కణాలు శక్తిని కోల్పోయి... ఇన్‌ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని కోల్పోతాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దడానికి శరీరం మోనోకైట్స్‌ అనే వ్యాధినిరోధక కణాలని విడుదల చేస్తుంది. ఈ పరిస్థితీ పదేపదే కొనసాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతూ వచ్చి ఊబకాయం, గుండెజబ్బులతోపాటూ ఇతర దీర్ఘకాలిక సమస్యలు రావొచ్చట. అందుకే పని ఒత్తిడీ, వారాంతం- పార్టీలు అనే సాకులు చెప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం అంటుందీ పరిశోధన.



sleeplessness, insomnia, night sleep, sleeping

 
 
 

Recent Posts

See All
LEAP యాప్ లేటెస్ట్ అప్‌డేట్ - వెర్షన్ 3.5.3 విడుదల

LEAP యాప్ లేటెస్ట్ అప్‌డేట్ - వెర్షన్ 3.5.3 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త! Learning Excellence in Andhra Pradesh (LEAP) యాప్ యొక్క కొత్త వెర్షన్ 3.5.3 ఫిబ్రవరి 2, 2026న గూగుల్ ప్లే స్టోర

 
 
 

Comments


bottom of page