top of page

వాట్సప్‌లో ఇక కరెంటు, గ్యాస్‌, వాటర్‌, ఫాస్టాగ్‌, ఇన్సురెన్స్‌, క్రెడిట్‌ కార్డ్‌, లోన్‌ రీపేమెంట్‌ చెల్లింపులు


మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) తన పేమెంట్స్‌ సేవలను విస్తృతం చేసింది. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జులు, మెట్రో టికెట్‌ బుకింగ్‌ వంటి వాటికే పరిమితం కాగా.. కొత్తగా బిల్‌ పేమెంట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌ కనెక్ట్‌ (BBPS) నెట్‌వర్క్‌లోని 30 కేటగిరీలకు చెందిన 22,722 బిల్లర్లను వాట్సప్‌ వేదికపైకి తీసుకొచ్చింది. దీని సాయంతో ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌, వాటర్‌, ఫాస్టాగ్‌, ఇన్సురెన్స్‌, క్రెడిట్‌ కార్డ్‌, లోన్‌ రీపేమెంట్‌ చెల్లింపులను వాట్సప్‌లోనే చేయొచ్చు.


వివిధ రకాల పేమెంట్‌ సేవల కోసం వేర్వేరు యాప్స్‌ వినియోగించే అవసరం లేకుండా వాట్సప్‌ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని మెటా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు దశలవారీగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వాట్సప్‌ తెరవగానే పైభాగంలో ‘₹’ సింబల్‌ దర్శనమిస్తుంది. దానిపై క్లిక్‌ చేశాక మీకు కావాల్సిన బిల్లు కేటగిరీ, బిల్లర్‌ను ఎంచుకోవచ్చు. అకౌంట్‌ వివరాలు ఇవ్వగానే చెల్లింపు ఆప్షన్లు దర్శనమిస్తాయి. యూపీఐ, డెబిట్‌కార్డు, క్రెడిట్‌ కార్డు వంటి వాటిల్లో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపులు పూర్తి చేయొచ్చు. పాత చెల్లింపులు, రాబోయే బిల్లు పేమెంట్లనూ చూసుకోవచ్చు.



 
 
 

Comments


bottom of page