Search Results
Search this site
738 results found with an empty search
- కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశ వివరాలు
ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. 1. అన్ని కేడర్ల సీనియారిటీ లిస్టులో ఫైనలైజ్ అయ్యాయి ఎన్నికల కోడ్ అవగానే తాత్కాలిక సీనియారిటీ లిస్ట్ లు విడుదల చేస్తారు. 2. జీవో నెంబర్ 117రద్దు - ప్రత్యమ్నాయ విధానం పై ఎలక్షన్ కోడ్ అయ్యాక పాఠశాల విలీనం మరియు అప్ గ్రేడేషన్ పై క్లస్టర్ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 3.గత శనివారం జరిగిన School Cluster మీద Feed Back తీసుకున్నారు.రాబోయే క్లస్టర్ మీటింగ్‌లో కొన్ని మార్పులు చేస్తారు. 4.Teachers Transfer Act పై Govt.AG Clarifications అడిగారు. 5.ప్రస్తుతం ఉన్న 45రకాల యాప్ లన్నింటి బదులు ఒకటే యాప్ తీసుకు వస్తున్నామన్నారు. 6.అకడమిక్ కేలండర్ డ్రాఫ్ట్ ఎన్నికల కోడ్ అయిన వెంటనే ఇచ్చి Feed Back అడుగుతారు. 7.MLC ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించాలని ప్రాతినిధ్యం చేసాం.జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇస్తామన్నారు.
- ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల
కోడ్ తర్వాత టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథమిక సీనియారిటీ జాబితా విడుదల చేయను న్నారు. డిప్యుటేషన్లపై ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సర్వీసు అప్డేట్ చేసుకునేందుకు సమయం కల్పి స్తారు. డీఎస్సీ-2008 వారికి నోషనల్ సీనియారిటీ డేట్ నమోదు చేసుకునే విధంగా అవకాశం ఇస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు వీలుగా సంబం ధిత బిల్లును న్యాయ సమీక్షకు పంపించారు. ఆగస్టు 31 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ లకు అర్హులు కాగా.. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసు కున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంపై ఎన్ని కల కోడ్ తర్వాత తల్లిదండ్రులు అభిప్రాయాలు తీసుకుం టారు. అకడమిక్ కేలండర్‌ను విడుదల ముందు ఉపా ధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న టీచర్లకు సెలవుల కోసం యాప్‌లో ఐచ్ఛికాన్ని కేటాయిస్తారు.
- 12వ పిఆర్సి ఏదీ?
12వ పిఆర్సి ఏదీ? 12వ పిఆర్సి ఏదీ? • యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు 2023 జులై 1 నుంచి రావాల్సిన 12వ పిఆర్సి జాడ ఎక్కడని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బుధవారం యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 11వ పిఆర్సిలో 23 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం 12 పిఆర్సికి సంబంధించి ఒక్క మాటైనా మాట్లాకపోవడం సరికాదన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి పిఆర్సి కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల వేతనాలను స్థిరీకరించడం ఉద్యోగుల హక్కు అని, ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సి చైర్మన న్ను నియమించాలని, రిపోర్టు వచ్చేలోపు ఐఆర్ 30 శాతం ప్రకటించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడి పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని అన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చిన్నబ్బాయి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరెడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరారు.
- మే నుండి చంద్రబాబు సర్కార్ సూపర్ సర్కార్... తల్లికి వందనం ప్లస్ మరో రెండు పథకాలు...!!
మే నుండి చంద్రబాబు సర్కార్ సూపర్ సర్కార్... తల్లికి వందనం ప్లస్ మరో రెండు పథకాలు...!! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని, కేంద్ర ప్రభుత్వ సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. చిత్తశుద్ధితో కష్టపడి ముందుకుసాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలన్న లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు. NDA ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు, సూపర్ సిక్స్‌లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు. మే నెలలోనే తల్లికి వందనం ఇవ్వబోతున్నామని, అన్నదాత సుఖీభవతో పాటు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్యం ఎప్పటికో కాదని..ఆ విజన్ అమలుచేస్తూ ఇప్పటి నుంచే ఫలితాలు సాధించడం మా లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు బాగుంది. రూ.18,401 కోట్ల అదనపు సంపద వచ్చే అవకాశముందన్నారు. హామీల అమలుకు షెడ్యూలు ప్రకటించారు చంద్రబాబు. - వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి DSC ద్వారా 16,384 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ - మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ. చదువుకునే పిల్లలు ఎందరున్నా, అందరికీ ఆర్థికసాయం - అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తాం. కేంద్రమిచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు - మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే రూ.20 వేల చొప్పున ఇస్తాం. - త్వరలో నిరుద్యోగ భృతి రూ.3,000 - ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యే సందర్భంగా జూన్ 12న పేదలకు 5 లక్షల ఇళ్లు పంపిణీ నెరవేర్చిన హామీలు ఇవి - - వృద్ధాప్య పింఛన్లు రూ.3,000 నుంచి ఒకేసారి రూ.4,000కు పెంపు. దివ్యాంగులకు 6,000, లెప్రసీ, డయలాసిస్ రోగులకు రూ.10 వేలు, మంచం దిగలేని వారికి రూ.15 వేల పింఛన్ - ఏటా 64 లక్షల మందికి సామాజిక పింఛన్ల రూపేణా రూ.33 వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. - ఉద్యోగులకు జీతాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్లను మొదటి తేదీనే ఇస్తున్నాం - 204 అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. - దీపం కింద ఏటా 3 ఉచిత సిలిండర్లు ఇస్తామన్న హామీ మేరకు ఇప్పటికే ఒకటి ఇవ్వగా, మిగిలినవి ఇస్తాం. దీనిపై రూ.2,684 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ పథకం కింద కోటి కుటుంబాలు రిజిస్టర్ చేసుకోగా, 93 లక్షల మందికి అమలు చేశాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మేలు - కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నందున ఉత్పత్తి విలువలో అదనపు ప్రయోజనం సాధించామన్నారు చంద్రబాబు. 2023-24లో రాష్ట్రంలో వృద్ధిరేటు 8.6% ఉండగా, ఈ ఏడాది 12.94%గా ఉండబోతోందన్నారు. ఫలితంగా రూ.62 వేల కోట్లు అదనపు సంపద వస్తుందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మాదిరిగా 8.6% వృద్ధి మాత్రమే ఉంటే రూ.15.44 లక్షల కోట్ల ఉత్పత్తి వచ్చేదన్నారు. వృద్ధి పెరిగి రూ.16.06 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు సాధించామని వివరించారు. అసాధ్యమనుకున్న నాలుగైదు ముఖ్య పనులను ఎన్డీయే ప్రభుత్వం 8 నెలల్లోనే సుసాధ్యం చేసిందన్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చామన్నారు. ఇక మిర్చి క్వింటాలుకు రూ.11,750 చొప్పున ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తోందన్నారు. మార్కెట్ జోక్యం వల్ల ఏపీ రైతులకు మేలు జరిగేలా కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు చంద్రబాబు. రైతు వారీగా పండించే ఈ-పంట ఆధారంగా చేసుకుని సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. రైతుల కోసం రూ.100 కోట్లతో నిధి పెడుతామన్నారు.
- పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్! పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ ల స్థానంలో ఒకటే యాప్ పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వ్యవస్థ! పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్! పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశాలు అమరావతిః ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ లో పూర్వ విద్యార్థిసంఘాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ముందుకొచ్చే దాతలకు ఆయా పాఠశాలల సమగ్ర సమాచారం, మౌలిక వసతుల అవసరాలను తెలియపరిచి, నేరుగా పాఠశాలలు, కళాశాలలకే దాతల విరాళాలు అందే వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు, నిధుల వినియోగం, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి కంప్యూటర్ ల్యాబ్ లు, స్టెమ్ ల్యాబ్ లు, స్కూల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఒకటే డ్యాష్ బోర్డ్ ఉపాధ్యాయులకు ఇప్పుడు 45 యాప్ ల స్థానంలో ఒకే యాప్ ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డ్యాష్ బోర్డ్ రూపొందించాలన్నారు. మంత్రి నుంచి క్షేత్రస్థాయి వరకు లాగిన్ లు రూపొందించి, ఒకే సమాచారాన్ని పదేపదే సేకరించే పద్ధతికి స్వస్థి పలకాలని, ఉపాధ్యాయుల సమయాన్ని విద్యార్థుల కోసం సద్వినియోగపరుచుకునేలా చూడాలని ఆదేశించారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్టస్థాయిలో ఏర్పాటుచేసి ఒక క్లాస్ కు ఒక టీచర్ ను కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఈ చట్టాన్ని ఆమోదించింది. 1. సంక్షిప్త శీర్షిక మరియు అమలు: (i) ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 అని పిలుస్తారు. (ii) ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రాంతానికి వర్తిస్తుంది. (iii) ఈ చట్టం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన తేదీ నుండి అమల్లోకి వస్తుంది. 2. నిర్వచనలు: ఈ చట్టంలో ప్రత్యేక సందర్భాలలో అర్ధం వేరుగా లేకపోతే, కింది విధంగా నిర్వచించబడుతుంది: (i) "అకడమిక్ ఇయర్" అంటే ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు ఉండే విద్యా సంవత్సరాన్ని సూచిస్తుంది. గమనిక: హెడ్ మాస్టర్ (గ్రేడ్-II)/ఉపాధ్యాయులు కనీసం ఒకే విద్యా సంవత్సరంలో తొమ్మిది నెలల సేవను పూర్తి చేసినట్లయితే, అది పూర్తయిన విద్యా సంవత్సరం గా పరిగణించబడుతుంది. (ii) "నియామకం" అంటే ప్రత్యక్ష నియామకం, అభివృద్ధి, బదిలీ లేదా ప్రమోషన్ ద్వారా నియామకాన్ని సూచిస్తుంది. (iii) "నియామక అధికారి" అంటే ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం హెడ్ మాస్టర్ (గ్రేడ్-II)/ఉపాధ్యాయుల నియామకానికి అధికారం కలిగిన అధికారి. (iv) "క్లస్టర్" అంటే ఒక మండలంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు హైస్కూల్స్ గల సమూహం. (v) "సంబంధిత అధికారి" అంటే హెడ్ మాస్టర్ల (గ్రేడ్-II) విషయంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుల విషయంలో జిల్లా విద్యా అధికారి లేదా ప్రభుత్వంతో నియమిత అధికారి. (vi) "హెడ్ మాస్టర్ గ్రేడ్-II" అంటే హైస్కూల్లో మంజూరైన హెడ్మాస్టర్ పోస్టులో పనిచేస్తున్న వ్యక్తి. (vii) "ఉపాధ్యాయుడు" అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ లేదా హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడిన వ్యక్తి. (viii) "గరిష్ట కాల పరిమితి" అంటే హెడ్ మాస్టర్ గ్రేడ్-II: ఐదు అకడమిక్ సంవత్సరాలు ఉపాధ్యాయుల విషయంలో: ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు (ix) "కనిష్ట కాల పరిమితి" అంటే హెడ్ మాస్టర్ (గ్రేడ్-II)/ఉపాధ్యాయుడిగా కనీసం రెండు అకడమిక్ సంవత్సరాల నిరంతర సేవ. (x) "అవసరమైన పాఠశాలలు" అంటే రైట్ టు ఎడ్యుకేషన్ (RTE) చట్టం ప్రకారం పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు. (xi) "పట్టణ ప్రాంతం" అంటే: కేటగిరీ-I: జిల్లా కేంద్రాలు, నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలు, ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర ప్రాంతాలు. కేటగిరీ-II: మునిసిపాలిటీలు, నగర్ పంచాయతీలు మరియు ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు. (xii) "గ్రామీణ ప్రాంతం" అంటే కేటగిరీ-III: మండల కేంద్రాలు, అన్ని హవా రోడ్డు కలిగిన గ్రామాలు. కేటగిరీ-IV: హవా రోడ్డు లేని లేదా కొండల పై ఉన్న పాఠశాలలు. (xiii) "మళ్లీ పంపిణీ" అంటే PTR (పిల్లలు - ఉపాధ్యాయుల నిష్పత్తి) ఆధారంగా అవసరమయ్యే పాఠశాలలకు ఉపాధ్యాయుల పోస్టులను మళ్లీ కేటాయించడం. (xiv) "బదిలీ" అంటే ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు హెడ్ మాస్టర్ (గ్రేడ్-II)/ఉపాధ్యాయుడిని మార్చడం. (xv) "ఉపాధ్యాయుల సర్దుబాటు" అంటే అధిక ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు పంపించడం. (xvi) "పాఠశాల" అంటే ప్రభుత్వం/మండల పరిషత్/జిల్లా పరిషత్/మునిసిపల్/కార్పొరేషన్ యాజమాన్యంలో ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు హైస్కూల్. (xvii) "షెడ్యూల్" అంటే ఈ చట్టానికి అనుబంధంగా జోడించబడిన షెడ్యూల్. (xviii) "అధికంగా ఉన్న ఉపాధ్యాయులు" అంటే ఒక పాఠశాలలో RTE చట్టం ప్రకారం అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులు. (xix) "సీనియారిటీ యూనిట్" అంటే జోన్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లు. జిల్లా స్థాయిలో మాండల పరిషత్ /జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు. మునిసిపల్ పాఠశాల ఉపాధ్యాయులు. (xx) "నిషేధ కాలం" అంటే ప్రభుత్వం నిర్దేశించిన బదిలీలకు అనుమతి లేని కాలం. టీచర్ల బదిలీల చట్టము 2025 Bullet Points 👉 ఈ చట్టము Govt&MP/ZP&Mpl మేనేజ్ మెంట్ స్కూల్స్ కు వర్తించును 👉Govt/PR/Municipalities లో వారికి వారి మేనేజ్ మెఞట్ల లో పాత జిల్లా పరిధిలోజరుగును.అలాగే Mpl corporation /గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ విశాఖ పరిధిలో జరుగును 👉Academic Year అంటే Jun 1st May 31st 👉 ఒక సంవత్సరములో ఒక.స్కూలులో 9 నెలలు పూర్తయితే Academic year Service పూర్తయినట్లే 👉Drawing,Craft, Vocational వారికి తప్ప.మిగిలిన HM&Teachers కు Online Councliing 👉Vacancies సంఖ్యను బట్టి Blocking.జరుగును 👉Promotions&Appointments సమయములో Cat IV ,III,II,I Priority లోNo of Promotions/Appointments కు సమానంగా Vacancies చూపిస్తారు 👉Minimum :2 AYs 👉Maximum:5 AYs for HMs, 8AYs for other Teachers 👉Govt Transfer పై వచ్చిన వారికి పాత, క్రొత్త స్కూలు రెండు స్కూళ్ళలో కలిపి Maximum నిర్ణయిస్తారు 👉Widow ,Diverged Women ,Exservice men, Military వొరి Spouse , 70%. లోపుPh వారికి%లకు Transfers లో Points మాత్రమే Prefernce లేదు .కేవలం వ్యాధులున్న వారికి , More than 70%Ph వొరికి , Self వ్యాధి గ్రస్తులైన పిలల్లున్న వారు మాత్రమే Preferential category Spouse ,NCC,Scouts ,Union office Old Dist bearers కు Special.points 👉Court కు పోవటానికి వీలు లేదు 👉Preferential category లో ఉన్న SGT s ఒక స్కూలులో 40%,SAలలో Subject 50% Posts మాత్రమేPreferential వారికి అవకాశమివ్వరు >Single Subject Teachers మాత్రమేఉన్నHS ల ఖాళీలను Preferential category వారిని కోరుకోనివ్వరు 👉 మిగిలిన నిబంధన లన్నీ పూర్వము వలెనే 📢 Dear Teachers,📢 In line with our commitment to a transparent and fair transfer process, we invite your valuable feedback on the Draft Andhra Pradesh State Teachers Transfer Regulation Act, 2025 🏫✍. This initiative reflects our vision, as promised in the 2024 manifesto, to create a system that prioritizes teachers' welfare and strengthens our education ecosystem 📖👩🏫. visit to latest updates at https://cse.ap.gov.in/documents/DRAFT_TTA_2025_AP.pdf Share your suggestions and feedback in the given format and send them to draft.aptta2025@gmail.com 📧 by 🗓 07-03-2025 by 5 PM. Your voice matters—let’s shape a policy that truly supports our teachers and students! 🚀🙌 #TeacherTransfersAP #EmpoweringTeachers #EducationForAll
- AP Government VSWS : సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్
AP Government VSWS : సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్ AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల హేతుబద్ధీకరణ ప్రారంభమైంది. ఏపీ సేవ పోర్టల్‌లో క్లస్టర్ల ఏర్పాటు, సచివాలయ అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ప్రభుత్వం అధికారాలను అప్పగించింది. ప్రతీ క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజన చేసింది. జనాభా ప్రాతిపదికగా హేతుబద్దీకరణ.. కాగా.. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో భాగంగా ఆయా జిల్లాలో జనాభా సంఖ్య మేరకు సచివాలయాలకు సిబ్బందిని కేటాయిస్తారు. మిగులు సిబ్బందిని సంబంధిత శాఖలకు పంపిస్తారు. మండలాల వారీగా కసరత్తు.. హేతుబద్ధీకరణ చేసే క్రమంలో 2,500 కంటే తక్కువ జనాభా ఉన్న సచివాలయాల్లో ఆరుగురు, 2,500 నుంచి 3,500 మధ్య ఉన్న సచివాలయాల్లో ఏడుగురు, 3,500 మంది కంటే ఎక్కువ ఉన్న సచివాలయాల్లో ఎనిమిది మంది సిబ్బంది ఉంటారు. ఈ మేరకు మండలాల వారీగా కసరత్తు జరుగుతోంది. సగటున ఒక సచివాలయం పరిధిలో నాలుగువేల కంటే ఎక్కువ జనాభా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మూడు కేటగిరీలుగా విభజించి సిబ్బందిని హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. హేతుబద్ధీకరణ తర్వాత పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను గ్రామ/వార్డు హెడ్‌గా పిలుస్తారు. సచివాలయాలపై పర్యవేక్షణకు మండల, జిల్లాస్థాయిలో వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తారు
- Top Viral Moments of Kumbhmela: మహాకుంభమేళా.. జనాల్ని ఆశ్చర్య పరిచిన టాప్ 10 ఉదంతాలు ఇవే
నేటితో కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో ఈసారి జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్న టాప్ 10 వైరల్ ఘటనలపై ఓ లుక్కేద్దాం. మహాకుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభం. భారతీయులే కాక హిందూ మతాన్ని ఆచరించే ఎందరో విదేశీయులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి త్రివేణిసంగమంలో పవిత్ర స్నానమాచరించి భగవద్ కృపకు పాత్రులయ్యారు. అయితే, ఈసారి కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు జనాల్ని సర్ప్రైజ్ చేశాయి. నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి వీటిల్లో టాప్ ఘటనలో ఎవో తెలుసుకుందాం (Top Viral Moments of Kumbhmela). ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మోనీ భంసలే. పూసల దండలు విక్రయించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 16 ఏళ్ల టీనేజర్ తన సహజసిద్ధమైన అందంతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఆకతాయిల వేధింపులకు కూడా దారితీయడంతో ఆమె మధ్యలోనే వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ పాప్యులారిటీ ఆలంబనగా ఆమె కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోంది. ఐఐటీ బాంబేలో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ చేసిన అభయ్ సింగ్ ఆ తరువాత ఆధ్యాత్మిక బాట పట్టాడు. కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాప్యులర్ అయ్యారు. కేరీర్లో అపార అవకాశాలు ఉన్నా అతడు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడం జనాల్ని ఆకట్టుకుంది. కుంభమేళాలో పుణ్యస్నానానికి వచ్చిన బాబా రామ్‌దేవ్ ఈ సందర్భంగా తన జుట్టును సినిమాటిక్ స్టైల్లో వెనక్కు ఎగరేయడం కూడా జనాల్ని ఆశ్చర్యపరిచింది. 1990ల నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి మహమండలేశ్వర్‌గా నియామకం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఆమె చివరకు ఆ బాధ్యతను వదులుకోవాల్సి వచ్చింది. తన భర్త కుంభమేళాకు రాలేకపోయవడంతో ఒంటరిగా వచ్చిన మహిళ.. భర్తకు డిజిటల్ పవిత్ర స్నానం చేయించింది. అతడితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఫోన్‌ను నీళ్లల్లో ముంచి తీసింది. ఆమె వింత ఆలోచనకు జనాలు అవాక్కయ్యారు. శుభమ్ ప్రజాపత్ అనే కంటెంట్ క్రియేటర్ కుంభమేళాలో టీ స్టాల్ ఏర్పాటు చేసి భారీగా లాభాలు ఆర్జించాడు. జస్ట్ ఒక్క రోజులోనే రూ.5 వేలు లాభం పొందినట్టు అతడి చెప్పడం చూసి జనాలు షాకైపోయారు. కుంభమేళాలో పాల్గొనేందుకు రాజేశ్, సాధనలు ముంబై నుంచి బైక్ మీద కుంభమేళాకు రావడం కూడా ఈసారి హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 1200 కిలోమీటర్లు వారు బైక్‌పై ప్రయాణించారని తెలిసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేందుకు ఓ వ్యాపారి ఏకంగా రూ.3 వేల కోట్ల వ్యాపారాన్ని కాదనుకున్న వైనం కూడా జనాల్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కుంభమేళాకు భార్యాపిల్లలతో వచ్చిన ఓ పెద్దాయనకు వారు అకస్మాత్తుగా కనిపించకపోవడంతో షాకైపోయాడు. ఆ తరువాత ఆయనను వెతుక్కుంటూ వచ్చిన వారికి చూశాక సంబరం తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. జనాల్ని ఆకట్టుకున్న ఉదంతాల్లో ఇదీ ఒకటి. 37 సంవత్సరాల తర్వాత కుంభమేళాలో కలుసుకున్నారు ఇద్దరు స్నేహితులు అతడు, ఆమె ఆనందానికి అవధులు లేవు .. ప్రపంచమంతా సంతోషించింది. ఇక కుంభమేళాలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వారికి వీపు వైపు దుస్తులపై తల్లిదండ్రులు తమ వివరాలున్న ఉన్న కాగితాలను అంటించారు. ఇదీ జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
- అలాంటి పచ్చబొట్లతో హెచ్ఐవీ, హెపటైటిస్ ముప్పు! tattoos are hazardous
tattoos are hazardous పచ్చబొట్టు వేసేందుకు వినియోగిస్తున్న పచ్చతో చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: పచ్చబొట్టు వేసేందుకు వినియోగిస్తున్న పచ్చతో చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రహదారి పక్కన శుభ్రతను పాటించకుండా వేసే పచ్చబొట్లతో హెచ్ఐవీ, హెపటైటిస్ తదితర వ్యాధులు సోకుతున్నట్లు గుర్తించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. బెంగళూరులోని ఆరోగ్య సౌధలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాసిరకం, రసాయనాలు కలిసిన పచ్చ ద్రావణం చర్మపొరలు, నరాల్లోకి వెళ్లి పలు రోగాలకు కారణమవుతోంది. ఆరోగ్య సురక్ష, ఔషధాల నాణ్యతను నిర్ధారించే నిపుణులు ఇప్పటికే పలుచోట్ల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. టాటూ సిరాలో కలిపే రింగర్ లాక్టేట్ ద్రావణానికి సంబంధించి 246 బ్యాచ్‌లను పరీక్షించగా, అందులో 113 నమూనాలు వినియోగానికి అర్హమైనవి కాదని గుర్తించాం. రింగర్ లాక్టేట్ను తయారు చేస్తున్న ఫార్మాస్యూటికల్స్ సంస్థపై ఇప్పటికే 9 కేసులు నమోదు కాగా, మరో 25 కేసుల నమోదుకు అనుమతించామ’ని వివరించారు. టాటూ ఇంక్‌లో కాంతివర్ధకాలు (ఇల్యూమినేట్/ మెరుపు) కలపకుండా కేంద్ర ప్రభుత్వం బీఐఎస్ ద్వారా నిబంధనలు కఠినతరం చేయాలని గుండూరావు కోరారు.
- ఇంటి నుంచే లైసెన్స్
నూతన వాహన రిజిస్ట్రేషన్లు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు వంటివి పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనుంది. నూతన వాహన రిజిస్ట్రేషన్లు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు వంటివి పొందాలంటే ఇక మీదట రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పొందేలా ప్రభుత్వం నూతన విధానం అమలు చేయనుంది. మార్చి మొదటి వారం నుంచి ఆన్లైన్లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను అందించనున్నారు. తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో విస్తరించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావడంతో తెలంగాణలో ఈ ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ 2016లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను రూపొందించింది. ‘వాహన్’, ‘సారధి’ పోర్టల్‌లు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచారాన్ని అనుసంధానం చేసి బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్ ద్వారా సాఫీగా సాగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్లైన్ విధానంలోనే సేవలు అందిస్తుండగా.. ఒక్క తెలంగాణ మాత్రం ఈ పోర్టల్‌లో చేరలేదు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రం పోర్టల్‌తో అనుసంధానానికి ముందుకు వచ్చింది. ‘వాహన్’ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే, సంబంధిత షోరూం లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ‘సారధి’ పోర్టల్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్లైన్లలోనే రెన్యూవల్ చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి పట్టణాల్లోనే రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. దేవరకొండ, చౌటుప్పల్, నకిరేకల్, నాగార్జునసాగర్, చిట్యాల, డిండి వంటి పట్టణాల వారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ విధానం ప్రస్తుతం సికింద్రాబాద్ కార్యాలయంలో మాత్రమే అమలు చేస్తున్నారు. ఆ తరువాత ఇతర జిల్లాలకు అనుసంధానం చేస్తారు. ముందస్తు ప్రకటించిన తరువాత ప్రక్రియ ప్రారంభిస్తారని మిర్యాలగూడ వాహన తనిఖీ అధికారి వీరస్వామి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
ఈరోజుల్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువమందే! ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఓ భాగమైపోయింది. కానీ దీని కంటే నేలపై కూర్చొని తినడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. ఈరోజుల్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువమందే! ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ ఓ భాగమైపోయింది. కానీ దీని కంటే నేలపై కూర్చొని తినడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.. కండరాలు దృఢంగా! నేల మీద కూర్చొని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోతుంది. ఇలా రోజూ కింద కూర్చొని తినడం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్‌గా, దృఢంగా మారతాయి. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ సాఫీగా.. కింద కూర్చొని నేలపై ప్లేట్ పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, తిరిగి వెనక్కి రావడం.. ఇలా వెంటవెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది. బరువు తగ్గచ్చు.. నేలమీద కూర్చొని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గచ్చట! అదెలాగంటే.. సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట! కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బంధాలు పటిష్టం.. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి.. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది పరోక్షంగా అనుబంధాల్నీ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నడుమునొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం.. వైద్యుల సలహా, తమ సౌకర్యం మేరకు ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే అక్కడ కూర్చొని తినడం మేలు!
- రిటర్న్ జర్నీ : పదోతరగతి జీవశాస్త్రం, "Excretion" విసర్జనక్రియ పాఠం కథారూపంలో
రిటర్న్ జర్నీ ఎయిర్ పోర్ట్ లో, ఒకటవ టెర్మినల్ దగ్గర తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది డాక్టర్ పద్మ. రెండు రోజుల క్రితం ఇండియా వస్తున్నట్లు శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఈ రెండు రోజుల్లో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఒక్క పద్మకు మాత్రమె తెలిసింది . “ఏమోయ్ఎలా ఉన్నావు?” లగేజి ట్రాలి తో పాటు పద్మను దగ్గరగా తీసుకుంటూ అడిగాడు శేఖర్. “అబ్బాయి రాలేదా?” యధాలాపంగా అడిగాడు. “డ్యూటీలో ఉన్నాడు”. సన్నగా చెప్పింది పద్మ. కారు ఇంటికి బయలుదేరింది. “హాస్పిటల్లో కొన్ని కేసులు ఉన్నాయి. చూసుకొని వెళ్దామా?” మెత్తగా అడిగింది పద్మ. “మీ డాక్టర్స్ ఎప్పుడు ఆన్ డ్యూటీ ఏనా?, సరే పద”, అన్నాడు శేఖర్. కారు హాస్పిటల్ వైపు పరిగెత్తింది. 1. “ఏమిటి విషయం?”బెడ్ మీద ఉన్న పేషెంట్ ను చూస్తూ అడిగాడు శేఖర్/ “ESRD: ఎండ్ స్టేజి ఆఫ్ రీనల్ డిసీజ్”. “అంటే?” “రెండు మూత్రపిండాలు పాడైపోయాయి” “ఎందుకిలా?” “సరిపడినంత నీరు తీసుకోకపోవడం, నైట్ షిఫ్ట్ లు, అధికంగా తీసుకునే ఉప్పు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, అధిక రక్త పీడనం మొదలైనవి”. “మరి ఇప్పుడుఎలా ?” “నిన్ననే మూత్రపిండ మార్పిడి జరిగింది. జీవన్ దాన్ నుంచి అవయవాలు తీసుకోవడం జరిగింది.” “మరి ఇప్పుడు అంతా ఓకేనా?” “ఒక నెల సమయం పడుతుంది. బాడీ కొత్త అవయవాన్నిఅంగీకరించడానికి.” “సరే ప్రమాదమేమీ లేదు జాగ్రత్తగా చూసుకోండి”. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాడు శేఖర్. పేషెంట్ ఇంటి వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉండగా దంపతులు ముందుకు నడిచారు. 2. “ ఏమిటి విషయం?” అడిగాడు శేఖర్ “రేపటినుండి ఈ పాప, తొలిసారిగా ఈ ప్రపంచాన్ని చూడబోతుంది” “అంటే?” “ఆ పాప అంధురాలు” “పుట్టినప్పటినుండా?” “ కాదు, చిన్నప్పుడు పోషకాహార లోపం, ప్రధానంగా విటమిన్ ఏ,” “మరి ఇప్పుడు?” “ కార్నియా రీప్లాంటేషన్ జరిగింది. తప్పకుండా చూపు వస్తుంది.” “తిరిగి లోకాన్ని చూడమంటే మామూలు విషయం కాదు.ఆల్ ద బెస్ట్”.అన్నాడు శేఖర్ 3. “ఈ కేసు ఏంటి?” “COPD” “అంటే?” “chronic obstructive pulmonary disease. ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. లంగ్స్ మార్చక తప్పని పరిస్థితి. నిన్ననే ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తయింది” “ఎందుకిలా జరుగుతుంది?” “ప్రధానంగా నికోటిన్, కొన్ని సందర్భాల్లో కాలుష్యం, మరి కొన్ని సందర్భాల్లో పనిచేసే ప్రాంతాలు” “అంటే?” అర్థం కానట్టు అడిగాడు శేఖర్ “గనులు, జిన్నింగ్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు, ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేసే పరిశ్రమలు ఊపిరితిత్తుల ఆయుస్సు ను హరిస్తాయి” ఏమి మాట్లాడకుండా ముందుకు కదిలాడు శేఖరు 4. పద్మ కొంచెం ముందు కదిలి మరో బెడ్ వద్ద ఆగింది “ఏంటి విషయం?” “ లివర్ సిరోసిస్” “అంటే?” “లివర్ గట్టిపడి, పని చేయటం మానేస్తుంది” “ ఎందుకలా?” “ప్రధానంగా మద్యపానం, మితిమీరిన తాగుడు, కానీ ఈ కేసు నాన్ ఆల్కహలిక్” “అదెలా?” “హెపటైటిస్ వైరస్ , ఏ సైలెంట్ కిల్లర్” “ఇప్పుడు పరిస్థితి ఏమిటి?” “లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. అతను ప్రస్తుతానికి క్షేమం” ఇంకా వెళదామా పద్మవైపు చూస్తూ అడిగాడు శేఖర్ ఇంకొకటి ప్లీజ్, లాస్ట్ కేసు అంటు ముందుకు కదిలింది పద్మ 5. “ఎవరి పాప?” “సివియర్ హార్ట్ స్ట్రోక్” “ఈ వయసులోనా?” “జెనిటికల్ డిఫెక్ట్, దూరాన మాలమూల గ్రామం. తీసుకొచ్చే సమయం కల్లా, పరిస్థితి చేజారింది. హార్ట్ లోని రెండు వాల్సు దెబ్బతిన్నాయి. అదృష్టం కొద్దీ వెంటనే వాల్వ్ సు రీ ప్లాంటేషన్ చేయగలిగాము.” “సరే ఇక అబ్బాయి దగ్గరికి వెళ్దామా ?” “ఉమ్” పద్మ, శేఖర్ ఇద్దరు కారిడార్ లో నడుస్తూ ఉన్నారు. పద్మ చేయి చిన్నగా కనిపిస్తుంది. అడుగులు తడబడుతూ ఉండగా కుర్చీలో కూలబడింది . “ఏమైంది? “ ఆందోళనగా అడిగాడు శేఖర్ “మీకో విషయం చెప్పాలి మీరు ధైర్యంగా వినాలి” “ఏమిటది?” “ఇప్పుడు మీరు చూసిన ఐదు కేసులు, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వి. ఆ అవయవ దాత మన అ….బ్బా…యి.” శేఖర్‌కి ఒక పట్టాన ఏమి అర్థం కాలేదు .అర్థమయ్యేసరి కల్లా గుండె పగిలినంత భారం “ఎలా జరిగింది?” “యాక్సిడెంట్” “డెడ్ బాడీ ఎక్కడ?” పద్మ చేయి ఎత్తి క్యారిడార్ చివరి వైపు చూపించింది. శేఖర్ నెమ్మదిగా లేచి తడబడుతూ క్యారిడార్ చివరికి వెళ్ళాడు కారిడార్ చివరన టాయిలెట్ బ్లాక్, దాని పక్కన ఒక పెద్ద తోట్టి లో ఫార్మాలిడిహైడ్.దానిలో ఒక బాడీ. ఒకసారి భయంగా,..రెండోసారి ధైర్యంగా,... మూడవసారి రెప్ప వేయకుండా…. చివరకు తనివి తీర తన గుండె ఏడుపు ఆగే వరకు చూస్తూ ఉండిపోయాడు శేఖర్. అప్పుడు అక్కడికి వచ్చిన వాచ్ మెన్ శేఖర్ ను పద్మావద్దకు తెచ్చాడు. కార్ ఇంటికి బయలుదేరింది. “మరి దహన సంస్కారాలు?” చిన్నగా అడిగాడు శేఖర్. “నా బిడ్డ చనిపోలేదు. రేపటి వైద్యులకు సేవ చేస్తున్నాడు. కళ్ళు మూసుకొనే చెప్పింది పద్మ.” కారు హస్పటల్ దాటి ఇంటి వైపు సాగిపోతుంది. అర్జెంటుగా వచ్చిన ఫోన్ కాల్,... రోడ్డుపైన ఘోరమైన యాక్సిడెంట్…., రక్తపు మడుగులో తన బిడ్డ….,ట్రాఫిక్ ని చీల్చుకుంటూ పరిగెత్తిన అంబులెన్స్…., ఎమర్జెన్సీ వార్డ్…, ఐ సి యు, …. “ ఐ యాం సారీ దా పేషంట్ ఇస్ నాట్ రెస్పాండ్, …ఇట్ ఇస్ బ్రెయిన్ డెడ్” పద్మ కారులో అసహనంగా కదిలింది . వెంటనే అతను తీసుకున్న నిర్ణయం.. తన జీవితంలో తను ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సమయం. అవయవ దానానికి సంతకాలు… విరోచిత సైనికులు లాగా డాక్టర్ల బృందం చేసిన యుద్ధం… అవయవాల రవాణాకు దిగివచ్చిన పోలీస్ టీం… పట్నం నుంచి ఇరువైపులా ఉన్న హాస్పిటలకు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ గ్రీన్ క్యారీడర్స్ .పెట్టెలు పట్టుకుని పరిగెత్తిన వైద్య బృందాలు, దారి పొడవున పూలు చల్లుతున్న వైద్య సిబ్బంది మరియు ప్రజలు , స్వచ్ఛందంగా ట్రాఫిక్ క్లియర్ చేసిన జనాలు… పరుగెత్తి అలసిపోయిన అంబులెన్స్ లు…. ,వెరసి ఒక గంటలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం, అంటే సగటున గంటకు 110 కిలోమీటర్లు… మొత్తంగా నిలబడిన ఆరు ప్రాణాలు…. ఊపిరాడనట్లు పద్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది . నిదానంగా ఇంటికి చేరింది. ప్రాణం లేని రెండు జీవాలు ఇంటిలోకి నిర్జీవంగా నడిచాయి. ఇంటిలో దీపం వెలగడం లేదు. శేఖర్ వడిలో గువ్వపిల్ల లా వణికి పోతున్న పద్మ నిద్రపోవట్లేదన్న విషయం తెలుస్తూనే ఉంది. అర్ధరాత్రి ఎప్పటికో “నేను మీతో వస్తానండి” అన్న పద్మ గొంతు జీరగా వినిపించింది శేఖర్ కి. “ మీ వ్యాపారం మీరు చూసుకోండి నేను మాత్రం పిల్లవాడిని, ఈ దేశాన్ని వదిలిపెట్టను,” అని భీష్ముంచుకోన్న ఒక్కప్పటి ధైర్యం ఆ గొంతులో ఏమాత్రం లేదు. లాలనగా పద్మను తన వైపు తిప్పుకొని “వెళ్దాం, రేపే వెళ్దాం, అయితే వెళ్లేటప్పుడు మరొక్కసారి,నువ్వు ఊపిరి పోసిన మనషులను కలిసి వెళ్దామా ?” అన్నాడు శేఖర్ . పద్మ అనిన “ఉమ్” గది లోని నిశ్శబ్దాన్ని ఏమాత్రం చెరప లేకపోయింది. మర్నాడు ఉదయం రిటన్ జర్నీ ప్రారంభమైంది. ఇద్దరూ ఉదయం తమ తిరుగు ప్రయాణాన్ని హాస్పిటల్ నుండి ప్రారంభించారు. శేఖర్ మొదటి బెడ్ పక్కన కూర్చొని, చేతిని తాకాడు, ఆ చేతికి దగ్గరగా నడుము, దానిమీద లోతైన గాయము. “ నాన్న ఐ యాం సారీ, నేను నేర్చుకున్న ప్రతి విషయము నువ్వు నేర్పిందే , నిరంతరం కష్టపడటం.. ఎంత పని ఒత్తిడి ఉన్న నిబ్బరంగా ఉండటం చుట్టూ ఎంత చెడు ఉన్న, మంచిని మాత్రమే స్వీకరించటం, చెడును వదిలించుకోవడం. నువ్వు…చెప్పిన, ఏ విషయము నేను మర్చిపోలేదు నాన్న, అన్ని ఆచరించాను కూడా… ఇప్పటికీ కూడా ….ఆచరిస్తున్నాను .దీనికి సాక్షమె ఈ మూత్రపిండం. చూడు నీ మాటలు ఎలా శిరసావహిస్తుందో..చుట్టూ ఎంత చెత్త ఉన్న, గుండె ఎంత ఒత్తిడి చేస్తున్న ఈ కిడ్నీ నవ్వుతూ పనిచేస్తుందంటే నువ్వు చెప్పిన మాటలే నాన్న .ఇది నువ్వు ఇచ్చిన ధైర్యమే. ఈ బిడ్డ నీ మాటని ఎప్పుడు జవదాటలేదు.. పోయిన నా ప్రాణం సాక్షిగా వాటిని ఆచరిస్తూనే ఉన్నాను” శేఖర్ కు ఏవో మాటలు గాల్లో వినిపిస్తున్నాయి. నెమ్మదిగా తలెత్తాడు శేఖర్ .ఎదురుగా ఉన్న లోకం కన్నీటి చెమ్మతో మసక గా కనిపిస్తుంది. శేఖర్ రెండో బెడ్ వద్దకు వెళ్లాడు. అది తన బిడ్డ గుండె చప్పుడు. “నాన్న నువ్వు వస్తావని నాకు తెలుసు, అది ఈ గుండెకు మాత్రమే తెలుసు నాన్న . అందుకే ఆక్సిజన్ అందని 30 సెకండ్స్ కే మెదడు మరణిస్తే, నేను మాత్రం మీకోసం కొట్టుకుంటూనే ఉన్నాను. శరీర అవయవాళ్ళకల్లా చివరిగా మరణించే అవయవం నేనే నాన్న.అది నీ కోసమే, నేను చూసిన మొదటి ప్రపంచం నీ చూపుడువేలు, నేను చూసిన లోకం అంతా నీ భుజాల మీద నుండి, అటువంటిది, నిన్ను పలకరించకుండా పాతిపెట్టేస్తారేమోనని భయమేసింది. కానీ అ..మ్మ… నన్ను రెండోసారి కన్నది నాన్న. ఎంత కష్టపడి నన్ను బతికించుకుందో నీకు తెలుసా? బహుశా ఈ ప్రపంచంలో పురిటి నొప్పులు కన్నా బాధాకరమైన ఏమైనా ఉన్నాయంటే, అవి అమ్మ కార్చిన కన్నీరే.. . నాకు నిన్ను తిరిగి కలిసే ఈ అవకాశం కల్పించిన అమ్మకు ధన్యవాదాలు చెప్పు.” శేఖర్ కంటి వెంట నదుల దారులు .ఇక ముందుకు కదల లేక హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు బరువైన గుండెతో దంపతులిద్దరూ విమానాశ్రయం చేరారు .కొద్దిసేపటికి బోర్డు పాస్ అనౌన్స్ విని పించింది. నిశ్శబ్దంతో గడ్డ కట్టినట్లు ఇద్దరు గేటు వైపుకు కదిలారు. గాలి గుసగుసలో తన బిడ్డ గొంతు పిలిచినట్లు వినిపిస్తుంది. వెను తిరిగి చూశాడు శేఖర్. తన వైపు చేతులు ఊపుతూ చాలా చూపులు. అవి తన బిడ్డ పంపించిన మనుషులవి. కాదు కాదు తన బిడ్డ బ్రతికించిన కుటుంబాలవి.ఎవరైనా తమ వెంట ఏమి తీసుజీకెళ్ళ గలరు.. ఇలా నాలుగు మంచి చూపులు తప్ప. రచయిత : శ్రీ Ch.వీరప్పయ్య , ప్రముఖ సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు , గుంటూరు





