Search Results
Search this site
738 results found with an empty search
- స్కూల్లో టీచర్ అనుమానాస్పద మృతి,విద్యార్థులు కొట్టి చంపారని భార్య ఆరోపణ
స్కూల్లో టీచర్ అనుమానాస్పద మృతి • విద్యార్థులు కొట్టి చంపారని భార్య ఆరోపణ రాయచోటిటౌన్, డిసెంబరు: ఓ ఉపా ధ్యాయుడు పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. గొడవ పడుతున్న విద్యార్థులను మందలించినందుకు ఆయన్ను విద్యార్థులే కొట్టి చంపారని భార్య చెబుతుండగా, అలాంటిదేమీ లేదని ఒక్కసారిగా కుప్పకూలిపోయారని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలోని కొత్తపల్లె జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, మృతుడి భార్య కథనం మేరకు.. మృతిచెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఎజాజ్(42) ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. బుధవారం సుమారు 3 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా పాఠశాలలోనే కుప్పకూలిపోయారు. వెంటనే పాఠశాల సిబ్బంది ఎజాజ్ భార్యకు సమాచారం ఇచ్చి, ఆయనను స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ఎజాజ్ అప్పటికే చనిపోయారని చెప్పారు. ఎజాజ్ భార్య రహిమూన్ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఐదు పూటలా నమాజు చేస్తాడని, ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్తాడని చెప్పారు. తన భర్త ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వెళ్తాడని, అది భరించలేని కొంతమంది ఉపాధ్యాయులు బయట వాళ్లతో కలిసి తన భర్తను విద్యార్థుల చేత కొట్టించి చంపించారని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులు కొట్టిన విషయాన్ని ఉపాధ్యాయులంతా కలిసి బయటికి రానివ్వకుండా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెబుతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు విచారించి తన భర్తను కొట్టి చంపిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన వారిని, సహకరించిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్‌ను 'ఆంధ్రజ్యోతి' వివరణ కోరగా.. ఎజాజ్ పాఠశాలలో కుప్పకూలిపోయారని, ఆయనపై విద్యార్థులు దాడి చేయలేదని హెచ్ఎం చెప్పారని అన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు.
- ఇక నుండి అన్ని స్కూల్స్ MDM BILLS ఈ FORMS ద్వారా మాత్రమే వెయ్యాలి అని CSE వారి ఆదేశం.
ఇక నుండి అన్ని స్కూల్స్ MDM BILLS ఈ FORMS ద్వారా మాత్రమే వెయ్యాలి అని CSE వారి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనం అందించడానికి నిర్వహించబడుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో రికార్డుల నిర్వహణకు సంబంధించిన మార్గ దర్శకాలను ప్రభుత్వం సర్క్యులేట్ చేసినది. ఈ సందేశం ప్రకారం ఈ కింద చూపించిన ఫారాలను మాత్రమే వాడవలసినదిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు . ఈ క్రింద వాటిని డౌన్లోడ్ చేసుకొని వాడుకొనవచ్చును. ఈ పోస్టు నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తు మీద నొక్కి మీ ప్రోత్సాహం అందించగలరు. #MID_DAY_MEAL_FORMS_AND_VOUCHERS CLICK BELOW AND DOWNLOAD MID DAY MEAL FORMS AND VOUCHERS MDM BILL 1,2 CLASSES 👈 MDM BILL 3,4,5 CLASSES FOR HIGH SCHOOLS 👈 MDM BILL 6,7,8 CLASSES 👈 MDM BILLS 1 to 5 PS SCHOOLS 👈 MDM BILLS 9,10 CLASSES HS 👈 MDM COOK ACQUITTANCE 👈 మధ్యాహ్న భోజన పథకమునకు సంబంధించిన దైనందిన గణాంకాలను సులభంగా వేగవంతంగా నమోదు చేసుకొనుటకు పథకానికి సంబంధించిన అన్ని రికార్డులను పకడ్బందీగా ఖచ్చితంగా నిర్వహించుకొనుటకు వీలుగా ఈ పత్రములను రూపొందించడం జరిగినది. ఈ పత్రములపై మీ అభిప్రాయాలను ఈ పోస్ట్ కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయగలరు. ఏమైనా మార్పుచేర్పులు గానీ ఇంకను అభివృద్ధి చేయవలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.
- SA-1 పరీక్షల అధికారికంగా విడుదలైన టైం టేబుల్
SA-1 పరీక్షల అధికారికంగా విడుదలైన టైం టేబుల్ డిసెంబర్ 9 నుండి 19 వరకు నిర్వహణ 16, 17 తేదీలలో జరగాల్సిన స్కూల్ కాంప్లెక్స్ లు 20-12-2024, 21-12-2024 కి మార్పు.... PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE EXAMINATIONS WILL BE CONDUCTED AS SEPARATE PAPERS ON DIFFERENT DATES FOR CLASSES VIII, IX AND X. FOR PHYSICAL SCIENCE AND BIOLOGICAL SCIENCE OF CLASS IX and X THE DURATION WILL BE TWO HOURS ONLY (1.45 Hrs FOR WRITING +15 Mins FOR QP READING)
- SCHOOL ATTENDANCE APP UPDATE D : UPDATE HERE
What's new Added SMC,PTM and few Academic monitoring modules About this app Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance.
- విద్యా - ఉపాధ్యాయ వార్తలు : ప్రస్తుత పరిణామాలు : AP Education; Teachers
ప్రతి పాఠశాలలో Dec 7 న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన Mega parent Teacher Meeting ను Teachers అందరూ Team spirit తో జయప్రదం చేయటం ఉద్యోగులుగా మన విధి. ఇంత ఖర్చుతో పెట్టే ఈ మీటింగ్ ల Motive ఏమిటో ఇంకా తెలియరాలేదు తల్లితండ్రులకు , విద్యార్థులకు శనివారం మెనూ తో మద్యాహ్న భోజనం శుచిగా , రుచిగా అందించాలి. ..ప్రభుత్వం సూచించిన రీతిలో తల్లి తండ్రులకు విడి విడిగా ఆటల పోటీలు నిర్వహించాలి. వీలయితే Lucky Dip ను పెట్టి Prize లు ఇస్తే మంచి స్పందన ఉండవచ్చును SMC సభ్యులకు HM,తల్లి తండ్రులకు టీచర్లు ఫోన్లు చేసి వ్యక్తిగతంగా ఆహ్వానిచాలి Leader ship Training లో పాల్గొనే వారు Evening ఇంటికి వెళ్ళుటకు అనుమతి ఇవ్వబడినది SA 1 పరీక్షల తర్వాత 3 వ విడత శిక్షణ ఉండును టీచర్ల బదిలీల శాశ్వత Act కొరకు ప్రతిపాదనలు DSE నుండి ప్రభుత్వ ఆమోదం కొరకు 1/2 రోజులలో పంపబడుచున్నవి .GAD, Law, Fin dept ల ఆమోదము తర్వాత కేబినెట్ ,అసెంబ్లీ ఆమోదము తో Act గా రూపొందును 2023 మే/, జూన్ లో బదిలీలు జరిగిన G.O 47 లోని ఎక్కువఅంశాల తో బాటు కొద్ది అదనపు అంశాలతో Act లో Incorporate చేసినట్లు సమాచారం. ఒక పాఠశాలను Preferential కేటగిరీ వారు కోరుకునే అవకాశము ఇవ్వకూడదనే నిబంధన నిలవక పోవచ్చు. ఏదైనా ఈ Act కోర్టుల పాలు కాకుండా అందరం చూసుకోవాల్సి ఉన్నది. బదిలీల Act తేవాలనే దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచన చేయటం ఆహ్వానించ దగినదే. HS లలో 3-5 తరగతుల మెర్జింగ్ ఉపసంహరించు నిర్ణయం జరిగిన దరిమిలా G.O 117 &128కు సవరణ/ రద్దు జరగవచ్చు HS లన్నీ 6-10 తరగతులు మాత్రమే ఉంటాయి. 3-10 తరగతులున్న HS లు ఉండవు. మెర్జింగ్ ఉపసంహరణ వల్ల మిగిలి పోయే School Asst ను Model primary School HMలుగా, SGT లతో పని చేసే UP school కు SA పోస్టులు, HS లకు అదనంగా SA పోస్టులు , 60 దాటినUP లను HS లుగా Upgrade చేసి కొన్ని, 75 దాటిన UP లకు HM లు ఇవ్వటం వలన SA పదోన్నతుల ఇచ్చి సర్దుబాటు చేస్తారు.అయినా ఇంకా కొద్ది మంది SA లు మిగులుతారు.Viable గా లేని Girls HS plus లలో ని SA లను కూడా సర్దు బాటు చేయవలసి ఉండును. HS లలో రోలు పడిపోతే చాలామంది SA లు Surplus గా మిగిలి పోతారు .దీని ప్రభావం SGT to SA పదోన్నతులపై పడవచ్చును Roll 55-60 దాటిన 4000 PS లను 5 తరగతులతో Model PS లుగా మార్చి School Asst /LFL ను HM గా ఉంచుతారు. State లో 29000, పైగా PS లుంటే కేవలం 4000 ( రోలు 55 కంటె ఎక్కువ)PS లు మాత్రమే Model PS లకు అర్హత పొందుతున్నాయి ఒక Habitation లో 55 కంటే తక్కువ Roll ఉన్న దగ్గర లోనిModel PS లో Merge అవుతాయి .దీని పై గ్రామ సభలలో/SMCలలో నిర్ణయం జరుగును ఒక గ్రామంలో Roll ఉంటే ఎన్ని Model PS లైనా ఉండవచ్చును 60 కంటే తక్కువ రోలు ఉన్న UP లు దగ్గర 5Km పరిధి లోని HS లో విలీనం Optimum Roll లేని Habitation లో Basic Primary School మాత్రమే ఉండును Model primary School లో చిన్న PS ల మెర్జింగ్ మంచి నిర్ణయం. Primary Education మరల పూర్వ వైభవం పొందాలంటే ఇది ఒక్కటే చివరి అవకాశం.ఈ విషయములో ప్రభుత్వం కులాలు, రాజకీయాలు పట్టించు కోకుండా ముందుకెళ్ళాలని కఠినంగా Political Decision తీసుకొన్నట్లు తెలుస్తుంది. Roll పెంచటం కోసం గట్టి ప్రయత్నం చేయాలనే సంకల్పంతో Roll ఉంటేనే Posts అనే నినాదం తో విద్యాశాఖ ముందుకు వెళుతుంది. దీని కోసం టీచర్లు, సంఘాలకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం. *Roll పెంచే బాధ్యత టీచర్లదే* 28000 కోట్ల బడ్జెట్ తో ఉన్న విద్యాశాఖ Enrollment ను ఒక సవాలుగా తీసుకొనే పనిలో పడి సంస్కరణలతో ముందుకు అడుగులు వేస్తున్నది. ఇన్ని పధకాలు ఇస్తున్నా మొత్తం విద్యార్థుల రోలులో 50% వాటా Private Schools లో ఉండటం విద్యాశాఖ ఛాలెంజ్ గా తీసుకొన్నది. మధ్యాహ్న భోజనం నిర్బంధం చేయటం పట్ల మధ్య తరగతి వర్గాలు అసంతృప్తి తో చేరికలు బాగా తగ్గినవి చిన్న PS లను Model PS తో Mapping చేసి Merge చేస్తారు. Habitation లో Model primary School గాని Basic Primary కాని ఏదో ఒకటే ఉండును. కాలువలు, NH, Railway gate వంటి Natural Barriers ఉన్న చోట తప్ప Model PS లోకి Merging ఆగదు దీని కోసం ప్రతి గ్రామంలో ఏ ఏ పాఠశాలలను Roll , భవనాలను., దూరం, Accessibility ను Model, Basic PS లుగా పరిగణించాలో మండల కమిటీ అధ్యయనం చేస్తుంది. Dyeo లుగా పనిచేయుచున్న AD లందరినీ వెనుకకు పంపించటం వలన ఖాళీ అయిన Dyeo పోస్టులలోకి. పదోన్నతులు ఇవ్వకుండా Govt HM/MEO లను అదే స్కేలులో DyEO లుగా గాని /FAC లుగా నియమిస్తారేమో. ప్రస్తుతం Court లో ఉన్న Contempt కేసుల వలన ZP HM /MEO లకు అవకాశము లేదు. ఈ చిక్కు ముడిని ఎలా విప్పుతారో చూడాలి. గుర్తింపు పొందిన సంఘాలు ఎప్పడూ టీచర్ల గురించే కాకుండా విద్యార్థుల వికాసమునకు కూడా టీచర్లు శ్రధ్ధ పట్టేట్లు చూడాలని అప్పుడే టీచర్ల కోసం చేసే మీ ప్రాతినిథ్యాలకు విలువ ఇస్తామని సెక్రటరీ గారు ఖరాఖండిగా చెప్పారు పాఠశాలలో విద్యార్థుల హాజరు 90% ఉంటే టీచర్ల హాజరు 75% ఉండటం శోచనీయమని అధికారులు పేర్కొన్నారు. HS లలో 10%మందికి మాత్రమే CL ఇవ్వాలని ఆదేశాలిచ్చారు వచ్చే విద్యాసంవత్సరము నుండి HS plus లు School Education పరిధి లో ఉండవు . వీటిని కొనసాగించే నిర్ణయం. Intermediate Education కు వదిలేస్తారట. ఈ నిర్ణయం వలన HS plus లలో PGT లుగా ఉన్న SA లందరూ వెనుకకు రావల్సిందే. Inter board ఆథీనంలో ఉన్న జూనియర్ కాలేజీలలో చాలా Viable గా లేవు కనుక HS plus ల నిర్వహణ కూడా కష్టమే . అన్నీ సవ్యంగా జరిగితే ఈ నిర్ణయాలతో వచ్చే ఏడాది టీచర్ల కు బదిలీలు, రేషనలైజేషన్ తో జూనియర్లకు భారీ కుదుపు ఉండ వచ్చు. రాబోయే భారీ మార్పుల గురించిన ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారు పట్టణాలకు దూరంగా Roll ఎక్కువగా ఉన్న స్కూళ్ళకు వైభోగమే . టీచర్ల తో పాటు అదనపు గదులు వస్తాయి SSC Action plan విడుదల చేసి ఆదివారాలతో సహా టీచర్లు పని చేయాలని ,సెలవులలో పని చేసిన వారికి CCL ఇస్తామని DSE వారు రోజు వారీ షెడ్యూల్ ను విడుదల చేశారు.CL s నే వాడుకోకుండా నిరోధిస్తున్న ప్పుడు CCL ఏమి చేసుకొంటామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హైస్కూలు టీచర్లు ఆదివారాలు పనిచేయాల్సి రావటం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ "గిచ్చుడు" ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖలు Action Plan లు రూపొందిస్తే వాటినే. అమలు చేసికోవచ్చు. సంక్రాంతి సెలవులలో విద్యార్థులు self preparation at home కు అవకాశం ఇచ్చి టీచర్లను Assignments ను ఇవ్వమని సూచన చేశారు Supdts కు AD లుగా పదోన్నతుల లపై త్వరలో నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తుంది విద్యాశాఖ ను సమూల ప్రక్షాళన చేసి పాఠశాలలో Enrollment వచ్చే ఏడాదినుండి గణ నీయంగా పెంచి పూర్వ వైభవాన్ని తేవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. March 2025 లో ఎన్నికలు జరిగే MLC నియోజక వర్గాలలో Graduate /Teacher MLC ఓటు నమోదుకు చివరి తేది Dec 9. 2024-25 Fy కు ITను compute చేసుకొని deduction పెంచేవారు డిసెంబరు నుండి పెంచుకోవాలి
- SSC Action Plan 2024-25 and Guidelines
#SSC_ActionPlan #10thClassActionplan Action Plan for SSC 2024-25: Guidelines for Effective Implementation Proceedings of the Commissioner of School Education, Andhra Pradesh Present: Sri Vijay Rama Raju V., IAS Reference: R.C. No. ESE02/1027/2024-SCERT, Dated 02/12/2024 --- The Commissioner of School Education, Andhra Pradesh, has issued directives for a 100-Day Action Plan to support Class X students under the new syllabus for the SSC March 2025 Public Examinations. This plan is designed to ensure focused preparation, alleviate exam-related stress, and achieve high academic performance. Importance of the 100-Day Action Plan 1. Focused Preparation with Individual Attention Teachers will address the needs of all students, including slow learners and high achievers, by providing individual attention. Students can progress at their own pace, ensuring steady improvement. 2. Additional Support through Extra Classes Extra classes will help complete the syllabus and reinforce SSC exam patterns. Regular practice of exam-oriented questions will boost confidence. 3. Daily Assessments with Feedback and Remediation Daily class tests with timely feedback will help students identify and overcome challenges. Remedial teaching will ensure concept clarity and continuous improvement. 4. Pre-Final and Grand Tests These tests will simulate the actual examination environment. Conducted according to the SSC blueprint, they will align with the final exam format. 5. Monitoring and Accountability District and mandal officers will oversee the implementation of the plan. Teachers will maintain records for verification. Implementation Directives 1. Mandatory Implementation All government schools must implement the action plan from 1st December 2024 without deviations. 2. Key Activities The plan includes Mega PTMs, SA-1, FA-3, Grand Tests, Pre-Finals, and more. Guidelines for Execution 1. Balanced Workload for Teachers Workload is distributed based on subject weightage and time available. 2. Slip Tests and Evaluations Daily slip tests must be conducted and discussed for immediate feedback. 3. Remedial and Merit Strategies Teachers will analyze tests and provide targeted support for slow and merit students. 4. Headmasters’ Responsibility Ensure smooth plan implementation in collaboration with teachers. 5. Timetable Adjustments Regular schedules should accommodate the action plan without disrupting other classes. 6. Sunday Classes Conducted with necessary precautions and communicated in advance to parents. 7. Safety of Girl Students Teachers must ensure the safety of all students, especially on Sundays 8. Parental Communication Inform parents about schedules for transport, lunch, and safety arrangements. 9. Teacher Permissions Permissions for class exchanges or absence should be minimal. 10. Study Material SCERT will release a subject-wise question bank in soft copy for open-source access. 11. Deviation Permissions Any changes to the plan require prior approval. 12. Compensatory Casual Leave (CCL) Teachers attending school on holidays will be eligible for CC 13. District-Level Adjustments District-specific plans may be developed and submitted to SCERT for approval. Enclosure: Detailed 100-Day Action Plan Issued by: Vijay Rama Raju V. Commissioner of School Education, Andhra Pradesh Recipients: All Regional Joint Directors and District Educational Officers of the State Project Director, Samagra Shiksha, Andhra Pradesh Director, SCERT, Andhra Pradesh Copy Submitted to: Secretary, Department of School Education, Andhra Pradesh This action plan aims to create an organized, supportive, and efficient framework for SSC preparation, ensuring the best possible outcomes for students in the 2024-25 academic year.
- ప్రేమ హార్మోన్... ఔషధంగా!
ఆక్సిటోసిన్ హార్మోన్... దీన్నే లవ్హార్మోన్ అని కూడా అంటారు. ఒక్క ప్రేమే కాదు మనలో సున్నితమైన భావోద్వేగాలకీ ఇదే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ పెరుగుదల ఉంటుంది... సామాజిక బంధాలు పెంచుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఆ క్సిటోసిన్ హార్మోన్... దీన్నే లవ్హార్మోన్ అని కూడా అంటారు. ఒక్క ప్రేమే కాదు మనలో సున్నితమైన భావోద్వేగాలకీ ఇదే కారణం. బిడ్డ పాలు తాగేటప్పుడు తల్లిలో ఈ హార్మోన్ పెరుగుదల ఉంటుంది... సామాజిక బంధాలు పెంచుకోవడానికీ ఉపయోగపడుతుంది. కానీ, తాజా అధ్యయనం ఒకటి ఆక్సిటోసిన్కి మతిమరుపుని తగ్గించే శక్తి ఉందనీ, నొప్పి నివారణిగానూ పనిచేస్తుందనీ తేల్చింది. టోక్యో, ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపైన చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. మెదడులో స్రవించే ఆక్సిటోసిన్ అక్కడి న్యూరాన్స్ని చైతన్యవంతం చేసి చెరిగిపోయిన జ్ఞాపకాలని మళ్లీ తీసుకురావడం గమనించారు. అలా ఈ హార్మోన్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకి చక్కని ఔషధంలా పనిచేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు, పెయిన్కిల్లర్స్కి ప్రత్యామ్నాయంగానూ దీన్ని ఉపయోగించొచ్చట. ఎందుకంటే ఈ ఆక్సిటోసిన్ నొప్పుల్ని కూడా అదుపు చేయడాన్ని పరిశోధకులు గమనించారు. ఆక్సిటోసిన్‌తో నాసల్ స్ప్రేని తయారుచేసి పెయిన్‌కిల్లర్ల వాడకం తగ్గించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు నలుగురితో కలవడం మంచిదట. ఎందుకంటే ఇలా అందరితో కలిసినప్పుడే ఆక్సిటోసిన్ విడుదలవుతుందనీ, అది వ్యాధిని చాలావరకూ తగ్గిస్తుందనీ చెబుతున్నారు.
- టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు రోడ్ మ్యాప్ విడుదల
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు రోడ్ మ్యాప్ విడుదల అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను పాఠశాల విద్య అధికారులు శనివారం విడుదల చేశారు. వచ్చే నెల 20, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీలలో మూడు దశలలో టీచర్ల ప్రొఫైల్ అప్ డేషన్ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15, మార్చి 1, మార్చి 15 మూడు విడతలుగా సీనియారిటీ జాబితాను ప్రదర్శించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 15వరకు హెచ్ ఎమ్ ల బదిలీలు, ఏప్రిల్ 21 నుంచి 25 వరకు ఎస్ఏ, మే 1 నుంచి 10 వరకు ఎస్జీటీల బదిలీలు చేపట్టనున్నారు. అలాగే ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హెచ్ఎంల పదోన్నతులు, మే 26 నుంచి 30 వరకు ఎస్ఏల పదోన్నతులు చేపట్టనున్నారు. మే 11 నుంచి 30 డీఎస్సీ సీట్ల భర్తీ చేపట్టనున్నారు.
- నన్ను విలన్ చేయొద్దు. MEO లకు సెలవుల మీద ఆంక్షలు పెట్టమని నేను చెప్పలేదు - వెట్రిసెల్వి
నన్ను విలన్ చేయొద్దు. MEO లకు సెలవుల మీద ఆంక్షలు పెట్టమని నేను చెప్పలేదు.సెలవుల విషయంలో G.ఓ follow కండి!-వెట్రి సెల్వి ఏలూరు జిల్లా ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా తెలియజేయు విషయములు.. ఈ రోజు NGO మరియు ఉద్యోగ సంఘాల JAC నాయకులు చైర్మన్ శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారు,కార్యదర్శి నెరుసు రామారావుగారి ఆధ్వర్యాన యూటిఎఫ్ రవికుమార్ మరియు మిగిలిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏలూరు జిల్లా గౌరవ కలక్టర్ వెట్రిసెల్వి ని కలసి టీచర్ల శెలవుల వినియోగంపై ఇటీవల MEO లు విధించిన 8% to 10% షరతులు,ఆంక్షలను ఆమెకు వివరించడం జరిగినది.దానికి వారు టీచర్ల శెలవుల విషయంలో నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అపార్ విషయంలో మీరు త్వరితగతిన పూర్తి చేయండి అని మాత్రం చెప్పడం జరిగింది శెలవులపై GO ఎలా ఉందో దానిని ఫాలో అవ్వండి. నా పేరు చెప్పి టీచర్లకు శెలవులపై షరతులు పెట్టి నన్ను టీచర్లకు నన్ను విలన్ గా చూపించవద్దు నా పేరు చెప్పి టీచర్లకు శెలవులు ఇవ్వమని బెదిరించిన MEO లు ఎవరైనా ఉంటే వారు ఏ మండల MEOలు చెప్పండి వారిమీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశానికి గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి కూడా హాజరైనారు.కలెక్టర్ ,DEO తో మాట్లాడుతూ మీరు ఇమీడియట్ గా MEO లతో VC పెట్టి టీచర్ల శెలవులపై ఎలాంటి షరతులు,ఆంక్షలు పెట్టకుండా MEO లకు ఇనస్ట్రక్షన్స్ ఇవ్వమని పాత పద్దతిలోనే GO NO 70 ఏమి చెబుతుందో దానికి శెలవుల మంజూరు చేసేలా చర్యలు గైకొనాలని DEO ని ఆదేశించారు. FLN లీడర్షిప్ ట్రైనింగ్ విషయమై కూడా JAC గా మట్లాడడం జిల్లా ప్రధాన కేంద్రంగా శిక్షణ నాన్ రెసిడెన్షియల్ ప్రాతిపదికన జరపాలని కోరగా ఈ శిక్షణాతరగతులు రాష్ట్ర SPD గారు అసైన్ చేసినది కాబట్టి మనం నిర్ణయం తీసుకొనుట కుదరదు కాని సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. కలక్టర్ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సుహృద్భావ వాతావరణ లో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపి టీచర్ల మనసు గెలుచుకోవడమే కాక టీచర్లందరికీ తానొక స్నేహశీలిననే సందేశం వినిపించారు.ఈ సందర్భంగా JAC నాయకులందరూ ధన్యవాదాలు తెలిపారు.
- ప్రధానోపాధ్యాయులకు లీడర్ షిప్ ట్రైనింగ్, ఉపాధ్యాయులకు FLN ట్రైనింగ్ కార్యక్రమాలలో మార్పులు
రాష్ట్ర వ్యాప్తంగా HMs కు లీడర్ షిప్, ఉపాధ్యాయులకు FLN ట్రైనింగ్ కార్యక్రమాలు వివిధ కేంద్రాల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో జరుగుతున్నాయి. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు శిక్షణకు హాజరయ్యేవారు ఎవరైనా వారి నివాస ప్రదేశం నుంచి ఉ.9:00 గంట.లకు హాజరై, సా.5:00 గం.లకు శిక్షణ ముగిశాక తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళ్లవచ్చు. శిక్షణ కేంద్రాలలో రాత్రి పూట ఉండాలని అనుకునేవారు సొంత పూచీకత్తుపై ఉండాలి. వీరికి అన్ని వసతులూ కల్పించడమైనది. ఇంటికి వెళ్లాలనుకుంటే ఎటువంటి షరతులు లేకుండా శిక్షణ సమయం ముగిశాక వెళ్లొచ్చు ప్రస్తుతం జరుగుచున్న బ్యాచ్ శిక్షణా తరగతులు రెండు రోజులపాటు ఈ విధంగా నిర్ణయించడమైనది. తదుపరి బ్యాచ్ లకు సంబంధించిన శిక్షణ విధివిధానాలు తరువాత తెలియజేయడం జరుగుతుందని రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ప్రకటించారు. ఈ పోస్టు నచ్చితే కిందనున్న గుండె గుర్తు మీద నొక్కి సపోర్ట్ చేయగలరు
- AP Mega DSC 2024 New Syllabus: లింక్ ఇలా ఓపెన్ చేయండి.డౌన్ లోడ్ చేయండి.
డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. అమరావతి: మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు కళ్లలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తోందా అని వెయిట్ చేస్తున్నారు. క్యాండెట్స్కు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు మెగా డీఎస్సీకి సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేసింది. ఉద్యోగం కోసం చదివేందుకు మరింత సమయం దొరికిందని అభ్యర్థులు తెగ సంబర పడుతున్నారు. సిలబస్ ఇదే.. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూడకుండా ప్రిపేర్ అయ్యే ఉద్దేశంతో సిలబస్ విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు మెగా డీఎస్సీ సిలబస్ విడుదల చేశామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు వివరించారు. వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు సిలబస్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. LINK 16 వేల పోస్టులు ఏపీలో 16 వేల పైచిలుకు టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ పేరుతో భర్తీ చేయనుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి చేసిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కనీసం 3 నెలల సమయం పడుతోందని అంచనా వేసింది. టీడీపీ నేతల రిక్వెస్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ కన్నా ముందు సిలబస్ విడుదల చేయాలని మంత్రి నారా లోకేష్‌కు ప్రజా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దాంతో డీఎస్సీ సిలబస్ గురించి లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేశ్ ప్రకటన చేశారు.
- Wife and Husband: భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా.. మన చట్టం ఏం చెబుతుంది..
పెళ్లయ్యాక కొంతమంది తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయంపై తమకు హక్కు ఉందని భావిస్తారు. కాబట్టి వారు తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటారు. అయితే, భార్య భర్త ఫోన్ చెక్ చేయవచ్చా? మన చట్టం ఏం చెబుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.. Wife and Husband: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా యాప్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్నింగ్ లేచినప్పుడు నుండి నైట్ పడుకునే వరకు వాటితోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే, పెళ్లయ్యాక కొంతమంది తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతిదానిపై తమకు హక్కు ఉందని భావిస్తారు. కాబట్టి వారు తమ జీవిత భాగస్వామి యొక్క వ్యక్తిగత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటారు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయడం ప్రారంభిస్తారు. భారత చట్టం ఏం చెబుతోంది? : న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం , ప్రతి ఒక్కరికీ గోప్యత హక్కు ఇవ్వబడింది. దీని ప్రకారం ఏ వ్యక్తి తన జీవిత భాగస్వామి ఫోన్ లేదా సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేయలేరు. తప్పక చూడాలంటే ముందుగా జీవిత భాగస్వామి అనుమతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్టికల్ 21 అంటే ఏమిటి?: మన దేశంలోని చట్టం ప్రకారం ప్రతి వ్యక్తికి తన వ్యక్తిగత విషయాలను ఇతరుల నుండి దాచడానికి పూర్తి హక్కు ఉంటుంది. 2017లో మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గోప్యత హక్కు చాలా ముఖ్యమైనదని, దానిని ఎప్పటికీ తీసివేయలేమని చెప్పింది.











