top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకు ఇవ్వాల్సిందే..

    ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్ మాకు ఇవ్వాల్సిందే.. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సోమవారం సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా పాలకులకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ... విజయవాడ, ఆగస్టు 5: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు (Secretariat Employees) సోమవారం సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం (AP Government) పరిష్కరించేలా పాలకులకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ... కొన్ని సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువలన రావలసిన బకాయిల్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి, పదోన్నతులు కల్పించాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలని.. సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులు(యూనిఫామ్) విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న రూల్స్ అన్నీ కూడా, సచివాలయ ఉద్యోగులకు కచ్చితంగా వర్తించేలా చూడాలని.. సమస్యలపై, ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోటేశ్వరరావు వినతి చేశారు.

  • AP TET 2024 Applications: ఏపీ టెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు

    #aptet ఏపీలో టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3తో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా.. 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 1-ఎకు 1,82,609మంది దరఖాస్తు చేసుకోగా.. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- బికు 2,662 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది  అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపోతే, సోషల్‌ స్టడీస్‌కు సంబంధించి 70,767మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 2- బి విభాగంలో 2,438మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే (అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు) టెట్‌ పరీక్షలు పరీక్షలు నిర్వహిస్తామని.. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ (Mega DSC)కి సిద్ధమైన ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా జులై 2న టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్‌, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ టెట్‌ షెడ్యూల్‌లో గతంలో పలు మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్‌ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు పోటీపడుతున్నవారి సంఖ్య భారీగా ఉంది.

  • సీబీఎస్‌ఈ విద్యార్థులకు ప్రత్యేక ‘పరీక్ష’

    ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పదోతరగతి పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రభుత్వం చర్యలు అమరావతి: ప్రభుత్వ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉండగా.. వీటిల్లో 82,764 మంది పదో తరగతి చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటిసారి వీరు సీబీఎస్‌ఈ పబ్లిక్‌ పరీక్షలు రాయనున్నారు. దీంతో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించేందుకు వీరికి ఒక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్కులు, పరీక్ష రాసిన విధానాన్ని పరిశీలించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాయడంపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారింది. 2020-21లో ఒకేసారి 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేసింది. అప్పటి వరకు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఆంగ్లంలోకి మారాల్సి వచ్చింది. వీరు ఇప్పుడు పదో తరగతికి వచ్చారు. ఈలోపు గత ప్రభుత్వం వెయ్యి బడులకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. ఈ బడుల్లో చదువుతున్న వారు సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ ఇవ్వకుండా మార్పు చేయడంతో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఆ బడుల్లో ఇబ్బందులు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్న బడులపై అధ్యయనం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ.. 243 బడుల్లోని విద్యార్థుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న వారికి కొంత మెరుగైన బోధన చేస్తే సీబీఎస్‌ఈ పరీక్షలు రాసేందుకు వీలుంటుందని వెల్లడించింది. దీంతో ఈ బడుల్లోని విద్యార్థులతో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయించాలా? లేదంటే ఈ ఏడాదికి రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలా? అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులకు ఇప్పటికే ఫార్మెటివ్‌-1 పరీక్ష పూర్తి చేయాలి. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు దీన్ని నిర్వహించలేదు. ఇందుకోసం సిద్ధం చేసిన ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వీటితోనే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధనలోనూ వ్యత్యాసం.. సీబీఎస్‌ఈ పరీక్షలు ఆంగ్లంలోనే రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇచ్చినందున చాలాచోట్ల టీచర్లు తెలుగు, ఆంగ్లం మిళితం చేసి బోధన చేస్తున్నారు. విద్యార్థులు సైతం ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. వీరికి తొమ్మిదో తరగతి వరకు పాఠశాల స్థాయిలోనే పరీక్షలు నిర్వహించారు. దీంతో వారి సామర్థ్యాలను ఎవరూ అంచనా వేయలేదు. మైనర్‌ మాధ్యమాలకు మినహాయింపు.. రాష్ట్రవ్యాప్తంగా కన్నడ, ఉర్దూ, ఒడియా మాధ్యమాల్లో చదువుతున్న 303 మంది పదోతరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షల నుంచి విద్యాశాఖ మినహాయింపు ఇచ్చింది. మొదటి నుంచి మాతృభాష మాధ్యమాల్లో చదివినందున తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలు రాయలేరని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

  • విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు

    #districtcollectorsconference #reviewoneducationdepartment #cmchandrababu విద్యాశాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు: • నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. • డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలి. జీఈఆర్ పెరగాలన్నది లక్ష్యం. • బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి. • కిట్ల పంపిణీలో 2, 3 నెలల ఆలస్యం అయింది. సకాలంలో పంపిణీ చేయడంలో విఫaలమైన సంబంధిత ఏజెన్సీని పక్కనబెట్టాలి. • ఉన్నత విద్యాశాఖలో ఏపీఏఏఆర్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) చేస్తే మన రెగ్యులర్ అకాడమిక్ స్కిల్స్ పై ఒక ఐడియా వస్తుంది • స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలి. • రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్, టెక్నికల్, యూనివర్సిటీలు, హయ్యన్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, ఎలిమెంటరీ తదితర విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిని భావితరాల భవిష్యత్ కేంద్రాలుగా (ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్స్ గా) తయారుచేయాలి. • కాలానికనుగుణణంగా కరికులమ్ మార్పు చెందాలి • ఏపీ విద్యా వ్యవస్థ బెస్ట్ అనేలా విధానాలు ఉండాలి • అధికారులు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని సాధనకు కృషి చేయాలి. • 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్లు అంగన్ వాడీల్లో ఉండాలి. • ప్రస్తుతం పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు లేవు. క్రీడలు లేవు. • విద్యావ్యవస్థ ధ్వంసం అయ్యింది • మళ్లీ విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. ఒత్తిడిలేని విద్యను అభ్యసించాలి. ఆనందంగా పిల్లలు చదువుకోగలగాలి. • గతంలో మా హయాంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాం. ఇంటరాక్టివ్ విద్యా విధానం తీసుకొచ్చాం. అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఉత్తమ విద్యా విధానాలు అవలంభించాలి. • ఆడియో, వీడియో, ఫీల్డ్ ఎడ్యుకేషన్ విధానం ఎలా ప్రవేశపెట్టాలి అన్న అంశం ఆలోచించాలి. • విద్యార్థుల్లో స్కిల్స్ మరింత మెరుగుపరచాలి. • 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం. • వర్క్ స్టేషన్ లు క్రియేట్ చేయాలి. ఈ తరహా ఇన్నోవేటివ్ స్కీమ్ లు తీసుకురావాలి. తద్వారా 5-10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. స్కిల్స్ మెరుగుపరుచుకుంటే అదనపు ఇన్సెంటివ్ లు ఇస్తాం. దేశంలో ఈ తరహా ఎవరూ స్ట్రక్చర్ చేయలేదు. • వర్చువల్ వర్కింగ్ కి పాలసీ తయారుచేయాలి. 100 మందిని పిలిచి ముందు వర్క్ షాప్ పెడదాం. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత పాలసీ తయారుచేద్దాం. ఆంధ్రప్రదేశ్ ను వర్చువల్ వర్కింగ్ హబ్ గా మారుద్దాం. తద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుదాం. • ఒకప్పుడు మన వాళ్లు అమెరికాకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అమెరికా వాళ్లు వచ్చి మన దగ్గర కంపెనీ పెట్టే పరిస్థితి రావాలి. • విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కు బాటలు వేద్దాం. • గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వివరాలు వెలికితీయాలి. ఎంత మంది వర్క్ చేస్తున్నారన్న వివరాలు సేకరించాలి. • ఎంప్లాయిమెంట్ అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. • డిజిటల్ కరెన్సీ వచ్చిన సమయంలో యూపీఐ, క్యూఆర్ కోడ్ తెచ్చాం. • ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ ఫామ్ అనేది యూపీఐ మాదిరి ప్లాట్ ఫామ్ వస్తే ఒకే వేదిక పైకి ఉత్పత్తిదారులు, వినియోగదారులు తీసుకొస్తాం. మిగిలిన వారిని కూడా ఒకే వేదిక పైకి తీసుకురాగలిగితే ఏం కావాలన్నా ఆన్ లైన్ లో కొనగలుగుతాం. అదే విధంగా ఉత్పత్తి చేసిన వస్తువును అమ్ముకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు అగ్రి కల్చర్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్ తదితర వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తు కాబోతుంది. దీనిపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది.

  • టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ అటెండెన్స్ యాప్ లో !

    టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ అటెండెన్స్ యాప్ లో ! ఉపాధ్యాయుల ప్రధాన వివరాలు సమర్పించుటకై Facial Attendance యాప్ నందుTeacher Information System అనే కొత్త Tile ఎనేబుల్ చేయడమైనది. ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేసిన డేటా ను మీమీ DDOలు చెక్ చేసి confirm చేయవలసి ఉన్నది ... డేటా update చేసుకోండి. PG లేనివారు no subject సెలెక్ట్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది B. ED చేయని వారు మెథడాలజి కోలమ్ లో డ్రాప్ డౌన్ లో OTHER METHODOLOGY పైన క్లిక్ చేయమని ఇప్పుడే ఐటి సెల్ వారు తెలియజేసారు PG లేనివారు పిజి ఆప్షనల్ సబ్జక్టుల ఇన్ పిజి కోలమ్ దగ్గర డ్రాప్ డౌన్ లో NO SUBJECT CLICK చేయాలి PROCEDURE All the teachers be ready to fill the following details in school attendance app in teachers individual logins. 👉1. Date of birth of the teacher: 👉2. Date of joining in the present school: 👉3. Date of joining in the present cadre: 👉4. Date of first appointment in the service: 👉5. Optional (main) Subjects in degree(graduation): 👉6. Optional (main) Subjects in master's (Post graduation) degree: 👉7. Methodology subjects in B.Ed/BPEd* 👉8. Teacher's present designation: అవగాహన కొరకు కింది వీడియో చూడవచ్చు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆప్షన్ తో అప్డేట్ అయిన స్కూల్ అటెండన్స్ యాప్ కింది బటన్ నొక్కి డౌన్ లోడ్ / అప్ డేట్ చేసుకోవచ్చు

  • ఉపాధ్యాయులు,అధికారులకు webex meeting లో కమీషనర్ ఇచ్చిన ముఖ్య సూచనలు

    #webexmeetingwithcommissioner ఉపాధ్యాయులు,అధికారులకు webex meeting లో విద్యాశాఖ కమీషనర్ ఇచ్చిన ముఖ్య సూచనలు: 1)UDISE+ యుడైస్ నందలి గ్యాప్స్ ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి. . తరగతిలో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు UDISE+ నందు ఆన్లైన్ తప్పనిసరిగా చేయాలి .వచ్చేవారం నుండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మరియు మినిస్టర్ గారు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉన్నది. . వారు యుడైస్ రోల్ గురించి పరిశీలించే అవకాశం కలదు. 2) Work Adjustments Udise+ నందు గల రోల్ ఆధారం చేసుకొని పాఠశాలల యందు మిగులు ఉపాధ్యాయులను ఆన్లైన్ విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయుటకు మార్గదర్శకాలు తయారు చేయుచున్నారు. వచ్చేవారం దీనికి సంబంధించిన విధివిధానాలు, ఆన్లైన్ మాడ్యూల్, షెడ్యూల్ మొదలగునవి విడుదల అగును. 3)EIS (TIS) ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చెక్ చేసుకుని అందులో ముఖ్యంగా 1)పుట్టినరోజు వివరములు 2)ప్రస్తుత పాఠశాలలో జాయిన్ అయిన తేదీ 3)ప్రస్తుత క్యాడర్లో జాయిన్ అయిన తేదీ 4)ఉద్యోగంలో అపాయింట్ అయిన తేదీ 5)గ్రాడ్యుయేషన్ లెవెల్ లో సబ్జెక్టులు 6)పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సబ్జెక్టులు 7)బీఈడీ లో మెథడాలజీలు 8)ప్రస్తుత క్యాడర్ మొదలగు అన్ని వివరములు ఈరోజు సాయంత్రం లోపల తప్పులు లేకుండా పూర్తి చేసుకోవలెను. ఎడిట్ ఆప్షన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేయబడును 5)Academic Calendar ప్రభుత్వం వారి ద్వారా ముద్రించిన అకాడమీ క్యాలెండర్లు వచ్చేవారు ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును. 4)SMC Elcetions ప్రభుత్వం వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాల యందు SMC ఎన్నికలు సజావుగా నిర్వహించేటట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలెను. SMC ఎలక్షన్ ముగిసే వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదు 7) Facial Attendance అందరూ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ తప్పక క్యాప్చర్ చేయవలెను. 6) Teachers Lesson plans తరగతి గది నందు బోధించు ఉపాధ్యాయుని వద్ద ఆ రోజు, ఆ పాఠ్యాంశానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తప్పనిసరిగా తన వద్ద ఉంచుకొని బోధన సాగించవలెను. ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన సహోపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ ను రాస్తున్నారా? లేదా? తరగతికి బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయంపై శ్రద్ధ వహించవలెను. 8) Below 10 enrollment పాఠశాలల్లో పది లోపు విద్యార్థులు ఉన్న వాటిని గుర్తించి అందు విద్యార్థులను పెంచే విధంగా కృషి చేయవలెను, ఒకవేళ విద్యార్థులు పెరిగే అవకాశం లేకపోతే వాటిపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించబడును. పూర్తి వివరాలు ఈ కింది డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుని చదవగలరు. Work Adjustment కి cut of date 04.08.2024. గౌ || కమిషనర్ గారు ఈ రోజు Webex లో చెప్పడం జరిగింది... Rationalization Norms for Primary Schools Roll. Posts 1-20 ... 1 SGT Post 21-60..…2 SGT Posts 61-90....3 SGT Posts 91-120..4 SGT Posts 121-150...5 SGT Posts 151-180...1 PS HM +6 SGT 181-210...1 PS HM +7 SGT

  • ఉపాధ్యాయులకు ప్రభుత్వం అత్యవసర సందేశం ! ఇలా చేయడం తప్పనిసరి.

    #workadjustment ఈ రోజు 2 pm తరువాత క్రింది అంశాలు స్కూల్ అటెండెన్స్ ఆప్ నందు POP UP అవుతాయి 1. Date of birth 2. Date of joining in present school 3. Date of joining in present cader 4. Date of Appointment 5. Optional subjects in Graduation 6. Optional subjects in Post graduate 7. Methodology in B.Ed 8. Present Designation వివరాలు అన్ని ఎవరి లాగిన్ లో వారు popup అయిన వెంటనే విధిగా నింపాలి. ప్రతి టీచర్ పై వివరాలు అన్ని ఒక కాగితం పై వ్రాసుకొని తప్పులు లేకుండా నింపాలి. అందరూ టీచర్స్ ఈ రోజు సాయంత్రం లోపు ఖచిత్తం గా పూర్తి చేసి పంపాలని పాఠశాల విద్యా కమిషనర్ గారి ఆదేశాలు. ఈ వివరాలు ఆధారం గానే work adjustment జరుగుతాయి . పై వివరాలు అన్ని సిద్ధం గా ఉంచుకోగలరు

  • రిఫండు కోసం ఎదురుచూస్తుంటే..#ITrefund

    #ITrefund రిటర్నులను ప్రాసెసింగ్‌ చేసేందుకు, వేగంగా రిఫండులను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొందరికి రిటర్నులు దాఖలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రిఫండు అందింది. #ITrefund ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు బుధవారంతో పూర్తయ్యింది. అర్హత ఉన్న కొందరికి ఇప్పటికే రిఫండు వచ్చేసింది. రానివారి జాబితాలో మీరుంటే ఏం చేయాలో చూద్దామా.. రిటర్నులను ప్రాసెసింగ్‌ చేసేందుకు, వేగంగా రిఫండులను అందించేందుకు ఆదాయపు పన్ను శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. కొందరికి రిటర్నులు దాఖలు చేసిన రెండు మూడు రోజుల్లోనే రిఫండు అందింది. ఇ-వెరిఫై చేశారా? ఆదాయ రకాలను బట్టి, వర్తించే ఐటీఆర్‌ ఫారాల్లో రిటర్నులు దాఖలు చేసి, ఇ-వెరిఫై చేసినప్పుడే వాటిని ప్రాసెస్‌ చేస్తారు. రిటర్నులను సమర్పించిన వెంటనే లేదా 30 రోజులలోపు వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా చేయకపోతే వెంటనే ఆ పనిని పూర్తి చేయండి. అదనపు సమాచారం.. రిఫండు కోరుతూ మీరు రిటర్నులు దాఖలు చేసినప్పుడు, పరిశీలించే క్రమంలో కొంత అదనపు సమాచారాన్ని కోరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి, మీ మొబైల్‌కు, ఇ-మెయిల్‌కు సందేశాలను పంపిస్తారు. వీటిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా అర్హత ఉన్న మొత్తం కన్నా అధికంగా రిఫండును క్లెయిం చేసినప్పుడు ఇలాంటి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు ఖాతా సరిగా ఉందా? కొన్నిసార్లు మీ బ్యాంకు వివరాలు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి, మీరు రిటర్నులు దాఖలు చేసినప్పుడు ఇచ్చిన బ్యాంకు వివరాలను సరిచూసుకోండి. ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీలాంటివి మరోసారి తనిఖీ చేసుకోండి. వివరాల్లో వ్యత్యాసాలుంటే.. ఫారం 26ఏఎస్‌లో ఉన్న వివరాలు, మీరు దాఖలు చేసిన రిటర్నులలో ఉన్న సమాచారంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదు. ముఖ్యంగా చెల్లించిన పన్ను వివరాల్లో తేడా ఉంటే, ఆ రిటర్నులను తిరస్కరించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను పోర్టల్‌ గణాంకాల ప్రకారం.. 7.2 కోట్లకు పైగా రిటర్నులు దాఖలైతే.. వీటిల్లో ఇప్పటికి 6.3 కోట్ల రిటర్నులు వెరిఫై అయ్యాయి. ఇందులో 2.6 కోట్ల రిటర్నులే ప్రాసెస్‌ అయ్యాయి. కాబట్టి, మిగతా ప్రాసెస్‌ కాని వాటి జాబితాలో మీ రిటర్ను ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి, కాస్త వేచి చూడక తప్పదు. ఒకసారి ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్‌ అయి మీ రిటర్నుల పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో చూసుకోవచ్చు. అపరాధ రుసుముతో.. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్నులను గడువు లోపు దాఖలు చేయలేదా? నికర పన్ను ఆదాయం రూ.5లక్షలకు మించి ఉంటే.. రూ.5,000 అపరాధ రుసుముతో రిటర్నులు సమర్పించేందుకు వీలుంటుంది. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలకు లోపున్న వారు రూ.1,000 చెలించాల్సి ఉంటుంది. గడువులోపు రిటర్నులు దాఖలు చేయని వారు.. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కోల్పోయినట్లే.

  • చైల్డ్ కేర్ లీవ్ - తప్పక తెలుసుకోవలసిన సంగతులు!

    #childcareleave 🔹Child care leave G.O.36 లోని విశేషాలు 🔹ఎన్నో ప్రాతినిధ్యాల తర్వాత Child care leave పై వివరణG.O. 36 GAD dt 16.3 2024 విడుదలయినది 🔹 ఈ G.O లోని Decision పేరా 5 లోని 4 వ లైను ప్రకారము మహిళా ఉద్యోగినులు తాము రిటైరయ్యే వరకు " To Take care of Minor child " Child care leave 180 days ను వాడుకొన వచ్చును అని పేర్కొన్నారు.దీని అర్థం late issues లో డెలివరీ అయ్యే వారికి కూడా ఉపయోగ పడే విధంగా తల్లి వయస్సు తో పని లే కుండా Minor child (Below 18yrs) వరకు CCL ను Avail చేసికొనవచ్చును అని అర్థం. 🔹CCL వాడుకోవాలంటే పిల్లల వయస్సు 18 దాటరాదు (Ph Children వారికైతే22 yrs) 🔹 ఈ G.O లో Heading ను చూసి Upper age limit తీసివేశారు అనుకొంటున్నారు.తీసినది తల్లులకే గాని శిశువులకు కాదు.(అవగాహన లేక కొంత మంది యూనియన్ నాయకులు కూడా మహిళా టీచర్లను అపోహలకు గురి చేస్తున్నారు) 🔹 ఈ CCL ను G.O 199 ప్రకారము180 రోజుల CCLs ను గరిష్టంగా 10 Spells లో సర్వీసు మొత్తం లో Minor children (Up to 18yrs age) వాడుకొనవచ్చును 🔹EL ,HPL లలతో కలిపి వాడుకొనవచ్చును 🔹 Probation period కు ఈ CCL కాలము Exclude అగును 🔹 ఒక రోజుకు కూడా CCL పెట్టు కొనవచ్చును 🔹 కేంద్ర మహిళా ఉద్యోగులకు ఇచ్చే 2 yrs CCL కు కూడా Minor child (Below 18 yrs) కే పరిమితము. Minimum 5 days CCL పెట్టుకోవాలి .అయితే వారికి Disabled children ఉంటే Minor child/ వయస్సు నిబంధన తొలగించబడినది. ఈ సమాచారం నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయగలరు ఈ పోస్ట్ షేర్ చేయువారు ఈ పోస్ట్ లింకు మాత్రమే షేర్ చేయవలెను. కాపీ చేయుట చట్టవిరుద్ధం.

  • స్కూల్‌కు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు #bombthreattoschool

    #bombthreattoschool దక్షిణ దిల్లీలోని ఓ పాఠశాలలో బాంబు పెట్టినట్లు దుండగులు పంపిన మెయిల్స్‌ కలకలం సృష్టించాయి. కొంతకాలంగా దిల్లీలోని విమానాశ్రయాలకు, ఆసుపత్రులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపుల కాల్స్‌ కలకలం సృష్టిస్తున్నాయి. కాగా తాజాగా దక్షిణ దిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అయితే శుక్రవారం పాఠశాలకు వచ్చిన అనంతరం స్కూల్‌ యాజమాన్యం ఈ మెయిల్‌ను గమనించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను బయటకు పంపించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల పలు ఆసుపత్రులు, పాఠశాలలకు బూటకపు బాంబు బెదిరింపు కాల్స్‌ వస్తున్న నేపథ్యంలో ఇది కూడా బూటకపు మెయిల్‌ అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • ఈరోజు ఆగస్టు 1 న మళ్ళీ అప్ డేట్ వచ్చింది: స్కూల్ అటెండెన్స్ యాప్

    #schoolattendanceapp #schoolattendanceappupdate నిన్నే అప్‌డేట్ అయిన స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ నేడు అనగా ఆగస్టు 1 న మళ్లీ అప్ డేట్ అయింది. ఈ అప్ డేట్ లో కొత్తగా ఒక ఫీచర్ చేర్చడం జరిగింది. అదేమంటే స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అనే ఆప్షన్ చేర్చడం జరిగింది. ఈ ఆప్షన్‌లో విద్యా సంవత్సరాలను ఆయా విద్యా సంవత్సరాల అన్ని పరీక్షల యొక్క మార్కులను ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇందులో తరగతి వారీగా, సెక్షన్ వారీగా పిల్లల యొక్క మార్కులను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. తరగతి సెక్షన్ ఎంచుకున్న తర్వాత పిల్లల యొక్క పేరు గానీ ఐడి నెంబర్ కానీ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేసి టాప్ చేసినట్లయితే పిల్లల పేర్లు వస్తాయి. అప్పుడు వారి యొక్క మార్కులను ఎంటర్ చేయవచ్చు. అయితే ఈ  ఆప్షన్‌ ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. పూర్తిగా అభివృద్ధి చేయలేదు. అలాగే చిత్రంగా ఈ ఆప్షన్‌లోఈ విద్యా సంవత్సరం అనగా 2024 -25 విద్యాసంవత్సరం ఇవ్వలేదు. బహుషా తదుపరి అప్‌డేట్‌లో ఈ ఫీచర్ ని పూర్తిగా అభివృద్ధి చేస్తారేమో వేచిచూద్ద్దాం. ఈ యాప్‌ని/అప్ డేట్ ని కింది బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Tap On Herat Symbol If You Like This Post

  • అసలేంటీ టెఫ్లాన్ ఫ్లూ.. నాన్ స్టిక్ పాన్ లు వాడేవారికి ఇది ఎందుకు వస్తుంది?

    #teflon #teflonflu నూనె ఎక్కువ వినియోగించకుండా వంట చేయవచ్చనే కారణంతో చాలామంది నాన్ స్టిక్ పాత్రలు వినియోగిస్తుంటారు. అయితే నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగించేవారిలో ఇప్పుడు టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి కలవరపాటుకు గురిచేస్తోంది. నాన్ స్టిక్ పాన్ లు ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. దోశలు, చపాతీలు చేయడానికి మాత్రమే కాకుండా వంటపాత్రలు కూడా నాన్ స్టిక్ కోటింగ్ లో ఉంటున్నాయి. నూనె ఎక్కువ వినియోగించకుండా వంట చేయవచ్చనే కారణంతో చాలామంది వీటిని వినియోగిస్తుంటారు. అయితే నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగించేవారిలో ఇప్పుడు టెఫ్లాన్ ఫ్లూ అనే వ్యాధి అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు టెఫ్లాన్ ప్లూ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది తెలుసుకుంటే.. టెఫ్లాన్ ఫ్లూ.. టెఫ్లాన్ ఫ్లూ ను పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది నాన్ స్టిక్ పాన్ కు కోటింగ్ గా ఉన్న టెఫ్లాన్ పొర వేడెక్కడం వల్ల వెలువడే పొగను పీల్చడం వల్ల వచ్చే సమస్య. అధిక ఉష్టోగ్రత వద్ద నాన్ స్టిక్ సామాను ఉపయోగించడం వల్ల ఇది వస్తుంది. నాన్‌స్టిక్ పాన్‌లు పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE)తో పూత పూయబడి ఉంటాయి. దీన్ని సాధారణంగా టెఫ్లాన్ అని పిలుస్తారు. 500°F (260°C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద నాన్ స్టిక్ పాత్రలను వేడిచేసినప్పుడు అవి పొగలను విడుదల చేస్తాయి. ఈ పొగలో పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA), ఫ్లోరినేటెడ్ వంటి సమ్మేళనాలు విడుదల అవుతాయి. వీటిలో విష రసాయనాలు ఉంటాయి. ఇవి పీల్చినప్పుడు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. టెఫ్లాన్ ఫ్లూ లక్షణాలు.. నాన్ స్టిక్ పాన్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు వెలువడే పొగను పీల్చినప్పుడు ఫ్లూ వంటి సమస్య వస్తుంది. దీన్ని టెఫ్లాన్ ఫ్లూ అని అంటున్నారు. ఇది వచ్చినప్పుడు కింది లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి చలి జ్వరం వికారం ఛాతీ బిగుతు దగ్గు గొంతు మంట పై లక్షణాలన్నీ కొన్ని గంటల తర్వాత కనిపిస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే కింది టిప్స్ పాటించాలి. నాన్ స్టిక్ పాన్ లను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడెక్కించకూడదు. నాన్ స్టిక్ సామాను వినియోగించే ముందు వాటిని ఉపయోగించే విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాడాలి. వంట చేసే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీలు తెరచి ఉంచాలి. నాన్ స్టిక్ పాన్ ల నుండి వెలువడే పొగకు వీలైనంత దూరం ఉండాలి. పాతబడిన, టెఫ్లాన్ కోటింగ్ దెబ్బతిన్న నాన్ స్టిక్ పాన్ లను వినియోగించకూడదు. ఇవి చాలా విషపూరిత రసాయనాలు విడుదల చేస్తాయి. నాన్ స్టిక్ పాన్ లను ఖాళీగా ఎప్పుడూ వేడి చేయకూడదు. స్టౌ వెలిగించి పాన్ ను స్టౌ మీద ఉంచగానే అందులో నూనె లేదా నీరు వంటివి వేయాలి. (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.) స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎలక్షన్ షెడ్యూల్ ఇదే! పాఠశాలల్లో వ్యాయామ విద్య పేలవం! ఆ తరగతి విద్యార్థులకు 10రోజులు బ్యాగులు అవసరం లేదు! అకడెమిక్ క్యాలెండర్లు (2024-25) ఇవే! డౌన్ లోడ్ చేసుకోండి.

bottom of page