top of page

టీచర్ పై రేప్ అటెంప్ట్

Jun 29, 2023
1 min read

కోసిగిలో మహిళా టీచర్ పై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు మధ్యాహ్న సమయంలో పాఠశాలలోని బాత్రూమ్ లు సరిగా లేకపోవడంతో ఎప్పటిలాగే పాఠశాల వెనుకభాగంలోని ఓ ఇంటికి బాత్రూం కి వెళ్ళింది.ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి బాత్రూం దగ్గరకు వెళ్లి మహిళా టీచర్ పై అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.మరో 20 నిమిషాల పాటు మహిళా టీచర్ ను పిడిగుద్దులు గుద్దుతూ మెడపైన ముఖం పైన రక్త గాయాలు చేసి ఆమెను బలాత్కారం చేయబోయినట్లు స్థానిక మహిళలు తెలిపారు.


మహిళా టీచర్ గట్టిగా కేకలు వేసి అరవడంతో కొందరు మహిళలు ఆ వ్యక్తిని అడ్డుకోబోగా వారిపై కూడా దాడికి ప్రయత్నించాడు.అధిక సంఖ్యలో మహిళలు ఒక్కసారిగా రావడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు ఆ కాలనీ మహిళలు మిడియాకు తెలిపారు... ఆ వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా టీచర్ బోరున విలిపిస్తూ ఎవరికి చెప్పుకోలేక తోటి ఉపాధ్యాయురాలుతో కలిసి ఎమ్మిగనూరుకు ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయింది.


వీడియో చూడగలరు




 
 
 

Comments


bottom of page