Search Results
Search this site
738 results found with an empty search
- భారత్ లో చైనా HMPV వైరస్ తొలి కేసు నమోదు!
భారత్ లో చైనా HMPV వైరస్ తొలి కేసు నమోదు! చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్ కు చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది. ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. అయితే తమ ల్యాబులో దీన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. Update: ICMR OFFICIAL: ఆ ఇద్దరిదీ చైనా వైరస్సే భయపడుతున్నట్టే జరిగింది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు (3 నెలలు, 8 నెలలు) సోకింది చైనా వైరస్ HMPV అని ICMR ధ్రువీకరించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజెన్‌ను గుర్తించామంది. బాధితులకు అంతర్జాతీయ ప్రయాణాల హిస్టరీ లేదని తేల్చిచెప్పింది. అయినప్పటికీ వ్యాధి రావడం అందరినీ కలవరపెడుతోంది. వీరిద్దరూ బెంగళూరులోని బాప్టిస్ట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందడం గమనార్హం.
- స్కూలు విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్కిల్స్
AI SKILLS WITH INFOSYS స్కూలు విద్యార్థులకు ఇన్ఫోసిస్ స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై స్కూలు దశలోనే విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇన్ఫోసిస్ రూపొందించిన బస్సును మంత్రి లోకేశ్ ప్రారంభించారు. స్కూలు విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, IOT, AI రంగాలపై ఇందులోని ట్రైనర్స్ బేసిక్ స్కిల్స్ అందిస్తారు.
- 3 నుండి 9 మరియు10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు ఇవే!
3 నుండి 9 మరియు10వ తరగతుల ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ లో మార్పులు జరిగినవి. పబ్లిక్ పేపర్ మోడల్ లో 4 సెక్షన్లతో 16 ప్రశ్నలు కలిగి ఉంటుంది. మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు ప్రశ్న పత్రం చదవడానికి 15 నిముషాలు. సెక్షన్ 1 లో 7 ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 2 లో 6 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 3 లో 2 నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 4 లో 2 ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇంటర్నల్ ఛాయిస్ తో ఉంటాయి. మొదటి మూడు సెక్షన్లో ఛాయిస్ ఉండదు. 6 to 8 classes లో కూడా 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 35 మార్కులు, కాలం 1గంట 15 నిముషాలు. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. సెక్షన్ 1 లో 10 MCQs టైం ప్రతి ప్రశ్నకి రెండు మార్కులు. సెక్షన్ 2 లో 3 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 3 లో 1 నాలుగు మార్కుల ప్రశ్న ఉంటుంది. సెక్షన్ 4 లో 1 ఐదు మార్కుల ప్రశ్న ఉంటుంది.
- ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి ఆరోపణలు
government's vendetta against employees: Venkataramireddy గుంటూరు: ఎన్నికల్లో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ గవర్నమెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. వాలంటీర్లకు నెలకు 10 వేలు జీతం ఇస్తామని చెప్పి విస్మరించారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదు’’ అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు ‘‘కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. కూటమి వేధింపులు తాళలేక ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. వందలాది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులే. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలి’’ అని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘‘పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తారో షెడ్యూల్ ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. వీఆర్ఏలకు తక్షణమే జీతాలు పెంచాలి’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు. చీకట్లో మహిళా ఉద్యోగులతో పెన్షన్లను పంపిణీ చేయమంటున్నారు. ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం?. వేరే ఊరులో ఉండే మహిళా ఉద్యోగులు చీకట్లో వచ్చి ఎలా పెన్షన్లు పంచుతారు?. ఇవ్వకపోతే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో మహిళా ఉద్యోగుల గురించి ఎంతో చెప్పారు. కానీ ఆయన శాఖలోనే ఉద్యోగులకు పనిచేసే వాతావరణం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రభుత్వంలోకి తీసుకుంది. గత ప్రభుత్వం మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఉద్యోగ నేతలతో సమావేశాలు నిర్వహించేంది. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. ఈ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో ఉద్యోగులను పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా సరైన సమయంలో వేయటం లేదు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల విషయంలో వేధింపులకు దిగుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చేయటంలేదు. పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందిని ఉన్నపళంగా తొలగించారు. ఒత్తిడి తట్టుకోలేక నలుగురు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లుగా మార్చారు. వందలాది మంది ఉద్యోగులకు షోజాజ్ లు ఇచ్చారు. ఆదివారం కూడా పని చేయమని నోటీసులు ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు
- Minister lokesh: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. Minister lokesh: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం హామీ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తాం విద్యార్థులను రాజకీయ సభలకు తరలించే పంథాకు అడ్డుకట్ట వేశాం ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూట్‌మ్యాప్ సిద్ధం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేశ్ అమరావతి: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచుతామన్నారు. గత ఐదేళ్లూ విద్యార్థులను విచ్చలవిడిగా రాజకీయ సభలకు తరలించి, వారి భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యాసంస్థలను వైకాపా రంగులు, నేతల ఫొటోలతో నింపేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగించామని, విద్యార్థులను రాజకీయ నేతల సమావేశాలు, సభలకు తీసుకెళ్లే పంథాకు పూర్తిగా అడ్డుకట్ట వేశామని చెప్పారు. విద్యాసంస్థల్లో ఉద్యోగమేళాలు తప్ప.. ఇతర కార్యక్రమాలేవీ నిర్వహించకూడదని ఆదేశించామని తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేశ్ శనివారం ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ కళాశాలల్లో 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఆరంభించామన్నారు. ఇందుకోసం ఈ విద్యా సంవత్సరంలో రూ.27.39 కోట్లు, వచ్చే ఏడాది రూ.85.84 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. రోడ్లు వేస్తున్నాం.. జగన్ నిర్భయంగా రావచ్చు ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీనీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు. ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామన్నారు. తాము ఇవ్వని హామీలనే ఇలా అమలు చేస్తున్నప్పుడు.. ఇచ్చినవి ఎలా విస్మరిస్తామని ప్రశ్నించారు. జగన్ దెబ్బకు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, రూ.నాలుగు వేల కోట్లను వడ్డీగా చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఒకవైపు రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెడుతూ, మరోవైపు అన్ని పథకాలూ అమలు చేస్తున్నామన్నారు. ‘కావాలని ఆరోపణలు చేస్తున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ గాలిలో కాకుండా రహదారులపైకి వచ్చి మేం చేస్తున్న మంచి పనులను చూడాలి. ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా వేశాం. కాబట్టి జగన్ నిర్భయంగా రోడ్లపైకి రావచ్చు’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇంటర్ విద్యను నిర్వీర్యం చేశారు ‘గత ప్రభుత్వంలో ఇంటర్ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాల పిల్లలూ ర్యాంకులు సాధించి.. టీవీ ఛానళ్లలో మారుమోగించేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఎంసెట్, నీట్ మెటీరియల్ కూడా వచ్చే ఏడాది నుంచి ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం. ప్రపంచంలో టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో మనవాటిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. పాఠశాల స్థాయిలోనూ విద్యావ్యవస్థ పటిష్ఠతపై దృష్టి సారించాం. ఏపీ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూట్‌మ్యాప్ తయారైంది’ అని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
- విద్యార్థినులతో పీఈటీ అసభ్య ప్రవర్తన!
ఆదర్శ పాఠశాల విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. Crime News: విద్యార్థినులతో పీఈటీ అసభ్య ప్రవర్తన! మహాముత్తారం, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాల విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రవి, బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆదర్శ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడి (పీఈటీ)గా పనిచేస్తున్నాడు. సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో నలుగురు పదో తరగతి, ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గత నెల 27 నుంచి ఈ నెల 2 వరకు రాష్ట్రస్థాయి క్రీడలు జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. వారిని పీఈటీ హైదరాబాద్ తీసుకెళ్లాడు. 27, 28 తేదీల్లో ఆ విద్యార్థినులు రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. 29న స్వస్థలాలకు వచ్చారు. పోటీలు జరుగుతున్న ఒకరోజు సాయంత్రం పీఈటీ మద్యం తాగి వచ్చి ఇద్దరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తిరుగు ప్రయాణంలో విద్యార్థినులను ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కించి..తాను మరో బస్సులో రావడంతో పోకిరీలతో విద్యార్థినులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాలను విద్యార్థినులు.. తమ తల్లిదండ్రులకు చెప్పగా.. వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సూచన మేరకు.. విద్యార్థినుల నుంచి ఫిర్యాదు తీసుకుని రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు. పీఈటీ మద్యం తాగి తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, అసభ్య పదజాలంతో దూషించాడని మిగతా ముగ్గురు విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పీఈటీకి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
- రేపు ఏపీ కేబినెట్.. ఉద్యోగులకు సంక్రాంతి కానుకలు
ఉద్యోగులకు సంక్రాతి కానుకను ఏపీ ప్రభుత్వం అందించడానికి సిద్ధమయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటకే నెలలో మొదటి రోజు వేతనాలను చెల్లిస్తూ కూటమి ప్రభుత్వం కొంత వారి నుంచి సానుకూలతను తీసుకున్నట్లయింది. అదే సమయంలో ప్రభుత్వోద్యోగులకు మరిన్ని వరాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. రెండు డీఏలు...ఈ మేరకు రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. పీఆర్సీ, ఐఆర్ లపై కూడా చర్చించి రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. నెలకు రెండుసార్లు ఏపీమంత్రి వర్గం సమావేశం కావాలని నిర్ణయించిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గం.కు వెలగపూడి సచివాలయం, 1వ బ్లాక్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది
- Corbin Bosch: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్.. క్రికెట్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా History created in world cricket By South African All rounder
దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ (Corbin Bosch) అరంగేట్రంలోనే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ (Corbin Bosch) అరంగేట్రంలోనే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్‌తో (SA vs PAK) జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన 30 ఏళ్ల కోర్బిన్.. ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు (4/63) పడగొట్టిన ఈ ఫాస్ట్ బౌలర్.. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 93 బంతుల్లో 15 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రంలో నాలుగు వికెట్లు, అర్ధ శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు మిలన్ రత్నాయకే (72) పేరిట ఉండేది. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు ఆలౌటైంది. 82/3తో రెండో రోజు (శుక్రవారం) ఆటను ప్రారంభించిన సఫారీలు.. 301 పరుగులకు ఆలౌటయ్యారు. ఓపెనర్ మార్క్రమ్ (89; 144 బంతుల్లో) రాణించగా.. టాప్ ఆర్డర్లో మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. బావుమా (31), బెడింగ్హామ్ (30) పరుగులు చేశారు. జట్టు స్కోరు 213 పరుగుల వద్ద మార్క్రమ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోర్బిన్ బాష్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు 90 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రబాడ (13), ప్యాటర్సన్ (12).. కోర్బిన్‌కు సహకరించారు. టెస్టుల్లో అరంగేట్రంలోనే 9వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు కోర్బిన్ బాష్, దక్షిణాఫ్రికా - (81* ; 92 బంతుల్లో) - పాకిస్థాన్‌పై, 2024 మిలన్ రత్నాయకే, శ్రీలంక - (72; 135 బంతుల్లో) - ఇంగ్లాండ్‌పై, 2024 బల్వీందర్ సంధు, భారత్ - (71; 88 బంతుల్లో) - పాకిస్థాన్‌పై, 1983 డారెన్ గోఫ్, ఇంగ్లాండ్ - (65;126 బంతుల్లో) - న్యూజిలాండ్‌పై, 1994 జోండేకి (దక్షిణాఫ్రికా) - (59; 128 బంతుల్లో) - ఇంగ్లాండ్‌పై, 2003
- జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు sankranthi holidays for ap government schools..
జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు #sankranthi_holidays for ap government schools #Pongalholidays sankranthi holidays pongal holidays ap schools అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉం టాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉం టాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
- ‘ఒక పాఠశాల-ఒకయాప్'తో సమగ్ర డ్యాష్ బోర్డు
SCHOOL EDUCATION MONITORING ‘ఒక పాఠశాల-ఒక యాప్'తో సమగ్ర డ్యాష్ బోర్డు విద్యా సంవత్సరం ముగింపు రోజున తల్లిదండ్రుల మెగా సమావేశం అన్ని బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్‌లు విద్యార్థుల సమాచారం పంపేందుకు ప్రత్యేక వాట్సప్ గ్రూపులు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. చేపట్టబోయే చర్యలపై మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాఠశాలల వారీగా వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు 'ఒక పాఠశాల-ఒక యాప్' పేరుతో సమగ్ర డ్యాష్ బోర్డును సిద్ధం చేస్తున్నారు. విద్యా సంవత్సరం చివరి పని దినం రోజున మరో సారి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పాఠశాలల పునఃప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను 1-12 తరగతుల విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు. ఇంటర్మీడియట్ విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు. బడులకుస్టార్ రేటింగ్‌ను మెరుగుపరిచేందుకు పాఠ శాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సిలబస్ ను మార్పు చేయ డంతోపాటు ప్రశ్నపత్రాల విధానాన్ని మారు స్తున్నారు.. వెనుకబడిన విద్యార్థులతోపాటు పిల్లలకు అదనపు బోధన అందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో కలిసి విద్యాశక్తి కార్య క్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయ నున్నారు. ఎకడమిక్ క్యాలెండర్‌ను సమర్థ Oగా అమలు చేయడంతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగు, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్‌లు ఇంటర్మీడియట్ వృత్తి విద్య విద్యార్థు లకు డ్యూయల్ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ నైపుణ్యవిద్య అర్హత ఫ్రేమ్ వర్క్ (ఎన్ఎస్క్యూఎఫ్), జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (ఎన్సీ వీఈటీ)తో కలిసి వీటిని ఇవ్వనున్నారు. ఎకడమిక్ సమాచారాన్ని అందించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి వంద శాతం అపార్ నంబర్లు కేటాయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబం ధించిన సామగ్రి అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీ డియట్ విద్యార్థులకు 475 కళాశాలల్లో జనవరి ఒకటి నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తారు. ఉత్తీర్ణత శాతం పెంచేం దుకు ప్రతి 10-15 మంది విద్యార్థులను బోధన, బోధనేతర సిబ్బందికి అనుసంధానం చేస్తూ అన్ని కళాశాలల్లోనూ మెంటార్షిప్ అమలు చేస్తారు.
- Education Loan: విద్యా రుణం చెల్లిస్తున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి..
మీ విద్యా రుణాన్ని సకాలంలో, సజావుగా చెల్లించడంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. #educationloan Education Loan: విద్యా రుణం చెల్లిస్తున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి..
- శుభవార్త: 1998 డీఎస్సీలో మిగిలిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు
నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ 1998 డిఎస్సి లో మిగిలిపోయిన అర్హులైన అభ్యర్థులకు శుభవార్త పోయిన సంవత్సరం కొంతమంది 1998 అర్హులైన అభ్యర్థులకు ఎంఎస్ టీచర్లుగా నియమించడం జరిగింది మిగిలిన వారికి కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడి ఎంటీఎస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ అన్నారు ఈ ప్రకటనని వారి మాటల్లోనే వినండి సంబంధించి మన వ్యక్తులు చెప్పారు సుమారుగా 4534 పోస్టులు వీళ్ళందరికీ కూడా చేసే అవకాశం ఇంకా ఉంది 4534 పోస్టుల్లో వీళ్ళు జరిగిన అన్యాయం ఎలా జరిగింది అంటే లో 85 మార్కులకేమో రిటన్ ఎగ్జామినేషన్ 15 మార్కులు ఇంటర్వ్యూ అయితే అది ఏమైంది అప్పుడు ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఓ సి క్యాండిడేట్ తీసుకున్నాను 50 కట్ ఆఫ్ నేను ఓ సి క్యాండిడేట్ 50 వచ్చినాయి ఇంటర్వ్యూ లో 10 వచ్చినాయి 60 మార్కులు వచ్చినాయి 60 మార్కులు వచ్చి వెయిటింగ్ ఫర్ ది జాబ్ నేను రెడీగా ఉన్నాను వెళ్ళటానికి ఈ లోపు ఏం చేయాలంటే తక్కువ మంది క్వాలిఫై అయ్యారు కట్ ఆఫ్ మార్క్ తగ్గించండి అని చెప్పి అప్పుడు ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ రావడంతో ఏం చేశారు ఒక ఫైవ్ మార్కులు తగ్గించారు అప్పుడు నాకు 49 మార్కులు వచ్చినోడు ఉన్నాడు నా పక్కన అప్పుడు గతంలో క్వాలిఫై కాలేదు ఈ కట్ ఆఫ్ మార్క్ తగ్గించడం వల్ల 49 మార్కులు వచ్చినాయి ఇంటర్వ్యూలో 15 వచ్చింది వాడు 50 + 10= 60 వస్తే ఇక్కడ 49 + 14 63 అంటే ముందు క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్నవాడేమో వెనకబడ్డాడు జనకాల కట్ ఆఫ్ మార్క్ తగ్గించడం వల్ల వచ్చినోడేమో క్వాలిఫై అయ్యాడు ఈ ప్రధానమైనటువంటి లోపం ఆ రోజు వెంటనే గమనించి చేశారు కానీ పోరాటం ఆ ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు గడిచి గడిచి గత ప్రభుత్వంలో కొన్ని పోస్టులని ఎంటీస్ గా సాధించుకోగలిగాం. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ తరపున మీరు అప్పుడు మేము అప్రోచ్ అవ్వగానే మా జిల్లాల్లో ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి మినిస్టర్ గారి దగ్గర కూర్చుని ఆ పేషీలో కూర్చుని ఆ 98 డిఎస్సి వాళ్ళకి ఎంటీఎస్ ఇప్పించడం లో ఎస్టీయు చాలా కీలకంగా వ్యవహరించింది అయితే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇప్పుడు పట్టుకున్న్నారు నన్ను ఇప్పుడు మిగిలిపోయిన మీ తర్వాత బ్యాచ్ సోదరులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు ఈరోజు అయితే అది డెడ్ లైన్ గీతంలో ఏం చేశారంటే ఇంకా రాష్ట్రా అదే చూడకుండా ఓవరాల్ గా మెరిట్ లిస్ట్ 02:46 తీసుకొని స్పీడ్ గా చేయాలనే ఉద్దేశంతో 02:47 చేశారు దాని వల్ల కొంతమంది మేజర్లు 02:49 కొంతమంది తప్పు జరిగిన మిగతా వాళ్ళు కూడా 02:52 వాళ్ళు కూడా పాపం వాళ్ళు వాళ్ళు మాత్రం ఏం 02:54 తప్పు చేశారో వాళ్ళు ఉన్నారు కాబట్టి 02:55 నేనేమంటున్నాను అంటే వాళ్ళు కూడా ఖాళీగా 02:58 చాలా కర్నూలు జిల్లాలో 3000 పోస్టులు 03:00 కావాల్సి వస్తున్నాయి కొన్ని జిల్లాల్లో 03:02 ఇప్పుడు రిక్రూట్మెంట్ లేట్ అయింది 03:03 కాబట్టి వాళ్ళని సర్వీసెస్ 03:05 ఉపయోగించుకోవచ్చు 60 సంవత్సరాలతో మీరు 03:08 జాబ్ ఇచ్చారు కానీ ఇమ్మీడియట్ గా మీకు 03:10 ఏమవుతుంది అంటే ఆ నెలలోనే రిటైర్ అయిన 03:14 సంబంధాలు ప్రతి నెల సుమారు 700 మంది 800 03:17 మంది రిటైర్ అయిపోయిన పరిస్థితి మొత్తం 03:20 కొత్తగా ఉన్నవాళ్ళు కూడా ఎంపిఎస్ కూడా 03:21 యావరేజ్ ని ఫోర్ ఇయర్స్ యావరేజ్ సిక్స్ 03:23 సెవెన్ ఇయర్స్ ఉన్నారు కొంతమంది టూ త్రీ 03:25 ఇయర్స్ ఉన్నా కానుండే యావరేజ్ ఒక ఫోర్ టు 03:28 ఫైవ్ ఇయర్స్ యావరేజ్ లో ఉంటారు ఈ 03:30 విషయాన్ని మన విద్యా శాఖ మంత్రి గారికి 03:33 చెప్దాం మొన్న కూడా నేను చదివాను 62 ఇస్తే 03:36 అందరికీ ఇవ్వాల్సి వస్తదేమో కదా అనేది 03:38 ఆలోచన ఉండి ఉండొచ్చు లోపల దాన్ని 03:41 ఎక్స్ప్లెయిన్ చేయడానికి సర్వీస్ ఎంతో 03:43 కాదు ఇచ్చిందే హ్యూమన్ గ్రౌండ్ వీళ్ళు 03:45 ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా 03:47 62 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొక 03:49 రెండు సంవత్సరాలు మినిమం టైమ్స్ లో 03:51 చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి 03:53 భవిష్యత్తులో రెగ్యులరేషన్ విషయంలో 03:55 మాట్లాడొచ్చు అట్లాగే వన్ డే గ్యాప్ తో 03:57 వన్ డే గ్యాప్ తోనే మిమ్మల్ని రెన్యూవ ల్ 03:59 చేసెట్టుగా 04:00 మాట్లాడాల్సి ఉంది వన్ మంత్ గ్యాప్ అనేది 04:02 కాదు కానీ మిగతా డిపార్ట్మెంట్ లో 04:04 జరుగుతున్నట్టుగా కాంట్రాక్ట్ వన్ డే 04:06 గ్యాప్ తో జరుగుతుంది కాబట్టి మీకు కూడా 04:08 వన్ డే గ్యాప్ తో చేయడానికి తప్పనిసరిగా 04:11 విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడదాం 04:13 మాట్లాడి మీకు 65 సంవత్సరాల విషయంలో 04:15 అట్లాగే వన్ డే గ్యాప్ విషయంలో 04:17 రెగ్యులరేషన్ విషయంలో తప్పనిసరిగా మీకు 04:19 అండగా 04:22 ఉండి కూడా మనం చేద్దాం తప్పనిసరిగా వాళ్ళు 04:26 కూడా సానుకూలతో కూడా మీ పట్ల ఉంటుంది ఈ 04:28 ప్రభుత్వానికి ఆ విధంగా మనం ప్రాతినిధ్యం 04:31 చేద్దాం అని చెప్పి తప్పనిసరిగా 04:33 తెలియజేస్తూ ఇంకా మీకు సెంట్రల్ చార్జెస్ 04:36 విషయంలో కూడా మీకు కూడా ఇంప్లిమెంట్ 04:38 అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా జాయినింగ్ 04:41 డేట్ ఇంకా 13/4 2023 జాయిన్ అయ్యారు 04:44 అన్నారు మీరు ఆ రోజుకి 23 అంటే అప్పుడే 04:48 మనకి రెండో 04:50 సంవత్సరం తప్పనిసరిగా 62 సంవత్సరాలు 04:53 సాధించుకుంటే భవిష్యత్తులో మీ అందరికీ 04:55 కూడా సెక్యూరిటీ ఉండేటట్టు గా ఆఫ్టర్ 04:57 రిటైర్మెంట్ కూడా గత ప్రభుత్వం మీకు హామీ 04:59 వచ్చింది ఆపరేటర్ మిమ్మల్ని నేను ఎగ్జామ్ 05:02 ఆ విషయాన్ని నెక్స్ట్ మీటింగ్ లో విద్యా శాఖ మంత్రిత 05:06 మాట్లాడదాం 98 కి సంబంధించి ఒక రోజు 05:08 అపాయింట్మెంట్ తీసుకొని సింపుల్ గా మీ 05:10 యొక్క ఇష్యూ మీద వెళ్దాం వెళ్లి ఆ వారికి 05:13 అర్థమయ్యేటట్టుగాను గతంలో జరిగినటువంటి 05:15 విషయాలు లోపాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ 05:17 చేసి మీ అందరి తరపున మాట్లాడటానికి నేను 05:20 అవకాశం తీసుకుంటాం మీ భరోసాగా ఉంటాం అని 05:22 చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు











