Search Results
Search this site
738 results found with an empty search
- శ్రీకాకుళంలో ఎలిమెంటరీ స్కూలును తనిఖీ చేసిన మంత్రి లోకేష్ | వచ్చే ఏడాది నుంచి ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం
#naralokesh #apeducation వచ్చే ఏడాది నుంచి ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం తొలుత ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తాం సంస్కరణల అమలు, ప్రమాణాల మెరుగుదలలో టీచర్లకు భాగస్వామ్యం అయిదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా ఏపీ స్కూళ్లను తయారు చేస్తాం టీచర్ గా మారి విద్యార్థులనుంచి సమాధానాలు రాబట్టిన లోకేష్ శ్రీకాకుళంలో ఎలిమెంటరీ స్కూలును తనిఖీ చేసిన మంత్రి లోకేష్ శ్రీకాకుళం : వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూలులో మంత్రి నారా లోకేష్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 1నుంచి 5వ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల చదువు కొనసాగుతున్న తీరుపై వాకబు చేశారు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటని ప్రశ్నించినపుడు ఇంగ్లీషు, ఈవిఎస్ సబ్జెక్టులని విద్యార్థులు చెప్పారు. స్కూలులో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? అమ్మా,నాన్నలు ఏం చేస్తున్నారు? యూనిఫాం, బ్యాగ్స్ బాగున్నాయా? తదితర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల వర్క్ బుక్ ను పరిశీలించిన మంత్రి చిన్నారుల హ్యాండ్ రైటింగ్ బాగుందని కితాబిచ్చారు. హ్యాండ్ రైటింగ్ మెరుగుదల కోసం కాపీ రైట్ బుక్స్ రాయిస్తున్నామని టీచర్లు చెప్పగా, వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇదే విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ చెప్పారు. మధ్యాహ్న భోజనంపై స్థానిక ఆహారంపై విద్యార్థులు మక్కువ చూపుతున్నందున, వాటిని మెనూలో చేర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులకు సూచించారు. టీచర్ గా మారిన మంత్రి లోకేష్ స్కూలు తనిఖీ సందర్భంగా మంత్రి లోకేష్ టీచర్ గా మారి విద్యార్థుల ఐక్యూ టెస్ట్ చేశారు. పలు వస్తువుల పేర్లను ఇంగ్లీషులో అడిగి తెలుగులో సమాధానాలు రాబట్టారు. చిన్నారులు హుషారుగా సమాధానాలివ్వడం, అల్లరి చేస్తూ కేరింతలు కొట్టడంపై మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తంచేశారు. అబ్బాయిలు క్లాస్ రూమ్ తలుపు విరగ్గొట్టారని ఒక బాలిక చెప్పడంతో... మీరు రౌడీల మాదిరి ఉన్నారురా అంటూ సరదాగా వారితో చమత్కరించారు. చిన్నప్పుడు తాను కూడా అల్లరి చేసేవాడినని చెప్పారు. విద్యార్థులకు ఏంకావాలని అడిగినపుడు బెంచీలు కావాలని చెప్పడంతో త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ముఖ్యంగా అమ్మను బాగా చూసుకోవాలని చెప్పారు. అలాగే చేస్తామంటూ విద్యార్థులు మూకుమ్మడిగా సమాధానమిచ్చారు. విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్ బాగున్నాయని అన్నారు. టీచర్లు, ఎంఇఓతో మంత్రి సమావేశం తరగతి గదుల పరిశీలన అనంతరం టీచర్లు, ఎంఇఓ, స్కూలు సిబ్బందితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లపై అవగాహన కోసమే తాను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ స్కూలు నిర్మాణం జరిగి వంద సంవత్సరాలు అయిందని టీచర్లు చెప్పగా, మంత్రి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొన్ని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, తామే స్వంతగా రూ.50వేలు ఖర్చుచేసి చిన్నచిన్న మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. నాడు-నేడు ఫేజ్ -1, ఫేజ్ -2 లో తమ స్కూలుకు ఎటువంటి నిధులు విడుదల కాలేదన్నారు. వర్షం వచ్చినపుడు తరగతి గదుల్లోకి నీరు వస్తోందని, మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ స్కూళ్లలో తొలుత కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, తర్వాత అన్నింటినీ ఒకేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ స్కూలులో అటెండెన్స్, ఫలితాలు బాగున్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. జీతంసరిగా అందడంలేదని ఆయా చెప్పగా, అటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎంఇఓను ఆదేశించారు. ప్రమాణాలను మెరుగుదలకు భాగస్వామ్యం వహించండి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు కలెక్టర్ నుంచి టీచర్ వరకు అందరూ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా ఎపి స్కూళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలకారణంగా పలు తప్పులు జరిగాయని, ఈసారి అలాంటివి చోటుచేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో పరిస్థితులన్నింటినీ ఒకేసారి మార్చడం సాధ్యం కాదని చెప్పారు. స్కూళ్లలోని మౌలిక సదుపాయాల వాస్తవ చిత్రాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అప్ లోడ్ చేయాలని ఎంఇఓను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా స్కూళ్లలో నాణ్యత పెంచేందుకు టీచర్ల సలహాలు తీసుకున్నారు. సబ్జెక్టులవారీగా బోధనకు స్కూల్ అసిస్టెంట్లు తక్కువగా ఉన్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇటీవల వర్క్ అడ్జస్ట్ మెంట్ ద్వారా కొన్నింటిని సరిచేశామని, వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా అమలుచేస్తామని చెప్పారు. మంత్రి లోకేష్ వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు.
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
#apsecratariat #apsecratariatunion #apsecratariatvenkatramireddy #venkatramireddy అమరావతి: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి(అప్సా) రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాంటూ అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ కోరింది. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు సమాధానమిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారు వివరణ ఇచ్చారు. సచివాలయానికి వెలుపల కార్యకలాపాలపై ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు తెలిపారు. ఎన్నికల్ కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఫాలో అవండి APTTV WhatsApp Channel 👈
- ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు కమిషనర్ తో జరిగిన వెబ్ ఎక్స్ చర్చనీయాంశములు
ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు కమిషనర్ తో జరిగిన వెబ్ ఎక్స్ చర్చనీయాంశములు: 1.ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటలు వరకు వెబ్ఎక్స్ నిర్వహిస్తారు. 2. ఆ వారంలో జరిగిన ఎడ్యుకేషన్ అంశాలపై అన్ని విషయాలతో చర్చిస్తారు వాటిపై రివ్యూ ఉంటుంది తక్షణం చర్చించవలసిన అంశాలు యాడ్ చేస్తూ రివ్యూ చేస్తారు. 3. ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టి విద్యా ప్రగతి కోసం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియూ టీచర్స్ ఇష్యూస్, సర్వీస్ మేటర్ ,అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో విద్యార్థులు లర్నింగ్ అవుట్ కమ్స్ మొదలగు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది 4.ప్రతి అంశం ట్రాన్సరెన్స్ గా ఉండాలి ఇంటిగ్రేటెడ్ గా ఉండాలి విద్యా అంశాలు ఎప్పటికప్పుడు అప్డేట్ గా తెలుసుకుంటూ సమాచారం మన వద్ద ఉంచుకోవాలి. ఏ విషయము తెలియదు అనకూడదు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 5. రెగ్యులర్ రివ్యూలు మండల స్థాయిలో కూడా ఉండాలి. MDM కి సంబంధించి ప్రతి ఐటెం సూపర్వైజర్ చేయాలి విద్యార్థులకు అందవలసిన ప్రతి ఐటెం కూడా అందాలి వాళ్లందరూ తినేటట్లు చేయాలి. 6. ఇన్స్పెక్షన్లు పెంచి విద్యా ప్రగతికి ఎంఈ1&2లో టీచర్స్ ని గైడ్ చేస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి. అజమాయిషీ పద్ధతి తగ్గించాలి. 7. టీచర్ అటెండెన్స్ విషయంలో స్టూడెంట్స్ విషయంలో చాలా తక్కువ స్టేటస్ కనిపిస్తుంది కనుక దానిపై దృష్టి పెట్టి దాని పర్సంటేజ్ పెరిగేటట్టు చేయాలి రెగ్యులర్‌గా ఆబ్సెంట్ అవుతున్న టీచర్స్ ని గుర్తించి ఆ సమాచారాన్ని పై స్థాయి అధికారులు పంపించాలి. 8. వర్క్ ఎడ్జస్ట్మెంట్ 100% పూర్తిచేసి పాఠశాల సక్రమ విద్యాప్రగతికి కృషి చేయాలి . 9.school complex reorganization త్వరగా పూర్తిచేసి గ్రామ సచివాలయాలు,అంగన్వాడీలు ఆ క్లస్టర్ లో ఉండేటట్టు చేయాలి. 10.ప్రతి ఎంఈఓ ఒక హైస్కూల్‌ను దత్తత తీసుకొని 100% క్వాలిటీని మరియు రిజల్ట్ వచ్చేటట్టు చేయాలి స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారో ప్రత్యేకమైన తరగతులు నిర్వహించే చెయ్యాలి. 11. NAS సర్వే త్వరలో జరుగుతుంది కనుక విద్యార్థులందరికీ రీడింగ్ మరియు గణితము నందు నైపుణ్యాలు అందజేయాలి. 12. సీబీఎస్ఈ స్కూల్స్ విజిట్ చేసి అందు రెమిడీయల్ టీచింగ్ జరుగుతుందా లేదా తగిన సదుపాయాలు కలిగి ఉన్నాయా లేదో నోట్ చేసుకోవాలి. 13.ATTENDENCE NOT CAPTURED స్కూల్స్ గుర్తించి 100% అయ్యేటట్లు చూడాలి 14.ఎండిఎం ఇన్స్పెక్షన్ లో ఎడ్యుకేషన్ 3 levels లో జరగాలి 1) వెల్ఫేర్ అసిస్టెంట్ 2)హెడ్మాస్టర్ ఇన్స్పెక్షన్ 3)ఎస్ఎంసి చైర్మన్ ఇన్స్పెక్షన్ జరిగేటట్టు చేయాలి. 15. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పిల్లలకు అందేటట్టు చూడాలి . 16.ఆయా పనితీరుపై దృష్టి పెట్టి పాఠశాల పరిశుభ్రతపై పర్యవేక్షణ జరగాలి. 16. ప్రతి ఎంఈఓ మరియు ఉపాధ్యాయులు జిల్లా,రాష్ట్రస్థాయిలో ఇది నాది అనే ఫీలింగ్స్ తో, ఓనర్ షిప్ మేనేజ్మెంట్ తో,రెస్పాన్సిబులిటీ గా పని చేయాలి. 17. ఫీల్డ్ లెవల్లో పర్యవేక్షణ పెంచి మీ అంచనాలకు తగ్గట్టుగా అవగాహన కలిగి ఉండాలి. 18. టైప్ ఫోర్ హాస్టల్స్ మీద అవగాహన ఉండాలి 19.భవిత సెంటర్లను సందర్శించి యాప్ ద్వారా సి డబ్ల్యూ స్క్రీనింగ్ యాప్ నందు నమోదు అయ్యేటట్టు చూడాలి. 20. పియం స్కూల్స్ విధివిధానాలు తెలుసుకొని వాటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి 21.స్టూడెంట్స్ కిడ్స్ పంపిణీ పనితీరు చాలా బాగుంది ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్ కిడ్స్ ఐటమ్ అందేటట్టు చూడాలి. 22. ఎస్ఎంసి ఎలక్షన్స్ కంప్లీట్ చేసి త్వరలోనే వారికి కమ్యూనిటీ ఆక్టివిటీస్ పై ట్రైనింగ్ నిర్వహించవలసి ఉంది. 23. ప్రతి పాఠశాలలో యూత్ అండ్ ECO క్లబ్స్ ఏర్పాటు చేయాలి 24.స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు పోటీలు నిర్వహించి విజన్- 2047 పై డిబేటు,ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాలి.
- Viral: "టీచర్ ఐ లవ్యూ నన్ను పెళ్లి చేసుకుంటారా" స్టూడెంట్ షాకింగ్ ప్రపోజల్‌కు మేడమ్ రిప్లై ఏంటంటే..
#studentmarriageproposalwhileonlineclass ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్ క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు. అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా పనులు ఆన్లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. స్టూడెంట్స్ (Student) క్లాసులకు కూడా వెళ్లనవసరం లేకుండా ఇళ్లలోనే కూర్చుని పాఠాలు వినేస్తున్నారు (Oline Class). అయితే ఈ తరహా బోధన వల్ల గురువులంటే (Teacher) విద్యార్థులకు గౌరవం లేకుండా పోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న సమయంలో టీచర్‌కు ఓ స్టూడెంట్ లవ్ ప్రపోజల్ చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది (Student proposed to his teacher). వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ టీచర్ పాఠం పూర్తయిన తర్వాత ఓ విద్యార్థి మాట్లాడాడు. చాలా అమాయకంగా మాట్లాడుతూ.. ``మీకు పెళ్లైందా`` అని టీచర్‌ను అడిగాడు. అందుకు ఆ టీచర్ ``లేదు`` అని సమాధానం చెప్పారు. వెంటనే ఆ విద్యార్థి.. ``నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను`` అని చెప్పాడు. దానికి ఆ టీచర్ స్పందిస్తూ.. ``నేను మిమ్మల్నందరినీ ప్రేమిస్తున్నా`` అని రిప్లై ఇచ్చారు. అప్పుడు స్టూడెంట్ ``మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా`` అని రెట్టించాడు. ఆ ప్రశ్నకు టీచర్ బదులివ్వకుండా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. సిగ్గుపడాలి``, ``ఇవన్నీ ఆన్లైన్ క్లాస్‌ల సైడ్ ఎఫెక్ట్స్``, ``ఆ టీచర్ చాలా హుందాగా ప్రవర్తించారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. వీడియో చూడండి.
- AP TET Hall Tickets| ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
#aptet #aptethallticket # aptethallticketdownload ఏపీలో టెట్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. AP TET Hall Tickets| అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET)కు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 3 నుంచి జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను (AP TET Hall Tickets) విడుదల చేశారు. అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/ లో తమ క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఏపీ టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.27 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ పోస్టుల భర్తీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉండటంతో తమ స్కోరును పెంచుకొనేందుకు భారీగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏపీ టెట్ షెడ్యూల్
- వేసవిలో బదిలీలు, ప్రమోషన్లు
ఉపాధ్యాయ సంఘ నాయకులతో విద్యాశాఖ కమిషనర్ గారు సమావేశంలో చర్చించిన అంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగాఉన్న గ్రేడ్ 2 హెడ్మాస్టర్లు/స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు చేపట్టాలని కోరగా 117 జీవో సవరించి వేసవి సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు చేపడతామని తెలిపారు 2. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవానికి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కోరగా నవంబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని తెలిపారు 3. 9,10వ తరగతి హిందీ పాఠ్యాంశాలను కొన్నింటిని వెంటనే తొలగించాలని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు 4.పని సర్దుబాటులో 50 కిలోమీటర్ల కంటే దూరం వెళ్లడం జరిగిందని అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని అలాంటి వారికి అనుకూలంగా ఏ స్కూల్ నుంచి అయినా టీచర్ మ్యూచువల్ గా వస్తాను అంటే వారిని ఆ పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు 5.దసరా సెలవులను అక్టోబర్ 4 నుంచి కాకుండా మహాలయ అమావాస్య ప్రారంభం అక్టోబర్ 3 వ తేదీ నుంచి ఇవ్వాలని కోరగా పరిశీలిస్తామన్నారు. 6.స్కూల్ కాంప్లెక్స్ వల్ల రెండు పని దినాలు, SAMP వల్ల ఆరు పని దినాలు వృధా అవుతున్నాయని తెలపగా కుదిస్తామని తెలిపారు. 7. SSC పరీక్షలను రెండు మీడియం లలో నిర్వహించాలని కోరగా త్వరలో నిర్ణయం తెలుపుతామన్నారు. 8. TMF యాప్ లో ఇన్స్పెక్షన్ ఫామ్ ఇంకా అదనంగా చేర్చడం జరిగిందని తెలపగా చర్చించి నిర్వహణ తగ్గేలా చూస్తామని తెలిపారు. 9.స్కూల్ అటెండెన్స్ యాప్ లో మార్కుల uploading కష్టతరంగా మారిందని మునుపటి వలె ఉండాలని కోరగా పరిశీలిస్తామన్నారు. 10. పాఠశాల నిర్వహణ గ్రాంట్లు రెండు సంవత్సరాలుగా విడుదల చేయలేదని తెలపగా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. 11. గతంలో డిజిటల్ లెసన్ ప్లాన్లు అనుమతించడం జరిగిందని అయితే ప్రస్తుతం పర్యవేక్షక అధికారులు వ్రాతపూర్వక లెసన్ ప్లాన్లు అడుగుతున్నారని తెలపగా ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. 12.డిఈఓ పూల్ లో పండితులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరగా వేసవి సెలవుల్లో చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇంకా అనేక విషయాలపై చాలా సమయం సమగ్రంగా చర్చించడం జరిగింది. కమిషనర్ విజయరామరాజు గారు సానుకూలంగా స్పందించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
- AP Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
AP Cabinet Decisions : వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖాల్లో సర్దుబాటు- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాజీనామాలు చేయగా రాష్ట్రంలో 1.07 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారన్నారు. ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్టెమీ పథకం, సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించిందన్నారు. 1.సాధారణ పరిపాలనా విభాగం సీఎం సహాయనిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు జూన్ 12,2024 నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ కేటగిరీల్లో (58) పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు జీవో నెం.78, ఇతర ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. 2. *గ్రామ, వార్డు సచివాలయాలు* గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు గతంలో ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని చేసి ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజకీయ లబ్దికోసం ఎవరికో ఆర్థిక లాభం చేకూరే విధంగా చేసిన ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.205 కోట్లు నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో కలపాలని కేబినెట్ నిర్ణయించింది. 3. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి "అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం" గా పేరు మార్చడానికి తీర్మానం, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కేబినేట్ నిర్ణయించింది. 4. పరిశ్రమలు, వాణిజ్యం 14.8.2024 తేదీన జరిగిన రాష్ట్ర స్థాయి కేటాయింపు కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) సమావేశం సిఫార్సుల ఆధారంగా ఎపీఐఐసీ కేటాయింపు నిబంధనల ప్రకారం (ప్రతి కేసు పరిధి, 50 ఎకరాల కంటే తక్కువ) సిఫార్సు చేసిన 203 పారిశ్రామిక భూ కేటాయింపులను ఆమోదించడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రతి ఇంట ఒక ఎంఎస్ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారుచేయాలన్న తమ ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు తెలిపారు. 5. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (STEMI - స్టెమీ) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కమ్యునిటీ స్థాయిలో సమగ్ర కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. 6. పరిశ్రమలు, వాణిజ్యం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం కింద అందే లబ్ధిని రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) లకు అందజేసి వాటిని అభివృద్ధి పథంలో నడపాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ ఫండ్ ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ప్రయోజనం కలగనుందన్నారు. 7. హోం శాఖ మాజీ సైనికులు, యుద్ధ వికలాంగ సైనికులు, యుద్ధ వితంతువులు, మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడినవారి స్వయం సమృద్ధి, సహాయ, పునరావాసానికై పీడీఎఫ్ ఖాతా నుంచి రూ.3 కోట్ల కార్పస్ నిధితో ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEXCO) ఏర్పాటు చేయనున్నారు. కేబినెట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రూ.10 కోట్ల కార్పస్ నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 8. పరిశ్రమలు, వాణిజ్యం కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్ లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్ ఎంఈ టెక్నాలజీ సెంటర్ (టీసీ) కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమిని అందజేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 9. ప్రణాళిక శాఖ విజన్ డాక్యుమెంట్ వికసిత్ ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర 2047గా మార్చాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 వరకు స్టేక్ హోల్డర్స్ సంప్రదింపుల అనంతరం 1 నవంబర్, 2024న విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 10. మానవ వనరుల (ఉన్నత విద్య) శాఖ కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీని యు.జి.సి. నిబంధనలు-2023 ప్రకారం డిస్టింక్టు కేటగిరీలో "డీమ్డు టు బి యూనివర్శిసిటీ" గా కన్వర్టు చేసేందుకు అవసరమైన "నో అబ్జక్షన్ సర్టిఫికేట్" (NOC)ను ప్రభుత్వ పరంగా జారీచేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశంలో పేరు పొందిన ఉత్తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కు తేవడం తమ లక్ష్యమని, బిట్స్ పిలానీ సంస్థ తమ అనుబంధ సంస్థను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సంసిద్దత తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 10. వెనుబడిన వర్గాల సంక్షేమ శాఖ బీసీలకు చట్టసభలో సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనలను కేంద్రం ఆమోదానికి పంపేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 11. జల వనరుల శాఖ పోలవరం ప్రాజెక్టుకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రస్తుతం ఉన్న ఏజన్సీతోనే కొనసాగించేందుకు పోలవరం చీఫ్ ఇంజినీర్ ప్రతిపాదించిన రాటిఫికేన్ ఆర్డర్స్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డయాప్రమ్ వాల్ నిర్మాణం కారణంగా అదనపు పనులను పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు, మైనర్ ఆరిగేషన్ ట్యాంకులను ఈ సీజన్ లో నింపేవిధంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 13. రైతు భరోసా కేంద్రాల పేరు మార్పు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రంగా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. 14. రెవెన్యూ (ఎక్సైజ్) నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్టోబరు మొదటి వారం నుంచి ఈ నూతవ పాలసీ అమలుకు చర్యలు తీసుకోనుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం - 1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నూతన మద్యం పాలసీలో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. దీంతో రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 10 శాతం గీతా కులాలకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రిజర్వుడ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అన్ రిజర్వ్ డ్ షాపులకు ప్రతిపాదిత శ్లాబుల్లో 50 శాతం లైసెన్స్ ఫీజు ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% దుకాణాలను అంటే 340 దుకాణాలను కేటాయించనున్నారు. రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా ఉండేందుకు లాటరీ ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు జరగనుంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
- ఉద్యోగుల ఒకరోజు జీతం విరాళాల ఉత్తర్వులు విడుదల . తెలుగు అనువాదం . మీ జీతం నుంచి ఎంత కట్ అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు.
#cmrf #chiefministerrelieffund ఇటీవల విజయవాడలో సంభవించిన భారీ వర్షాలు వరదల బాధితుల కోసం సహాయార్థం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సంస్థల ఉద్యోగులు ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటించడం విధితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం నేడు విడుదల చేసింది ఆ ఉత్తర్వుల తెలుగు అనువాదాన్ని ఈ కింద చూడవచ్చు ఉత్తర్వుల్లో పేర్కొన్న సూచికలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ చైర్మన్ అమరావతి జేఏసీ చైర్మన్ ఏపీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూ ట్ ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ వారు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగుల సంఘ జేఏసీ చైర్మన్ ఇటీవల వచ్చిన తుఫాను,వరదల్లో బాధితులైన వారికి సహాయార్థం, ముఖ్యంగా విజయవాడ నగరంలో వచ్చిన వరద బాధితుల సహాయార్థం తమ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించుటకు ప్రాతినిధ్యం చేసి ఉన్నారు. 2.పైన తెలిపిన ప్రాతినిధ్యం ప్రకారం వారి వారి అక్టోబరు నెలలో అందుకొను సెప్టెంబర్ 2024 నెల జీతాలు /పెన్షన్లు /గౌరవ వేతనముల నుంచి కింద తెలిపిన విధంగా మినహాయించబడునని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. i. ప్రభుత్వ/ సంఘాల /సంస్థల /విశ్వవిద్యాలయాల/ స్థానిక సంస్థల ఉద్యోగులు మరియు పింఛనుదారుల ఒకరోజు మూలవేతనము ii. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ వారి ప్రాతినిధ్యం మేరకు ఆ శాఖలోని ఉద్యోగుల యొక్క రెండు రోజుల మూలవేతనము iii. సర్పంచులు, ఎంపీటీసీలు మరియు జడ్పిటిసిల యొక్క ఒక నెల గౌరవ వేతనము 3.పైన తెలిపిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల యొక్క డి డి వో లు పైన తెలుపబడిన విధంగా ప్రక్రియ పూర్తి అగుటను పర్యవేక్షించవలెను. ఈ మినహాయింపులన్నీ సంబంధిత డి డి వో లు పెన్షన్ ప్రాసెసింగ్ అధికారులు సంబంధిత బిల్లులను సమర్పించడం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ 8448-00-111-01-15-001-001VN కి జమచేయవలెను . 4. ఎవరైనా ఉద్యోగులు గాని పెన్షనర్లు గాని తమ ఒకరోజు మూలవేతనాన్ని పైన పేర్కొన్న విధంగా ప్రభుత్వానికి జమ చేయడానికి అయిష్టత కలిగి ఉంటే అట్టివారు ఒక లేఖను తమ డిడిఓకి సమర్పించి ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు పొందవచ్చు. అట్టి ఉద్యోగులను ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ప్రక్రియ నుంచి వారి డీడీవోలు మినహాయించవలెను. 5. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ /పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్/వర్క్స్ ఎకౌంట్స్ డైరెక్టర్ మరియు రాష్ట్రంలోని అందరు డి డి ఓ లు ఈ ఉత్తర్వులు విజయవంతంగా అమలు జరిగేలా చూడాలని ఆయా విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎటువంటి అవాంతరాలు లేకుండా జమ అయ్యేలాగా చూడాలని ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి రెవెన్యూ కార్యదర్శి కి ఏపీ సచివాలయ కార్యదర్శికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయవలసిందిగా ఆదేశించారు 6. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ /పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్/వర్క్స్ ఎకౌంట్స్ డైరెక్టర్ మరియు రాష్ట్రంలోని అందరు డి డి ఓ లు అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్టార్లు వారి నియంత్రణలోని పరిపాలన పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ ప్రక్రియను విజయవంతం చేయుటకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా పేర్కొన్నారు. 7. పై ఉత్తర్వులు అమలు జరుగుటకు పేరోల్ సిస్టంలో తగిన ఫీచర్‌ను చేర్చుటకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీసి ఎఫ్ఎస్ఎస్ సీఈఓ ని ఆదేశించారు. జీవో కాపీని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు DOWNLOAD G.O COPY మీ నెల మూల వేతనం ప్రకారం మీ ఒకరోజు మూల వేతనం ఎంతనో సెప్టెంబర్ జీతాల నుంచి ఎంత మినహాయించబడుతుందో ఈ కింది పట్టికను చూసి తెలుసుకోవచ్చును. ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కిందనున్న కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. READY RECKONER OF ONE DAY BASIC PAY జీతం నుంచి ఒకరోజు మూలవేతనాన్ని కట్ చేయవద్దని డీడీఓ కి సమర్పించే లేఖ DOWNLOAD
- స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ .వెర్షన్ 2.5.6 ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
#schoolattendanceapp #sims School Attendance (SIMS-AP) Details What's new Improved application performance About this app Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. More info 3+, Rated for 3+, Learn more, App info, Version Updated on 2.5.6. Sep 17, 2024 UPDATE/ DOWNLOAD SCHOOL ATTENDANCE APP
- పిల్లల్ని కొడుతున్నారా?జాగ్రత్త! ఇదిచదవండి
పిల్లల్ని కొడుతున్నారా? క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి క్రమశిక్షణ కోసం లేదా శిక్షించటం కోసం....దేనికోసమైనా పిల్లల్ని కొట్టడం అనేది పెంపకంలో భాగమైపోయింది. తక్షణ ఫలితం రాబట్టడం కోసం కొడుతున్నామని అంటున్నారా? అయితే వెంటనే ఆ పని మానుకోండి. దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా అది పిల్లల మనసు మీద శాశ్వత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లల్ని కొట్టేముందు ఈ కింది విషయాల గురించి ఆలోచించండి. సంప్రదాయాల్ని పాటించడం: పిల్లల్ని కొట్టడం అనేది మీ ఇంట్లో సంప్రదాయంగా వస్తోందా? మీ నాన్నని మీ తాతయ్య, మిమ్మల్ని మీ నాన్న మందలించటానికి అదే పద్ధతిని అనుసరించారు కాబట్టి మీరూ దాన్నే ఫాలో అవుతున్నారా? అలాగైతే పెద్దయ్యాక మీ పిల్లలు కూడా తమ మాట వినేలా చేయటం కోసం వాళ్ల పిల్లల్ని ఇలానే దండిస్తారు. వయసులో పెద్దవారైతే చాలా?: పిల్లలు మిమ్మల్ని ఎదిరించలేరు, బలహీనులని వాళ్లని కొట్టడానికి మీరు వెనకాడటం లేదా? ఇదే మీ ఉద్దేశమైతే పెరిగి పెద్దయ్యాక మీ పిల్లలు కూడా తాము చెప్పిందే కరెక్టని ఒప్పించటం కోసం కొట్టడాన్నే సాధనంగా వాడతారు. అనుబంధాలకు బీటలు: పిల్లలకు మీకు మధ్య ఎంతటి అనుబంధమున్నా కొట్టడంతో ఆ బంధం బీటలు బారుతుంది. ఆ దూరం శాశ్వతంగా ఉండిపోతుంది. రిలేషన్షిప్ సమస్యలు: తల్లితండ్రుల చేతుల్లో దెబ్బలు తింటూ పెరిగిన పిల్లలు తమ జీవితాల్లో రిలేషన్షిప్ సమస్యల్ని ఎదర్కొంటారు. తమను కొట్టే తల్లితండ్రుల్ని నమ్మనట్టే ఎవర్నీ వాళ్లు నమ్మలేరు.
- కళ్ళకి కాటుక ప్రమాదకరమా?!
కాటుక అనారోగ్యాలకు దారితీయగల దని నీతి ఆయోగ్ స్వయంగా చెప్పింది . ఇది నిజంగానే ప్రమాదం . ఒకప్పుడు కళ్ళు అందంగా కనిపిస్తాయి.. వాటిల్లోకి చేరిన దుమ్ము పోతుంది కళ్ల ఆరోగ్యానికి మంచిదని కాటుక పెట్టేవారు. వాటిని స్వయంగా ఇళ్లల్లోనే స్వచ్ఛమైన ఆముదం, నెయ్యితో తయారుచేసేవారు. మనం ఇప్పుడు వాడేవన్నీ కమర్షియల్ కాటుకలే. వాటిల్లో వాడే లెడ్, నిల్వ ఉండటానికి ఉపయోగించే పారాబెన్స్, భారలోహాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లెడ్ శరీరంలో ఇంకి మెదడు, ఎముకలపై దుష్ప్రభావం చూపు తుంది. రక్తహీనతకి దారితీస్తుంది. కింది కనురెప్పల్లో నూనెగ్రంథులు ఉంటాయి. ఇవి నీటిని విడుదల చేసి, కళ్లకు తేమ అందేలా చేస్తాయి. మనం రసాయనాలతో కూడిన కాటుక రాయడం వల్ల అవి తెరుచుకోవు. దీంతో తగినంత తేమ అందక కళ్లు పొడిబా రతాయి. కంటికి అలర్జీలు, గ్లకోమా, కార్ని యల్ అల్సర్లు వంటివి వస్తాయి. పిల్లల్లో రిస్క్ మరీ ఎక్కువ. నాడీవ్యవస్థపై ప్రభావం పడి నేర్చుకోవడం ఆలస్యమవడం, ప్రవర్తనా సమస్యలు తీవ్రమైతే కోమాలోకి వెళ్లొచ్చు. కాబట్టి, రోజూ కాటుక పెట్టకపోవడమే మేలు. ఒకవేళ పెట్టుకున్నా కొద్దిసేపయ్యాక తీసేయడమే మంచిది. దీన్ని ఇతరు లతో పంచు కోకూడదు. తుది గడు వులు (ఎక్స్పైరీ డేట్ ) గమ నించుకోవాలి. లెడ్ (సీసం) లేనివి చూసి ప్రత్యేకంగా ఎంచుకోవాలి. ఇంకా కాటుకకు బదులుగా ఐలైనర్, ఐషాడో, మస్కారా వంటివి ప్రయ త్నించొచ్చు. ఇవైతే కంటిలోకి పోవు. అయితే కడుక్కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.
- కోచింగ్ క్లాస్‌లపై నమ్మకం లేదు..Infosis నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
Narayana Murthy: కోచింగ్ క్లాస్‌లపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలపై శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాస్ (Coaching Classes)లు అవసరమవుతాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు అవి తప్పుడు మార్గంగా నిలుస్తున్నాయని అన్నారు. అలాంటి వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. బెంగళూరులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల అంశంపై అడిగిన ప్రశ్నకు నారాయణమూర్తి స్పందించారు. ‘‘ఈ రోజుల్లో కోచింగ్ క్లాస్‌లకు వెళ్లే చాలామంది తరగతి గదిలో క్లాస్‌లను సరిగా విననివారే. లేదా ఇంటివద్ద తల్లిదండ్రులు వారికి చదువులో సాయం చేయలేని స్థితిలోనైనా ఉండి ఉండాలి. అలాంటివారే కోచింగ్ క్లాస్‌లకు ఆసక్తి చూపుతారు. దురదృష్టవశాత్తూ మన దేశంలో బట్టీ చదువులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. దీనివల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, వాస్తవిక సమస్యలను పరిష్కరించుకునే సన్నద్ధత తగ్గిపోతోంది’’ అని నారాయణమూర్తి (Infosys Co-Founder Narayana Murthy) సమాధానమిచ్చారు. ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడమే అసలైన విద్యావిధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ముందు దేన్నైనా పరిశీలించాలి. ఆ తర్వాత దాన్ని విశ్లేషించాలి. తర్వాత దాన్ని అన్వయించుకోవాలి. చివరకు ఫలితాన్ని ధ్రువీకరించుకోవాలి. ఇదే అసలైన విద్యా ప్రాముఖ్యత’’ అని నారాయణమూర్తి తెలిపారు. మీరు సినిమాలు చూస్తూ పిల్లలను చదవమంటే ఎలా..? ఈసందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఆయన పలు సూచనలు చేశారు. ‘‘పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ.. పిల్లలను చదువుకోమని చెబితే ఎలా..? మా పిల్లలు అక్షతా, రోహన్ చదువుల కోసం నేను, నా భార్య సుధామూర్తి ప్రతిరోజూ మూడున్నర గంటలు కేటాయించేవాళ్లం. మనం పుస్తకం పట్టుకుంటే మనల్ని చూసి పిల్లలకు కూడా చదువుకోవాలనే ఆసక్తి కలుగుతుంది’’ అని నారాయణమూర్తి వివరించారు.









