Search Results
Search this site
738 results found with an empty search
- కాపాడి లెంప వాయగొట్టాడు
నదిలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు ఉత్తరప్రదేశ్ - సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. అది చూసి అక్కడే ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై వారిని కాపాడారు. వారిని ఒడ్డుకు తీసుకువచ్చాక ప్రియుడిని పనికిమాలిన పని చేశావని ఓ మత్స్యకారుడు చెంప పగలకొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
- AP Politics : వలంటీర్లపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్; మూతపడ్డ స్కూళ్ళు తెరిపిస్తాం!
AP Politics : వలంటీర్లపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్; మూతపడ్డ స్కూళ్ళు తెరిపిస్తాం! వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు ప్రకాశం: వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు. రాజీనామా చేయకుండా ఉన్న వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఒకటో తేదీనే ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేస్తామని మాటిచ్చారు. తన కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈరోజు(ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఒక వరంగా భావిస్తున్నానని అన్నారు. మాది విడతల వారి ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మూతపడిన పాఠశాలలు తిరిగి తెరిపిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు.
- మీ ఆధార్‌ని ఇలా ఫ్రీగా అప్డేట్ చేసుకోండి! మిగిలింది 8 రోజులే!! #AadhaarUpdate
#AadhaarUpdate #AadhaarUpdateFree #AadhaarUpdateLastDate ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించింది. ఒకవేళ గడువు దాటితే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. #AadhaarUpdate #AadhaarUpdateFree #AadhaarUpdateLastDate యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటగా ఆధార్ అప్డేట్ ప్రవేశపెట్టినప్పుడు రూ.50 ఫీజు వసూలు చేసింది. కానీ ప్రస్తుతం ఉచితంగానే అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అప్డేట్లో ఆధార్ వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, వేలి ముద్రలు, ఫోటోగ్రాఫ్ తదితరాలు మార్చుకోవచ్చు. (ఇది కూడా చదవండి : గతి తప్పిన రాష్ట్ర పాలనను సత్వరమే గాడిన పెట్టాలి,ఉద్యోగులకు త్వరగా పీఆర్సీ ప్రకటించాలి : హైకోర్ట్ ఉద్యోగుల సంఘం) ఆధార్ అప్డేట్ ఎందుకు? ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి చేసింది. డేటా కచ్చితమైనదని, తాజా సమాచారమని నిర్దారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడం ద్వారా మోసాలకు చెక్ పెట్టొచ్చు. మహిళలకు వివాహం అయిన తర్వాత పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలు మారుతాయి. పలువురు కొత్త ప్రాంతాలకు మారుతుంటారు. దీంతో చిరునామా, మొబైల్ నంబర్లో మార్పులు అవసరం అవుతాయి. ఇలా రకరకాల కారణంతో మార్పులు అవసరమైన వారు అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్డేట్ ఇలా.. UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి. My Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ట్యాబ్ చేసి Update Your Aadhaar అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆధార్ వివరాలను అప్డేట్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మీరు అప్డేట్ చేయాలకున్న వివరాలను ఎంచుకోండి. కొత్త సమాచారాన్ని జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి. మీ అప్డేట్ వివరాలను ధృవీకరించడానికి అవసరమైన సహాయక పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ప్రక్రియను పూర్తిచేయడానికి Submit Update Request అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అలా మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో యూఆర్ఎన్ (URN) నంబర్ ఇస్తుంది. దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ అప్డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ లింక్ క్లిక్ చేసి నమోదును తనిఖీ చేయిపై క్లిక్ చేయండి ఆఫ్‌లైన్‌లో ఇలా.. ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ను అప్డేట్ చేయడానికి రూ. 50 రుసుము చెల్లించాలి. #AadhaarUpdate #AadhaarUpdateFree #AadhaarUpdateLastDate
- గతి తప్పిన రాష్ట్ర పాలనను సత్వరమే గాడిన పెట్టాలి,ఉద్యోగులకు త్వరగా పీఆర్సీ ప్రకటించాలి : హైకోర్ట్ ఉద్యోగుల సంఘం #apadministration #apprc #apemployees #aphighcourtemployees
#apadministration #apprc #apemployees #aphighcourtemployees 2024 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతి తప్పిన రాష్ట్ర పాలనను కొత్తగా కొలువైన ప్రభుత్వం సత్వరమే గాడిన పెట్టాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నూతన పీఆర్సీని వీలైనంత త్వరగా అమలుచేసి ఈ లోగా తగినంత ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం కోరింది. ఇది కూడా చదవండి:మీ ఆధార్‌ని ఇలా ఫ్రీగా అప్డేట్ చేసుకోండి! మిగిలింది 8 రోజులే!! అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గతి తప్పిన రాష్ట్ర పాలనను కొత్తగా కొలువైన ప్రభుత్వం సత్వరమే గాడిన పెట్టాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన నూతన పీఆర్సీని వీలైనంత త్వరగా అమలుచేసి ఈ లోగా తగినంత ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం కోరింది. ఉద్యోగులకు రావలసిన బకాయిలు సత్వరమే విడుదల చెయ్యాలని హైకోర్ట్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు చీకటి రోజులు తొలగించి, రానున్న రోజుల్లో నూతన ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలని వేణుగోపాల రావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు వైద్య, ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వెయ్యాలని వేణుగోపాలరావు కోరారు.
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పు
APలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన కోర్టు వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అమరావతి: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాలు చేస్తూ వైకాపా ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ‘‘ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులున్నాయి. మెమోల అమలును నిలుపుదల చేయాలి’’ అని పిటిషన్లో కోరారు. పిటిషనర్ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించిన ధర్మాసనం.. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
- ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన
తేది: 23.05.2024 విజయవాడ ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి • తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిపుణుల సహకారంతో ప్రత్యేక వీడియోల రూపకల్పన • మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై శిక్షణా వీడియోలు • వీడియోలో రుచికర, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల వివరణ • రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో అందించే ఆహారం నాణ్యత, రుచిని నిర్ధారించడమే లక్ష్యం • 100 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేటట్లు ప్రోత్సహించాల్సిందిగా డీఈవోలకు ఆదేశం • కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయన్న నమ్మకం • “తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన”లో ఈ అంశం చర్చించేలా సంబంధిత తరగతి ఉపాధ్యాయులదే బాధ్యత :- పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం తినేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ డీఈవోలను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలోని వివిధ వంటకాల తయారీపై గురువారం తిరుపతిలోని తాజ్ హోటల్ వంట నిఫుణుల సహకారంతో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శిక్షణా వీడియోలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న పథకంలో భాగంగా ప్రతి రోజు మెనూ భిన్నంగా ఉండటంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను ఎలా తయారు చేయాలో, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక వీడియోలను రూపొందించామన్నారు. రోజుకొక వీడియో ఉండేలా 6 వీడియోలను రూపొందించి యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశామన్నారు. వీడియోలను ఈ న్యూస్ కింద చూడవచ్చు. రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాలు అందించే 85,000 మంది వంట వాళ్లతో ఈ వీడియోలను డౌన్లోడ్ చేసుకునేలా ప్రధానోపాధ్యాయులకు సూచించాలని డీఈవోలకు ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేని వంట వారికి ప్రతి ఉన్నత పాఠశాల తరగతి గదిలో ఇన్స్టాల్ చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లోని స్మార్ట్ టీవీల ద్వారా పాఠశాల సమయం తర్వాత వీడియోలను ప్రదర్శించి చూపించాలని తెలిపారు. రాష్ట్రంలోని 44,190 పాఠశాలలన్నింటిలోనూ అందించే ఆహారం యొక్క నాణ్యత, రుచిని నిర్ధారించడమే తమ లక్ష్యమన్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 90% మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేస్తుండగా, 10% మంది విద్యార్థులు ఇంటి నుండి టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారని, అది పాఠశాల వాతావరణానికి హానికరమన్నారు. పాఠశాలలో విద్యార్థులంతా కలిసి భోజనం చేయడం, ఆడుకోవడం ద్వారా వారిలో టీమ్ స్పిరిట్, సహచర్యం పెరుగుతాయని తెలిపారు. ఇవి విద్యార్థి భావోద్వేగ మేధస్సు (EQ) యొక్క నాలుగు స్తంభాలలో రెండింటికి (సామాజిక అవగాహన మరియు సామాజిక నిర్వహణ) చాలా కీలకమన్నారు. AI మరియు చాట్‌జిపిటి (ChatGPT) యుగంలో భావోద్వేగ మేధస్సు (EQ) విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆయా లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడం తమ బాధ్యతగా భావించాలన్నారు. టిఫిన్ బాక్స్‌లు తీసుకురావడం వల్ల వారి తోటి విద్యార్థులతో దూరం పెరగడమే గాక వారి భావోద్వేగ మేధస్సు (EQ) పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలపాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 44,190 పాఠశాలలకు గానూ 36,612 పాఠశాలలు 100% మధ్యాహ్న భోజనం వినియోగిస్తుండగా, 5,012 పాఠశాలల్లో 95-99 శాతం, 885 పాఠశాలలు 90-95 శాతం, 439 పాఠశాలలు 85-90 శాతం, 353 పాఠశాలలు 80-85 శాతం, 522 పాఠశాలలు 50-80 శాతం, 60 పాఠశాలలు 30-50, 236 పాఠశాలలు 30% కంటే తక్కువగా ఉన్నాయి. ప్రతి డీఈవో ఈ విద్యా సంవత్సరంలో తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లోని 100% విద్యార్థులు 100% మధ్యాహ్న భోజనం తినేలా చూడటమే లక్ష్యంగా పనియాలని ఆదేశించారు. జూన్ నెలలో జరిగే తల్లిదండ్రుల- ఉపాధ్యాయుల గృహసందర్శన కార్యక్రమంలో ఈ విషయాన్ని చర్చించేలా సంబంధిత తరగతి ఉపాధ్యాయులు చూడాలని తెలిపారు. ............................................................................................................ జారీ చేసిన వారు: సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం మెనూ హాట్ పొంగల్ , వెజ్ పులావ్ తయారీ వీడియో : మంగళ వారం మెనూ పులిహోర, దొండకాయ పచ్చడి, రాగి జావ తయారీ: బుధవారం మెనూ వెజ్ కర్రీ తయారీ విధానం : గురువారం మెనూ పులిహోర, సాంబార్ రైస్ , టొమాటో పచ్చడి తయారీ విధానం: శుక్రవారం మెనూ పప్పు ఆకుకూర తయారీ విధానం : శనివారం మెనూ పప్పు చారు, స్వీట్ పొంగల్ తయారీ విధానం : ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ నొక్కండి. 100 లైకుల టార్గెట్ చేరడానికి సహకరించండి. ధన్యవాదాలు 🙏
- ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు.
ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు AP: విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది. ఫీజు కట్టకపోయినా కట్టినట్లు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంది.
- SSC 2024 రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు విడుదల #SSCrecounting_reverification
#SSCrecounting_reverification మార్చి 2024న జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన విషయం తెలిసిందే ! అలాగే జవాబు పత్రాల రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ దరఖాస్తు కోసం ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ లాగిన్సులో సదుపాయం కల్పించబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక విధానం తీసుకువచ్చింది .ఎవరైతే తమ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క జవాబు పత్రాలను ఈ సంవత్సరం నుంచి డిజిటలైజేషన్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం 55,966 జవాబు పత్రాల రీవెరిఫికేషన్ మరియు రికౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటికే 43,714 జవాబు పత్రాలు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ పూర్తి చేసి ఫలితాలను ఆయా పాఠశాలల లాగిన్ నందు అందుబాటులో ఉంచడం జరిగింది. మిగతా జవాబు పత్రాల ఫలితాలు కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, అందుబాటులో ఉన్న రిజల్ట్స్ ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి లాగిన్స్ నుంచి డౌన్లోడ్ చేసి సాఫ్ట్ కాపీ లేదా ప్రింట్ కాపీలు సంబంధిత విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి దేవానందరెడ్డి తెలిపారు. ఈ క్రింది బటన్ నొక్కి రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలు చూసుకోవచ్చు
- ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? జూన్ 15 వరకు వెయిట్ చేయడం బెటర్ - ఎందుకో తెలుసా? - Income Tax Return Filing
#IncomeTaxReturnFiling #efiling Income Tax Return Filing : 2023-24 ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్నులు ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. జూన్ 15 వరకు ఐటీ రిటర్నులు దాఖలు చేయకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో తెలుసా? Income Tax Return Filing : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చాలా మంది గాబరా పడిపోతుంటారు. మొదటి రోజు నుంచే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఐటీ రిటర్నులు దాఖలు చేసేస్తుంటారు. నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్నులు దాఖలు చేయడం మంచిదైనా, మరీ అంత వేగంగా రిటర్నులు ఫైల్ చేయొద్దంటున్నారు నిపుణులు. జూన్ 15 వరకు వేచి చూసి ఐటీ రిటర్నులు దాఖలు చేయమంటున్నారు. నిపుణులు ఎందుకు అలా అంటున్నారో తెలుసా? గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. జులై 31 ఆఖరి తేదీ. ఈ నేపథ్యంలో ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4, ఐటీఆర్ 5, ఐటీఆర్ 6 ఫారాలను ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఉద్యోగులు మాత్రం జూన్ 15లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు అన్నీ తెలపాల్సి ఉంటుంది. అంటే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఏప్రిల్ 1- మార్చి 31 వరకు జరిపిన మీ అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు, పత్రాలు అన్నీ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి ఉండకపోవచ్చు. ఫారం-16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు వార్షిక ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఫారం 16 కీలకమైన పత్రం. ఉద్యోగి తాను పనిచేస్తున్న సంస్థ నుంచి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫారం 16 అనేది ప్రాథమికంగా ఇచ్చే టీడీఎస్ (మూలం వద్ద పన్ను) సర్టిఫికెట్. సాధారణంగా ఉద్యోగి జీతం నుంచి టీడీఎస్ కట్ చేసినప్పుడు యజమాన్యం ఫారం 16ని అందిస్తుంది. సంస్థ యాజమాన్యం తమ ఉద్యోగి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం, పొందిన మినహాయింపులు, టీడీఎస్ వివరాలతో ఫారం 16ని జారీ చేస్తుంది. కాగా, చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి ఏడాది జూన్ 15 తరువాతనే ఫారం 16ను అందజేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు మరింత ఆలస్యంగా ఫారం 16ను అందిస్తాయి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఫారం 16 ఒక్కటే కాకుండా మరికొన్ని పత్రాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెలవారీ జీతానికి సంబంధించిన రశీదులు, అన్ని అలవెన్సులు, ఫారం 26ఏఎస్, పన్ను మినహాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. మీరు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ పొందుతున్నట్లయితే పొదుపు ఖాతా వడ్డీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, టీడీఎస్ సర్టిఫికెట్లను బ్యాంక్ నుంచి తీసుకోవాలి. ఈ పత్రాలను బ్యాంకులు కొన్ని సార్లు ఏప్రిల్ లేదా మే చివరి నాటికి ఇస్తాయి. అందువల్ల ఎవరైనా ఏప్రిల్‌లో ఐటీఆర్‌ను ఫైల్ చేస్తే, వారు తమ రిటర్న్ ఫైలింగ్‌లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల వివరాలను మాత్రమే అందజేసే అవకాశం ఉంది. అందుకే జూన్ 15 వరకు ఆగడం మంచిది. అప్పుడే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ కింద బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫారం- 26ఏఎస్ అంటే ఏమిటి? ఫారం-26 ఏఎస్ ప్రాథమికంగా టీడీఎస్, టీసీఎస్ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పన్ను క్రెడిట్‌ను సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాయపడుతుంది. కనుక ఈ పత్రాలు అన్నీ సిద్ధం చేసుకున్నాకే, ఐటీఆర్ ఫైల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
- ఏపీలో 5 వేల మంది కాంట్రాక్ట్ టీచర్స్ మెడపై కత్తి #ContractTeachers
#ContractTeachers #ContractTeachersInTrouble ఏపీలో 5 వేల మంది కాంట్రాక్ట్ టీచర్స్ మెడపై కత్తి #ContractTeachers కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. కేజీబీవీలు, భవిత కేంద్రాల్లో ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో 5 వేల మందికిపైగా ఒప్పంద ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఒకరోజు విరామంతో సంవత్సర కాలానికి ఒప్పందాన్ని పొడిగించేవారు. ఈ సారి జూన్ 9 వరకు మాత్రమే పొడిగించారు. ఈ లోపు 2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పనితీరును ఎస్ఎస్ఏ మదింపు చేయనుంది. కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలకు తదితరులకు 20 మార్కులకు పనితీరును అంచనా వేస్తున్నారు.దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం ఉపయోగకరం అనిపిస్తే కిందనున్న హృదయం గుర్తు మీద నొక్కండి. తదుపరి తాజా సమాచారం కొస సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకండి.
- ఇక ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ #employeeregistration
ఇక ఇంటి నుంచే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ ఒంగోలు సెంట్రల్: ఇకపై నిరుద్యోగులు, యువకులు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నుంచి కాక ఇంటి నుంచే చేసుకునే నూతన విధానాన్ని, ప్రత్యేక పోర్ట ల్ను ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భరద్వాజ్ తెలిపారు. గతంలోలా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం నేరుగా కార్యాల యానికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అనుసంధానంతో పది, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు, నిరుద్యోగ యువత సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు అభ్యర్థులు www.employment.ap.gov.in వెబ్సైట్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకో వచ్చని తెలిపారు.
- WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా?#SendMessageWithoutSavingNumberOnWhatsapp
WhatsApp: నంబర్ సేవ్ చేసుకోకుండా వాట్సప్ మెసేజ్‌లు పంపడం ఎలాగో తెలుసా? #SendMessagesWithoutSavingNumberOnWhatsapp ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. #SendMessagesWithoutSavingNumberOnWhatsapp ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు. ఆ తరువాత అతని నంబర్‌తో మీకు పని ఉండకపోవచ్చు. నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్‌లు పంపడం ఎలా అనేది చాలా మందికి తెలియదు. ఉదాహరణకు మీరో ఫొటో స్టూడియోకి వెళ్లారనుకోండి.. అక్కడ మీ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కోసం సదరు ఫొటో స్టూడియో యజమాని నంబర్ని తీసుకుంటారు. అనంతరం సేవ్ చేసుకుని ఫొటోని వాట్సప్ చేస్తారు. తరువాత ఆ నంబర్‌తో మనకు పని ఉండకపోవచ్చు. గతంలో నంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సప్ చాట్ చేయగలిగే వాళ్లం. కానీ, వాట్సప్ సర్చ్ బార్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ సమస్య తీరిపోయింది. దీని గురించి సింపుల్‌గా తెలుసుకుందాం వాట్సప్‌ని ఓపెన్ చేయండి ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. నంబర్ని కాపీ చేయండి. అనంతరం సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్ని పేస్ట్ చేయండి. ఆ నంబర్‌పై వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని నంబర్ సేవ్ చేసుకోకుండానే షేర్ చేయొచ్చు











