top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం: జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం

    అతి త్వరలో మునిసిపల్ డి.డి.ఓ లకు శిక్షణ ఇస్తాం: జేడీ సర్వీసెస్ శ్రీ ఎం.రామ లింగం ఈరోజు ఉదయం ఆర్.జే.డీ. లు, డీఈవోలు, మున్సిపల్ హెచ్ఎంలు, ఎంఈఓ లతో జరిగిన వెబెక్స్ మీటింగ్లో ముఖ్యంశాలు: విద్యాశాఖ గతంలో మునిసిపల్ స్కూల్స్ అకడమిక్ అంశాలు మాత్రమే చూసేవాళ్ళం. ఇపుడు నిర్వహణ, పర్యవేక్షణ కూడా విద్యాశాఖ చూస్తుంది. అన్ని యాజమాన్యాలు ఒక్కటే. అకడమిక్ అంశాలు అన్ని స్కూల్స్ కి వర్తిస్తాయి. నాన్ అకడమిక్ అంశాలను ఏ.పి.ఎం.లు చూస్తారు. మున్సిపల్ పాఠశాలల్లో టీచర్స్, సౌకర్యాల కొరత వుంది. దాన్ని మనం సరి చేయాలి. మున్సిపల్ పాఠశాలలో కూడా జీవో 117 ప్రకారం రేషన్లైజేషన్ చేయాలి. వారం లోపు వివరాలన్నీ పూర్తి చేసి ఇవ్వాలి. ఉపాధ్యాయుల సర్దుబాట్ల గురించి ఆలోచించే అంశంలో ఒకే ప్రదేశంలో ఉన్న జిల్లా పరిషత్ & మున్సిపల్ స్కూల్స్లోని పరిస్థితిని కూడా బెరీజు వేయాలి. మెడికల్ bils, ఎన్.ఓ.సి. ప్రతిపాదనలు కూడా ఆన్ లైన్ ద్వారా నే పంపాలి. మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు ఉంటే కలెక్టర్ లతో సంప్రదించి పరిష్కారానికి కృషి చేయాలి. డి.డి. ఓ.లకు జిల్లా వారీగా శిక్షణ ఇస్తాము. పాఠశాలలను ఖజానా శాఖలో మ్యాపింగ్ చేయాలి. సర్దుబాట్లు చేస్తాము. మిగులు సిబ్బందిని ఇతర స్కూల్స్ లో సర్దుబాటు చేస్తాము. దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తాం. జి.పి.ఎఫ్. ఎన్నాళ్ళ నుంచో వున్న సమస్య... తెల్లారే అయ్యేది కాదు. సమస్య పరిష్కారానికి మా వంతు సత్వరంగా కృషి చేస్తాం.. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, స్కూల్స్ కి వర్తించే సౌకర్యాలు, అంశాలు అన్ని మీకు కూడా వర్తింప చేస్తాము. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశాలలో వివాదాలు లేకుండా... లిఖీత పూర్వకమైన సూచనలు జారీ చేస్తాం. హైస్కూల్ కి హెచ్.ఎం.లుగా గెజిటెడ్ బదులు ఎస్.ఏ.లు వుంటే.. జిల్లా పరిషత్ స్కూల్లో పాటించే విధంగానే చేస్తాము... ఇంక్రిమెంట్లు, అరియర్స్ డి. డి. ఓ.లే మంజూరు చేయొచ్చు. ఈ అంశాలపై డిడిఓ లకు అతి త్వరలో తగిన శిక్షణ ఇస్తాం. మున్సిపల్ ఉపాధ్యాయులు అదనంగా వచ్చి చేరడం వలన కొన్ని మండలాల్లో ఎం.ఈ.ఓ.లకు పని భారం - విషయంలో ఆలోచించి పని భారం తగ్గించే విధంగా తగు నిర్ణయం తీసుకుంటాం. స్కూల్స్ కనుక అద్దె భవనాల్లో వుంటే... మేనేజ్మెంట్ మున్సిపాలిటీ కాబట్టి వారే చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ కేవలం నిర్వహణ, పరిరక్షణ మాత్రమే చేస్తున్నాం. అవి మున్సిపల్ పాఠశాలలే. కరెంటు బిల్లులు లాంటివి స్కూల్ గ్రాంట్ నుంచే కట్టుకోండి. పాఠశాల వారిగా ఉపాధ్యాయుల కొరత, ఇతర అవసరాలు, సర్దుబాటులపై పూర్తి వివరాలు సేకరిస్తాం... పదోన్నతులు, ఫారిన్ సర్వీస్ లాంటి ఇతర అంశాల్లో సర్వీస్ నిబంధనలు రూపొందించిన తర్వాత పరిష్కారం దొరుకుతుంది. మున్సిపల్ మేనేజ్మెంట్ తో అన్ని అంశాల్లో సర్దుబాటు ధోరణిలో వ్యవహరించండి.. పాతవి అయినా సెలవులు లాంటి నమోదులు డి.డి.ఓ.లుగా చేయొచ్చు... స్కూల్స్ లో అవసరమైన పోస్టుల విషయలో 117 జి. ఓ. చదవండి. దాని ప్రకారం చేస్తాం. సోషల్ మీడియాలో ఇష్టారీతి గా పోస్టింగులు చేయకండి: యూనియన్ బాధ్యులు అయినా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం వద్దు. ఇష్టారీతీ గా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దు. సి.సి. ఏ. రూల్స్ ప్రకారం తీవ్ర చర్యలు వుంటాయి. మీరు డీఈవో ల కంట్రోల్ లో ఉన్నారని మర్చిపోవద్దు. మనసులో భావాలు మనసులోనే దాచుకొండి క్లర్క్ లు విషయంలో జిల్లా పరిషత్ పాఠశాలలకు వర్తించే విధంగానే మీకు కూడా చేస్తాం.. మంజూరైన నాన్ టీచింగ్ పోస్టులు ఉంటే వాళ్ళను మన దగ్గరే ఉంచాలి. వాళ్ళ జీతాలు మనమే చేయాలి. All Deputations should be cancelled. as per G.O. 84... జీతం ఏ పాఠశాలలో పనిచేస్తున్నారో అదే పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విధులు నిర్వహించాలి. ఆస్తులన్నీ మున్సిపాలిటీకి చెందినవే అది గుర్తుంచుకోండి. అన్ని అంశాలను సానుభూతితో సత్వరంగాగా పరిష్కరిస్తారని ప్రయత్నం చేస్తాం. మీ సర్వీసులను ఏకీకృతం చేయడం లేదు. మీ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం లేదు. కేవలం నిర్వహణ, పర్యవేక్షణ మాత్రమే తీసుకున్నాం.. ఇది మరీ మరీ గుర్తుంచుకోండి. ఒక జి. ఓ. రావడానికి ఎంతో మంది అధికారులు శ్రమిస్తేనే వస్తుంది, ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమిస్తేనే వస్తుంది. జి.ఓ. 84 కూడా అలాగే వచ్చింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల మరియు పాఠశాలల వలెనే మున్సిపల్ పాఠశాలలను కూడా చూస్తాము, సమస్యలను పరిష్కరిస్తాము. కాస్త ఓపికతో, సంయమనంతో వ్యవహరించి సహకరించండి... అని శ్రీ ఎం.రామలింగం సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు మున్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ లు డిప్యూటీ డిఈవోలు లేవనెత్తిన సందేహాలను శ్రీ రామలింగం నివృత్తి చేశారు.

  • IMMS యాప్ లేటెస్ట్ అప్ డేట్ లింక్

    ప్రభుత్వ పాఠశాల నిర్వహణలో భాగంగా మధ్యాహ్నం భోజన పథకం మరియు మరుగుదొడ్ల పరిశుభ్రత నిర్వహణలో ప్రతిరోజు పాఠశాలలో వినియోగించే ఐఎంఎంఎస్ యాప్ యొక్క లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ ప్లే స్టోర్లో అందుబాటులో కలదు. మీరు ఇప్పటివరకు ఈ యాప్ అప్ డేట్ చేసివుండకపోతే క్రింది లింకు క్లిక్ చేసి యాప్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే అప్ డేట్ చేసివుంటే క్లిక్ చేయనవసరం లేదు. https://play.google.com/store/apps/details?id=com.ap.imms Like, comment and share

  • డీఏ ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు DA విడుదల ప్రకటన చేసింది. వచ్చే 2023 జనవరి నుంచి ఒక డీఏ విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంగీకరించారనిప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు వెంకటరామిరెడ్డి ప్రకటన చేశారు. పీఆర్‌సీలో నష్టపోయిన ఉద్యోగులు ఎంతోకాలంగా డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఈ వార్త పెద్దగా సంతోషించదగ్గది కాకపోయినా గుడ్డిలో మెల్ల నయం అన్నట్లు ఎంతో కొంత ఆర్ధిక ప్రయోజనం కలిగించేదిగా కాస్త ఉపశమనం కలిగించే వార్తగా చెప్పుకోవచ్చు . 2023 జనవరి నుంచి ఒక డీఏ విడుదల చేస్తే మిగతావి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న ఆందోళనలో సందేహాస్పదంగా ఉన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం. ఉద్యోగులకు జనవరిలో డీఏ ఏప్రిల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీలు గ్రేడ్-3 సర్వేయర్లకు గ్రేడ్-2గా పదోన్నతి సీఎం జగన్ భరోసా ప్రభు త్వ ఉద్యోగులకు జనవరిలో ఒక డీఏను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాల యాల్లో పనిచేస్తున్న గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2గా మార్పు. చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ గవర్న మెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఆధ్వర్యంలో శుక్ర వారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉద్యోగుల కు రావలసిన డీఏలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించి వచ్చే ఏడాది జనవరి నుంచి ఒక డీఏ మంజూరు చేస్తామని చెప్పా రు. గ్రామ వార్డు సచివాలయాల లో పనిచేస్తున్న గ్రేడ్ -3 సర్వేయ ర్లను గ్రేడ్-2 గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కి గ్రామ సర్వేయర్ల తరుపున ఏపీజీ ఈ ఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా గ్రామ, వార్డు ' సచివాలయాలలో పని చేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల పూర్తి భాద్యతలు కేటాయించే ప్రతిపాదనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ లో జరగవలసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వాయిదాపడినట్లు వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా బదిలీలు జరిపించాలని కోరారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ ఏప్రిల్ లో బదిలీలకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కిషోర్, భవనం వెంకట రామిరెడ్డి, కావ్య దీప్తి తదితరులు పాల్గొన్నారు.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే అప్ డేట్ చేసుకోండి !

    School Attendance App ఈరోజు (నవంబర్ 24 ) 2.1.6 versionకి update అయ్యింది, పాత యాప్ పనిచేయదు. ఈ కొత్త Updated Version ప్రకారం Nov 28 నుండి స్టూడెంట్స్ Attendance ను ఉదయం 8.30am నుండి 10.30am లోపు మాత్రమే క్యాప్చర్ చేయగలం. Update latest version School attendance app APP Click below link https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance

  • 25 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగుల వివరాలు సేకరణ: డాక్యుమెంట్లు: ఎందుకు సేకరిస్తోంది? వివరణ.

    పెన్షన్ నిర్ణయ జాప్యం నివారించుటకు 25 years service పూర్తి చేసుకున్న ఉద్యోగులు అందరూ తమ SR లను AG తో వెరిఫై చేయించుకోవాలన్న ఉత్తర్వులు: సందేహం: ప్రభుత్వం - ఖజానా శాఖ ద్వారా 25 సం"ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాలు, ఎందుకు సేకరిస్తున్నారు,/ రిటైర్మెంట్ కు ఇంకా చాలా సమయం వున్న SR ను అప్పుడే AG ఆఫీస్ (Accountant General) కి పంపాలి అంటున్నారు దేనికోసం..!? వివరణ:- నిన్నటి దినం, రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు - రాష్ట్రంలో 25 సం"ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల సమాచార నిమిత్తం.. 👉 రిటైర్డ్ అయిన ఉద్యోగుల, పెన్షన్ fixation ఆర్డర్స్ (first pay) జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి. 👉 25 సం" ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల వివరాల ద్వారా రిటైర్మెంట్ దగ్గర వున్న ఉద్యోగుల సంఖ్య, ఏ సంవత్సరం ఎంత మంది రిటైర్డ్ అవుతారు అనే సమాచార నిమిత్తం. 👉 ఇలా నిక్షిప్తం చేసిన సమాచారం ద్వారా రిటైర్మెంట్ తేదీకి, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచే ఫస్ట్ పే పెన్షన్ ఆర్డర్ ఇవ్వడానికి. ఆ విధంగా సాఫ్ట్వేర్ ను వృద్ధిపరిచి అందుబాటులో ఉంచుతారు. 👉 నిర్ధిష్టంగా భవిష్యత్ కాలంలో రిటైర్డ్ అయ్యే వారి సౌలభ్యం కోసం మాత్రమే... డాక్యుమెంట్లు

  • సీసీఈ మార్కుల గ్రేడింగ్ టేబుల్ CCE MARKS GRADING TABLE

    సీసీఈ మార్కుల గ్రేడింగ్ టేబుల్ CCE MARKS GRADING TABLE అన్ని పరీక్షల అన్ని సబ్జెక్టుల మార్కుల యొక్క గ్రేడింగ్ ఈ పట్టికలో చూడవచ్చు. గ్రేడ్లు స్పష్టంగా కనిపించకపోతే ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.

  • బదిలీ ఉత్తర్వులు కోరుతూ సీఎంకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేఖ..

    బదిలీ ఉత్తర్వులు కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖలో రెండులక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుల బదిలీలు చేపడతామని అధికారులు, సంబంధిత మంత్రులు వేసవి సెలవుల నుండి అనేక పర్యాయాలుగా ప్రకటిస్తున్నారు. కానీ నేటికీ సంబంధిత ఉత్తర్వులు విడుదల కాలేదు. సంబంధిత పైలు ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందినందున బదిలీల ఉత్తర్వులు జారీ చేయుటకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాము. అని శాసనమండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు

  • Revised schedule for formative and summative assessments by SCERT AP

    Revised schedule for formative and summative assessments by SCERT AP. ఈనెల అనగా నవంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల డిసిఇబి సెక్రటరీలతో SCERT డైరెక్టర్ డి ప్రతాపరెడ్డి వెబెక్స్ మాధ్యమం ద్వారా ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించు పరీక్షల యొక్క షెడ్యూల్ను పైన చూపించిన చిత్రంలో గమనించవచ్చు. ఈ సమావేశంలో అన్ని పూర్వ అవిభాగ్య జిల్లాల డిసిఇబి కార్యదర్శుల నుంచి ఆంధ్రప్రదేశ్ పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై అభిప్రాయాలను స్వీకరించారు. కొచ్చిన్ పేపర్స్ విషయంలో ప్రాక్టికల్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి గాను గత విద్యా సంవత్సరంలో వలె ఎఫ్ఏ వన్ పరీక్షలకు ఏ విధంగా అయితే వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్లు పంపించారో అదేవిధంగా ఈ సంవత్సరం ఎఫ్ ఏ2 మరియు 4 లకు ప్రశ్నాపత్రాలను వాట్సాప్ లో పంపిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష పత్రాన్ని పరిచయం చేయుటకు గాను 9వ తరగతి విద్యార్థుల పరీక్షా పత్రాల బ్లూ ప్రింట్ 10వ తరగతి బ్లూ ప్రింట్ లాగానే ఉంటుంది. ఎఫ్ఏ3 ని CBA2 గాను, ఎస్ఏ2 ను CBA3 గాను నిర్వహిస్తారు.

  • ఉద్యోగ సంఘాలకు కొత్త రూల్స్ కోసం అధికారుల సమావేశం: ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం.

    ఉద్యోగ సంఘాలకు కొత్త రూల్స్ కోసం అధికారులతో సమావేశానికి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు సేవా సంఘాల యొక్క నియమాలు మార్చి కొత్త నియమాలు ప్రవేశ పెట్టుటకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ -ఉద్యోగుల సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఆహ్వానం అందింది. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారి కార్యాలయం నందు రూమ్ నెంబర్ 134 లో గ్రౌండ్ ఫ్లోర్ ,బిల్డింగ్ నెంబర్ 4, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతిలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో అధికారుల సమావేశం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో 2001 ఉద్యోగ సంఘాల పునవ్యవస్థీకరణపై అధ్యయనం చేసి ఆ స్థానంలో కొత్తగా పునవ్యవస్థీకరణ చేసి కొత్త నియమాలు ప్రవేశపెట్టడంపై సమావేశం జరుగుతుంది. ఏపీటీఎఫ్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆఫర్స ఉన్నాయి ఈ సమావేశానికి గుర్తింపు పొందిన సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానం అందుకున్న సంఘాలలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టీయూ, యూటీఎఫ్, పి ఆర్ టి యు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం,ఏపీటీఎఫ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ,ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆపస్ ఉన్నాయి. ఏపీ టీచర్స్ టీవీ

  • ఇక సీఎఫ్ఎంఎస్ ఐడీనే ఏపీజీఎల్ఐ నెంబర్!

    APGLI కి CFMS ID నే నంబరుగా ఇచ్చే అవకాశం ఉన్నందున నూతన పాలసీల జారీ తాత్కాలికంగా నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • ప్రభుత్వ వినూత్న పథకాలతో 6 లక్షల మంది విద్యార్థులు పెరిగారు...కానీ 13 వేలకు పైగా SGT లు surplus

    ప్రభుత్వ వినూత్న పథకాలతో 6 లక్షల మంది విద్యార్థులు పెరిగారు...కానీ 13 వేలకు పైగా SGT లు surplus అయ్యారు - AP ప్రభుత్వం 🫣

  • సీబీఏ ఎఫ్ఏ 1 పరీక్షల కీ విడుదల చేసిన ప్రభుత్వం.1st to 8th CBA -1 OFFICIAL KEY RELESED BY AP SCERT

    సీబీఏ ఎఫ్ఏ 1 పరీక్షల కీ విడుదల చేసిన ప్రభుత్వం.1st to 8th తరగతుల CBA -1 OFFICIAL KEY RELESED BY AP SCERT: ఈనెల అనగా నవంబరు 2022 2,3,4 తారీకులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతట ప్రభుత్వ పాఠశాలలో సాల్ట్ పథకంలో భాగంగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1 పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఎప్పుడు లేనంత కఠినంగా పరీక్ష పత్రాలు రావడం పిల్లలు తెల్ల మొహాలు వేయడం ఉపాధ్యాయులు గందరగోళంపడి ఈ పరీక్షలపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆఫ్లైన్లోనూ చర్చలు లేవడం విదితమే! ఈ పరీక్షలు సాల్ట్ పథకంలో భాగంగా ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన విషయం విదితమే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నిటిని సీబీఎస్ఈ పాఠశాలలుగా మార్చాలనుకుంటున్న నేపథ్యంలో ఈ పరీక్షలు సీబీఎస్ఈ పేటర్న్ లో నిర్వహించారా అని అనుమానాలు ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంటున్నాయి. సిలబస్ లో లేని ప్రశ్నలు, విద్యార్థుల స్థాయికి మించిన ప్రశ్నలతో ఈ పరీక్షలు మానసికంగా ఇబ్బందికి గురి చేశాయని అనుకుంటున్నారు. CBA -1 OFFICIAL KEY RELESED BY AP SCERT FROM 1 TO 8 CLASS. key డౌన్లోడ్ చేయడానికి కింద నొక్కండి.

bottom of page