top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • ఆ 23 మంది మహిళా ఉపాధ్యాయినిలపై తీసుకున్న చర్యలు పునః సమీక్షించండి:

    ఆ 23 మంది మహిళా ఉపాధ్యాయినిలపై తీసుకున్న చర్యలు పునః సమీక్షించండి:- ఉపాధ్యాయ MLC కత్తి నరసింహారెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహిళా ఉపాధ్యాయినిలపై శనివారం నాడు అన్నమయ్య జిల్లా DEO గారు తీసుకున్న చర్యలను పునః సమీక్ష చేసి నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ MLC కత్తి నరసింహారెడ్డి విన్నవించారు. 117 G.O తో ఒక గందరగోళ వాతావరణం పాఠశాల స్థాయిలలో ఏర్పడటం, రేషనలైజేషన్, బదిలీలు ఒకవైపు పాఠశాలల విలీనం మరోవైపు ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఒక సందిగ్ధత ఉన్న ఈ సమయంలో స్కూల్ రెడీనెస్ పై అవగాహన లేదనే కారణంతో ఇంక్రిమెంట్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం లాంటి చర్యలు వెనక్కి తీసుకోవాలని కత్తి నరసింహారెడ్డి గారు RJD గారిని DEO గారిని కోరడం జరిగింది.

  • 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి

    1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని 17.3.2022 న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ముఖ్యమంత్రి కి చేసిన ప్రాతినిధ్యం పై తదుపరి చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు. వివరాలకు కింది వీడియో చూడవచ్చు.

  • Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్‌

    AP TEACHERS TV: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండేషన్‌ పాఠశాలల నుంచి హైస్కూల్‌ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్‌ క్యాలెండర్‌లోని లెసన్‌ ప్లాన్‌ ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది. జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 20/25, అక్టోబర్‌లో 19, నవంబర్‌లో 25, డిసెంబర్‌లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్‌మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6వరకు, క్రిస్‌మస్‌ సెలవులు డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. స్క్లూళ్ల సమయాలివీ.. ఫౌండేషన్‌ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్‌ తరగతులకోసం ఆప్షనల్‌ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు, 6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్‌ పీరియడ్‌ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్‌ బెల్‌ ఉంటుంది. సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్‌ లవ్‌ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్, కెరీర్‌ గైడెన్సు, మాస్‌ డ్రిల్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్, వర్క్‌ ఎడ్యుకేషన్, హెల్త్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్, స్కూల్‌ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు.

  • విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

    విద్యాశాఖలో నాడు-నేడుపై సీఎం జగన్‌ సమీక్ష ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై సీఎం జగన్‌ చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని, ఆ ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు.. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. ►అలాగే తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ►దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి: ►విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామన్న అధికారులు. ►ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం ఆదేశం ►తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్న సీఎం ►బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలన్న సీఎం ►ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం ►వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయన్న సీఎం ►వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది ►స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. ►డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి ►దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలి ఈ సమీక్షా సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • 1.7.2018 తర్వాత రిటైర్ అయిన వారి సర్వీస్ /ఫ్యామిలీ పెన్షన్ ప్రొపోజల్స్ జీఓ

    1.7.2018 తర్వాత రిటైర్ అయిన వారు తమ సర్వీస్ /ఫ్యామిలీ పెన్షన్ ప్రొపోజల్స్ AG ఆఫీస్ కు పంపుకునేందుకు ఆర్థిక శాఖ నుండి వెలువడిన ఉత్తర్వులు.

  • అమ్మఒడి కార్యక్రమం... లైవ్ తప్పక చూడండి.

    అమ్మఒడి కార్యక్రమం... లైవ్ తప్పక చూడండి https://youtu.be/UXGb4lcTLl4

  • అక్టోబర్ 2005లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొంది మార్చి 2006లో విధుల్లో చేరిన టీచర్స్ సీనియారిటీ

    అక్టోబర్ 2005 లో స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఉత్తర్వులు పొంది ,మార్చి 2006 లో సంబంధిత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా చేరినటువంటి ఉపాధ్యాయుల సీనియార్టీ 24. 10. 2005 నుంచి పరిగణిస్తూ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు.

  • డీఎస్సీ 1998 అన్నిజిల్లాల మెరిట్ జాబితాలు

    డీఎస్సీ 1998 అన్నిజిల్లాల మెరిట్ జాబితాలు

  • DSC -1998 Memo for appointments as MOST URGENT: Spl.Chief Sec.Sri.B.Rajasekar

    DSC -1998 Memo for appointments as MOST URGENT: Spl.Chief Sec.Sri.B.Rajasekar Download G.O by pressing on picture

  • 1998 డీఎస్సీ వారిని 1, 2 తరగతులకు నియమిస్తారు

    రాష్ట్రంలో ఉన్న 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు తెలియయజేయునది ఏమనగా ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని విజయనగరము క్వాలిఫైడ్ మిత్రులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ రాజగోపాల్ నాయుడు సిహెచ్ మల్లేశ్వరరావు లు కలవడం అయినది మంత్రి చెప్పేది ఏమనగా మీరంతా వయసు పైబడినవారు కాబట్టి మీకు ఇటువంటి మెంటల్ వయసు పైబడినవారు కాబట్టి మీకు ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు 1, 2 తరగతులు ఉన్నటువంటి పాఠశాలల్లో మిమ్ములను కాంట్రాక్ట్ టీచర్లుగా ప్రభుత్వము నియమిస్తుంది అని మంత్రివర్యులు చెప్పడం జరిగింది

  • ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరు తప్పక టెట్(TET) ఉత్తీర్ణత కావాలి

    ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరు తప్పక టెట్(TET) ఉత్తీర్ణత కావాలంటూ తాజా ఉత్తర్వు విడుదల... School Education Department – AP TET – 2022 – Ensure that all the teachers who are working under Private Un-aided Schools / Aided Schools must qualify Teacher Eligibility Test - Certain Instructions

  • 23 జూన్ 2022 లైబ్రరీ ట్రైనింగ్ తర్వాత సబ్మిట్ చేయవలసిన అటెండెన్స్ ఫారం

    ✓ లైబ్రరీ నిర్వహణపై అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు నేడు అనగా 23-06-2022 తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి 5-30 వరకు ✓ ట్రైనింగ్ తర్వాత సబ్మిట్ చేయవలసిన అటెండెన్స్ ఫారం లింక్(5 PM తర్వాత 👇👇 https://zfrmz.com/eSowwJeC1F5ag9VROzSE

bottom of page