Search Results
Search this site
738 results found with an empty search
- Diabete and obesity: రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే మధుమేహం
పరిశోధన నిర్వహిస్తున్న ఉల్లాస్, పరిశోధక విద్యార్థి ఎస్.గంగూలీ అతిగా టీ, కాఫీలు తాగితే మధుమేహం వస్తుందని, తరచూ శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి. టీ, కాఫీ, శీతలపానీయాలతో వాటిపై తీవ్ర ప్రభావం టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల వెల్లడి అతిగా టీ, కాఫీలు తాగితే మధుమేహం వస్తుందని, తరచూ శీతల పానీయాలు తీసుకుంటే ఊబకాయం బారిన పడతారని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి. వీటికి కొనసాగింపుగా... రోజుకు రెండుసార్లు చక్కెరతో టీ, కాఫీలు తాగితే మధుమేహంతోపాటు ఊబకాయం వస్తుందని, శీతలపానీయాలు తీసుకుంటే ఊబకాయానికి అదనంగా టైప్-2 మధుమేహం వస్తుందని హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) పరిశోధకులు ఫ్రొఫెసర్లు ఉల్లాస్ ఎస్.కొల్తూర్, మహేందర్ హెచ్చరిస్తున్నారు. వారు మాట్లాడుతూ... ‘‘టీ, కాఫీ, శీతలపానీయాల వినియోగంపై చాలా అధ్యయనాలున్నా మేం మరిన్ని సూక్ష్మ అంశాలను తెలుసుకునేందుకు రెండేళ్లపాటు ప్రయోగాలు చేశాం. వేర్వేరు జాతుల ఎలుకలను తీసుకుని... కొన్నింటికి రోజుకు నాలుగైదుసార్లు చక్కెర కలిపిన 100 మిల్లీలీటర్ల టీ, కాఫీ, శీతలపానీయాలను ఇచ్చాం. మరికొన్నింటికి ప్రతి మూడు గంటలకు ఒకసారి ఇచ్చారు. వీటి రక్త నమూనాలను పరీక్షించగా... అన్ని ఎలుకల్లోనూ మధుమేహం, ఊబకాయ లక్షణాలు కనిపించాయి. ఈ ప్రయోగ ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసిన గ్లోబల్ డైటరీ డేటాబేస్‌తో సరిపోల్చారు. మా పరిశోధనపత్రం ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ’ ప్రచురించింది. టీ, కాఫీ, శీతలపానీయాల్లో ఉండే సుక్రోజ్ కారణంగా కాలేయం, కండరాలు, చిన్నపేగులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తేలింది. టీ, కాఫీలను చక్కెర లేకుండా తాగేందుకు ప్రయత్నించాలి. శీతల పానీయాలను తీసుకోకుండా ఉండటమే మేలు’’ అని వివరించారు
- అది ఆట కాదు.. కన్నీటి గాధ
బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడి విలవిల ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావంతో భారీగా రుణాలు అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు బెట్టింగ్ యాప్‌లు యువత ఉసురు తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. సినీ, టీవీ తారలు, సామాజిక సేవకుల ముసుగులో ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని రూ.లక్షలు సంపాదించామని నోట్ల కట్టలను చూపుతూ వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీటికి ఆకర్షితులై ఎంతోమంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆడుతున్నారు. కొందరు రుణ యాప్‌లను ఆశ్రయించి ఆ ఉచ్చులో చిక్కుతున్నారు. చివరికి అసలు, వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో రెండేళ్లలో సుమారు 10 మంది బెట్టింగ్ ఉచ్చులో పడి బలవన్మరణం చెందినట్లు అంచనా. ఆయా కుటుంబాలు బిడ్డల జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు ఉబికివస్తున్నాయి. కడుపుకోత మిగిల్చాడు బాలానగర్ వినాయకనగర్‌కు చెందిన డి.తరుణ్‌రెడ్డి(21) బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రముఖ వర్సిటీలో సీటు సంపాదించాడు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగా రూ.6 లక్షల ప్యాకేజీతో కొలువు లభించింది. తల్లిదండ్రులు పొంగిపోయారు. ఇంజినీరింగ్ చదివేటప్పుడు సరదాగా మొదలైన ఆన్‌లైన్ బెట్టింగ్‌లు అలవాటుగా మారాయి. రెండేళ్లుగా పందేలు కాసేందుకు క్రెడిట్ కార్డుతో రూ.3 లక్షలు.. వ్యక్తిగత రుణం రూ.4 లక్షలు తీసుకొని నష్టపోయాడు. అప్పులన్నీ తీర్చిన తండ్రి కొడుకుని సున్నితంగా మందలించాడు. గతేడాది డిసెంబర్‌లో అప్పులు తీరగానే.. ఈ ఏడాది జనవరి 13న బెట్టింగ్‌లతో క్రెడిట్ కార్డుతో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులకు తెలిసేలోగా.. జనవరి 22న ఉరేసుకున్నాడు చితికిపోయి.. కొడుకుని కోల్పోయి గుడిమల్కాపూర్‌కు చెందిన బాలకృష్ణ కుమారుడు శీలం మనోజ్ గతేడాది దుండిగల్‌లోని కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఆన్‌లైన్ బెట్టింగులకు దగ్గరయ్యాడు. సులువుగా డబ్బు సంపాదించవచ్చంటూ మనోజ్‌ను రొంపిలోకి లాగారు. రుణయాప్‌లు, ఇతర మార్గాల్లో అప్పులు చేశాడు. సొమ్మంతా నష్టపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. నెల వాయిదాలు చెల్లించట్లేదంటూ ఒత్తిడి చేయడం.. అప్పుల విషయం బయటకు తెలిస్తే బంధువుల్లో పరువు పోతుందని భావించాడు. మనస్తాపంతో గతేడాది ఫిబ్రవరి 26న ఉరేసుకొని చనిపోయాడు. మనోజ్ చేసిన రూ.5 లక్షల అప్పును తండ్రే తీర్చాడు. ఆర్థికంగా చితికిపోయి.. కొడుకును కోల్పోయి తల్లిదండ్రులు కన్నీటి మధ్య జీవనం సాగిస్తున్నారు. ఎదిగిన బిడ్డలు చేసిన తప్పులు కన్నవారిని మనోవేదనకు గురిచేస్తాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డకు దూరమై కోలుకోలేని తల్లి ఎదిరే కొమరయ్య, లక్ష్మి దంపతులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోచమ్మబస్తీలో ఉంటారు. సాయికిరణ్(21) ఏకైక సంతానం. తల్లి కూలీకెళుతూ.. తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. కుమారుడిని నారాయణగూడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలో చేర్చారు. రూ.1.50 లక్షల బైక్ కొనిచ్చారు. ఏడాది క్రితం స్నేహితుల ప్రభావంతో బెట్టింగ్ యాప్‌లకు దగ్గరయ్యాడు. రూ.2 లక్షలు అప్పు చేశాడు. బైక్ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. తప్పటడుగు వేశాడని గ్రహించిన తల్లిదండ్రులు రూ.రెండు లక్షల అప్పు తీర్చారు. బుద్ధిగా చదుకోమని చెప్పారు. బెట్టింగ్ వ్యసనంతో మరోసారి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. బైక్ తాకట్టు పెట్టాడు. చేసిన అప్పులు.. కన్నవారి మనోవేదన చూసి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుంగిపోయిన తల్లి మూడు నెలలుగా మంచానికే పరిమితమైంది. భార్య ఆలనాపాలనా చూస్తున్నాడు. అప్పులన్నీ తీరుస్తాం బిడ్డా.. నువ్వు ఆగం కావొద్దని చెప్పినా ఇట్టా చేసుకున్నాడని సాయికిరణ్ అమ్మమ్మ బాలమణి కన్నీరుమున్నీరయ్యారు.
- Gold: బంగారం కొందాం ఈటీఎఫ్ రూపంలో
శుభకార్యం, పండగలు సందర్భం ఏదైనా సరే బంగారం గురించే ఆలోచన. ఆభరణాల రూపంలోనూ.. పెట్టుబడిగానూ ఇది ఎంతో ప్రత్యేకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా ప్రపంచమంతా నమ్మే విశ్వసనీయ మదుపు పథకం శుభకార్యం, పండగలు సందర్భం ఏదైనా సరే బంగారం గురించే ఆలోచన. ఆభరణాల రూపంలోనూ.. పెట్టుబడిగానూ ఇది ఎంతో ప్రత్యేకం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా ప్రపంచమంతా నమ్మే విశ్వసనీయ మదుపు పథకం. ఇటీవలి కాలంలో పసిడి ధర పెరుగుతుండటంతో చాలామంది బంగారంలో మదుపు చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తంతోనూ పసిడిలో మదుపు చేసేందుకు వీలు కల్పించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్ల (గోల్డ్ ఈటీఎఫ్) గురించి తెలుసుకుందాం. బంగారం పది గ్రాముల ధర రూ.90వేలకు మించి పోయింది. దీంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. భవిష్యత్తు అవసరాల కోసం బంగారాన్ని కూడబెట్టాలనే ఆలోచనా పెరిగింది. వైవిధ్యమైన పెట్టుబడులు ఎప్పుడూ శ్రేయస్కరమే. ఇందులో బంగారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనేందుకే ఇష్టపడతారు. శుభకార్యాలు, ఇతర అవసరాల సందర్భంలో ఇది తప్పనిసరి. ఆభరణాలు, నాణేలు, ఇతర రూపాల్లోనే కాకుండా.. పెట్టుబడి దృష్టితో, చిన్న మొత్తంతో బంగారం కొనాలి అనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. దేశీయ బంగారం ధరలకు దగ్గరగా ఉంటూ.. చిన్న మొత్తంలోనూ పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించేవే గోల్డ్ ఈటీఎఫ్‌లు. వీటిలో మదుపు చేయడం అంటే.. బంగారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో కొనడం అన్నమాట. డీమ్యాట్ ఖాతా ఉన్నవారు వీటిని యూనిట్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. కావాలనుకున్నప్పుడు వెంటనే అమ్మొచ్చు. పసిడిలో సులభంగా లావాదేవీలు నిర్వహించేందుకు ఇవి ఒక సులభమైన మార్గంగానూ అనుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ కొన్నారంటే మదుపరులు ఆ మేరకు 99.5 శాతం శుద్ధతతో బంగారాన్ని కొన్నట్లే లెక్క. బంగారం రేట్లలో వచ్చే హెచ్చుతగ్గులే గోల్డ్ ఈటీఎఫ్‌లపైన ప్రభావాన్ని చూపిస్తాయి. బంగారం 10 శాతం పెరిగితే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర 10శాతానికి అటూఇటూగా లాభాన్ని అందిస్తుంది. తక్కువ ఖర్చుతో బంగారం నేరుగా కొన్నప్పుడు కొన్ని ఖర్చులూ కలిసి ఉంటాయి. దీంతో మార్కెట్ ధరకన్నా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. అమ్మేటప్పుడు అన్ని ఖర్చులూ తిరిగి రావు. ఈ ఇబ్బంది గోల్డ్ ఈటీఎఫ్‌లతో ఉండదు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఉన్న రేటును బట్టి అమ్మొచ్చు. కొనొచ్చు. బంగారాన్ని భద్రపర్చడమూ కష్టమే. ఈటీఎఫ్‌ల ద్వారా కొన్నప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. కాబట్టి, రక్షణకు ఇబ్బందేమీ ఉండదు. డీమ్యాట్ ఉంటే చాలు.. గోల్డ్ ఈటీఎఫ్‌లు కొనాలని అనుకుంటే డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. మీ మొబైల్ నుంచే యూనిట్లను కొనొచ్చు. అమ్మొచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. మీరే సొంతంగా లావాదేవీలు చేసుకోవచ్చు. దీనివల్ల మీకు సమయమూ కలిసొస్తుంది. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడి విలువనూ చూసుకుంటూ ఉండొచ్చు. పన్ను భారం లేకుండా బంగారాన్ని నేరుగా కొన్నప్పుడు 3 శాతం వరకూ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు కొన్నప్పుడు నామమాత్రపు రుసుములు ఉంటాయి. పెట్టుబడిపై వచ్చే లాభాలకు నిబంధనల మేరకు మూలధన పన్ను వర్తిస్తుంది. రూ.75తోనూ.. సాధారణంగా బంగారాన్ని కొనాలంటే రూ.వేలల్లోనే అవసరం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గ్రాము పసిడికి దాదాపు రూ.9,300 వరకూ అవుతుంది. కానీ, గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.75 తోనూ పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా వీటిని కొనుగోలు చేస్తూ వెళ్లడం వల్ల దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు ఇదే మొత్తాన్ని వెనక్కి తీసుకొని, అసలైన బంగారాన్ని కొనొచ్చు. క్రమానుగతంగా.. ఒకేసారి పెట్టుబడి పెట్టడంతోపాటు, క్రమానుగతంగానూ బంగారంలో మదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. డీమ్యాట్ ఖాతా లేని వారు గోల్డ్ ఫండ్లను, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. నెలనెలా మదుపు చేయొచ్చు. బంగారం ధర పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో దీర్ఘకాలిక వ్యూహంతో గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయొచ్చు. మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి 10-15 శాతం వరకూ కేటాయించడం వల్ల వైవిధ్యం సాధ్యమవుతుంది.
- టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌కి 'భారతరత్న' అవార్డ్..?
దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’( Bharat Ratna) అవార్డును ప్రముఖ సంగీత దర్శకుడు అందుకోనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యుత్తమ పనితీరును కనబరచినవారికి ఈ అవార్డును అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. అయితే, 2025 ఏడాదికి గాను మేస్ట్రో ఇళయరాజాను (Ilaiyaraaja) భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనుందని తెలుస్తోంది. ఈ ఉగాదిలోపు ప్రకటించే అవకాశం ఉంది. మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వింటే చాలు సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజాను భారతరత్న అవార్డ్‌తో కేంద్ర ప్రభుత్వం గౌరవించనున్నట్లు దాదాపు ఖాయం అయిందని సమాచారం. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5వేల పాటలతో పాటుగా 1000 సినిమాలకు పైగానే సంగీత దర్శకత్వం వహించి రికార్డ్ క్రియేట్ చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఆయన కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2010లో భారత ప్రభుత్వం ఆయనను "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించగా.. 2018లో "పద్మవిభూషణ్" అవార్డ్ వరించింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన 24 అవార్డ్స్‌ను ఇళయరాజా అందుకున్నారు. లండన్‌లో ఇటీవల ఇళయరాజా ‘వాలియంట్’ పేరుతో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజాకు గౌరవం దక్కింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా ఇళయరాజా కలిశారు.
- ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలకై సాయిశ్రీనివాస్ ప్రాతినిధ్యం
12వ పిఆర్సీ కమిటీ ఏర్పాటు, 29 శాతం మధ్యంతర భృతి మంజూరు, బకాయిల చెల్లింపు కొరకు రోడ్ మ్యాప్ పై ప్రకటన, పెండింగ్ డిఏల మంజూరు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో. 57 మేరకు అర్హులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు, గురుకుల, మోడల్ స్కూల్, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు అమలు తదితర 14 డిమాండ్ల అమలుకై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఏపీ జేఏసీ పక్షాన ప్రాతినిధ్యం
- రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపుఉద్యోగులకు
రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపుఉద్యోగులకు AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.
- Nara Lokesh: విద్యార్థుల సెల్‌ఫోన్లకే పరీక్ష ఫలితాలు
SSC Results on Whatsapp జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. జూన్ 30 నుంచి వాట్సప్ గవర్నెన్స్ 2.0 నోటిమాటగా చెబితే టికెట్ బుకింగ్ విద్యుత్తు బిల్లుల చెల్లింపు సహా ఇతరసేవలు కూడా.. పౌరులు అడిగిన సేవను పది సెకన్లలో అందిస్తాం శాసనసభలో మంత్రి లోకేశ్ అమరావతి: జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘ఒకచోట నుంచి మరో చోటకు టికెట్ కావాలని నోటితో చెబితే.. టికెట్ బుక్ చేస్తుంది. నంబర్ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుంది. అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయి’ అని వివరించారు. పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే.. వాటిని వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో ‘వాట్సప్ గవర్నెన్స్’పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకే జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం 200 సేవలు అందుతున్నాయి. మార్చి నెలాఖరుకు 300, జూన్ 30కల్లా 500 సేవలు అందిస్తాం. పౌరులు అడిగిన సేవను 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్ ద్వారా చేసినవి 51 లక్షలు. వాట్సప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతగా చేరువైందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్‌టికెట్లు పొందారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా దీనిద్వారా అందుబాటులోకి తెస్తాం. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తాం. కేంద్ర ఐటీ చట్టం ప్రకారం ఫిజికల్ పత్రాల్లాగే ఎలక్ట్రానిక్ పత్రాలూ చెల్లుబాటవుతాయి. క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణకు వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించే బిల్లు తెస్తాం’ అని లోకేశ్ చెప్పారు. ధాన్యం సేకరణలో వాట్సప్ సేవలను మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత ఆలోచనతో ప్రారంభించారని.. దాన్ని కూడా అనుసంధానిస్తామన్నారు. గత ప్రభుత్వ వేధింపుల నుంచి పుట్టిన ఆలోచన ‘గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి నుంచి ఎక్కువ మంది గెలిచినా.. బీసీ మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా అప్పటి ఎమ్మెల్యే అడ్డుపడ్డారు. కులధ్రువీకరణ పత్రం ఇవ్వనీయకుండా వేధించారు. సర్టిఫికెట్ కోసం ఎలా వేధిస్తారో అప్పుడే చూశాను. అక్కడ్నుంచే ఈ ఆలోచన మొదలైంది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని, చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తోందని పాదయాత్ర సమయంలోనూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇబ్బందులు తీర్చడానికే వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించాం’ అని లోకేశ్ పేర్కొన్నారు. జగన్‌కు ఫోన్ కొని పంపిస్తే నేర్చుకుంటారేమో! ‘పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అయినా పేటీఎం బ్యాచ్‌లు అసత్యప్రచారం చేస్తున్నాయి. వాట్సప్ గవర్నెన్స్‌లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేశా. ఎవరూ స్పందించలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ వాడరంటున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక ఫోన్ కొని అందులో వాట్సప్ గవర్నెన్స్ లోడ్ చేసి పంపిస్తే.. అప్పుడైనా నేర్చుకుంటారేమో’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యేలు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాలని, రెవెన్యూలో బ్లాక్‌చైన్ ఆధారిత విధానాలు అమలు చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో లొకేషన్ షేరింగ్ అవకాశం కూడా ఇందులో ఉండాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. వాట్సప్ గవర్నెన్స్‌లో గ్రామాల్లో సమస్యలు, పాఠశాలల్లో ఇబ్బందులు చెప్పే విధానం అమలు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, గ్రామాల్లో నెట్‌వర్క్ సమస్యలున్నందున వైఫై హాట్‌స్పాట్లు ఏర్పాటు చేయాలని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. కేంద్ర పథకాల సేవలను కూడా దీనిలో అందించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సూచించారు. తమ నియోజకవర్గంలో ఒకరు రెండేళ్లుగా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రానికి తిరుగుతున్నా మంజూరు చేయలేదని.. వాట్సప్ గవర్నెన్స్ వచ్చాక వెంటనే వచ్చిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. ఎచ్చెర్ల, రాజమహేంద్రవరం నగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు ఈశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, లోకం నాగమాధవి మాట్లాడారు. మరిన్ని వార్తలు, విశేషాలు చదవండి.. 👈
- ఇ-క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు
ఇ-క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు తే.17–03–2025 దీ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు.... 1.ఆర్థిక శాఖ -భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ద్వారా సంప్రాప్తించిన అధికారానికి లోబడి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటన ఆమోదం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 2.ఉన్నత విద్యా శాఖ: -గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU) ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన మరియు నియంత్రణ) చట్టం 2016 (చట్టం నం. 3 ఆఫ్ 2016) షెడ్యూల్‌ను సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -విద్యా ప్రణామాణ మెరుగుకు, ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక ప్రగతిని మరియు పరిశోధనాత్మక సామర్థ్యాలను పెంచేందుకు ఈ సవరణ దోహదపడుతుంది. 3.పాఠశాల విద్యా శాఖ: -రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 ను ప్రవేశపెట్టడానికి రూపొందించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE చట్టం, 2009) మరియు దాని క్రింద రూపొందించబడిన నియమాల ప్రకారం మునిసిపల్ పరిమితులు, ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) రేట్లు, రవాణా సౌకర్యాల లభ్యత ఆధారంగా ఆవాసాలను కేటగిరీలు I, II, III, మరియు IVలుగా వర్గీకరించడం ద్వారా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. 4.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల సమీక్షకు సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించడానికి మరియు అమరావతి భూ కేటాయింపు నియమ, నిబంధనలు, 2017 ప్రకారం మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్, APCRDA కి అనుమతి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 5.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -(ఎ) రూ.390.06 కోట్ల విలువైన APTRANSCO 400KV DC లైన్ (18 KM) మరియు PGCIL 400KV DC లైన్ల (20 KM) రీరూటింగ్ యొక్క బ్యాలెన్స్ పనులకు మరియు రూ.1082.44 కోట్ల విలువైన N10 నుండి N13 - E1 జంక్షన్ వరకు UG కేబుల్స్ ద్వారా 220KV EHV లైన్ల రీరూటింగ్ బ్యాలెన్స్ పనులకు సంబందించి పరిపాలనా అనుమతుల నిమిత్తం -(బి) ఈ పనులలో రూ.390.06 కోట్ల పనులను అంచనా నిర్మాణ వ్యయం కంటే 8.99% అదనపు మొత్తానికి మెస్సర్స్ పివిఆర్ కన్‌స్ట్రక్షన్స్, హైదరాబాదు మరియు మెస్సర్స్ కె.రామ చంద్రరావు ట్రాన్సుమిషన్ & ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు సంయుక్తంగా చేపట్టేందుకు అనుమతిని నిస్తూ, అలాగే బెంగళూరులోని మెస్సర్స్ బిఎస్‌ఆర్‌ఐన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, బెంగుళూరు వారికి రూ.1082.44 కోట్లకు అంచనా వ్యయం కంటే 8.98% ఎక్కువ శాతానికి అప్పగించేందుకు చేసిన ప్రతిపాధనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 6.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -ప్యాకేజీ XXXXII క్రింద రూ.834.46 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ మరియు జాతీయ రహదారి-16 వరకు E13 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. - 7.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -ప్యాకేజీ XXXXI క్రింద రూ.307.59 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ మరియు పాత జాతీయ రహదారి మంగళగిరి వరకు E15 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 8.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -(i) శాసనసభ మరియు హైకోర్టు (ii) సచివాలయం మరియు HOD టవర్ల నిర్మాణపు కాంట్రాక్టులను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉన్న సమగ్ర నిర్మాణ సేవలకు సంబందించి కరెన్సీ సీలింగ్ నిబంధనను సవరించడానికి చేసి ప్రతిపాదకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 9.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు L1 బిడ్లను ఆమోదించడానికి APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదన, L1 బిడ్డర్లకు ఈ పనులను అప్పగించడానికి LOA జారీ చేయడం మరియు APCRDA అథారిటీ వారి తీర్మానం నెం.491/2025 ద్వారా 512/2025 వరకు ఆమోదించిన నిర్ణయాన్ని అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 10.పురపాల మరియు పట్టణాభివృది శాఖ: -ప్రపంచ బ్యాంకు, ADB, HUDCO, KfW మరియు ఇతర ఆర్థిక ప్రాజెక్టులకు సంబంధించిన రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకై APCRDA అథారిటీ వారి తీర్మానానికై చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 11.జలవనరుల శాఖ: -(i) రూ.180.00 లక్షలతో ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతులు మరియు పునరుద్ధరణ పనులకు మరియు -(ii) రూ.3797.00 లక్షలతో బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క KM 3.840 నుండి KM 4.340 వరకు కుడి, ఎడమల వరద నివారణ రక్షణ గోడలకు నిర్మించేందుకు పరిపాలనా అనుమతి కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 12. ఐటి, ఇ & సి: -ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ (4.0) 2024-2029 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి ITE&C విభాగానికి అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 13. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ: -రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి M/s ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, M/s దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్, M/s లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, M/s సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ (పి) లిమిటెడ్, M/s ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు M/s బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ (యాక్షన్ టెసా) పెట్టుబడి ప్రతిపాదనలకై తే.13.03.2025దీన జరిగిన సమావేశంలో SIPB చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 14. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ: -ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు పవర్‌లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -ఈ నిర్ణయం వల్ల 93 వేల మంది చేనేత కార్మిక గృహాలకు మరియు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు లబ్దిచేకూర నుంది. 15.ఇంధన శాఖ -AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4000 MW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను M/s. AP NGEL హరిత్ అమృత్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 16.ఇంధన శాఖ -అన్నమయ్య & వైఎస్ఆర్ జిల్లాల్లో 1800 మెగావాట్ల ఆఫ్-స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (OCPSP) ఏర్పాటు కోసం మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అటవీ పరిరక్షణార్థం 350 హెక్టార్ల (864.87 ఎకరాలు) భూమిని కేటాయించేందుకు చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 17.ఇంధన శాఖ -కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు మరియు ఇతర పునరుత్పాదక ఇంధన (సౌర/తేలియాడే సౌర/పవన) ప్రాజెక్టుల అమలు కోసం SPV ఏర్పాటు కై NHPCతో చేసుకున్న JV ఒప్పందాన్ని ఆమోదించడానికి APGENCO మేనేజింగ్ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 18.సాదారణ పరిపాలనా శాఖ (సమచార & పౌర సంబంధాలు) -ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు మూడు (03) ఫోటోగ్రాఫర్ పోస్టులు మరియు రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ బేసిస్ పై తీసుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -దీని వలన G.O.Rt.No.1983, G.A.(I&PR), తేదీ 05.09.2019 లో -జిల్లా కార్యాలయాలు మరియు కమిషనరేట్ ఆఫ్ I&PR శాఖకు మంజూరు చేయబడిన (15) వీడియోగ్రాఫర్ పోస్టులలో ఒక (01) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పోస్టు, ఒక (01) అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ పోస్టు మరియు రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులను రద్దు చేసే ప్రతి పాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 19.వై.ఏ.టి. & సి: -వైయస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో ‘ఒబెరోయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధి కోసం మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ (ఒబెరోయ్ గ్రూప్) కు సంబంధించి గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమిని మరియు ఆ స్థలానికి (45 మీటర్ల వెడల్పు) యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేస్తూ మరియు రిఎలైన్మ్మెంట్ కై తే. 13.03.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) తీసుకున్న నిర్ణయానికి సంబందించిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -ఈ ప్రాజక్టు వ్యవస్థాన వలన దాదాపు 1500 ఉద్యోగాలు రానున్నాయి. 20.వై.ఏ.టి. & సి: -విశాఖపట్నంలోని భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ కు సంబంధించి తే.13.03.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం కోసం చేసిన క్రింది ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. -ఎ) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలో కేటాయించిన 40.00 ఎకరాల భూమిని మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ కు హద్దులు నిర్ణయించడం. -బి) చట్టపరమైన సంస్థను మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ నుండి మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ (వైజాగ్) ప్రైవేట్ లిమిటెడ్ కు మార్చడానికి ఆమోదం. -సి) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మేఫేర్ బీచ్ రిసార్ట్స్ మరియు కన్వెన్షన్ కు మౌలిక వసతులైన రోడ్డు, విద్యుత్ మరియు నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను అందించే నిర్ణయం. -ఈ ప్రాజెక్టు ఏర్పాటు వలన ప్రస్తుతానికి 200 మంది ఉద్యోగ అవకాశాలు కల్పనతో ఏడవ సంవత్సరం ప్రాజక్టు పూర్తి అయ్యే సమయానికి అదనంగా 750 మంది ఉద్యోగ అవకాశలు కలుతాయి. 21.సాంఘిక సంక్షేమ శాఖ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణపై శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, I.A.S.(రిటైర్డ్), ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రుల బృందం సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 22.రెవిన్యూ శాఖ -వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 23. పురపాల మరియు పట్టణాభివృది శాఖ: - "YSR తాడిగడప మునిసిపాలిటీ" ని "తాడిగడప మునిసిపాలిటీ" గా పేరు మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీల చట్టం, 1965 షెడ్యూల్ X యొక్క కాలమ్ 2లో No.1 ను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 24. జలవనరుల శాఖ - గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో అత్యవసర ప్రాతిపధికన రూ.6373.23 లక్షల వ్యయంతో నామినేషన్ పద్దతిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు చేసిన పనులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
- APJAC తీర్మానాలు
APJAC తీర్మానాలు: 1. 12వ PRC కమిష 6thనర్ ను వెంటనే నియమించాలి. PRC అమలు అయ్యేలోపు 29% IR ప్రకటించాలి. 2. జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ, సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించాలి. పేరుకుపోయిన పెండింగ్ బకాయిల చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలి 3. పెండింగ్లో ఉన్న డి.ఏలను మంజూరు చేయాలి. 4. కేంద్ర పభుత్వ మేమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004 ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ ఉపాధ్యాయలకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలి. కూటమి ప్రభుత్వ హమికి అనుగుణంగా CPS రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి. 5. రిటైర్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటి, కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. 6. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చెయ్యాలి. 7. గురుకుల ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, మోడల్ స్కూల్, MTS కు పదవి విరమణ వయస్సు 62కు పెంచాలి. 8. 2014కి ముందు నియమించబడి రెగ్యులరైజ్ కానీ 7000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలి. 9. పంచాయతి రాజ్ డిపార్టుమెంటు, తదితర శాఖలలో పెండింగ్ లో ఉండిపోయిన కారుణ్య నియామకాలకు పరిష్కరం చూపాలి. 10. 11వ PRCలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ను పునరుద్దరించాలి. 11. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 12. RTC డిపార్టుమెంటు లో గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను RTC నిబంధల ప్రకారం అమలుచెయ్యాలి. 13. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు APCOS ద్వార సేవలు కొనసాగించాలి. 14. మెడికల్ డిపార్టుమెంటులో తొలగించబడిన MPHAలను తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలి. మరిన్ని వార్తలు విశేషాలు చదవండి 👈
- AP cabinet: వైయస్‌ఆర్ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం
AP cabinet: వైయస్‌ఆర్ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం వైయస్‌ఆర్ జిల్లా పేరును వైయస్‌ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. AP cabinet: వైయస్‌ఆర్ జిల్లా పేరు మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం అమరావతి: వైయస్‌ఆర్ జిల్లా పేరును వైయస్‌ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన కేబినెట్ భేటీ (AP cabinet) జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ysr kadapa district మరిన్ని కేబినెట్ నిర్ణయాలు.. నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయించింది మరిన్ని విశేషాలు చదవండి 👈 👉 యూట్యూబ్ చానెల్ కి సబ్ స్క్రయిబ్ చేయండి విలువైన బహుమతులు పొందండి ! 3999/- విలువ గల Canva , 2000/- విలువ గల pdf ఎడిటర్ , 23,000 /- మరియు 17000/- విలువగల వీడియొ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మరెన్నో ఫ్రీ గా పొందండి. ఆఫర్ కొన్నిరోజులే
- మంకీ ట్రాప్
మంకీ ట్రాప్ ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ... తల నుండి బయటికి పంపించేసినా.. పదే పదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది..ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని". ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము. ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయము "మంకీ ట్రాప్" అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి నికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది.తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము. నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు.నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. విశిదంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదుల కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు... నో చెప్పలేని మోహమాటలు... తిరిగి అడగలేని అప్పులు... దండిచలేని ప్రేమలు... ఊపిరి సలపనివ్వని పనులు... వత్తిడి పెంచే కోరికలు.... ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు... పేరు వెంట చేసే పరుగులు.... అన్నీ మంకీ ట్రాప్ లే. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు " వదలటం గొప్పా పట్టుకోవడం గొప్ప? అంటే.. అవును సీతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు.. అందుకే ఫ్రెండ్స్ కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం.. మరింత మనశ్శాంతిగా ఉందాము. ch.వీరప్పయ్య
- టీచర్ల బదిలీల (Transfers) బిల్లుకు ఆమోదం .
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలు (17-03-2025) ఏపీ టీచర్ల బదిలీల బిల్లు రాష్ట్ర మంత్రివర్గం టీచర్ల బదిలీల (Transfers) బిల్లుకు ఆమోదం తెలిపింది. బదిలీల విధానం, గడువులు, మెరిట్ పాయింట్స్ వంటి అంశాలపై పూర్తి వివరాలు త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. SC వర్గీకరణపై కీలక నిర్ణయం రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ SC వర్గీకరణపై ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ నివేదికలోని సిఫార్సుల అమలుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. SC వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నివేదికను ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం






