Search Results
Search this site
738 results found with an empty search
- పదోతరగతి ప్రీ ఫైనల్ తెలుగు, హిందీ సమాధానాలు : Pre-Final Keys Telugu, Hindi
ఏపీలోని పాఠశాలల్లో నిన్నటి నుంచి జరుగుతున్న పదోతరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమాధానాలను ఇక్కడ చూడవచ్చు. నిన్నజరిగిన తెలుగు , నేడు జరిగిన హిందీ పరీక్షల సమాధానాలు (Answer Keys ) కింద చూడవచ్చు. తెలుగు పదోతరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమాధానాలు : 10th Class Pre-final Telugu Key హిందీ పదోతరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమాధానాలు : 10th Class Pre Final Hindi Key Principles of valuation
- NEET UG 2025 Registrations | నీట్ (యూజీ) నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తులు ఇలా..!
Previous Posts: ఈ సంవత్సరం బెస్ట్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఇవే ! స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్డేట్ చేసుకోండి Education: అమ్మానాన్నలూ.. ఇలా పాటిస్తే మంచి మార్కులు! చైనా ‘డీప్‌సీక్’ ఎఫెక్ట్.. ఓపెన్‌ఏఐ ‘డీప్ రీసెర్చ్’ : OpenAI vs Deepseek కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు NPS స్థానంలో UPS Padma Awards 2025: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం : లిస్ట్ ఇదే ! నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు మార్చి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. NEET NOTIFICATION - APPLICATION PROCEDURE NEET UG 2025 Registration | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ - యూజీ (NEET UG 2025) పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. మే 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఒకే షిఫ్టులో ఈ పరీక్ష జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు.. దరఖాస్తులు: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులో పొరపాట్ల సవరణ: మార్చి 9 నుంచి 11వరకు దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700; జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600; ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000; విదేశీ విద్యార్థులు రూ.9500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఏప్రిల్ 26 నాటికి; అడ్మిట్ కార్డులను మే 1 నాటికి విడుదల చేస్తారు. నీట్ పరీక్ష తేదీ: మే 4 (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు) ఫలితాలు జూన్ 14 నాటికి విడుదల చేసే అవకాశం. సమాచార బుక్‌లెట్ కోసం క్లిక్ చేయండి . దరఖాస్తు ఇలా.. తొలుత neet.nta.nic.in వెబ్‌సైట్ సందర్శించాలి. రిజిస్ట్రేషస్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. చెల్లుబాటయ్యేలా మీ వ్యక్తిగత సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూసుకొని.. ఏవైనా మార్పులు ఉంటే చేయండి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి. మీరు దరఖాస్తు చేసినట్లుగా వచ్చిన కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరుచుకోండి.
- ఈ సంవత్సరం బెస్ట్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఇవే !
TOP BEST INCOME TAX SOFTWARE ఉద్యోగులు , ఉపాధ్యాయులు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తమ ఆదాయపన్ను వివరాలను డీడీవోలకు సమర్పిం చవలసివుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి క్వార్టర్ లో పూర్తి వార్షిక ఆదాయపన్ను వివరాలను డీడీవోలు సేకరించి ఆడిటర్ సహాయంతో ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో మొదట ఉద్యోగినే సొంతంగా ఆదాయపన్ను వివరాల లెక్కలను కూర్చుకొని ఎంత ఆదాయపన్ను పడుతుందో మదించుకుని ఆ దస్త్రాలను డీడీవోలకు అప్పగిస్తారు . కొందరు ఆడిటర్ల సహాయంతో ఫైల్ చేయించుకుంటారు . కానీ ఇప్పుడు ఆన్లైన్ లో లభిస్తున్న ఇన్కమ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సులభంగా ఆదాయపన్ను మదింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కొన్ని బెస్ట్ ఇన్కమ్ టాక్స్ సాఫ్ట్వేర్ ఇక్కడ చూడవచ్చు. మీకు నచ్చిన సాఫ్ట్వేర్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు . మీ బేసిక్ జీతం , గ్రాస్ , మినహాయింపులు , అరియర్స్ తదితర వివరాలు ఈ సాఫ్ట్వేర్ లో నమోదుచేసి మీకు ఎంత ఆదాయపన్ను పడుతుందో చూసుకోవచ్చు. ఇకనుంచి నెలవారీ అడ్వాన్స్ టాక్స్ ఎంత నిర్ణయించుకోవాలో తెలుస్తుంది. అనవసరంగా ఎక్కువ పన్ను కట్టకుండా , అవకాశముంటే రీఫండ్ కూడా రావాలంటే ఈ బెస్ట్ సాఫ్ట్వేర్ తో మీ ఆదాయపన్ను మదింపు చేసుకోండి
- స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు..!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కోసం ఉపాధ్యాయుల హాజరు కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా హాజరు నమోదు చేసే అప్లికేషన్ స్కూల్ ఇన్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే అప్డేట్ అయ్యింది ఈ కొత్త అప్డేట్ ని కింది లింక్ మీద నొక్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ కొత్త అప్డేట్ లో SAMP3 మార్కుల నమోదు ఛట్రాన్ని కొత్తగా చేర్చారు. ఇక ఉపాధ్యాయులు SAMP3 మార్కులు నమోదు ప్రారంభించవచ్చు. ఈ అప్డేట్లు ఈ అప్లికేషన్ యొక్క పనితనాన్ని కూడా మెరుగుపరిచి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యాప్ అప్డేట్ చేసుకోవడం ద్వారా మార్కులు నమోదు చేసుకోవడంతో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ యాప్ లోని అన్ని సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు ఈ పోస్ట్ నచ్చితే కింద ఉన్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి మీ సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి
- Education: అమ్మానాన్నలూ.. ఇలా పాటిస్తే మంచి మార్కులు!
తమ పిల్లల చదవులపై నేటి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పదేళ్ల క్రితం చూస్తే ప్రాథమిక విద్యాభాస్యం చేసేవారిపై దృష్టి ఎక్కువగా ఉండేది. సరిగా ఏకాగ్రత చూపరనో? చిన్నవారనో ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. తమ పిల్లల చదవులపై నేటి తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. పదేళ్ల క్రితం చూస్తే ప్రాథమిక విద్యాభాస్యం చేసేవారిపై దృష్టి ఎక్కువగా ఉండేది. సరిగా ఏకాగ్రత చూపరనో? చిన్నవారనో ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇప్పుడీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత పాఠశాల (6-10వ తరగతి), ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన వారిపై తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ప్రత్యేక శ్రద్ధకనబర్చుతున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేవారిని కేవలం కళాశాలలకే వదిలేయడం లేదని తాజా ‘విద్యాస్థితి నివేదిక-2024’ చెబుతోంది. ఇంటర్‌లో గరిష్ఠ మార్కులు, తదుపరి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకే లక్ష్యంగా ఇంట్లోవాళ్లు బాగా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలల సమయం అనంతరం ప్రతిరోజూ రెండు, మూడు గంటలైనా సమయం కేటాయిస్తున్నారు. వార్షిక పరీక్షలు దగ్గరపడిన కొద్దీ.. వారు వెనుకబడిన సబ్జెక్టులేమిటో గుర్తించి కోచింగ్ ఇప్పిస్తున్నారు. కావాల్సిన మెటీరియల్, ఇతర అవసరాల్ని సమకూర్చుతున్నారు. అంతాబాగానే ఉన్నా.. సాధారణ రోజులు, ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులపై ఒత్తిడి కలిగేలా తల్లిదండ్రులు ప్రవర్తించొద్దని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. వారి ఆందోళనల్ని పారదోలి.. ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలంటున్నారు. అప్పుడే, అమ్మానాన్నలకు పిల్లలూ మంచి మార్కులేస్తారని సూచిస్తున్నారు. ఇలా చేసి చూడండి... సబ్జెక్టుల వారీ సన్నద్ధత, విరామానికి సంబంధించి పిల్లలతో కలిసి టైం టేబుల్ తయారుచేయండి. కావాల్సిన పుస్తకాలు, రిఫరెన్స్ మెటీరియల్, ఇతర సామగ్రిని సేకరించేందుకు సహాయపడండి. ముఖ్యాంశాలు రాయడం (బ్రీఫ్ నోట్స్), ఇతరులతో చర్చించండి వంటి చిట్కాలు వీలైనన్ని నేర్చుకునేలా ప్రోత్సహించండి. చదువు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలున్నా ఇంట్లో చెప్పేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి. అలసట దరిచేరకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా తగినంత నిద్రపోనివ్వండి. వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. అభ్యసనలో, అంతర్గత పరీక్షల్లో చూపిన ప్రతిభను గుర్తించి అభినందించండి. ఇతరులతో పోల్చకండి. చిన్న విజయాలను సెలబ్రేట్ చేయండి. చదువులో మరింత మెరుగయ్యేలా ప్రోత్సహించండి. ర్యాంకులు, మార్కులే లక్ష్యం కాకుండా.. అకడమిక్‌పరంగా ప్రతిభచూపడం ముఖ్యమనే ఆలోచన కలిగించండి. మా అబ్బాయి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అంతర్గత పరీక్షల అనంతరం అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పాఠశాలకు వెళ్లి తెలుసుకుంటున్నాం. నేను ఉద్యోగిని. అయినా, తీరిక చేసుకుని సమయం కేటాయిస్తున్నా. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అడిగి తెలుసుకుంటున్నా. ఏమైనా సందేహాలుంటే ఉపాధ్యాయులతో ఫోన్లో మాట్లాడి నివృత్తి చేయిస్తున్నాం. పరీక్షల సన్నద్ధతకు ఇంట్లో ప్రత్యేక వసతులు కల్పించాం. రాంబాబు, పదో తరగతి విద్యార్థి తండ్రి, వైఎస్సార్‌నగర్, ఖమ్మం ‘పరీక్షలు పిల్లల జీవితంలో ఓ భాగమే. పరీక్షలే వారి జీవితమనేలా తల్లిదండ్రులు వ్యవహరించొద్దు. ఇతరులు బాగా చదువుతున్నారనో, ఫీజులు రూ.లక్షలు చెల్లించామనో మందలించొద్దు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. విశ్రాంతి కోసం తోటి విద్యార్థులతో ఆడుకునేలా, వ్యాయామం చేసేలా చూడాలి. సెలవు రోజుల్లో విహార ప్రదేశాలకు, తీరిక ఉన్నప్పుడు బంధుమిత్రుల ఇళ్లకు తీసుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం గడపాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, చదువుపై ఏకాగ్రత కుదురుతుంది’. నాగరాజశేఖర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం
- చైనా ‘డీప్‌సీక్’ ఎఫెక్ట్.. ఓపెన్‌ఏఐ ‘డీప్ రీసెర్చ్’ : OpenAI vs Deepseek
ChatGPT Vs Deepseek OpenAI: చైనా ‘డీప్‌సీక్’ నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ ‘డీప్ రీసెర్చ్’ పేరుతో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. కృత్రిమ మేధ రంగంలో పెను సంచలనం సృష్టించిన చైనా ‘డీప్‌సీక్’.. దిగ్గజ ఏఐ సంస్థలకు సవాళ్లు విసురుతోంది. ఈనేపథ్యంలోనే అమెరికా టెక్ సంస్థ ‘ఓపెన్ ఏఐ (OpenAI)’ కీలక ప్రకటన చేసింది. ‘డీప్ రీసెర్చ్ (Deep Research)’ పేరుతో కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. మనిషి చాలా గంటల్లో చేసే పనిని ఈ కొత్త టూల్ పది నిమిషాల్లోనే చేసి పెడుతుందని కంపెనీ వెల్లడించింది. ‘‘ఓపెన్ ఏఐ తదుపరి ఏజెంట్ డీప్ రీసెర్చ్ స్వతంత్రంగా పని చేయగలదు. మీరు ప్రాంప్ట్ ఇస్తే.. చాట్‌జీపీటీ ( ChatGPT )నే వందలాది ఆన్‌లైన్ సోర్సులను విశ్లేషించి.. రీసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో సమగ్ర నివేదిక రూపొందిస్తుంది’’ అని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో ఉన్నతస్థాయి సమావేశానికి ముందు కంపెనీ ఈ టూల్‌ను ఆవిష్కరించింది. ఓపెన్‌ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్ ప్రస్తుతం టోక్యోలో ఉన్నారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, టెక్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అధినేత మసయోషి సన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్ కలిసి ‘స్టార్‌గేట్’ పేరుతో సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదిలాఉండగా.. చైనా ( China )కు చెందిన ‘డీప్‌సీక్ (DeepSeek)’ ఇటీవల అమెరికా టెక్ స్టాక్స్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్ సంస్థ.. కొన్ని రోజుల కిందట ఆర్1 పేరిట ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. ఓపెన్‌ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం సబ్‌స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలుచేస్తున్నాయి. ఈనేపథ్యంలో పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్‌ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండడంతో డీప్‌సీక్ పేరు నెట్టింట మార్మోగింది. అంతేకాదు.. టెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చిస్తున్న వేళ.. డీప్‌సీక్ మాత్రం కేవలం 6 మిలియన్ డాలర్లతో లేటెస్ట్ ఏఐ మోడల్‌ను రూపొందించడం గమనార్హం.
- ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ తో ఉపాధ్యాయ సంఘాల సమావేశ ఫలితాలు
నేడు విజయవాడ విద్యా భవన్ నందు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన విద్యాశాఖ కమిషనర్ ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు: 1. 117 జీవో రద్దుకు సంబంధించి ప్రతిపాదనలు, క్షేత్రస్థాయిలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలలో తరగతులను సమీప పాఠశాలల్లో విలీనం చేయడం కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమేనని, క్షేత్రస్థాయిలో గ్రామ ప్రజల నిర్ణయం తీసుకొని మాత్రమే ముందుకు వెళ్తామని తెలియజేశారు. 2. దాదాపు 7,500 మోడల్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నామని తెలిపారు. 3. ప్రాథమికోన్నత పాఠశాలల అబ్రిడేషన్ విషయంలో సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలు ఇబ్బంది పడుకుంటా నిర్ణయం తీసుకుంటామన్నారు. 4. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS) లో చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని సరి చేసుకోవాలని కోరారు. 5. ఫిబ్రవరి 10 లోపు ప్రాథమికంగా సీనియారిటీ లిస్టులు మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో విడుదల చేస్తామన్నారు. 6. విడుదల చేసిన సీనియారిటీ లిస్టులపై గ్రీవెన్స్ తీసుకుని మూడుసార్లు అవకాశం ఇస్తామన్నారు. 7. గ్రీవెన్స్ కు సంబంధించి డిఇవో పరిధిలో న్యాయం జరగకపోతే ఆర్జెడి పరిధిలో చూస్తామన్నారు. 8. డిఇఓ,ఆర్జెడిలకు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేయకుండా కోర్టుకు వెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 9. జీవో 92 ప్రకారం రీలింక్విస్మెంట్ ఒక సంవత్సరం అన్విల్లింగ్ ఇస్తే తర్వాత సంవత్సరంలో ప్రమోషన్ తీసుకోవచ్చు. 9. టీచర్ల ట్రాన్స్ఫర్ యాక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రెండు రోజుల్లో వెబ్ సైట్ లో పెడతామన్నారు. ఏవైనా సూచనలు తెలియజేయాలంటే మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు అన్నారు. 10. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బదిలీల యాక్టు ప్రవేశపెడతామన్నారు 11. ఆగస్టు 31వ తేదీ నాటికి రెండు అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు (2023 వారు) బదిలీలకు అర్హులు. 12. ఆగస్టు 31 నాటికి 8 అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు (2017 వారు) కంపల్సరీ బదిలీల క్రిందకు వస్తారు. 13. సర్ ప్లస్ స్కూల్ అసిస్టెంట్ లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం/ప్రిన్సిపాల్స్ గా పంపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.
- ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ తాజా సమాచారం
16,347 టీచర్ పోస్టులు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన రాష్ట్రంలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యు యేట్ MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యు యేట్ MLC ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు DSC నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
- ఏపీలో ఉపాధ్యాయ బదిలీలు - తాజా సమాచారం
AP Teachers Transfers ఈ రోజు కమిషనర్ మీటింగ్ లో చర్చించిన కొన్ని ముఖ్య అంశాలు: రెండు మూడు రోజుల లో ట్రాన్స్ఫర్ ఆక్ట్ (డ్రాఫ్ట్) వెబ్సైట్ లో పెడతారు. ఫిబ్రవరి 10 లోగా అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు డిస్ప్లేచేస్తారు. ట్రాన్స్ఫర్స్ లో అకడమిక్ ఇయర్స్ తీసుకొంటారు. మినిమం 2 సంవత్సరాలు మాక్సిమం 8 సంవత్సరాలు 2017,2023 వారికి బదిలీ కి అర్హులు. Update: ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో డైరెక్టర్ గారితో జరుగుతున్న సమావేశంలో బదిలీ చట్టం రూపొందుతోన్న సందర్భంలో 2017, 2023 బదిలీపొందిన ఉపాధ్యాయులను ప్రస్తుతం బదిలీ పరిధిలోకి తీసుకు రావడాన్ని సూత్రప్రాయంగా అంగీకరించియున్నారు. సమావేశం కొనసాగుచున్నది. పూర్తి సమావేశ అంశాలు త్వరలో....
- ఏపీలో వాట్సప్‌తో పౌరసేవలకు నేడు శ్రీకారం
దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు నేడు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి లోకేశ్ దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి: దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు నేడు శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేశ్ గురువారం దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. వాట్సప్ ద్వారా ఎలా సేవలు పొందవచ్చో అధికారులు ప్రజంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. సీఎం మాట్లాడుతూ వాట్సప్ సేవలతో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సైబర్ భద్రతను బలోపేతం చేయాలి: చంద్రబాబు పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలి. వాట్సప్ ద్వారా సేవలందించేందుకు గతేడాది అక్టోబరు 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రాన్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. అధికారిక వాట్సప్ నంబర్‌తో.. వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సప్ నంబర్‌ను ప్రకటిస్తారు. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్) ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్తు సబ్‌స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి అందిస్తారు. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే.. ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు పొందుపరిచి, వారి వినతిని టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సప్ నంబరుకు మెసేజ్ చేసి, తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సప్‌లో పంపిస్తారు. మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని.. టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపటం వంటివి చేయొచ్చు. ధ్రువపత్రాలూ పొందవచ్చు.. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్.. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు వంటివి పొందవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, సర్వీసు, రిఫండ్, ఫీడ్‌బ్యాక్ తదితర సేవలు పొందవచ్చు. Update: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు అందించేందుకు, ప్రజలనుంచి వినతులు స్వీకరించేందుకు,వారికిఅవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన (వాట్సప్ గవర్నెన్స్)కు శ్రీకారం చుట్టింది. మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలుఅందిస్తున్నారు.రెండో విడతలో మరిన్ని సేవలనుఅందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలోదేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ,మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి. దీనికోసం అధికారిక వాట్సప్ నంబర్ +919552300009 ను కేటాయించారు. WhatsApp Governance
- YS Jagan : జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
YS Jagan Nadu Nadu : గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకం వల్ల ఒరిగిందేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీని వల్ల పాఠశాలల్లో ప్రమాణాలు దిగజారయని పేర్కొంది. YS Jagan : జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 28: గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన నాడు - నేడు కార్యక్రమంతో విద్యా ప్రమాణాలు దిగజారాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలోని డొల్లతనాన్ని కేంద్రం బయట పెట్టింది. ఈ కార్యక్రమం పూర్తిగా0 అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించింది. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) మంగళవారం న్యూఢిల్లీలో బహిర్గతం చేసింది. గత ప్రభుత్వంలో నాటి అధికారులు చేసిన నిర్వాకాల వల్ల విద్యా వ్యవస్థ ఏ విధంగా కుదేలైందో గణాంకాలతో సహా సదరు నివేదిక వివరించింది. 2018 నుంచి 2024 వరకు విద్యా ప్రమాణాలను ఈ నివేదికలో ASER పొందుపరిచింది. అయితే.. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలు దిగజారినట్లు సదరు నివేదికలో పేర్కొంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు లెక్కల్లో కూడికలు, తీసివేతలు వంటివి కూడా రావడం లేదని ఆ నివేదికలో సోదాహరణగా వివరించింది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6 నుంచి14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు 2018లో 63.2 శాతం ఉంటే... 2024 నాటికి అది 61.8 శాతానికి పడి పోయిందని సోదాహరణగా విపులీకరించింది. ఇక15 - 16 ఏళ్ల పిల్లలు స్కూలు నమోదు శాతం సైతం 2018లో 9 శాతం నుంచి 2024లో 1.3 శాతానికి తగ్గిందని స్పష్టం చేసింది. అలాగే మూడో తరగతి చదివే పిల్లల్లో రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదివే సామర్ధ్యం ఉన్న వారు 2018లో 22.4 శాతం ఉంటే.. 2022లో అది10.4 శాతానికి పడిపోగా.. 2024లో మళ్లీ అది 15.7 శాతంగా నమోదైందని ASER నివేదిక తెలిపింది. ఐదో తరగతి చదివే పిల్లల్లో రెండో తరగతి పుస్తకాలు చదివే సామర్ధ్యం 2018లో 59.7 శాతం ఉండగా.. 2022లో అది 36.4 శాతానికి దిగజారిపోయిందని..అయితే అది 2024లో 37.7 శాతంగా ఉన్నట్లు పేర్కొన్న సదరు నివేదిక గణాంకాలతో సహా విశదీకరించింది. అదే విధంగా ఐదో తరగతి చదివే విద్యార్దుల్లో బాగాహారం చేయగలిగిన వారు 2018లో 39.3 శాతం మంది ఉండగా.. అది 2022లో 29.6 శాతంగా ఉందని... అదే విధంగా 2024లో 36.2 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది. మరోవైపు ఎనిమిదో తరగతి విద్యార్ధుల్లో కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగే వారు 2018లో 78.2 శాతం నుంచి 2022లో 66.4 శాతానికి.. 2024లో 56.2 శాతానికి పడిపోయిందంటూ పలు విషయాలు ఈ నివేదికగా ద్వారా బహిర్గతం చేసింది.
- Lokesh: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: మంత్రి లోకేశ్
Lokesh: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: మంత్రి లోకేశ్ త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతి: త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. సాంకేతికత సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్‌ను రూపొందించే ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధరించేందుకు అపార్ ఐడీ అనుసంధానంపై ఆరా తీశారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో చర్చించారు.










