top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • అకడెమిక్ క్యాలెండర్లు (2024-25) ఇవే! డౌన్ లోడ్ చేసుకోండి.

    పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడెమిక్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు అమరావతి: పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడెమిక్ క్యాలెండర్‌ను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.  అనంత‌రం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకతీతంగా ఉంచాల‌ని అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘‘స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించాను. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించాను’’ అన్నారు. అమరావతి: విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ‘అకడమిక్ క్యాలెండర్’ను విడుదల చేశారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాల విద్య అకడమిక్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన చేశారు. కాగా ఆగస్టులో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలకు మంత్రి లోకేశ్ ఆదేశాలు ఇచ్చారు. కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు.

    స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు. స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్త అప్ డేట్ వచ్చింది. ఇప్పుడే ఇక్కడే అప్ డేట్ చేసుకోవచ్చు. ఏపీలోని. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు ఉపాధ్యాయుల హాజరు మానిటరింగ్ చేసే అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. ఉపాధ్యాయుల సెలవులు హాజరు తరగతి బోధన కార్యక్రమాలను పర్యవేక్షించే ఈ అప్లికేషన్ ఇప్పుడు కొత్త అప్‌డేట్ వచ్చింది. యాప్ ని మరింత అభివృద్ధి చేసి. కొన్ని బగ్స్ ని ఫిక్స్ చేసి ఈ అప్లికేషన్ అప్‌డేట్ చేయడం జరిగింది. ఈ అప్ డేట్ లేదా యాప్‌ని ఈ కింది బటన్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్ డేట్ లేదా యాప్‌ని ఈ కింది బటన్ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు.

  • స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎలక్షన్ షెడ్యూల్ ఇదే!

    (SMC) SCHOOL MANAGEMENT COMMITTEE ELECTION SCHEDULE 🌴01-08-2024 (Thursday) :: Issue of Notification to Conduct Elections for re-constitution of School Management Committees (SMC Members, Chairman & Vice Chairman) :: 10:00 AM 🍁01-08-2024 (Thursday) :: Display of Voter List for Conduct of Elections in the Notice Board :: 2:00 PM 🌴05-08-2024 (Monday) :: Calling of Objections on Voter List and Redressal of Grievances if any :: 9:00 AM to 1:00 PM 🍁Finalization of Voter List for Conduct of Elections and its display in the Notice Board :: 3:00 PM to 04:00 PM ⛱️ 08-08-2024 (Thursday) :: Conduct of Elections Finalisation of Reconstitution of School Management Committee Members :: 7:00 AM to 1:00 PM 🌴Conduct of Election of Chairman & Vice Chairman by Committee Members School Management :: 1.30 PM 🍁Oath taking by School Management Committee Members, Chairman & Vice Chairman :: 2.00 PM 🌴Conducting First School Management Committee Meeting :: 3.00 PM to 3:30 PM Download Full Copy Here స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు ప్రొసీడింగ్స్ డౌన్లోడ్ చేయుటకు ఇక్కడ నొక్కండి

  • పాఠశాలల్లో వ్యాయామ విద్య పేలవం!

    విద్యార్థులకు ఆటపాటలు, వ్యాయామవిద్య అందిస్తేనే.. చదువులోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య, విద్యారంగ నిపుణులు ఘోషిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. విద్యార్థులకు ఆటపాటలు, వ్యాయామవిద్య అందిస్తేనే.. చదువులోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య, విద్యారంగ నిపుణులు ఘోషిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు పెడచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. అత్యధిక మంది పాఠశాల విద్యార్థులు కనీస వ్యాయామ విద్యకు నోచుకోవడంలేదని వెల్లడించింది. నాణ్యమైన వ్యాయామ విద్యపై రూపొందించిన తొలి ప్రపంచవ్యాప్త నివేదికలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టింది. ‘గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ ప్లే’ పేరుతో వెల్లడించిన ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ్య 58% దేశాలు మాత్రమే బాలికలకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 7 శాతం పాఠశాలలు మాత్రమే బాలురు, బాలికలకు భేదం లేకుండా వ్యాయామ విద్యకు సమాన సమయాన్ని కేటాయిస్తున్నాయి. మూడింట రెండొంతుల మంది మాధ్యమిక పాఠశాలల విద్యార్థులకు, సగానికిపైగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వారానికి అవసరమైన కనీస వ్యాయామ విద్యను బోధించడంలేదు. మూడింట రెండొంతుల దేశాలు తమ విద్యా బడ్జెట్‌లో కనీసం 2% కూడా వ్యాయామ విద్యకు కేటాయించడం లేదు. నిధుల లోటు, వ్యాయామవిద్య శిక్షణకు హాజరవడానికి ఉపాధ్యాయులకు సమయం కేటాయించకపోవడం వంటివి ఈ రంగంలో నైపుణ్యలేమికి కారణమవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు వ్యాయామ విద్యకు నిధుల కేటాయింపును పెంచాలని యునెస్కో సూచించింది

  • ఆ తరగతి విద్యార్థులకు 10రోజులు బ్యాగులు అవసరం లేదు!

    ఆ తరగతి విద్యార్థులకు 10రోజులు బ్యాగులు అవసరం లేదు! విద్యార్థులకు బ్యాగ్‌ అవసరం లేని (Bagless Days) రోజులు అమలు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి.. తరగతుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం జాతీయ విద్యా విధానంలో (NEP) పొందుపరిచిన సిఫార్సుల అమలుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాగ్‌ అవసరం లేని (Bagless Days) రోజులు అమలు చేసేందుకు సిద్ధమైంది. సంవత్సరంలో మొత్తంగా 10 రోజులు ఈ వెసులుబాటు కలిగించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ‘‘బోధనా అభ్యాస ప్రక్రియలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడమే దీని ఉద్దేశం. ఇందుకోసం విద్యాసంవత్సరంలో 10 రోజుల పాటు పుస్తకాలు అవసరం లేకుండా చూడాలి. ఒకేసారి కాకుండా మూడు దశల్లో వీటిని అమలు చేయాలి. అన్ని విభాగాల టీచర్లను భాగస్వామ్యం చేయాలి. అవసరమైతే ఇండోర్‌, ఔట్‌డోర్‌ కార్యక్రమాలను కలిపి నిర్వహించాలి. కూరగాయల మార్కెట్‌లను సందర్శించి సర్వేలు చేయడం, బుక్‌ఫెయిర్‌ నిర్వహణ, సోలార్‌ ఎనర్జీ పార్క్‌, బయోగ్యాస్‌ ప్లాంట్‌ల సందర్శన, గాలిపటాల తయారీ, ఎగురవేయడం వంటి కార్యక్రమాలు ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల్లో ఉన్నాయి. స్థానిక నైపుణ్యాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు, స్థానిక సంస్థలు నిర్ణయించిన వృత్తిపరమైన వడ్రంగి, విద్యుత్‌ పని, ఆభరణాల తయారీ, గార్డెనింగ్‌, కుండల తయారీ వంటి పనులకు సంబంధించిన నైపుణ్యాలపై ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు అనుభవం పొందవచ్చని తెలిపింది. వీటి ద్వారా పుస్తక జ్ఞానం, వాస్తవిక జ్ఞానానికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోవడంతోపాటు పని వాతావరణంలో నైపుణ్యాలు తెలుసుకునేందుకు వీలుంటుందని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది. తద్వారా భవిష్యత్తు కెరీర్‌ను నిర్ణయించుకునేందుకు దోహదపడుతుందని తెలిపింది. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యా సంవత్సరంలో 10 రోజుల పాటు పుస్తకాల అవసరం లేని వాతావరణాన్ని కల్పించాలని జాతీయ విద్యా విధానం సిఫార్సు చేసింది. దీన్ని అమలు చేసేందుకు గాను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (NCERT)కు చెందిన పీఎస్‌ఎస్‌ సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ తాజా మార్గదర్శకాలను రూపొందించింది.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ జూలై 5 కొత్త అప్డేట్ ఇదే

    స్కూల్ అటెండెన్స్ యాప్ జూలై 5 కొత్త అప్డేట్ ఇదే స్కూల్ అటెండెన్స్ యాప్ 5.7.24 అప్‌డేట్ #schoolattendanceapp #schoolattendancappupdate ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ఎలక్ట్రానికల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తిగత మొబైలు ఫోన్ ద్వారా నమోదు చేస్తున్న సాంకేతిక అన్వయమునకు (స్కూల్ అటెండెన్స్ యాప్) ఈరోజు అనగా జూలై 3, గురువారం సాయంత్రం అప్డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌ని పైన కనిపిస్తున్న ఫోటోలోని అప్ డేట్ మీద నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు. లేదా కింద బటన్ నొక్కి అప్‌డేట్ చేసుకోవచ్చు. స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ ని మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా మరింత స్మూత్ గా పనిచేసే లాగా తీర్చిదిద్ది ఈ అప్‌డేట్‌ని విడుదల చేశారు. యాప్‌ని ఇప్పుడు అప్‌డేట్ చేసుకోండి. పాత యాప్ సరిగా పనిచేయకపోవచ్చు. లేదా మీ హాజరు నమోదుకు ఆటంకం కలగవచ్చు. అప్ డేట్ చేయడానికి లేదా కొత్తగా ఇన్ స్టాల్ చేయడానికి ఇక్కడ నొక్కండి లేదా పైన కనిపిస్తున్న ఫోటోపై నొక్కండి

  • స్కూల్ అటెండెన్స్ యాప్ 3.7.24 అప్‌డేట్

    స్కూల్ అటెండెన్స్ యాప్ 3.7.24 అప్‌డేట్ #schoolattendanceapp #schoolattendancappupdate ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ఎలక్ట్రానికల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వ్యక్తిగత మొబైలు ఫోన్ ద్వారా నమోదు చేస్తున్న సాంకేతిక అన్వయమునకు (స్కూల్ అటెండెన్స్ యాప్) ఈరోజు అనగా జూలై 3, గురువారం సాయంత్రం అప్డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌ని పైన కనిపిస్తున్న ఫోటోలోని అప్ డేట్ మీద నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు. లేదా కింద బటన్ నొక్కి అప్‌డేట్ చేసుకోవచ్చు. స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ ని మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా మరింత స్మూత్ గా పనిచేసే లాగా తీర్చిదిద్ది ఈ అప్‌డేట్‌ని విడుదల చేశారు. యాప్‌ని ఇప్పుడు అప్‌డేట్ చేసుకోండి. పాత యాప్ సరిగా పనిచేయకపోవచ్చు. లేదా మీ హాజరు నమోదుకు ఆటంకం కలగవచ్చు.

  • ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. సిలబస్‌ ఇదే! #AP_TET_2024:

    #aptetnotification2024 ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. అమరావతి: ఏపీలో 16వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. టెట్‌ సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి

  • UPSC Prelims 2024: సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ:UPSC Prelims 2024

    సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది. న్యూఢిల్లీ, జులై 01,ఏపీ టీచర్స్ టీవీ : సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఆ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచింది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మార్కులతో అన్ని అబ్జెక్టివ్ ప్రశ్నలతో రెండు పేపర్లగా ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు.. మెయిన్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే.. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు గతేడాది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 26వ తేదీన నిర్వహిస్తే.. జూన్ 12న ఫలితాలు విడుదల చేసిన విషయం విధితమే.

  • Alert: జులై 1 నుంచి దేశంలో వచ్చిన 10 కీలక ఆర్థిక మార్పులివే

    దేశంలో ప్రతి నెలా కొన్ని ఆర్థిక నియమాలలో మార్పులు(financial changes) జరుగుతుంటాయి. కొన్ని కొత్త నియమాలు మారుతుండగా, మరికొన్ని అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో (జులై 1, 2024) అమలైన, అమలు కానున్న కొత్త నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం. దేశంలో ప్రతి నెలా కొన్ని ఆర్థిక నియమాలలో మార్పులు(financial changes) జరుగుతుంటాయి. కొన్ని నియమాలు మారుతుండగా, మరికొన్ని అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో (జులై 1, 2024) అమలైన, అమలు కానున్న కొత్త నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ నెలలో క్రెడిట్ కార్డ్, డిజిటల్ వాలెట్, గ్యాస్‌కు సంబంధించి సహా పలు కొన్ని కొత్త నియమాలు ఉన్నాయి. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుకు సంబంధించిన కొన్ని కొత్త నియమాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలో చేసిన మార్పుల ప్రకారం అన్ని బ్యాంకులు భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. జులై 1న దేశంలోని చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం తర్వాత రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 30 తగ్గి రూ. 1646కి చేరుకుంది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ.31 తక్కువ ధరకు రూ.1598కి విక్రయిస్తున్నారు. కానీ డొమెస్టిక్ ఎల్‌పీజీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. జులై 1 నుంచి మొబైల్ సంబంధిత విషయాలలో అనేక మార్పులు జరిగాయి. మీ సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా దాని లాకింగ్ సమయం 7 రోజులు ఉంటుంది. అంటే 7 రోజుల తర్వాత మాత్రమే మీకు కొత్త సిమ్ వస్తుంది. ఇది కాకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు కీలక అప్డేట్ ఇచ్చింది. మీ ఖాతాను సంవత్సరాలుగా ఉపయోగించకుంటే జూలై 1 నుంచి అటువంటి నిష్క్రియ ఖాతాలను మూసివేయాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంకు కొద్ది రోజుల క్రితమే ఖాతాదారులకు సమాచారం అందించింది. గత మూడేళ్లలో ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతా బ్యాలెన్స్ జీరోగా ఉన్న ఖాతాల వినియోగదారులు జూన్ 30లోగా KYCని పొందాలని పేర్కొన్నారు. అలా చేయని వారి ఖాతాలను జూలై 1 నుంచి బ్యాంకు రద్దు చేస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ నియమాలు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలకు సంబంధించిన మార్పులు నేటి (జూలై 1, 2024) నుంచి అమలులోకి వస్తాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో పెంచిన ధరలను జులై 3 నుంచి అమలు చేస్తుంది, వోడాఫోన్ జులై 4 నుంచి అమలు చేయనుంది.

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమాచారం.

    వ్యవస్థలను గాడిన పెట్టడంపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా 1న తారీఖున జీతాలు పడతాయా? లేదా? అనే సందేహాలన్నింటికి కూడా సీఎం చెక్ పెట్టేశారు. మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే (జులై 1) ఉద్యోగుల అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఉద్యోగులలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. #apemployeesnews #apemployeessalary #apemployeessalaries దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన జీతాలు పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అకౌంట్లలో శాలరీలు జమ అవుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్స్‌కు బ్యాంక్ మెసేజ్‌లు వస్తున్నాయని చెబుతున్నారు. ఇక సాయంత్రానికి పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎఫ్.ఎం.యస్‌లో గ్రీన్ ఛానల్‌లో పెన్షన్ బిల్లులు పెట్టారు నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం రూ.5500 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుందరి. ఈ మొత్తం లేక నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం ముప్పు తిప్పులు పెట్టిన పరిస్థితి. అయితే అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే ఆర్ధిక శాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సామాజిక భద్రతా పెన్షన్లకు రూ.4వేల కోట్లు సర్దుబాటు చేసింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రేపటిలోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో ఒకటో తేదీ ఉదయం నుంచి జీతాలు చెల్లింపు ప్రారంభం అయ్యాయి. సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడటంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • నేడు జూలై 1 న టెట్ నోటిఫికేషన్

    *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *పాఠశాల విద్యాశాఖ* ప్రెస్ నోట్ (30.06.2024) *నేడు (జూలై 1న) ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల* - జూలై 2 నుండి దరఖాస్తుల స్వీకరణ. - - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.ఈ సందర్భంగా ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ జూలై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. AP TET (JULY)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్,సిలబస్,ఆన్లైన్ విధానంలో (CBT) జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలు అన్నీ https://cse.ap.gov.in/ వెబ్ సైట్ నందు ఉంచబడినవి.అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం తేదీ.02.07.2024 నుండి పైన తెలిపిన వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు. సహాయ సమాచారం కోసం కమిషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని కోరారు. *ఎస్.సురేష్ కుమార్* కమీషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్,అమరావతి.

bottom of page