Search Results
Search this site
738 results found with an empty search
- ఇక విద్యా శాఖలో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ-ఆఫీసులోనే ! తప్పనిసరి చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖలో ఇకనుంచి అన్ని కార్యా కళాపాలు ఈ ఆఫీస్ ద్వారానే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈ ఆఫీస్ ద్వారా కాకుండా వేరే విధంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి వీలు లేదని ప్రభుత్వం పేర్కొంది. పాఠశాల విద్యాశాఖలోని అన్ని సబ్ ఆర్డినేట్ కార్యాలయాల్లో నవంబర్ 1వ తేదీ నుండి ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని, పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని ఆదేశాలు జారీ. Implementation of e-Office in the subordinate office under School Education Department - Certain Instructions- Rc.No. ESE02-31021/49/2022-IT-CSE Dt:25/10/2022
- తెలంగాణలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ : OPS Restoration in Telangana
మళ్లీ ఓపీఎస్..? • యోచిస్తోన్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ • ఇప్పటికే ఐదురాష్ట్రాల్లో పునరుద్ధరణ • ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం • ఉద్యోగ వర్గాల్లో ఎదురుచూపులు ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్గా పేరున్న తెలంగాణ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ దిశగా యోచిస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఖజానాకు భారం తగ్గడంతోపాటు ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించి పాలనలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ చేస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ వివరాలను రెడీ చేసింది. పంజాబ్లో పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవడంతో తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఈ దిశగా యోచిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. ఇప్పటికే పాత పెన్షన్ విధానం అమలు లోకి తెచ్చిన ఐదో రాష్ట్రంగా పంజాబ్ ఘనత సాధించగా ఆరో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్ ) ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించి అమలు చేయడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగులకు సీపీఎస్ ను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ఈ నూతన పెన్షన్ విధానం అమలులోకి వచ్చిన వెంటనే సీపీఎస్ ను ఉద్యోగులు వ్యతిరేకించారు. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని చెబుతోంది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి భిన్నమైన ప్రకటనలు వస్తున్న తరుణంలోనే పంజాబ్ ఐదో రాష్ట్రంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించింది. దీంతో సీపీఎస్ రద్దు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని ఈ ఐదు రాష్ట్రాలు రుజువు చేశాయి. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్న నూతన పెన్షన్ విధానంపై మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. 1.72లక్షల మంది ఉద్యోగులకు నష్టం కల్గిస్తున్న సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. వీడియో చూడండి
- APGLI: కొత్త పీఆర్సీ ప్రకారం ఏపీ జి ఎల్ ఐ స్లాబ్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం
APGLI New Slab Rates GO 198 Released APGLI శ్లాబ్ రేట్లను భారీగా పెంచుతూ అదే విధంగా APGLI రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 🔹Revised Slab Rates (RPS-2022) 👉Pay from Rs.20000 o Rs.25220 = 800/- 👉Pay from Rs.25221 o Rs.32670 = 1000/- 👉Pay from Rs.32671 o Rs.44570 = 1300/- 👉Pay from Rs.44571 Ito Rs.54060 = 1800/- 👉Pay from Rs.54061 o Rs.76730 = 2200/- 👉Pay from Rs.73761 iand above = 3000/- 👉పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు 👉APGLI శ్లాబ్ రేట్ కన్నా ఎక్కువ డిడక్ష న్ బేసిక్ పే మీద 15 % ( పూర్వం 20% మాత్రమే)వరకు మాత్రమే అనుమతి 👉 57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు.
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమాచారం
డీఎస్సీ 1998 లో అర్హత సాధించి అప్పట్లో ఉద్యోగాలకు నోచుకోని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మినిమం టైం స్కేలుతో 2008 డీఎస్సీ వారితో సాదృశ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగాలలో నిర్మిస్తున్నది.ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవలే ఆన్ లైన్ లో తమ ఆసక్తిని కనబరిచినవారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇక ఉద్యోగాలలో నియామకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. త్వరలో ప్రభుత్వం నియామకాలకు సంబంధించిన వార్త వెలువరించే అవకాశం ఉంది. ఈలోగా అన్ని జిల్లాల 1998 డీఎస్సీ అర్హత పొందిన అభ్యర్థులకు సంబంధించిన గణాంకాలు ఓసారి చూసేయండి ఈ చిత్రంలో డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎంత మంది, ఆసక్తి (విల్లింగ్) కనబరిచినవారెందరు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి హాజరైనవారెందరు, తుది అర్హత సాధించి ఉద్యోగం పొందబోతున్నది ఎందరు మిగిలిన వారెందరు అనే వివరాలన్నీ ఇక్కడ చూడవచ్చు.
- ఉపాధ్యాయుల సర్వీస్ సందేహాలు - సమాధానాలు
ప్రశ్న: ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం? జవాబు: ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No. 7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd) ప్రశ్న: ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు? జవాబు: ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును ప్రశ్న: HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా? జవాబు: కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు ప్రశ్న: ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా? జవాబు: కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997) ప్రశ్న: నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా? జవాబు: ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు. ప్రశ్న: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి జవాబు: తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి. ప్రశ్న: ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఎన్ని పిరియడ్లు బోధించాలి? జవాబు: కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 ) ప్రశ్న LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా? జవాబు: డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు. ప్రశ్న: ప్రభుత్వ /మండల/జడ్పి స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి? జవాబు: ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును ప్రశ్న: ఫైవారు 24 సం.ల స్కేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి? జవాబు: HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి. ప్రశ్న: నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా? జవాబు: అవును. . ప్రశ్న ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి జవాబు: పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి #SERVICE_MATTERS #apteachers #apttv #apteacherstv
- బదిలీలు - తాజా కబురు
పాత పద్ధతిలోనే బదిలీలు జరపమని సీఎం ఆదేశం, ఉత్తర్వులపై మంత్రి తో చర్చిస్తున్న అధికారులు సోమవారం బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం.
- విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష-నిర్ణయాలు
స్కూళ్ల నిర్వహణపై నివేదికలు స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలని, ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన ట్యాబ్‌లు ప్రస్తుతం లక్షన్నరకు పైగా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. అవసరమైనన్ని రాగానే, వాటిలో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని సీఎం చెప్పారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, ముందుగా టీచర్లకు పంపిణీ చేసి.. అందులోని కంటెంట్‌పై వారికి అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని.. అందువల్ల ట్యాబ్‌లు పొందిన 8వ తరగతి విద్యార్థులే కాకుండా మిగతా తరగతుల్లోని విద్యార్థులందరికీ ఈ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అధికారులు వివరించారు. ఆ విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకొనేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ‘బైజూస్ కంటెంట్‌లోని అంశాలను పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిసున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని సీఎం అన్నారు. ‘విద్యాకానుక’లో ఏ లోటూ ఉండకూడదు ‘నాడు – నేడుకు సంబంధించి ఆడిట్‌లో గుర్తించిన అంశాలన్నింపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి. నాడు–నేడు కింద తొలి దశలో పనులు పూర్తి అయిన చోట్ల తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జగనన్న విద్యా కానుకకు సంబంధించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును అవసరమైన మేరకు పెంచండి. ప్రస్తుతం జతకు ఇస్తున్న కుట్టు కూలి రూ.40ని ఇకపై రూ.50కి పెంచుతున్నాం. స్కూలు బ్యాగు విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వచ్చే ఏడాది నుంచి 1–6 తరగతుల వరకు మీడియం సైజు, 6–10 తరగతుల వారికి పెద్ద బ్యాగు ఇవ్వాలి. షూ సైజులు ఇప్పుడే తీసుకుని, ఆ మేరకు వాటిని నిర్ణీత సమయంలోగా తెప్పించాలి. ఎట్టిపరిస్థితిలో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుకను అందించాలి. పీపీ–1, 2 పూర్తి చేసుకున్న అంగన్‌వాడీ పిల్లలను తప్పకుండా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు. నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కూళ్ల నిర్వహణ మరింత మెరుగవ్వడం కోసం మండల విద్యా శాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామని, దీని వల్ల పర్యవేక్షణ మెరుగై మంచి ఫలితాలు వస్తాయని సీఎం తెలిపారు. సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘జగనన్న గోరుముద్దకు సంబంధించి నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి. కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 14417 నంబర్‌ను అన్ని స్కూళ్లలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి’ అని సీఎం ఆదేశించారు. నాడు–నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1,120 కోట్లు విడుదల అయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాకానుక టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్ నాటికే కిట్లను సిద్ధం చేయనున్నామని, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు సీఎంకు నివేదించారు. ఈ సమీక్షలో సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యా శాఖ సలహాదారు ఏ మురళి, నాడు–నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- ఇకపై ఉత్తర్వులు వచ్చే వరకూ మునిసిపల్ ఉపాధ్యాయులు జీతాలు DDO అధికారాలు మునిసిపల్ కమిషనర్లు కే ఇస్తూ ప
ఇకపై ఉత్తర్వులు వచ్చే వరకూ మునిసిపల్ ఉపాధ్యాయులు జీతాలు DDO అధికారాలు మునిసిపల్ కమిషనర్లు కే ఇస్తూ ప్రబుత్వ ఉత్తర్వులు
- 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఒరిజినల్ మర్క్స్ మెమోలు
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రియల్ 2022, జులై 2022 లలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాస్ సర్టిఫికేట్స్ (ఒరిజినల్ మర్క్స్ మెమోలు) పాఠశాలలకు పంపుతూ విద్యార్థులకు అందచేయుటకు సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు.
- B.PEd ఉన్న SGTs కూడా SA (PD) పదోన్నతికి అర్హులే
B.PEd ఉన్న SGTs కూడా SA (PD) పదోన్నతికి అర్హులే
- ఆ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేత
సస్పెన్షన్ ఎత్తివేత .. ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో చూచిరాతలను ప్రోత్సహించారనే కారణంతో 10 మంది స్కూలు అసిస్టెంట్ ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు . వారందరూ తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతిస్తున్నట్లు ఏలూరు డీఈవో గంగాభవాని తెలిపారు .
- ప్రమోషన్స్, బదిలీలు తాజా సమాచారం
పదోన్నతి పోస్టులన్నీ భర్తీ కావలసిందే. 👉 పదోన్నతుల కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్రంలో HM&SA పోస్టులన్నీ భర్తీ చేయాలనే ధృడ సంకల్పంలో విద్యాశాఖ 👉 పదోన్నతులకు నిర్ణయించిన పోస్టులన్నీ భర్తీ అయ్యే వరకు పదోన్నతుల జాబితాలు అదనపు అభ్యర్ధుల Adding. 👉 ఈ లక్ష్యంతో నేOct 13 న కూడా Local Body పదోన్నతుల కౌన్సిలింగ్ 👉SA To HM పదోన్నతుల వలన ఏర్పడిన SAఖాళీలలో 70% పదోన్నతుల ద్వారా రేపు భర్తీకు గ్రీన్ సిగ్నల్ 👉 పదోన్నతుల బదిలీలు , రేషనలైజేషన్ ,తర్వాత కేవలం DSC కు నిర్ణయించిన SA పోస్టులు మాత్రమే ఖాళీ గా ఉండాలి 👉SGT పోస్టులు అప్ గ్రేడ్ చేసి SA పోస్టుల ఇస్తున్నారు కనుక పదోన్నతి SA పోస్టులన్నీ భర్తీ చేసి రేషన లైజేషన్ లో SGT ల సర్దు బాటుకు ఇబ్బంది లేకుండా చూసు కొంటున్నది. 👉Not willing ఇచ్చిన వెంటనేSR లో Relinquish entry వేస్తున్నారు కనుక ఒక సారి Not willing చెప్పిన వారు మనసు మార్చుకొని మరల Yes చెప్పే అవకాశముండటం లేదు 👉Not willing చెప్పే వారందరూ SR తప్పక తెచ్చుకోవాలి 👉 Oct 13 తేదీ లోగా పదోన్నతుల షెడ్యూల్ పూర్తి అగును 👉షెడ్యూల్ లో మూడో అంకము బదిలీ లకు G O త్వరలో...........







