Search Results
Search this site
738 results found with an empty search
- ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకటించండి: ఆప్టా వినతి
ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకటించండి: ఆప్టా వినతి అమరావతి : పెండింగ్ బకాయిలను చెల్లించి, వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆష్టా) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలు గడుస్తున్నా ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించలేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని అధిక మెజార్టీతో గెలిపించినా, ఇప్పటికీ పాత బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. నేటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, తక్షణమే నూతన పీఆర్సీ కమిటీని నియమించి, జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆష్టా కోరింది. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులు, పీఎఫ్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో 12వ పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఆష్టా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జూన్‌లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ పీఎఫ్, ఏపీజీఎల్ అమౌంట్లు విడుదల చేయలేదని, వీటిని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
- AP News: పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ssc exams, free bus పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు AP News: పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమరావతి: పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు జయప్రదంగా పదో తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. తల్లితండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో 5,64,064 మంది, తెలుగు మాధ్యమంలో 51,069 మంది సోమవారం నుంచి పరీక్షలు రాయనున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకు వెళ్లొచ్చు. మరిన్ని విశేషాలు చదవండి 👈
- passive income ideas: పనిచేయకున్నా... ‘పాసివ్’ ఆదాయం!
passive income ideas: పనిచేయకున్నా... ‘పాసివ్’ ఆదాయం! ఉద్యోగం లేకపోయినా జీతం రావాలా? వ్యాపారం చేయకపోయినా లాభాలు కావాలా? అయితే, ‘పాసివ్ ఇన్కమ్’ గురించి ఆలోచించండి. అలా అని, ఇదేం అల్లా ఉద్దీన్ అద్భుత దీపం కాదు... పక్కా ఆర్థిక ప్రణాళిక. సంపదనూ, సంపాదననూ సృష్టించే దీర్ఘకాలిక వ్యూహం. అవును! రేపటి అవసరాల కోసమైనా, రెండుచేతులా సంపాదించాలి. రెండు చేతులకూ సంపాదించడం నేర్పాలి. ఒక చేయి... జీతం కోసం. మరో చేయి... జీవితం కోసం. మొదటి చేయి విశ్రాంతి తీసుకున్నా, రెండో చేయి అందుకోవాలి. ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది. చేయకపోతే రాదు. కొన్నిసార్లు, మార్కెట్ సంక్షోభం కారణంగా ఉన్న కొలువూ ఊడిపోవచ్చు. ఒత్తిడిని భరించలేకో, పోటీని తట్టుకోలేకో మనమే ఆ పరుగు నుంచి పక్కకి తప్పుకోనూవచ్చు. ఆ పరిస్థితే వస్తే కష్టాల్లో పడతాం. అందులోనూ, మధ్యతరగతి జీవితాలకు... జీతం ఒకటే అయినా, బాధ్యతలు అనేకం. గృహరుణం వాయిదా చెల్లించాలి. కారు అప్పు తీర్చేయాలి. పర్సనల్ లోన్ బకాయి వదిలించుకోవాలి. అదనంగా పిల్లల చదువులూ, పెద్దల బాధ్యతలూ ఉండనే ఉంటాయి. మరి జీవితం సంగతి? ఏదో ఒక రోజు స్టార్టప్ ఆరంభించాలనేది జీవితాశయం. ఎప్పటికైనా ఐఎస్బీలో ఎంబీఏ చేయాలనేది కాలేజీ రోజులనాటి కల. టార్గెట్లూ డెడ్లైన్లతో నిమిత్తం లేకుండా నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలనేది బలమైన ఆకాంక్ష. ఇందులో ఏ ఒక్కటి నిజం కావాలన్నా... ఉద్యోగం లేకపోయినా, నెలనెలా జీతం మాత్రం అందాలి. ‘పాసివ్ ఇన్కమ్’తోనే ఇదంతా సాధ్యం. పాసివ్ ఇన్‌కమ్‌ను... పరోక్ష ఆదాయమనీ, నిష్క్రియా సంపాదన అనీ పిలుస్తారు. కొన్ని మొక్కలకు రోజూ నీళ్లు పెట్టాలి. బలానికి ఎరువులు వేయాలి. పురుగూపుట్రా ఆశించకుండా క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి. ఇదంతా, ఉద్యోగాన్ని తలపించే చాకిరీ. మరికొన్ని మొక్కల్ని మాత్రం నాటి వదిలేస్తే సరిపోతుంది. వాటంతట అవే పెరిగిపోతాయి. ఏడాదికో, ఆర్నెల్లకో పంటనూ ఇచ్చేస్తాయి. ‘పాసివ్ ఇన్కమ్’ కూడా ఇలాంటిదే. ఇది డబ్బుకు డబ్బును కాయించే కరెన్సీ సేద్యం. ప్రతి రోజూ, ప్రతి గంటా పనిచేయం. అలా అని, పూర్తిగా గాలికి వదిలేయం. పెట్టుబడుల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉంటాం. నెలవారీ ఆదాయాన్ని ఠంచనుగా అందుకుంటాం. జీతం ఆగిపోయినా, తగ్గిపోయినా, సరిపోకపోయినా భయపడాల్సిన పనుండదు. ‘నిద్రలోనూ సంపాదించే రహస్యం తెలియకపోతే, శాశ్వత నిద్రలోకి జారిపోయేవరకూ పనిచేయాల్సి వస్తుంది జాగ్రత్త!’ అని హెచ్చరిస్తాడు విశ్వ కుబేరుడు వారెన్ బఫెట్. పాసివ్ ఇన్కమ్ అచ్చంగా అలాంటి ‘ఎర్న్ వైల్ యు స్లీప్’ చిట్కానే! మన అవసరాలూ, ఆర్థిక లక్ష్యాలూ, కెరీర్ ప్రణాళికలను బట్టి పరోక్ష సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొందరు, తదుపరి నెల నుంచే రాబడిని ఆశిస్తారు. కొందరు, దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంటారు. కొందరు, జీతానికి అదనంగానో, పెన్షన్‌కు ప్రత్యామ్నాయంగానో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగినట్టు వ్యూహాలూ రచించుకుంటారు. అలా అని, ఒక్కసారి పాసివ్ ఇన్‌కమ్‌ను సిద్ధం చేసుకుంటే... జీవితాంతం నిశ్చింతగా బతికేయగలమని అనుకుంటే పొరపాటే. ఆ సంపాదనకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. రాబడిలో ఏటా పది శాతమైనా పెరుగుదల కనిపించాలి. అందులోనూ, ఆరోగ్య బీమా లాంటి ముఖ్య విషయాల్లో ప్రస్తుత ఖర్చులతో పోల్చుకోకూడదు. జీవన ప్రమాణాలు పెరుగుతూ, ఆయుర్దాయాలు అధికం అవుతున్నందున... పాతిక ముప్పై ఏళ్ల తర్వాతి పరిస్థితుల్నీ దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య వ్యయాలు ఏటా పదిహేను నుంచి ఇరవై శాతం మేర పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆ లెక్కల ప్రకారమే మన ఆరోగ్య బీమా విలువను సవరించుకోవాలి. టర్మ్ పాలసీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అరకొర బీమా రక్షణ చిల్లుల గొడుగు లాంటిది. ఉన్నా లేనట్టే. గుడ్లుపెట్టే ఆస్తులు... ఆస్తులు రెండు రకాలు. ఒకటి... విలువ పెరిగేవి. రెండు... విలువ పెరుగుతూనే, తక్షణ రాబడిని అందించేవి. ఓమోస్తరు నగరంలో రెండొందల గజాల స్థలం తీసుకున్నా, దీర్ఘకాలంలో ఆ విలువ తప్పక పెరుగుతుంది. అదే ఇల్లు అయితే... అటు ఆస్తి విలువ పెరుగుతుంది. ఇటు అద్దె కూడా వస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచించి, ఏ దుకాణమో కొనగలిగితే... ప్రతినెలా ఫస్టున మరింత పెద్ద మొత్తం చేతికి అందుతుంది. పొలమైనా ఫర్వాలేదు. పంటల సీజన్లో కౌలు రూపంలో కొంత డబ్బు జమ అవుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా, నెలనెలా స్థిరమైన సంపాదన అందుకోవాలని అనుకునేవారు... రెండో మార్గంలో నడవడమే ఉత్తమం. మొదటి దారిని ఎంచుకున్నవారు, పాసివ్ ఇన్కమ్ అవసరమైన సమయానికి స్థిరాస్తుల్ని కరిగించి... స్థిరమైన నెలవారీ సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. Passive Income ‘ఇన్స్టంట్’ ఆదాయం దీర్ఘకాలిక ప్రణాళికతోనే, పాసివ్ ఇన్‌కమ్‌కు అవసరమైన వనరుల్ని సృష్టించుకోగలం. తమకంటూ కొన్ని లక్ష్యాలూ, కలలూ ఉన్నవారు... తొలి జీతం అందుకున్న రోజే, ఆ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది. పదేళ్లు, పదిహేనేళ్లు, పాతికేళ్లు... కాల వ్యవధి పెరిగేకొద్దీ నికర సంపదా పెరుగుతుంది. మరింత స్థిరమైన రాబడి లభిస్తుంది. నెలనెలా ఎంత మొత్తం అందుకోవాలనే విషయంలో ముందే ఓ అంచనాకు రావాలి. అందుకు తగినట్టుగానే పొదుపు-మదుపు కేటాయింపులు జరపాలి. ‘అయినా, ఎప్పటి వరకో ఎదురుచూడటం ఎందుకు? తక్షణమే రెండో సంపాదనను సృష్టించుకోలేమా?’ అనుకునే వ్యక్తులూ ఉంటారు. అలాంటి వారు తమకంటూ ఓ సొంతిల్లు ఉంటే, అందులో ఒకట్రెండు పోర్షన్లు అద్దెకు ఇచ్చుకోవచ్చు. చాలామంది, ఇల్లాలు ముచ్చటపడిందనో పిల్లలు పోరుతున్నారనో అవసరం ఉన్నా లేకపోయినా కారు కొనేస్తుంటారు. కొత్త మోజు తీరిపోయాక... ఆ బండి పార్కింగ్‌కే పరిమితమై పోతుంది. ఆ వాహనాన్ని అద్దెకిస్తే... నెలనెలా ఆదాయం వస్తుంది! సిక్స్‌ప్యాక్ ట్రెండ్ మే ఎండలా మండిపోతున్న రోజుల్లో ఈఎమ్ఐ మీద కొనుక్కున్న ట్రెడ్మిల్, స్మార్ట్ బైక్ లాంటి జిమ్ ఎక్విప్మెంట్ బాల్కనీలో ఓ మూలన పడుంటాయి. వాటిని ఆన్లైన్ వేదికలపైన అద్దెకిచ్చుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలో వృథాగా ఉన్న మిగులు సొమ్మును ఆకర్షణీయమైన వడ్డీని అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు మళ్లించుకోవచ్చు. ఇవన్నీ, చిన్నపాటి సర్దుబాట్లతో తక్షణమే రెండో ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలు. ఈ ప్రణాళికను కనుక కచ్చితంగా అమలు చేస్తే ఇంటి అద్దె, కారు అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ... ఇలా వివిధ రూపాల్లో ‘పాసివ్ ఇన్కమ్’ మన పర్సులో పడిపోతుంది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకోడానికి నిపుణుల సాయంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నిస్తే, పరోక్ష ఆదాయం మరో రెండు రూపాల్లోనూ వస్తుంది. డబ్బును ఇన్వెస్ట్ చేయడం ఒక దారీ, కాలాన్నీ నైపుణ్యాన్నీ పెట్టుబడిగా పెట్టడం ఇంకో దారి. డబ్బు ప్లస్ నైపుణ్యం మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా అంగడి సరుకే. వస్తువు, సేవ, నైపుణ్యం... అన్నీ అమ్ముకోవచ్చు. కాకపోతే, మనకు మనం ప్రచారం చేసుకోవాలి. మనలోని కళకు బ్రాండ్ విలువ సృష్టించాలి. ఆకట్టుకునేలా రాయగలిగితే, అక్షరాలూ అదనపు ఆదాయ మార్గాలు అవుతాయి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్ పైనా పట్టు ఉన్నవారికి ప్రచురణ సంస్థలు అనువాదకులుగా అవకాశం ఇస్తున్నాయి. మంచి పారితోషికాన్నీ అందిస్తున్నాయి. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ట్యూటర్ అవతారం ఎత్తొచ్చు. నృత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ...ఇలా ఏ అభిరుచినైనా ఆదాయంగా తీర్చిదిద్దుకోవచ్చు. రియల్ ఎస్టేట్, బీమా రంగాల్లో మార్కెటింగ్ మాంత్రికుడు అయిపోవచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఛానెల్ ఓనర్, యోగా గురు, ఫిట్నెస్ ట్రెయినర్... అవతారమూ ఎత్తొచ్చు. ఇవన్నీ పాసివ్ ఇన్కమ్ పరిధిలోకే వస్తాయి. అభిరుచితో ముడిపడిన ఆదాయానికి పరిమితి ఉండదు, రిటైర్మెంటు ఉండదు. ఆ పనిలో మనకు అలసటా తెలియదు. కాకపోతే, మన నైపుణ్యానికి నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీనీ, కొత్తతరం అభిరుచినీ అందిపుచ్చుకోవాలి. మనసుకు ముసలితనం రాకుండా జాగ్రత్తపడాలి. ఈ ఆదాయం తక్షణ అవసరాలకు పాసివ్ ఇన్కమ్గా పనికొస్తుంది. రేపటి పాసివ్ ఇన్‌కమ్‌కు పెట్టుబడిగానూ ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో సహజీవనం. ట్రంప్ తుమ్మితే పడిపోవచ్చు. నిర్మలమ్మ నవ్వితే మళ్లీ లేచి కూర్చోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా, దలాల్ స్ట్రీట్‌ను పాసివ్ ఇన్కమ్ మార్గంగా ఎంచుకునేవారికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కొంత సురక్షితమైన మార్గం. క్రమానుగత పెట్టుబడి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఫార్ములా - 15్ల15్ల15 ప్రకారం... పదిహేనేళ్లపాటూ నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే... పదిహేను శాతం రాబడితో, పదహారో ఏడాది ఆ విలువ దాదాపు కోటి రూపాయలకు చేరుతుందని అంచనా. ఆ సొమ్మును ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైన ‘పాసివ్’ పద్ధతి. ఉదాహరణకు... ఒక్కొక్కటి వంద రూపాయల చొప్పున, కోటి రూపాయలతో లక్ష యూనిట్లు కొనుగోలు చేశామని అనుకుందాం. నెలనెలా యాభైవేల రూపాయల విలువైన యూనిట్లను సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (స్విప్) కింద నగదు రూపంలో ఉపసంహరించుకుంటే... ముప్పై ఏళ్లపాటూ నిశ్చింతగా స్థిరమైన రాబడిని అందుకున్నాక కూడా... సుమారు రూ.1.76 కోట్ల కార్పస్ అందుబాటులో ఉంటుందని నిపుణుల అంచనా. మ్యూచువల్ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ)లో పెరుగుదలతో ఇదంతా సాధ్యం అవుతుంది. స్థిరమైన రాబడి కోసం ఏటా డివిడెండ్లను అందించే పెద్ద కంపెనీల షేర్లనూ ఎంచుకోవచ్చు. నగదు ప్రవాహం అధికంగా ఉన్న లాభదాయక సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వాటాదారులకు లాభాలను పంచుతాయి. కోల్ ఇండియా, ఐటీసీ, ఓఎన్జీసీ మొదలైనవి ఆ జాబితాలోకి వస్తాయి. ఆ మొత్తం చిన్నదే అయినా, ఆదాయం స్థిరమైంది. మరో వైపున, మార్కెట్‌కు అనుగుణంగా షేర్ల విలువా పైపైకి పాకుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో సంపద తరగదూ, ఆదాయం ఆగదూ! ఇతర మార్గాలూ... బంగారాన్ని దేవుడి కరెన్సీగా అభివర్ణిస్తారు ‘రిచ్‌డాడ్ - పూర్‌డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కొద్దిపాటి ఒడుదొడుకులు ఉంటాయే తప్పించి, బంగారం ధర మరీ పతనమైపోయిన దాఖలాల్లేవు. ‘సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఢోకా లేదు’ అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఈ మధ్యే ప్రకటించారు కూడా. ఇరవై ఏళ్ల క్రితం బంగారంపైన లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే... ఇప్పుడు, తక్కువలో తక్కువ పన్నెండున్నర లక్షలు అందుకునేవాళ్లం. భవిష్యత్తులోనూ ఇదే హవా కొనసాగుతుందని అంచనా. స్థిరమైన ఆదాయం కావాలనుకునే సమయానికి ఆ పెట్టుబడిని కరిగించి ఏ ఫిక్స్డ్ డిపాజిట్‌గానో మార్చుకోవచ్చు. నేరుగా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే... రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి వేదికలు పాసివ్ ఇన్‌కమ్‌కు సరికొత్త వేదికలు అవుతున్నాయి. కాకపోతే, ఈ పెట్టుబడి విధానం మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆరేడు శాతానికి మించి రాబడిని ఇవ్వకపోవచ్చు కానీ, యాన్యుటీ ప్లాన్స్‌నూ తీసిపారేయలేం. పాసివ్ ఇన్కమ్లో రోజువారీ శ్రమ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఎప్పటికప్పుడు మార్కెట్ కదలికల్ని గమనించుకుంటూ ఉండాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. తేడా వస్తే, సంపద కరిగిపోతుంది. నెలవారీ సంపాదన బక్కచిక్కి పోతుంది. కాకపోతే ఒక షరతు... మీ పాసివ్ ఇన్కమ్ మీద అయినా, దాంతో ముడిపడిన పెట్టుబడుల మీద అయినా... మీకూ, మీ జీవిత భాగస్వామికి మాత్రమే నియంత్రణ ఉండాలి. మరొక్క సూచన. పూర్తిగా పాసివ్ ఇన్కమ్ మీదే ఆధారపడేవారికి, ప్లాన్-బి తప్పనిసరి. ఏ కారణం వల్ల అయినా, ఒకట్రెండు ఆదాయ మార్గాలు మూసుకుపోతే, తక్షణ సర్దుబాటు కోసం అదనపు నిధులనూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదొక సుదీర్ఘ ఆర్థిక ప్రయాణం. మార్కెట్లో కుదుపులు ఉంటాయి. అయినా, తట్టుకోవాలి. ఓపిక, ఆశావాదం... పాసివ్ ఇన్‌కమ్‌కు ఆర్థికేతర పెట్టుబడులు. * ఉద్యోగంలో ఉంటే... కలల్ని నిజం చేసుకోలేం. ఉద్యోగం వదిలేస్తే... వాస్తవ ప్రపంచంలో బతకలేం. కాబట్టి, మధ్యేమార్గమే ఉత్తమం. ఉద్యోగం చేస్తూనే కలల్ని నిజం చేసుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. మేనేజ్మెంట్ పట్టా అందుకోడానికి లక్షణమైన కొలువును వదులుకోవాల్సిన పన్లేదు. ఆన్లైన్లో కోర్సు పూర్తి చేయొచ్చు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఉపయోగించుకుని, అభిరుచులకూ కొంత సమయం కేటాయించు కోవచ్చు. ఇక స్టార్టప్ కల అంటారా? కొన్ని సంస్థలు ఇంట్రాప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్నాయి. మనం పనిచేస్తున్న కంపెనీ భాగస్వామ్యంలోనే కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? అంతిమంగా ఒకటే సూచన... ప్లే సేఫ్! బాగా ఆలోచించాకే... రెండో సంపాదనను కోరుకోవడం, ఉద్యోగ జీవితం నుంచి విముక్తిని ఆశించడం దురాశ కాదు. కానీ, ఆ వైపుగా అడుగులు వేసే ముందు, తక్షణ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 1. మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ఉందా? మెడికల్ ఎమర్జెన్సీలో ఆ మొత్తం సరిపోతుందా? 2. ఇంటి పెద్దగా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాల్సిన బాధ్యతా మీదే. ఏదైనా జరిగితే, మీరు లేకపోయినా కూడా... వాళ్లకు ఏ లోటూ రాకుండా భారీ మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకున్నారా? 3. గృహరుణం ఇంకా తీర్చాల్సి ఉందా? పెద్దపెద్ద అప్పులేమైనా ఉన్నాయా? 4. మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైనా, తట్టుకుని నిలబడేంత శక్తి మీకుందా? 5. హఠాత్తుగా ఆదాయం ఆగిపోయినా, కనీసం ఆరునెలల పాటూ ఇల్లు గడవడానికి ‘అత్యవసర నిధి’ ఏర్పాటు చేసుకున్నారా? 6. రెండో సంపాదన దారికి వచ్చేలోపు, మొదటి సంపాదన ఆగిపోతే ఏం చేస్తారు? మీ దగ్గర ప్లాన్-బి ఉందా? 7. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యాలు ఉన్నాయా? 8. మీ జీవిత భాగస్వామి కూడా సంపాదనాపరులేనా? 9. పిల్లల చదువులకు డబ్బు సిద్ధం చేసుకున్నారా? ... ఇందులో మిమ్మల్ని మీరు అడిగే, ప్రతి ప్రశ్నా కీలకమైందే. మీకు మీరు ఇచ్చుకునే ప్రతి జవాబూ ముఖ్యమైందే. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలే. అన్ని కోణాల నుంచీ ఆలోచించుకున్నాకే అడుగు ముందుకేయాలి. ప్రతి పద్దూ ప్రత్యేకమే! రేపటి ‘పాసివ్ ఇన్కమ్’కు... నేటి ‘యాక్టివ్ ఇన్కమ్’ బలమైన పునాది. వీలైనన్ని నిధులు సమీకరించుకోవాలి. ప్రతి పద్దుకూ స్థిరమైన ఆదాయవనరు ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు... కిరాణా సామాన్లకు నెలకు రూ.పదివేల వరకూ అవసరమైతే, ఆ మొత్తం బ్యాంకు వడ్డీ రూపంలో అందేలా కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఔషధాలు, పాల బిల్లు, పేపర్ బిల్లు, కేబుల్ బిల్లు, రవాణా ఖర్చులు... ఇలా ఇతర అవసరాలకు ఓ పాతిక వేలు తప్పనిసరి అనుకుందాం. సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా ఆ సొమ్ము చేతికి అందేలా జాగ్రత్తపడాలి. టర్మ్ పాలసీ, ఆరోగ్య బీమా, వార్షిక వైద్య పరీక్షలు... ఇలా దేని పద్దు దానిదే. పర్యటనల కోసం, చిన్నాచితకా బహుమతుల కోసం కూడా ఓ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల, డబ్బు కోసం తడుము కోవాల్సిన అవసరం రాదు. అలా అని మూలధనాన్ని కదిలించకూడదు. మొత్తం సొమ్మును ఒకే రంగం మీద ఇన్వెస్ట్ చేయకుండా... పొదుపు-మదుపులో ఎంతోకొంత వైవిధ్యాన్ని పాటించాలి. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్.. రిటైర్ ఎర్లీ (ఫైర్) - నవతరం ఆర్థిక స్వేచ్ఛా మంత్రం. మన రిటైర్మెంట్ వయసును ఎవరో ఎందుకు నిర్ణయించాలి? మనమేఓ తీర్మానానికి వచ్చేద్దాం. నాలుగు పదుల్లో ఉద్యోగ విరమణ చేస్తే పోలా?... అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇదంతా కాలి మీద కాలేసుకుని కూర్చోడానికి కాదు! కలల్ని నిజం చేసుకోడానికి. స్టార్టప్‌ను ప్రారంభించడం, విదేశాల్లో చదువుకోవడం, సరికొత్త కెరీర్‌ను నిర్మించుకోవడం... ‘ఫైర్’ ప్రధాన లక్ష్యాలు అవుతున్నాయి. అందుకు అవసరమైన పెద్ద మొత్తం సమకూరే వరకూ... హంగూ ఆర్భాటాల్లేకుండా బతికేస్తారు. పెద్దపెద్ద అప్పుల జోలికి వెళ్లరు. కమిట్మెంట్స్ పెట్టుకోరు. వార్షిక వ్యయాలకు ఇరవై అయిదు రెట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకోవడం, ఆ ఏడాది ఏర్పడిన లోటును మరుసటి ఏడాదిలోపు ఏదో ఓ రూపంలో భర్తీ చేసుకోవడం... ఈ రెండు నిర్ణయాలూ ‘ఫైర్’లో చాలా కీలకం. ఆ ప్రయోగంలో చేతులు కాల్చుకుని మళ్లీ కార్పొరేట్ పౌరసత్వం తీసుకున్నవారు ఉన్నారు, కంపెనీలు స్థాపించి ఘన విజయాలు సాధిస్తున్నవారూ ఉన్నారు
- ఒక్కరోజు నిద్ర తగ్గినా...
ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది?’... చాలామంది నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది?’... చాలామంది నిద్రని ఇలాగే తేలిగ్గా తీసుకుంటారు. శారీరక ఆరోగ్యం బాగుండాలంటే చక్కని ఆహార నియమాలు పాటిస్తూ, మంచి వ్యాయామం చేస్తే చాలనుకుంటారు... కానీ వీటితోపాటూ మంచి నిద్రకూడా ముఖ్యమేనంటోందీ పరిశోధన. కువైట్‌లోని డాస్మేన్ డయాబెటిస్ ఇన్స్టిట్యూట్ విశ్రాంతికీ, దీర్ఘకాలిక వ్యాధులకూ ఉండే సంబంధంపైన పరిశోధన చేసింది. మనం నిద్ర పోకుండా ఉన్నప్పుడు మెదడు మనం ఒత్తిడిలో ఉన్నామేమో అనుకుంటుంది. దాన్ని తగ్గించడానికి కార్టిసాల్ అనే హార్మోన్‌ని మామూలు కన్నా ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇలా ‘ఒక్కరోజే కదా’ అని సర్దిచెప్పుకుంటూ మనం పదేపదే నిద్రకు దూరమవుతూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా జమవుతూ చివరికి శరీరంలో కొన్ని వాపులకి కారణం అవుతుంది. మరోపక్క నిద్రలేమితో కణాలు శక్తిని కోల్పోయి... ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాన్ని కోల్పోతాయి. దాంతో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దడానికి శరీరం మోనోకైట్స్ అనే వ్యాధినిరోధక కణాలని విడుదల చేస్తుంది. ఈ పరిస్థితీ పదేపదే కొనసాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ వచ్చి ఊబకాయం, గుండెజబ్బులతోపాటూ ఇతర దీర్ఘకాలిక సమస్యలు రావొచ్చట. అందుకే పని ఒత్తిడీ, వారాంతం- పార్టీలు అనే సాకులు చెప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం అంటుందీ పరిశోధన. sleeplessness, insomnia, night sleep, sleeping
- శాలరీ అకౌంట్.. బ్యాంకులు చెప్పని బెనిఫిట్స్ SALARY ACCOUNT advantages
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు. క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి. రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు శాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలు వేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి. ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులు బ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి. ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్ శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి. ఉచిత డిజిటల్ లావాదేవీలు సాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి. ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులు శాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది. ఉచిత ఏటీఎం లావాదేవీలు అనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు. జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ చాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. salary account salary slip state bank of india SBI AP Teachers Latest News
- వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ
విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు.. ప్రజా సమస్యలపై మాట్లాడరు.. కానీ జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటారు. నెలకు రూ. లక్షా 75వేలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అసెంబ్లీ (Assembly)కి రారు.. ప్రజా సమస్యలపై మాట్లాడరు.. కానీ జీతాలు (Salaries) మాత్రం సమయానికి తీసుకుంటారు. నెలకు రూ. లక్షా 75 వేలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ (AP)లో కూటమి (Kutami)కి 164 స్థానాలు లభించగా వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమం తర్వాత అసెంబ్లీ గడప కూడా తొక్కలేదు. ఇటీవల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి హాజరైన వైఎస్సార్సీపీ సభ్యులు నానా హంగామా సృష్టించి 10 నిముషాల తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన విశేషాలు చదవండి 👈
- Youth For India Fellowship | గ్రామీణ భారతంలో అధ్యయనానికి ‘యూత్‌ఫర్ ఇండియా ఫెలోషిప్’.. స్టైపెండ్ ఎంతంటే?
#YouthForIndiaFellowship గ్రామాల్లో మార్పు కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతకు భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్ ఫర్ ఇండియా’ (YouthforIndia) పేరిట ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. Youth For India Fellowship | ఇంటర్నెట్ డెస్క్: దేశానికి జీవనాడిగా ఉన్న గ్రామాల్లో మార్పు కోసం పనిచేయాలనే తపన ఉన్న యువతకు భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI Foundation) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్ ఫర్ ఇండియా’ (YouthforIndia) పేరిట ఇచ్చే ఫెలోషిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ.. తద్వారా వారికి ఆర్థిక చేయూతనందిస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అక్కడి స్థితిగతుల్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న యువకులు ఈ ఫెలోషిప్‌లకు ఆన్లైన్లో https://youthforindia.org/ దరఖాస్తు చేసుకోవచ్చు. యూత్ ఫర్ఇండియా ఫెలోషిప్(2025-26)కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలివే.. ఫెలోషిప్ వ్యవధి ఎంత? అర్హతలేంటీ? ఎస్బీఐ ఫెలోషిప్ వ్యవధి 13 నెలలు. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు 2025 అక్టోబర్ 1నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. భారతీయ పౌరులై ఉండాలి. నేపాల్/భూటాన్ లేదా ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ (ఐఓసీ) ఉన్నవారూ అర్హులే. ఈ ప్రోగ్రామ్ ప్రారంభమయ్యే రోజుకు అభ్యర్థుల వయసు 21 - 32 ఏళ్ల లోపు ఉండాలి. చురుకుదనం, నాయకత్వ నైపుణ్యాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం కావాలనుకొనే వారికి ప్రాధాన్యం. ముఖ్యంగా ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది. 13 నెలల పాటు కొనసాగే ఈ గ్రామీణ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో కొనసాగుతూ.. సవాళ్లతో కూడిన గ్రామీణ పరిస్థితులను స్వీకరించేందుకు సిద్ధమై ఉండాలి. ఎంపిక విధానం? యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపిక విధానం దశల వారీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలుత అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశలో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్లైన్ అసెస్మెంట్ అందించాల్సి ఉంటుంది. ఇందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, అభ్యర్థి సూచనలను అడుగుతారు. అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వీటి ఆధారంగానే తుది ఎంపిక చేపడతారు. అనంతరం ఆఫర్ లెటర్‌తో పాటు ప్రోగ్రామ్ వివరాలు, ఫెలోషిప్‌లో నిబంధనలతో కూడిన వివరాలను అందజేస్తారు. స్టైపెండ్ ఎంత? ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16వేలు చొప్పున స్టైపెండ్ రూపంలో ఇస్తారు. స్థానికంగా ప్రయాణ ఖర్చులకు రూ.2000; ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. అలాగే, ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90,000 అందజేస్తారు. ఎంపికైన వారికి తమ ఇంటి నుంచి బయల్దేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకొనే వరకు ప్రయాణానికి 3ఏసీ రైలు ఛార్జీల ఖర్చులు, శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాలకు అవసరమైన ఖర్చుల్ని సైతం చెల్లిస్తారు. వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుంది. 2025-26కు సంబంధించి ఎస్బీఐ యూత్‌ఫర్ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు స్టేటస్, తుది గడువు వంటి వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి కోసం ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జీఓలు ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి. క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోడానికి ఎన్జీవో కేంద్రాలు సహకరిస్తాయి. అనంతరం ప్రోగ్రామ్ లక్ష్యానికి అనుగుణంగా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. 2011లో మొదలైన ఈ ఫెలోషిప్ ద్వారా దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 250కి పైగా గ్రామాల్లో 640మందికి పైగా ఫెలోషిప్ గ్రహీతలు పల్లెల్లో మార్పు కోసం కృషిచేశారు. ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో తెలుసుకోండి.
- Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..
#aadhaar #voterID #aadhaar_voterID ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నకిలీ ఓటరు జాబితా ద్వారా బీజేపీ.. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గెలిచిందంటూ టీఎంసీ ఇటీవల ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు కార్డును.. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ సెక్రటరీతో పాటూ యూఐడీఏఐ సీఈవోతో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) భేటీ కానున్నట్లు తెలుస్తోంది ఎలక్టోరల్ డేటాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు (link voter ID with Aadhaar) తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులతో సీఈసీ మంగళవారం సమావేశం అవనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపారు. సుమారు 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓటర్ ఐడీ కార్డు డూప్లికేట్ సమస్యకు మూడు నెలల్లో చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏప్రిల్ 30లోగా అన్ని జాతీయ, రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి కూడా సూచనలు కోరతారని చెబుతున్నారు. అదేవిధంగా దీనిపై బూత్ స్థాయి ఏజెంట్లు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లతో పాటూ ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఈసీ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించేందుకు చట్టం అనుమతిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఓటర్ కార్డును ఆధార్‌తో ఆనుసంధానం చేసే అంశంపై ఎలాంటి గడువూ నిర్దేశించలేదని ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. అదేవిధంగా ఓటరు జాబితాలతో తమ ఆధార్ వివరాలను అనుసంధానించని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించరని కూడా ప్రభుత్వం పేర్కొంది.
- పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు: హైకోర్టు ఆదేశం
🔸నిర్ధారించుకున్నాకే చర్యలు... పోలీసులకు కేరళ హైకోర్టు ఆదేశం 🔸ఆందోళనకరంగా విద్యార్థుల ప్రవర్తన 🔸స్కూళ్లలోకి ఆయుధాలు, డ్రగ్స్, మద్యం 🔸టీచర్లపై బెదిరింపులు, భౌతిక దాడులు 🔸సదుద్దేశంతో శిక్షించినా వారిపై కేసులు 🔸ఉపాధ్యాయుల చేతిలో బెత్తం తప్పనిసరి 🔸అప్పుడే పిల్లల్లో భయం: న్యాయమూర్తి కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు. ప్రాథమికంగా దర్యాప్తు చేసి, నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి’’ అని పోలీసులను ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచరుకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు, యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీచర్లనే బెదిరిస్తున్నారు. వారిని ఘెరావ్ చేస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అన్నారు. క్లాసురూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిసారీ బెత్తం వాడాలని కాదు. అది టీచర్ల చేతిలో ఉంటే చాలు, తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి. అది నేరమేమీ కాదు. పైగా అంతిమంగా మన విద్యావ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. దీన్నుంచి వారికి రక్షణ కల్పించాలి. లేదంటే పని చేయలేరు’’ అన్నారు. ‘‘టీచర్లంతా సాధుసత్తములని చెప్పడం లేదు. వాళ్లలోనూ కొందరు చెడ్డవాళ్లు ఉండవచ్చు. కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు’’ అన్నారు.
- ఏపీలో ఒంటిపూటబడులు - ఉత్తర్వులు విడుదల
#halfdayschools ఆంధ్రప్రదేశ్‌లో హాఫ్-డే స్కూల్స్ అమలు – అధికారిక ఉత్తర్వులు తేదీ: 13-03-2025 ప్రస్తుత డైరెక్టర్: విజయ రామ రాజు. వి, IAS Rc. No . 30027/2/2023-A&I ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంవత్సరం 2024-25 నకు సంబంధించి మార్చి 15, 2025 నుంచి తరగతులు I నుంచి IX వరకు హాఫ్-డే స్కూల్స్ గా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హాఫ్-డే పాఠశాలలు 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 📌 పాఠశాలల సమయాలు ఉదయం: 7:45 AM నుంచి 12:30 PM వరకు SSC పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు: మధ్యాహ్నం 1:00 PM నుంచి 5:00 PM వరకు ఈ కొత్త సమయాలు ప్రభుత్వ, జెడ్పి, మునిసిపల్, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలకు వర్తిస్తాయి. 🏫 ప్రధాన మార్గదర్శకాలు 🔹 తప్పనిసరిగా హాఫ్-డే స్కూల్ సమయాలను అమలు చేయాలి. 🔹 ఏప్రిల్ నెలలోని రెండో శనివారం పనిచేసే రోజుగా పరిగణించాలి. 🔹 గ్రామ పంచాయతీ & RWS డిపార్టుమెంట్ల సహకారంతో తాగునీరు అందుబాటులో ఉండాలి. 🔹 చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాలలో తరగతులు నిర్వహించకూడదు. 🔹 పిల్లలకు ఒఆర్ఎస్ (ORS) పొడియాలు అందుబాటులో ఉంచాలి. 🔹 మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగ అందించేందుకు స్థానిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో సహకరించాలి. 🔹 మధ్యాహ్న భోజనం (Mid-Day Meals) తరగతుల అనంతరం మాత్రమే అందించాలి. 🔹 విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను గమనిస్తూ అధికారి స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 📢 గమనిక: ఈ మార్గదర్శకాలు SA-2 పరీక్షల షెడ్యూల్‌కు ఎటువంటి అంతరాయం కలిగించకూడదు. 💡 మీ అభిప్రాయాన్ని తెలియజేయండి! ఈ మార్పుల వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? హాఫ్-డే స్కూల్స్ అమలుతో విద్యార్థుల అభ్యాసం పై ప్రభావం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. 📢 మన బ్లాగ్‌కు మద్దతునివ్వండి! ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, దీన్ని మీ స్నేహితులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో షేర్ చేయండి. మన బ్లాగ్ అభివృద్ధికి మీ సహకారం అమూల్యం! 🙌💙
- AP News: ఏపీలో కొత్తగా ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే!
#apnews #APMLCs #AP_New_MLCs ఆంధ్రప్రదేశ్(AP News)లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. అమరావతి: ఆంధ్రప్రదేశ్(AP News)లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న కొణిదల నాగేంద్రరావు (జనసేన), బీద రవిచంద్ర(తెదేపా), బి.తిరుమల నాయుడు(తెదేపా), కావలి గ్రీష్మ ప్రసాద్ (తెదేపా), సోము వీర్రాజు (భాజపా) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో, ఐదు స్థానాలకు సంబంధించి మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి, ఇది రాజకీయ పరిణామాలను సూచిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది, ఈ సమయంలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం కలిగి ఉన్నారు. అయితే, ఈ సందర్భంలో ఎలాంటి ఉపసంహరణలు జరగలేదు. ఈ ఐదు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఇందులో కొణిదల నాగేంద్రరావు (జనసేన), బీద రవిచంద్ర (తెదేపా), బి. తిరుమల నాయుడు (తెదేపా), కావలి గ్రీష్మ ప్రసాద్తెదేపా), మరియు సోము వీర్రాజు (భాజపా) ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఈ అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులపై ప్రభావం చూపించవచ్చు, మరియు ఇది అభ్యర్థుల మద్దతు ఉన్న పార్టీలు, వారి విధానాలు మరియు ప్రణాళికలపై ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయడం ద్వారా, అధికారికంగా వారి ఎన్నికను గుర్తించడంతో పాటు, వారు తమ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దృశ్యం ఎలా మారుతుందో చూడాలి.
- School Attendance App: స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు!
School Attendance App: స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పుడే ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు! What's new Improved the app performance About this app Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance.









