top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నిక అసలు ఎందుకో తెలుసా.. ఇవాళ ఓటు వేయకపోతే ఏమవుతుంది

    MLC Elections 2025: ఎమ్మెల్సీ ఎన్నిక అసలు ఎందుకో తెలుసా.. ఇవాళ ఓటు వేయకపోతే ఏమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలను ఎందుకు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్సీలు ఏమి చేస్తారు. శాసనమండలి సభ్యుల బాధ్యత ఏమిటి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఏమవుతుందనేది ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో 6 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.తెలంగాణలో రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో పెట్టగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో బీజేపీ మాత్రమే తమ అభ్యర్థులను పోటీకి పెట్టింది. పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. సాధారణంగా ఐదేళ్లకోసారి ఎమ్మెల్యేలను ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించి ఎన్నుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది, ఓటు వేయ్యొచ్చు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండదు. ఏ రంగానికి సంబంధించిన ఎన్నికైతే ఆ రంగానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఐదేళ్లకోసారి తప్పనిసరి, కానీ శాసనమండలి ఉండాలనే ప్రత్యేక నిబంధన ఏమీ లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉంది. అసలు ఎమ్మెల్సీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటుచేశారు. వీళ్లకుఉండే అధికారాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రాష్ట్రాల్లో మాత్రమే.. శాసనమండలి ఏర్పడాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. కనీసం 40 మంది సభ్యులు ఉండాలి. అదే సమయంలో శాసనసభ్యుల సంఖ్యలో 1/3 వ వంతుకు మించకూడదు. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి వ్యవస్థను ఏర్పాటుచేయడానికి ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 118 నుంచి 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. దేశంలో 31 చోట్ల శాసనసభ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 15 రాష్ట్రాల్లో మాత్రమే 119 లేదా అంతకంటే ఎక్కువ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం శాసనమండలి వ్యవస్థ అందుబాటులో ఉంది. శాసనమండలికి ప్రత్యేక అధికారాలు ఏమి లేకపోయినప్పటికీ, వివిధ రంగాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా చర్చించడానికి, ఆయా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడానికి శాసనమండలికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం లేదా శాసనసభ ఏదైనా చట్టాన్ని చేస్తే.. దానిని శాసనమండలి తప్పనిసరిగా ఆమోదించాలనే నిబంధన లేదు. కానీ శాసనసభ ఆమోదించిన తర్వాత.. శాసనమండలి ఆమోదం తెలపకపోయినా ఒకసారి శాసనమండలికి వెళ్లి వస్తే శాసనసభ రెండోసారి ఆమోదిస్తే అది నేరుగా ఆమోదించినట్లు పరిగణిస్తారు. శాసనమండలి సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు. మంత్రి మండలిలోనూ శాసనమండలి సభ్యులకు అవకాశం ఇవ్వొచ్చు. శాసనమండలి సభ్యుడు ముఖ్యమంత్రిగానూ ఉండటానికి అవకాశం ఉన్నప్పటికీ శాసనమండలి సభ్యుల అధికారాలు పరిమితంగానే ఉంటాయి. శాసనమండలి అసలు ఉద్దేశం.. శాసనమండలిలో పలు విభాగాలు ఉంటాయి. సాధారణంగా 1/3 వంతు సభ్యులను శాసనసభ్యుల కోటాలో ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల సభ్యుల కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. ఇక ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా నుంచి కొందరిని ఎన్నుకోగా.. రాష్ట్రంలో సీట్ల సంఖ్య ఆధారంగా గవర్నర్ కోటాలో కొందరిని ఎన్నుకుంటారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోదం తెలుపుతారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, వివిధ రంగాల్లో పేర్గాంచిన వారిని శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తున్న సందర్భాలు ఉన్నాయి. శాసనమండలి సభ్యులను ఎన్నుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం.. వివిధ రంగాలకు సంబంంధించిన ప్రతినిధులుగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓటు వేయకపోవతే ఏమవుతుంది. పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావొచ్చు. ఓటరుగా నమోదై ఓటు పొందిన వ్యక్తులు మాత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఉపాధ్యాయస్థానం నుంచి కేవలం ఓట్లు కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తప్పనిసరి కాదు. కానీ బాధ్యతగా భావించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్లు లేదా టీచర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవల్సి ఉంటుంది. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో సరైన వ్యక్తి శాసనమండలికి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే నిబంధన ఏమీ లేదు.

  • 8 మంది ఓపీఓలు సస్పెన్షన్ - కాకినాడ కలెక్టర్

    కాకినాడ: 8 మంది ఓపీఓలు సస్పెండ్- కలెక్టర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరుకాని 8 మంది ఓపీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కాకినాడ కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. కాకినాడ డివిజన్లో ముగ్గురు, పెద్దాపురం డివిజన్లో ఐదుగురు బుధవారం పోలింగ్ సామగ్రి తీసుకువెళ్లే కార్యక్రమానికి హాజరు కాలేదున్నారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

  • తూర్పు- పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లు ఇవే ! East West MLC Elections Polling Stations

    East-West Godavari MLC Elections Polllng stations list ఏపీ టీచర్స్ టీవీ: కాకినాడ, ఫిబ్రవరి 26, 2025. ఈ నెల 27న జరిగే తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ జాబితాను బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో విడుదల చేశారు. East West MLC Elections Polling Stations కాకినాడ జిల్లాలో ఈ ఎన్నికల నిమిత్తం మొత్తం 98 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ నెంబర్ తో పాటు పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని కూడా ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పోలింగ్ స్టేషన్ 13- ఎంపీడీవో ఆఫీస్, మీటింగ్ హాల్ జగ్గంపేట, 14-గ్రామపంచాయతీ ఆఫీస్ జగ్గంపేట, 15- గ్రామ సచివాలయం బిల్డింగ్ జగ్గంపేటకు 2; పోలింగ్ స్టేషన్ 16-తహసీల్దార్ కార్యాలయం ఏలేశ్వరం, 17-MPP స్కూల్ ప్రధాన భవనం, రమణయ్యపేట, ఏలేశ్వరం, 18-మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల, ఎర్రవరం, ఏలేశ్వరం,. పోలింగ్ స్టేషన్ 19-ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్ ప్రత్తిపాడు, 20-తహసీల్దార్ కార్యాలయం ప్రత్తిపాడు, 21-తహసీల్దార్ కార్యాలయం శంఖవరం, 22-మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మీటింగ్ హాల్ శంఖవరం; పోలింగ్ స్టేషన్ 23-తహసీల్దార్ కార్యాలయం వీసి రూమ్ రౌతులపూడి, 24- మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ న్యూ బిల్డింగ్ స్టాఫ్ రూమ్ రౌతులపూడి; పోలింగ్ స్టేషన్ 25-తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ హాల్ నార్త్ సైడ్ రూమ్ కోటనందూరు. 26-మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిల్డింగ్ మీటింగ్ హాల్ కోటనందూరు; పోలింగ్ స్టేషన్ 27- తుని ఎంపీడీవో కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసు రూమ్, 28-తుని టౌన్ సచివాలయం12, 29-తుని సిడిపిఓ అర్బన్ ఆఫీస్ గోడౌన్ రూమ్, 30-తుని టౌన్ సచివాలయం13, 31-తుని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ బిల్డింగ్ ట్రావెలర్స్ బంగ్లా సీతారాంపురం, పోలింగ్ స్టేషన్ 32- తొండంగి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ భవనం, 33- తొండంగి తహసీల్దార్ కార్యాలయం మీటింగ్ హాల్, పోలింగ్ స్టేషన్34-కిర్లంపూడి తహసీల్దర్ కార్యాలయం, 35- కిర్లంపూడి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం, పోలింగ్ స్టేషన్ 36- పెద్దాపురం లూధరన్ హై స్కూల్ ఈస్ట్ ఫేసింగ్ రూమ్ నెంబర్ 6, 37-పెద్దాపురం లూధరన్ హై స్కూల్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 9, 38-పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహరాణి కళాశాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్1, 39- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహారాణి కళాశాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 2, 40- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహా రాణి కళాశాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 6, 41- పెద్దాపురం ఎస్ఆర్వీబీఎస్జేబీ మహారాణి కళాశాల ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ రూమ్ నెంబర్ 7, పోలింగ్ స్టేషన్ 42-గండేపల్లి ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్, 43- గండేపల్లి మండల మహిళ సమైక్య భవనం. పోలింగ్ స్టేషన్ 86-గొల్లప్రోలు ఎస్ఎస్పీఎల్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్1, 87-గొల్లప్రోలు ఎస్ఎస్పీఎల్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్2, 88-గొల్లప్రోలు ఎస్ ఎస్పీఎల్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్3, పోలింగ్ స్టేషన్ 89- యు.కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ రూమ్, 90-యు. కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్స్2, 91-యు.కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4, పోలింగ్ స్టేషన్ 92-పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ స్టాప్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్, 93-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్, 94- పిఠాపురం ఎంపీడీవో కార్యాలయం స్టాఫ్ రూమ్, 95-పిఠాపురం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్, 96-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్, 97-పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ఈస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్, పోలింగ్ స్టేషన్ 98-సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు స్కూల్, నార్త్ సైడ్ రూమ్ సామర్లకోట, 99-సామర్లకోట యార్లగడ్డ అక్కిరాజు స్కూల్ నార్త్ వెస్ట్ సైడ్ రూమ్, 100-సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ న్యూ బిల్డింగ్, 101- సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ నెంబర్ 2, 102-సామర్లకోట బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ నెంబర్ 5, పోలింగ్ స్టేషన్ 103-కాకినాడ పట్టణం జిల్లా హౌసింగ్ మేనేజర్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ సైడ్ రూమ్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు, 104-కాకినాడ పట్నం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ ఈస్ట్ బ్లాక్, 2 రూమ్, 105.మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ 1 రూమ్, శ్రీనగర్ కాకినాడ,. 106. మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ సౌత్ సైడ్ 2 రూమ్, శ్రీనగర్ కాకినాడ,. 107.రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4 ఆనంద భారతి కాకినాడ,. 108. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఈస్ట్ బ్లాక్ 2 రూమ్ సాంబమూర్తి నగర్ కాకినాడ,. 108. A.సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్సి స్కూల్ ఈస్ట్ బ్లాక్ 3 రూమ్ సాంబమూర్తి నగర్ కాకినాడ,. 109. బచ్చు రాము మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చర్చ్ స్క్వేర్ ఈస్ట్ సైడ్ 2 రూమ్ , జగన్నాధపురం, కాకినాడ,. 110 .ఆంధ్ర పాలిటెక్నిక్ రూమ్ నెంబర్ ఎల్ 11, జగన్నాధపురం కాకినాడ,. 111.జిఎంసి బాలయోగి మున్సిపల్ హై స్కూల్ సౌత్ సైడ్ బ్లాక్ లిస్టు సైడ్ 1 రూమ్, కాకినాడ,. 112 శ్రీ లక్ష్మీ నారాయణ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ వెస్ట్ బ్లాక్ సౌత్ సైడ్ బిల్డింగ్ 1 రూమ్ ,జే రామారావు పేట కాకినాడ,. 113. థి కోకనాడ అన్నదాన సమాజం వెస్ట్ సైడ్ బ్లాక్ డైనింగ్ హాల్ సినిమా రోడ్ కాకినాడ, 114. రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ వెస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 1, ఆనంద భారతి కాకినాడ,. 115. పిఠాపురం రాజా జూనియర్ కాలేజ్ ఎస్ ఆర్ ఎమ్ టి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ సైడ్ ఫస్ట్ రూమ్ బాలాజీ చెరువు జంక్షన్ కాకినాడ,. 116. ఎస్ . ఈ ఆర్ అండ్ బి ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్త్ రూమ్, నియర్ కలెక్టర్ ఆఫీస్, కాకినాడ,. 117. జిల్లా ప్రజా పరిషత్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ సైడ్ రూమ్ రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు కాకినాడ,. 118. పి ఆర్ హై స్కూల్ గర్ల్స్ నియర్ టిటిడి కళ్యాణ మండపం ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ రూమ్ నెంబర్ 1,. 119. పి ఆర్ హై స్కూల్ గర్ల్స్ నియర్ టిటిడి కళ్యాణమండపం ,ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ రూమ్ నెంబర్ 2,. కాకినాడ. 120. మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఈస్ట్ బ్లాక్ సైడ్ ఫస్ట్ రూమ్ గాంధీనగర్ కాకినాడ,. 121. లక్ష్మీ మాలకొండయ్య మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ ఈస్ట్ సైడ్ న్యూ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ ప్రతాప్ నగర్ కాకినాడ,. 122. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ఆర్ సి సి బిల్డింగ్ సౌత్ సైడ్ రూమ్ శ్రీరామ్ నగర్ కాకినాడ,. 123 .గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఎల్ 5 రూం, ద్వారకా నగర్, కాకినాడ,. 124. గవర్నమెంట్ మహిళా పాలిటెక్నిక్ ఎల్ 4 రూమ్, నెంబర్ ద్వారకా నగర్ కాకినాడ,. 125. SRPKM స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ ఈస్ట్ బ్లాక్ నాథ్ సైడ్ 1 రూమ్, గైగులపాడు, కాకినాడ, . 126. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ సౌత్ సైడ్ సెకండ్ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ రమణయ్యపేట కాకినాడ ,. 127. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ సౌత్ సైడ్. సెకండ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఏపీఎస్పీ క్వార్టర్స్ కాకినాడ ,. 128.జిల్లా పరిషత్ హై స్కూల్ సౌత్ సైడ్ సెకండ్ బిల్డింగ్ ఫోర్త్ రూమ్ ఏపీఎస్పీ కాకినాడ రూరల్ ,. 129 .మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ సౌత్ సైడ్ రూమ్ రమణయ్యపేట కాకినాడ,. 130.మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ ఏపీఎస్పీ క్వార్టర్స్ రమణయ్యపేట కాకినాడ రూరల్ ,. 131.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ ఫస్ట్ రూమ్ వాకలపూడి, కాకినాడ రూరల్ ,. 132. జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ సౌత్ సైడ్ బిల్డింగ్ మిడిల్ రూమ్ వాకలపూడి, కాకినాడ రూరల్,. 133. జిల్లా పరిషత్ హై స్కూల్ ఓఎన్జిసి సౌత్ సైడ్ ఫస్ట్ రూమ్ తూరంగి కాకినాడ రూరల్,. 134. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ నార్త్ సైడ్ రాజుల తూరంగి , కాకినాడ రూరల్,. 135.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ సూర్యారావుపేట ,ఇంద్ర పాలెం కాకినాడ ,. 136.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ వెస్ట్ సైడ్ బిల్డింగ్ సౌత్ సైడ్ రూమ్ సూర్యారావుపేట ఇంద్ర పాలెం కాకినాడ రూరల్,. 137. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ న్యూ బిల్డింగ్ సౌత్ సైడ్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ సెకండ్ రూమ్ ఇంద్రపాలెం సూర్యారావుపేట కాకినాడ రూరల్ ,. 138.గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హై స్కూల్ పెదపూడి రూమ్ నెంబర్ 4,. 139.గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హై స్కూల్ పెదపూడి రూమ్ నెంబర్ 5,. 140. zpp బాయ్స్ హై స్కూల్ జి మామిడాడ పెదపూడి,. 141.జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ రూమ్ కరప,. 142. జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ వెస్ట్ సైడ్ రూమ్ కరప ,. 143. మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్ వెస్ట్ సైడ్ రూమ్ సెకండ్ రూమ్ కరప,. 144.మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ సైడ్ వి సీ హాల్, తాళ్లరేవు,. 145.గ్రామపంచాయతీ ఆఫీస్ పటవల గ్రామం ఈస్ట్ సైడ్ సచివాలయం పటవల,. 146.గ్రామపంచాయతీ ఆఫీస్ సుంకరపాలెం విలేజ్ ఈస్ట్ సైడ్ సచివాలయం రూమ్ సుంకర పాలెం, 173.మండల ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 1, గ్రౌండ్ ఫ్లోర్ కాజులూరు,. 174.మండల్ ప్రజాపరిషత్ ప్రైమరీ స్కూల్ న్యూ బిల్డింగ్ నార్త్ సైడ్ రూమ్ నెంబర్ 2, గ్రౌండ్ ఫ్లోర్ కాజులూరు ,. 175. స్త్రీ శక్తి భవన్ ఎన్ఆర్ఈజీఎస్ మీటింగ్ హాల్ రూమ్ కాజులూరు ,. 176.ఎక్స్ ఎంపీపీ రూమ్ ఎంపీడీవో ఆఫీస్ కాజులూరు,. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వాటిని గుర్తించి గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ప్రకటనలో కోరారు. ఈ లింకు నొక్కి మీ ఓటు వివరాలు పోలింగ్ స్టేషన్ అడ్రస్ తో సహా చూడవచ్చు

  • కాకినాడ: రేపు అన్ని పాఠశాలలకు సెలవు

    కాకినాడ: రేపు అన్ని పాఠశాలలకు సెలవు కాకినాడ: రేపు అన్ని పాఠశాలలకు సెలవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ షామ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లయితే వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో పర్యవేక్షణ చేయాలని సూచించారు.

  • ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల పన్నాగం

    8th class students set sodium bomb in cistern of wash room to kill their teacher in bilaspur of chhattisgarh ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న అయిదుగురు విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల మరుగుదొడ్డిలో పేలుడు పదార్థం అమర్చిన వైనం బిలాస్‌పుర్‌: ఉపాధ్యాయురాలిపై కక్ష పెంచుకున్న అయిదుగురు విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక రచించారు. సోడియం నీటితో కలిసినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆన్‌లైన్‌ వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు వాష్‌రూంకు వచ్చే సమయంలో సిస్టర్న్‌ (మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటితొట్టె) ఔట్లెట్‌లో సోడియం అమర్చారు. ఇంతలో నాలుగో తరగతి విద్యార్థిని ఫ్లష్‌ను ఉపయోగించడంతో పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ నెల 21న  ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ టీవీ ఫుటేజీని  పరిశీలించిన పోలీసులు ముగ్గురు విద్యార్థినులు సహా మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 23న నలుగురిని అరెస్టు చేసి జువైనల్‌ హోంకు తరలించినట్లు తెలిపారు. మరో విద్యార్థి వేరే ఊర్లో ఉండటంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదన్నారు. అరెస్టైన నలుగురూ 8వతరగతి విద్యార్థులని వెల్లడించారు.

  • DSC నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ మరోసారి క్లారిటీ

    DSC నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, అది కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలతో డీఎస్సీ పోస్ట్ పోన్ అయిందన్నారు. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే 16387 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ అకడమిక్ ఇయర్ కే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా.. ఏప్రిల్ లేదా మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

  • తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన

    తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన తల్లికి వందనం(రూ.15,000), అన్నదాత సుఖీభవ(రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా, ఏడాదికి రూ. 250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.

  • AP SCERT : 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

    ఆంధ్రప్రదేశ్ SCERT: 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ 10వ తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్ట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. SCERT డైరెక్టర్ శ్రీ విజయ్ రామ రాజు V, IAS గారి ప్రకటన ప్రకారం, ముఖ్యమైన తేదీలు, పరీక్షా విధానాలు, మరియు మార్గదర్శకాలను వెల్లడించారు. గ్రాండ్ టెస్ట్ పరీక్ష తేదీలు & టైమ్‌టేబుల్ 10వ తరగతి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు మార్చి 3, 2025 నుండి మార్చి 13, 2025 వరకు  నిర్వహించబడతాయి. ఈ పరీక్ష విద్యార్థుల సిద్ధతను మరియు ప్రదర్శనను మెరుగుపరిచేందుకు ఉద్దేశించబడింది. SSC గ్రాండ్ టెస్ట్ టైమ్‌టేబుల్ – 2024-25: తేదీ రోజు విషయము గరిష్ట మార్కులు సమయం 03-03-2025 సోమవారం మొదటి భాష (గ్రూప్ A) 100 1:30 PM – 4:45 PM 04-03-2025 మంగళవారం రెండవ భాష 100 1:30 PM – 4:45 PM 05-03-2025 బుధవారం ఇంగ్లీష్ 100 1:30 PM – 4:45 PM 06-03-2025 గురువారం మొదటి భాష పేపర్ II (కాంపోజిట్ కోర్సు) 30 1:30 AM – 3:15 AM 07-03-2025 శుక్రవారం గణితం 100 1:30 PM – 4:45 PM 10-03-2025 సోమవారం భౌతిక శాస్త్రం 50 1:30 AM – 3:30 AM 11-03-2025 మంగళవారం జీవశాస్త్రం 50 1:30 AM – 3:30 AM 12-03-2025 బుధవారం OSSC ప్రధాన భాష పేపర్-II 100 1:30 PM – 4:45 PM 13-03-2025 గురువారం సామాజిక శాస్త్రం 100 1:30 PM – 4:45 PM పరీక్ష నిర్వహణ మార్గదర్శకాలు గ్రాండ్ టెస్ట్ పరీక్షల నాణ్యత మరియు రహస్యత్వాన్ని పరిరక్షించేందుకు SCERT అనుసరించాల్సిన సూచనలను జారీ చేసింది: ప్రశ్నపత్రాల రహస్యత:  ప్రశ్నపత్రాలను మండల వనరుల కేంద్రం (MRC) వద్ద భద్రపరచి, పరీక్షకు ఒక గంట ముందు మాత్రమే పంపిణీ చేయాలి. పర్యవేక్షణ & మానిటరింగ్:  మండల విద్యా అధికారులు (MEOs) మరియు పాఠశాల హెడ్‌మాస్టర్లతో కూడిన మూడు మంది కమిటీ ప్రశ్నపత్రాల భద్రతను పర్యవేక్షించాలి. న్యాయంగా పరీక్ష నిర్వహణ:  హెడ్‌మాస్టర్లు (HMs), MEOs మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRPs) పరీక్షల సమయాల్లో పాఠశాలల పర్యవేక్షణ చేపట్టాలి. అవాంఛిత ఘటనలు:  ఏదైనా అవాంఛిత ఘటనలు వెంటనే పై అధికారులకు నివేదించాలి. అనుసరణ:  ప్రైవేట్ మరియు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలలు నిర్దేశిత షెడ్యూల్ మరియు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. ముగింపు SCERT డైరెక్టర్ ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు మరియు జిల్లా విద్యా అధికారులకు  గ్రాండ్ టెస్ట్ పరీక్షల విజయవంతమైన నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏదైనా ప్రామాణిక విధానాలకు విరుద్ధంగా ఏమైనా జరిగినా దానిని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ కార్యక్రమం 100-రోజుల కార్యాచరణ ప్రణాళిక  లో భాగంగా, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. విద్యార్థులు మరియు పాఠశాలలు తమ పాఠశాల షెడ్యూల్‌ను తగిన విధంగా అనుసరించాలని సూచించబడింది. అదనపు సమాచారానికి, అధికారిక SCERT ప్రకటనలను అనుసరించండి. తాజా సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు మీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం అవ్వండి!

  • NCTE: మళ్లీ ఒక ఏడాది బీఈడీ, ఎంఈడీ!

    #b_Ed #oneyear_b_ed #m_ed ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రామ్‌ల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు.. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్టీఏకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదనలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బీఈడీ, ఎంఈడీ కోర్సులు తిరిగి ‘ఒక ఏడాది’ ఫార్మాట్‌కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) యోచిస్తోంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు ప్రోగ్రామ్‌ల కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధిని రెండేళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు ప్రజల అభిప్రాయాలు తీసుకోనుంది. పాలసీ ఆమోదం తర్వాత..స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు (టీఈఐ) కొత్త ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే, రెండేళ్ల బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు. లేదా ఒక ఏడాది ఫార్మాట్‌లో మారేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. అన్ని బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రామాణిక సబ్జెక్ట్‌, ఆప్టిట్యూట్‌ పరీక్ష నిర్వహించనుందని హిందుస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఎన్టీఏ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ల (ఐటీఈపీ) అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎన్‌సీఈటీ) నిర్వహిస్తోంది. ఎన్టీఏ నిర్వహించనున్న కొత్త ఐటీఈపీ కోర్సుల పరీక్షకు సంబంధించిన విధివిధానాలు వచ్చే ఏడాది రూపొందించబడతాయని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్‌పర్సన్‌ పంకజ్‌ అరోరా పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఐటీఈపీ యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, సంస్కృత విద్య, కళా విద్య అనే 4 ప్రత్యేక కోర్సులను తీసుకురానున్నట్లు ఎన్‌సీటీఈ తన ముసాయిదా నిబంధనలు-2025లో పేర్కొంది. కొత్త కోర్సులతో పాటు కనీస అవసరమైన సదుపాయాలు, అధ్యాపకులు వంటి అంశాలను కూడా ఎన్‌సీటీఈ నిర్దేశించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం.. కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ప్రత్యేక సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులతో నాలుగేళ్ల అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) కలిగిన అభ్యర్థి ఒక సంవత్సర బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రెండేళ్ల ఎంఈడీ ప్రోగ్రామ్‌ అందించబడుతుందని ముసాయిదా పేర్కొంది. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు కొత్త నిబంధనలు రూపొందించినట్లు అరోరా తెలిపారు.

  • PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. టీచర్ పై ప్రశంసల జల్లు

    PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. టీచర్ పై ప్రశంసల జల్లు PM Modi Mann ki Baat: మన్ కీ బాత్.. టీచర్ పై ప్రశంసల జల్లు ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ రాకెట్‌ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని అన్నారు. ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ( ISRO ) 100వ రాకెట్‌ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) అన్నారు. అంతరిక్ష రంగం ( Space Sector )లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఇస్రోకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని.. ఇస్రో, ఏఐ రంగాలపై ప్రధానంగా వివరించారు. గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ ( Adilabad ) జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్‌ ( Teacher Kailash )ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారంటూ కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి కొలామి భాషలో కైలాష్ పాటను కంపోజ్‌ చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

  • ‘పీఈటీ కొట్టాడు..’ సారీ మదర్‌.. ఐ విల్‌ డై టుడే

    ‘పీఈటీ కొట్టాడు..’ సారీ మదర్‌.. ఐ విల్‌ డై టుడే ఉప్పల్, న్యూస్‌టుడే: ఏదో తప్పు చేశాడని తరగతి గదిలోనే అందరి ముందు విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడు దండించాడు.. క్లాస్‌ టీచర్‌ కూడా తిట్టింది..దీంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ‘సారీ మదర్‌.. ఐ విల్‌ డై టుడే’ అని నోటుబుక్‌లో రాసి పెట్టి.. అదే పాఠశాల భవనంపై నుంచి దూకి 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. బోడుప్పల్‌లోని ద్వారకానగర్‌కు చెందిన ముంగ ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండో కుమారుడు సంగారెడ్డి(13). ఉప్పల్‌ న్యూ భరత్‌నగర్‌లోని సాగర్‌ గ్రామర్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. శనివారం పాఠశాల పీఈటీ ఆంజనేయులు 8వ తరగతి గదికి వచ్చాడు. శుక్రవారం తరగతి గదిలోని సీసీ కెమెరా డైరెక్షన్‌ సంగారెడ్డి మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరి ముందు సంగారెడ్డిని కొట్టాడు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే ప్రిన్సిపల్‌కు చెప్పి, టీసీ ఇచ్చి పంపిస్తాన హెచ్చరించాడు. ఇదే సమయంలో క్లాస్‌ టీచర్‌ సంగారెడ్డిని హెచ్చరించినట్టు తెలిసింది. అందరి ముందు అవమానమని..  తరగతి గదిలో పీఈటీ కొట్టడంతో సంగారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొద్ది సేపు తరగతి గదిలోనే దుఃఖించాడు. వాష్‌ రూంకు వెళ్తానని క్లాస్‌ టీచర్‌ను అడిగి బయటకు వెళ్లాడు. సంగారెడ్డి పక్కనే కూర్చొన్న మరో విద్యార్థి అతడు చివరగా రాసి పెట్టిన నోటుబుక్‌ను తీసి చూడగా ‘సారీ మదర్‌.. ఐ విల్‌ డై టుడే’ అని రాసి ఉంది. వెంటనే క్లాస్‌ టీచర్‌కు ఇది చూపిస్తూ ఉన్నాడు. అప్పటికే సంగారెడ్డి పాఠశాల భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకేశాడు. పెద్దగా శబ్దం రావడంతో అంతా వచ్చి చూసేసరికే రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే దగ్గరలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లి సంగీత, మిగతా బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఎంఈవో రామారావు పాఠశాలను సీజ్‌ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • 1998, 2008 MTS ఉపాధ్యాయులందరికీ ఇండక్షన్ ట్రైనింగ్ ఐదు రోజులశాలరీ

    1998, 2008 MTS ఉపాధ్యాయులందరికీ ఇండక్షన్ ట్రైనింగ్ ఐదు రోజులశాలరీ information. ఇండక్షన్ ట్రైనింగ్ అటెండెన్స్ సర్టిఫికెట్ మీకు సంబంధించిన మండల విద్యాధికారి ద్వారా సబ్మిట్ చేసి అరియర్స్ బిల్లు పెట్టించుకోవాలి. ఆ తర్వాత మీ అకౌంట్ కు ప్రతి ఒక్కరికి 5269రూపాయలు జమ అవుతుంది. Here's a blog post based on the content of the memo: Andhra Pradesh Government Approves 5-Day Salary Payment for DSC-1998 & DSC-2008 MTS Teachers The Andhra Pradesh School Education (Services-I) Department has issued a memo approving the payment of five days’ salaries to DSC-1998 and DSC-2008 MTS teachers who participated in induction training during the summer vacation. Key Highlights of the Memo Issued by:  Government of Andhra Pradesh, School Education Department Memo No:  2075772/SER.I/A1/2023 Date:  February 20, 2025 Purpose:  Payment of five days’ salary to DSC-1998 and DSC-2008 MTS teachers Training Period:  May 15, 2023 – May 31, 2023 Reason:  Teachers were deputed for induction training during their termination period and later re-engaged/renewed for the academic year 2023-24. Approval:  Concurrence from the Finance Department (U.O. No. FIN01-FMUOMISC/429/2024-FMU-SE, dated January 28, 2025) Government's Decision Based on reports from the Director of School Education, the government has granted approval for the payment of these teachers for their training days. The Director of School Education is directed to take further necessary action in this matter. Official Statement Kona Sasidhar, Secretary to the Government, issued the memo with official concurrence from the Finance Department. Conclusion This decision ensures fair compensation for teachers who contributed to the training process during summer vacations. The move highlights the government's commitment to supporting educators in Andhra Pradesh. Stay tuned for more updates on education policies and teacher welfare in Andhra Pradesh! Would you like any modifications or additional details in the post?

bottom of page