top of page

IPL 2025: ఐపీఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఆఫర్లు చుశారా..


ఐపీఎల్ 2025 మొదలైన నేపథ్యంలో క్రికెట్ ప్రియుల కోసం టెలికాం సంస్థలు క్రేజీ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించాయి. 100 రూపాయల పరిధిలోనే దాదాపు అనేక సంస్థలు ఐపీఎల్ మ్యాచ్ చూసే సేవలను అందిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

IPL 2025: ఐపీఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఆఫర్లు చుశారా..

ఐపీఎల్ 2025 సందర్భంగా క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. మార్చి 22న మొదలైన ఐపీఎల్, మే వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో క్రెకిట్ ప్రేమికుల ఆదరణ దక్కించుకునేందుకు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు క్రేజీ ఆఫర్లను ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

జియో ప్లాన్

మీరు కేవలం రూ.100 చెల్లించి JioHotstar సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ జియో ప్లాన్‌లో వినియోగదారులకు 5 జీబీ డేటా లభిస్తుంది. మీరు 90 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ పొందుతారు. అంటే కేవలం 100 రూపాయలతో, మీరు JioHotstarలో 90 రోజుల పాటు మ్యాచ్ చూడవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, SMS సేవలు అందుబాటులో ఉండవు. మీకు కేవలం 5GB ప్రయోజనం లభిస్తుంది.



Vi సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

ఇదే సమయంలో Viలో అత్యంత చౌకైన రూ.101 ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిలో వినియోగదారులు Jiohotstar ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ఈ ప్లాన్ లో యూజర్లకు జియో హాట్ స్టార్ 3 నెలలు ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, కంపెనీ వినియోగదారులకు 5GB డేటాను కూడా అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో వినియోగదారులు వాయిస్ కాలింగ్ సేవను పొందలేరు.


ఎయిర్‌టెల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

ఎయిర్‌టెల్ ఒక ప్లాన్ ధర రూ.100 కాగా, మరో ప్లాన్ ధర రూ.195. ఎయిర్‌టెల్ రూ.100 ప్లాన్ గురించి మాట్లాడుకుంటే, వినియోగదారుడు జియోహాట్‌స్టార్‌తో 30 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్‌ను పొందుతారు. అలాగే, ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 5GB డేటా, 30 రోజుల పాటు ఉచిత JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.

195 రూపాయల ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ లో యూజర్ కు మొత్తం 15GB డేటా లభిస్తుంది. దీంతో పాటు, ఈ ప్లాన్‌తో కంపెనీ 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఈ రెండు ప్లాన్‌లలో వాయిస్ కాలింగ్ సేవలు అందుబాటులో ఉండవు.


ఇవి కూడా చదవండి:




 
 
 

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page