top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • AP Inter Hall tickets| ఏపీ ఇంటర్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ ఇలా!

    ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. Inter Exam Hall Tickets Download | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో ఇంటర్ పరీక్షలకు హాల్‌టికెట్లు(AP Inter Halltickets 2025) విడుదలయ్యాయి. మార్చి 1, 3వ తేదీల నుంచి ప్రారంభం కానున్న ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థులు కాలేజీ లాగిన్‌లతో పాటు వాట్సప్‌ గవర్నెన్స్‌లో భాగంగా ‘మనమిత్ర’ ద్వారా పొందొచ్చని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇటీవల ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్‌ నంబరు 95523 00009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా.. మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోండి Hi అని వాట్సప్‌ ద్వారా పైన ఇచ్చిన నంబర్‌కు పంపండి సేవను ఎంచుకోండి అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. విద్యా సేవలు సెలక్ట్‌ చేసి క్లిక్‌ చేయండి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌/సెకండ్‌ ఇయర్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి అనే ఆప్షన్‌ కనబడుతుంది. మీరు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులైతే టెన్త్‌ హాల్‌టికెట్‌/ఆధార్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులైతే ఫస్ట్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌/ఆధార్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి.  ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి. https://bie.ap.gov.in/theoryhjktahjblltickets https://bie.ap.gov.in/theoryhjktahjblltickets https://bie.ap.gov.in/theoryhjktahjblltickets 👆 1st Year Link

  • Half Day Schools : విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు

    Half Day Schools: విద్యార్ధులకు బిగ్ రిలీఫ్, త్వరలో ఒంటి పూట బడులు ఈ వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి. మార్చ్ నుంచి వేసవి ప్రారంభం కావల్సి ఉండగా అప్పుడే ఎండ వేడిమి పెరిగిపోయింది. ఉదయం 8-9 గంటలకే వేడి ఎక్కువగా ఉంటోంది. విద్యార్ధులు ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. రోజూ స్కూల్స్ తెరిచే సమయంలో అంటే 9-10 గంటల మధ్యలో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా గత వారం పది రోజులుగా ఎండలు పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏటా మార్చ్ 15-20 తేదీల్లో ఒంటి పూట బడులు ఉంటాయి. కానీ గత ఏడాది ఎండల తీవ్రత దృష్ట్యా అంతకంటే ముందే ఒక పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈసారి ఇంకా త్వరగానే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. ఎండల తీవ్రతను పరిగణలో తీసుకుని త్వరగా ఒంటి పూట బడులు ప్రారంభించాలని కోరారు. వచ్చే వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఒంటి పూట బడులు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే ఫిబ్రవరి 25-28 తేదీల నుంచి ఏపీలో హాఫ్ డే స్కూల్స్ ప్రారంభం కావచ్చు.

  • పదోతరగతి ప్రీ ఫైనల్ బయాలజీ తో సహా ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్ సమాధానాలు : Pre-Final Keys English, Maths, PS, Biology

    పదోతరగతి ప్రీ ఫైనల్ బయాలజీ తో సహా ఇంగ్లీషు, గణితం, ఫిజిక్స్ సమాధానాలు : Pre-Final Keys English, Maths, PS, Biology Answer Keys for 10th Grade All Subjects – A Valuable Resource for Teachers Accurate and well-structured answer keys are essential for teachers to efficiently evaluate students’ answer scripts. As part of our commitment to supporting educators, we are providing comprehensive answer keys for all 10th-grade subjects  to facilitate easy and accurate valuation. Why Use Our Answer Keys? Our answer keys are designed to help teachers by: Saving Time:  Quick and accurate reference for grading. Ensuring Consistency:  Standardized solutions reduce subjective marking. Enhancing Transparency:  Teachers can cross-check responses effectively. Supporting Quality Evaluation:  Helps in identifying student strengths and weaknesses. Subjects Covered We provide answer keys for the following subjects: Mathematics  – Step-by-step solutions for all problems. Science  (Physics, Chemistry, Biology) – Detailed explanations and diagrams. Social Studies  – Key points for history, geography, civics, and economics. English & Other Languages  – Grammar, comprehension, and writing solutions. How to Access the Answer Keys? Teachers can download the answer keys directly from our blog  in PDF format for free. Simply navigate to the respective subject and click on the download link. Benefits for Teachers Reduces Workload:  Eliminates the hassle of manually preparing answer keys. Reliable References:  Based on official syllabus and guidelines. Improves Accuracy:  Helps minimize human errors in grading. Encourages Standardized Marking:  Ensures fairness in student evaluation. Stay Updated We regularly update our answer keys to align with any syllabus changes. Bookmark our blog and subscribe to notifications to stay informed about the latest updates. Providing teachers with the right tools for efficient assessment not only saves time but also enhances the overall quality of education. Visit our blog now and start using our answer keys for seamless evaluation!

  • Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

    Teacher Transfers: ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు, జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు ఏపీలో ఏప్రిల్ నుంచి టీచర్ల బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమైన వివరాలు మీ కోసం. ఆంధ్రప్రదేశ్ ఉప్యాధ్యాయులకు శుభవార్త. చాలాకాలంగా ఎదురు చూస్తున్న టీచర్ల బదిలీలకు మార్గం సుగమమైంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలు కావచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు బయటికొచ్చాయి. మరోవైపు మంత్రి నారా లోకేశ్ సైతం కీలక ప్రకటన చేశారు. బదిలీల్లో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్ విద్యపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలో జీవో నెంబర్ 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 1800 మంది ఉపాధ్యాయుల్ని కోరుకున్న స్థానాలకు బదిలీ చేసింది. అయితే ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలతో బదిలీ ఉత్తర్వుల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది . అప్పటి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు ఇప్పుడు మళ్లీ శుభవార్త విన్పిస్తోంది. త్వరలో విద్యార్ధుల తల్లిదండ్రులతో సమావేశం జరగనుంది. ఉపాధ్యాయ సంఘాల నేతలో బదిలీల చట్టం ముసాయిదాపై చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 రద్దు, బదిలీల చట్టంపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి చేరుతాయి.

  • రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధులు జమ ఎప్పుడంటే?PM Kisan

    రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధులు జమ ఎప్పుడంటే?PM Kisan అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు తేదీ ఖరారైంది. PM Kisan 2025| ఇంటర్నెట్‌ డెస్క్‌: రైతులకు గుడ్‌న్యూస్‌! అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్‌ (PM Kisan) పథకం 19వ విడత నిధుల (PM Kisan 19th installment) విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్‌ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి. అలాగే, ఇ-కేవైసీ చేసి ఉండాలి.  ఒకవేళ పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలన్నా, పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. ఆయా వివరాలు పొందడానికి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌/ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. ఇవి కూడా చదవండి. 🔸 ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్‌ SBI Loans 🔸 స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు 🔸 ఉపాధ్యాయులకు విలువైన వనరు ‘ఆది వాణి’ ఏఐ యాప్ : ప్రభుత్వం 🔸 EPFO: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పీఎఫ్‌ వడ్డీ 8.25 శాతమే! 🔸 చైనా ‘డీప్‌సీక్‌’ ఎఫెక్ట్‌.. ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’ : OpenAI vs Deepseek

  • 21 న పెన్షన్ మరియు GPF అదాలత్ : ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) ఏపీ శాంతి ప్రియ సరేళ్ల

    #pension #gpf కాకినాడ,ఫిబ్రవరి17,2025 ఏపీ టీచర్స్ టీవీ: PAG (A&E), AP, విజయవాడ వారు 21-02-2025న కాకినాడ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులు/GPF కేసులను సమీక్షించడానికి మరియు పరిష్కరించడానికి , DDOలకు సమర్ధవంతంగా సేవలను అందించడానికి , GPF సమయానికి అందించడానికి "పెన్షన్ మరియు GPF అదాలత్" నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్( ఏ & ఇ) ఆంధ్రప్రదేశ్ శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లాలోని జిల్లా అధికారులు/డ్రాయింగ్ & పంపిణీ అధికారులందరూ తేదీ 21-02-2025న కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల "విధాన గౌతమి మీటింగ్ హాల్"లో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే "పెన్షన్ మరియు GPF అదాలత్‌ కు పెండింగ్‌ లో ఉన్న పెన్షన్ కేసులు / GPF సమస్యలు వివరాలతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) ఆంధ్రప్రదేశ్ శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఒక ప్రకటనలో కోరారు. ఈ పెన్షన్, జిపిఎఫ్ అదాలత్ లో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్) కిషోర్ రెడ్డి పోలు , డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) లలిత్ కుమార్. వి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్స్ ) జి. సునీత , సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (పెన్షన్స్) టి. విజయ్ కుమార్ , సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జిపిఎఫ్) డి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొని జిపిఎఫ్ , పెన్షన్ సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ (ఏ & ఇ) శ్రీమతి శాంతి ప్రియ సరేళ్ల ఆ ప్రకటనలో వివరించారు . *********""""********* డి ఐ పి ఆర్ ఓ, కాకినాడ వారి ద్వారా జారీ.

  • Guillain Barre Syndrome: ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం

    🔸 ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్‌ SBI Loans 🔸 స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు 🔸 ఉపాధ్యాయులకు విలువైన వనరు ‘ఆది వాణి’ ఏఐ యాప్ : ప్రభుత్వం 🔸 EPFO: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పీఎఫ్‌ వడ్డీ 8.25 శాతమే! 🔸 చైనా ‘డీప్‌సీక్‌’ ఎఫెక్ట్‌.. ఓపెన్‌ఏఐ ‘డీప్‌ రీసెర్చ్‌’ : OpenAI vs Deepseek Guillain Barre Syndrome Guillain Barre Syndrome: ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్)తో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న కమలమ్మ అనే మహిళ మరణించింది. రెండు రోజుల కిత్రం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మకు ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చు పడిపోయాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. కమలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వ్యాధి సోకి మరణించిన తొలి మహిళ కమలమ్మ మరణించడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు సదరు గ్రామంలో ప్రజలకు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. కానీ ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో టెన్షన్‌ పడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవల ఇది తెలంగాణలో ప్రవేశించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటరయింది. . ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బార్రే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అయితే గుంటూరు జిల్లా జీజీహెచ్‌కు ఈ వ్యాధి సొకిన బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో వారికి ఐసీఐలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి.. ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతోపాటు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్‌ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదని పేర్కొంటున్నారు.

  • ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్‌ SBI Loans

    ఎస్‌బీఐ లోన్స్ వడ్డీరేట్లు తగ్గాయ్‌ SBI Loans ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలి సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి పరిమితం చేసింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఊరట 15 నుంచే అమల్లోకి   ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలి సమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి పరిమితం చేసింది. ఇందుకు అనుగుణంగా ఎస్‌బీఐ తన ఈబీఎల్‌ఆర్‌ (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌), ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ (రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌)ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ మార్పు ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి వచ్చింది. ఫలితంగా వీటికి అనుసంధానమై ఉన్న వ్యక్తిగత, వాహన, గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.  బ్యాంకును సంప్రదించాలి: గృహరుణం తీసుకున్న వారు.. ఒకసారి తమ బ్యాంకును సంప్రదించి రుణ వడ్డీ రేటు తగ్గింపు తమకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఈఎంఐ తగ్గించాలా? రుణ చెల్లింపు వ్యవధి తగ్గించుకోవాలా? అనే నిర్ణయమూ తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వ్యవధి తగ్గించుకోవడమే మేలని నిపుణుల సూచన. ఇతర బ్యాంకులూ..: కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సైతం రెపో ఆధారిత వడ్డీ రేట్లను 0.25% మేర తగ్గించాయి.   క్రెడిట్‌ స్కోరు ఆధారంగా: క్రెడిట్‌ స్కోరు ఆధారంగా ఎస్‌బీఐ గృహ రుణ వడ్డీ 8.25% నుంచి 9.20% వరకూ ఉంటుంది. టాపప్‌ రుణం తీసుకోవాలనుకుంటే.. వడ్డీ రేటు 8.55% నుంచి 11.05% అవుతుంది. ఈబీఆర్‌ఎల్‌ ఆధారంగా రుణం తీసుకుంటే వడ్డీ రేటు 8.90%. నిధుల ఆధారిత రుణ వడ్డీ రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌), బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్, బేస్‌రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. మార్పులు ఇలా ఈబీఎల్‌ఆర్‌ 9.15 శాతం నుంచి 8.90 శాతానికి తగ్గింది. దీంతోపాటు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 8.75 శాతం నుంచి 8.50 శాతంగా సవరించింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు కొత్తగా తీసుకునే వారికి తగ్గించిన వడ్డీ వర్తిస్తుంది. ఫలితంగా నెలవారీ వాయిదా (ఈఎంఐ) ప్రస్తుతం కంటే కొంత తగ్గుతుంది.  ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాలవ్యవధి లేదా ఈఎంఐ తగ్గుతుంది. AP Teachers TV WhatsApp Channel

  • స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడే అప్డేట్ చేసుకోవచ్చు

    Teachers Attendance App ఈరోజు (Feb 15) 2.6.4 వెర్షన్ కి update అయ్యింది, పాత యాప్ పనిచేయదు. Latest Teachers - Students Attendance యాప్ 2.6.4 వెర్షన్ ను కింది బటన్ నొక్కి Instal/Update చేయవచ్చును Latest Version Features: Added the special attendance and improved the app performance

  • ఉపాధ్యాయులకు విలువైన వనరు ‘ఆది వాణి’ ఏఐ యాప్ : ప్రభుత్వం

    ‘ఆది వాణి’ ఏఐతో భాష పదిలం దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది. సాంకేతికతతో సాధికారత ఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. భాష పరిరక్షణకు.. భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది. విద్యార్థులకు ఎంతో మేలు.. ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్‌ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.

  • EPFO: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ పీఎఫ్‌ వడ్డీ 8.25 శాతమే!

    EPFO: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉండే అవకాశం ఉందని సమాచారం. EPFO: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉండే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో నిల్వలపై పాత వడ్డీ రేటే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి గానూ ప్రావిడెంట్‌ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న నిర్వహించే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) సమావేశంలో ఈపీఎఫ్‌ఓ ప్రకటన ఉండనుంది. సీబీటీ (CBT) సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నాక అందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ ( EPFO ) 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వడ్డీ రేటు. ఈ ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌ఓ ఇప్పటివరకు 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేసింది. దీని విలువ రూ.2.05 లక్షల కోట్లు. 2023- 24లో మొత్తంగా రూ.1.82 లక్షల కోట్లు విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించించినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది.

  • కొత్త క్లస్టర్ స్కూళ్ల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశం లో కమీషనర్, పాఠశాల విద్యాశాఖ తెలియజేసిన అంశాలు

    🏤 నూతన పాఠశాలల సముదాయాల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశం లో కమీషనర్, పాఠశాల విద్యాశాఖ తెలియజేసిన అంశాలు 🏤 ✅ ఇక మీదట పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతీ నెల మూడవ శనివారం మధ్యాహ్నం 1గంట నుంచి 5 గంటల వరకు మాత్రమే నిర్వహించబడుతుంది. ఒకవేళ 3వ శనివారం సెలవు అయితే 4వ శనివారం నిర్వహించబడుతుంది. ✅ పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా ఉదయం 11 గంటల 45 నిం .కి 🥣 మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి అయితీరాలి. ✅ ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించవలెను. ✅ ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ, అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయరాదు. ✅ ఈ సమావేశాల రోజున పాఠశాల సముదాయాల పాఠశాలలో ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయుటకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఐటి విభాగం తగిన ఏర్పాటు చేస్తుంది. ✅ ఈ సంవత్సరం ఈ నూతన పాఠశాల సముదాయాల మొదటి సమావేశం రోజున గౌరవ విద్యాశాఖ మాత్యులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమీషనర్ గారు హాజరవుతారు. ⏩🛑 అత్యంత ముఖ్యమైన కమీషనర్ ఆదేశం 🛑⏪ ✅ ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లోని అన్ని ఐఎఫ్పి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా  ఐఎఫ్పి లు పనిచేసి తీరాలి మరియు అన్ని  ఐఎఫ్పి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా ఇంటర్నట్ సదుపాయం కలిగి వుండాలి సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లో ఐఎఫెపిలు అన్నీ పని చేసేటట్టు మరియు ఇంటర్నెట్ ఖచ్చితంగా అందుబాటులో వుండేటట్టు చూసుకోవాలి. జిల్లా స్థాయి లో సమగ్ర శిక్షా జిల్లా ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్ మండల స్థాయి లో మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్స్ పర్యవేక్షణ చేసి అన్నీ అందుబాటులో వుండేలా చూడాలి. ✅ ప్రతీ పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (1 నుంచి 2 తరగతులు బోధించు వారు మరియు 3 నుంచి 5 తరగతలు బోధించు వారు) మరియు 8గురు చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు (పిడితో సహా) ఎంపిక చేసుకుని సిద్ధంగా వుండవలెను. ➡️ ఈ మొదటి సమావేశం 5 అంచెలుగా జరుగుతుంది ⬅️ ⏩ రేపు శనివారం మొదటి సమావేశం కాలపట్టిక ⏪ 🕐1గంట నుంచి 🕜1.30 వరకు మంత్రి వర్యులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమీషనర్ వారి సందేశాలు 🕑 2గం నుంచి 🕝 2.30వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం వుంటుంది. ఈ సమావేశంలో పాఠశాల సముదాయాల సమావేశాలలో ఏఏ అంశాలు చర్చించాలో తెలియపరిచెదరు. 🕝 2.30 నుంచి 🕞 3.45 వరకు 1 మరియు 2 తరగతులు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3 నుంచి 5 తరగతలు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు వేర్వేరు సబ్జక్ట్ లు బోధించు ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు వేర్వేరు గదుల్లో కూర్చుని వారి భోధానాంశాలకు సంబంధించిన అంశాలమీద చర్చించడం జరుగుతుంది. 🧑‍🧑‍🧒‍🧒🧑‍🧑‍🧒 ఈ సెషన్లో సంపూర్ణంగా 📕📕 ఈ దిగువ విద్యా సంబంధిత అంశాలమీద మాత్రమే చర్చ జరగాలి. 📚 కాలపట్టిక ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి అయిందా లేదో 📝 పరీక్ష పత్రాల మూల్యాంకనం 🧮 ఫౌండేషన్ లిటరసీ మరియు న్యుమరసీ ప్రకారం విద్యార్థుల స్థితి 📋ఎస్ ఎస్ సి యాక్షన్ ప్లాన్ అమలు 📖 మోడల్ పాఠ్యాంశ బోధన 🕞 3.45 నుంచి 🕓4 గంటల వరకు విశ్రాంతి 🕓4 గంటల నుంచి 🕟 4.30 వరకు మరలా సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఉమ్మడి సమావేశం వుంటుంది.ఈ సమావేశంలో అత్యుత్తమ అభ్యాసాలు (best exercises) పై చర్చ జరుగుతుంది. 🕟 4.30 నుంచి 🕔 5 గంటల వరకు తిరిగి కమీషనర్ పాఠశాల విద్యాశాఖ వారి తో పరస్పర చర్చ కార్యక్రమం వుంటుంది. 🕔 సాయంత్రం 5గంటలకు సమావేశం ముగుస్తుంది. జిల్లాలోని అన్ని కాంప్లెక్స్ సమూదాయ పాఠశాలలకు ఈ సమావేశాల రోజున జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా ప్రోజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా సందర్శించాలి. తదుపరి ప్రతీ నెల జరిగే ఈ పాఠశాల సముదాయాల సమావేశాలకు సంబంధించిన పూర్తి ప్రణాళికను మరియు కాల నిర్ణయ పట్టికలను ఎస్ సి ఆర్ టి నుంచి తెలియజేయుదురు. కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారి నేటి సమీక్షా సమావేశ సూచనల ప్రాప్తికి పై సమాచారం తెలియజేయడమైనది.

bottom of page