top of page

Search Results

663 results found with an empty search

  • LEAP Attendance App Update To Latest Version 3.0.9

    >> కమీషనర్ తో చర్చలు - ఏం జరిగింది?? >> SASA యాప్ ఇకనుంచి ఇలా మాత్రమే ! >> టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్? >> ఏపీ స్కూళ్లలో ఉపాధ్యాయుల రీ అప్పాయింట్మెంట్ సూచనలు జారీ: పోస్టుల కన్వర్షన్.. పోస్టుల సృష్టి..పూర్తివివరాలు సమగ్రంగా.. >> ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు LEAP Attendance App Update To Latest Version 3.0.9 Details What's new LEAP Application. About this app Learning Excellence in Andhra Pradesh, School Education Department Learning Excellence in Andhra Pradesh (LEAP) App is a revolutionary step by the School Education Department, Government of Andhra Pradesh by duly consolidating multiple digital tools into a single, efficient platform. This app provides multiple services related to Schools, Teachers, Students, and Administrators to improve governance through a detailed dashboard. Leap includes profile information of students, teachers, schools, school resources, fund allocation details, student attendance tracking, MDM function tracking, and other student entitlement functions, as well as maintenance of school infrastructure and more. More info Rated for 3+ Learn more App info Version:3.0.9 Updated on: May 19, 2025 Downloads :500,000+ downloads Update size :1.08 MB Required OS: Android 8.0 and up Offered by: AP SCHOOL EDUCATION Released on: Jul 27, 2022 See More: Compatibility for your active devices Compatibility Android 8.0 and up Version: 3.0.9 Download Size: 1.08 MB Required OS: Android 8.0 and up 👉More News

  • ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు! AP Teachers Transfers

    ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు! సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన 10న పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం! ap teachers transfers ఇప్పటికే టీచర్ల పదోన్నతులపై కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీల విధివిధానాలపై దృష్టిలోపం, వితంతు కేటగిరి ఉపాధ్యాయుల అసంతృప్తి బదిలీల్లో అన్యాయం జరగనుందని కోర్టులో వేర్వేరుగా పిటీషన్లు జూన్‌ 15వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు! పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసేలోపు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుందనే ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు. ఈలోగా ప్రత్యేక అవసరాలు కలిగిన టీచర్లు బదిలీల కోసం మెడికల్‌ సర్టిఫికెట్లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీల విధివిధానాలు సక్రమంగా లేకపోవడంతో దృష్టిలోపం ఉన్నవారు, వితంతు కోటాలోకి వచ్చే వారు బదిలీల్లో తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించారని, సరిచేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్‌ 15వ తేదీ వరకు ఉపాధ్యాయుల బదిలీల అంశంపై యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు పూర్తయ్యేలోపు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పదోన్నతులు.. ఆ తర్వాత బదిలీలు బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఈ నెల 10వ తే దీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కాకముందే జిల్లాలో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు ఇచ్చేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా టీచర్‌ల సీనియారిటీ జాబితాల తయారీపై జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌లు(ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌లు (ఎస్‌ఏ)లు ఎంతమందికి పదోన్నతి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే జాబితాలను రూపొందిస్తున్నారు. పాఠశాలల విలీనం, ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా తరగతికి ఒక ఉపాధ్యాయడు ఉండాలనే నిబంధనలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టీచర్‌లు ఎంత మందిని బదిలీ చేయాల్సి వస్తుందనే అంశంపైనా లెక్కలు చూస్తున్నారు. దీంతో పాటు గణితం, ఇంగ్లీష్‌, సైన్స్‌ సబ్జెక్టులలో ఇప్పటికే మిగులుబాటుగా ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు.. వారిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏయే పాఠశాలల్లో సర్థుబాటు చేయాలనే అంశంపైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్‌ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల అయితే ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియలను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు తమవంతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 10 శాతం పాఠశాలలను బ్లాక్‌ చేసి.. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దృష్టిలోపం ఉన్న వారు, వితంతువులు కోర్టును ఆశ్రయించడంతో వీరి కోసం 10 శాతం పాఠశాలలను బ్లాక్‌ చేసి, బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రెండు కేటగిరీల వారికి వారుకోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేసే అవకాశం లేకపోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచనప్రాయంగా చెప్పుకుంటున్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖలోని ఉన్నతాధికారులు కొందరు ఉపాధ్యాయుల ప్రయోజనాలను పక్కనపెట్టి విద్యాశాఖ సెక్రటరీ, కమిషనర్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతోనే విజయవాడకు ఊహించని విధంగా ఉపాధ్యాయులు తరలివచ్చి పెద్దఎత్తున నిరసన తెలియజేశారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. కొందరు అధికారుల తీరుతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీచర్‌లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.

  • కమీషనర్ తో చర్చలు - ఏం జరిగింది??

    ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ద్వారా కమిషనర్ మరియు విద్యాశాఖ సెక్రటరీతో సుదీర్ఘంగా సుమారు 8 గంటల పాటు చర్చలు జరిగాయి. • ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి 16 అంశాలలో మొట్టమొదటి అంశంగా ఉన్నత పాఠశాలలో 53 రోల్ దాటిన తర్వాతనే రెండో సెక్షన్ ఇచ్చే విషయమై ప్రతిష్టంభన నెలకొంది • మనం 45 దాటిన వెంటనే రెండో సెక్షన్ ఇవ్వాలని కోరాము ఈ విషయంలో చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగాయిగాని పూర్తిస్థాయిగా క్లారిటీ రాలేదు. • మరియు తెలుగు మీడియం సమాంతర మీడియంగా కొనసాగించాలని కోరగా ఈ విషయం కూడా ప్రభుత్వ పరిధిలోని విషయమని దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని చెప్పారు. • అంతేకాకుండా గతంలో ఫౌండేషన్ పాఠశాలలకు 30 రోలు ఉన్న సందర్భంలోనే రెండో పోస్ట్ ఇచ్చేవారు దానిని 21 రోల్ కి రెండో పోస్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. • స్టడీ లీవ్ లో వెళ్లే ఉపాధ్యాయులు ఈ సంవత్సరం ఆగస్టు లోపు తిరిగి చేరే వారికి వారి స్థానాలని బదిలీల్లో చూపించకుండా మినహాయింపు ఇచ్చారు. • ఫిజికల్లీ ఛాలెంజ్ ఉపాధ్యాయులు వారు 40%ప్రాధమిక మరియు 50% ఉన్నత పాఠశాలలో కోరుకునే సందర్భంలో వారికి కోరుకునే అవకాశం లేనప్పుడు జనరల్ కేటగిరిలో కూడా కోరుకునే అవకాశం కల్పించారు. • వేకెన్సీలు వేటిని కూడా బ్లాక్ చేయరు. • ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా 9620 ఉండగా ఇప్పటికే 3532 ఎల్ ఎఫ్ ఎల్ పోస్టులుగా పనిచేస్తున్నారు. • మిగిలిన 6088 పోస్టులలో 1382 పోస్టులు సెకండ్ గ్రేట్ టీచర్లకు ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ గా పదోన్నతిస్తారు మిగిలిన 4706 పోస్టులకు స్కూల్ అసిస్టెంట్లను వాటిలో నియమిస్తారు. • సెకండరీ గ్రేడ్ టీచర్స్ లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 72,000 మంది తప్పనిసరి బదిలీకి గురవుతున్న ఉపాధ్యాయులు 25వేల మంది రిక్వెస్ట్ బదిలీలు జరిగే అవకాశం ఉంది వీరిలో మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా అయితే కేవలం 72,000 ఖాళీలు మాత్రమే కనిపిస్తాయని రిక్వెస్ట్ బదిలీల ఖాళీలు వీరు కోరుకునే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఆలోచించుకొని ఏ నిర్ణయం చెప్పమని కోరారు. దీని ప్రకారం క్రింది స్థాయిలో జిల్లాల వారీగా సమాచారం సేకరించి మీకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ బదిలీ కావాలా లేదా మాన్యువల్ బదిలీ కావాలనేది మీ జిల్లా సమాచారం తెలియజేయండి. • అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 779 హై స్కూల్స్ అప్ గ్రేడ్ అయ్యాయి ఈ విషయాలలో కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ముఖ్యమైన విషయాలు అయిన 45 రోల్ దాటిన సందర్భంలో రెండవ సెక్షన్ విషయంలో ఇంకనూ క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఉపాధ్యాయుల ఉద్యమాన్ని యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు

  • SASA-SWACH ANDHRA యాప్ ఇకనుంచి ఇలా డౌన్ లోడ్, అప్ డేట్ చేసుకోవాలి

    SASA-SWACH ANDHRA About This App Join the Swachh Andhra & Swarna Andhra initiatives with this official app. Swachh Andhra - Swarna Andhra is the official mobile app designed to support and promote cleanliness initiatives across Andhra Pradesh. In line with the government's efforts, this app provides a platform for citizens and government officials to track, capture, and engage with various cleanliness and environmental responsibility programs. Every third Saturday of the month, the Government of Andhra Pradesh organizes special programs under the Swachh Andhra and Swarna Andhra initiative to raise awareness about cleanliness, waste management, and environmental protection. With this app, you can stay updated on the latest activities, monthly themes, and community-driven programs happening across the state. స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్‌లో శుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించడానికి రూపుదిద్దుకున్న అధికారిక మొబైల్ యాప్. ప్రభుత్వ తగిన ప్రయత్నాలతో, ఈ యాప్ పౌరులు మరియు ప్రభుత్వ అధికారులు వివిధ శుభ్రత మరియు పర్యావరణ బాధ్యత కార్యక్రమాలను ట్రాక్ చేయడానికి, తీసుకోవడానికి, పాల్గొనడానికి ప్లాట్‌ఫార్మ్ అందిస్తుంది. ప్రతి మూడవ శనివారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర మరియు స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల కింద విశేష కార్యక్రమాలను నిర్వహించి శుభ్రత, వ్యర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తుంది. ఈ యాప్‌తో మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా కార్యక్రమాలు, నెలవారీ అంశాలు , మరియు సామాజిక కార్యక్రమాల గురించి తెలుసుకోగలుగుతారు. What's New Removed village mapping. Added a new question. Resolved offline submission bugs మరిన్ని వార్తలు విశేషాలు చదవండి 👈

  • టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్?

    ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. తాజాగా బడుల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల హేతుబద్ధీకరణపై జీవోలు వి డుదల కావడంతో గురువారం బదిలీలపై జీవో ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేప ట్టారు. గురువారం జీవో విడుదల చేస్తే శుక్రవారం నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు పాఠ శాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేయనుంది. కొత్తగా రూపొందించిన టీచర్ల బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు జరగనున్నాయి. ప్రస్తుత పాఠశాలలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎని మిది విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉపాధ్యా యులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. పాఠశాలలో రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంవత్సరాల లెక్కింపునకు మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. 🔹డీఎస్సీ నియామకం ఉన్నందున బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఉండవు. 🔹ప్రస్తుతం రేష్నలైజేషన్లో విల్లింగ్ తో పాల్గొంటున్న సీనియర్ ఉపాధ్యాయులు గత ఎనిమిది సంవత్సరాల్లో స్పెషల్ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకొననిచో ప్రస్తుతము వారికి కేటాయిస్తారు. కర్నూలు: ఉపాధ్యాయుల బదిలీప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని డీఈవో శామ్యూల్పాల్ తెలిపారు. నగర పరిధిలోని సెయింట్ క్లారెట్ పాఠశాలలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల విద్యాశాఖ అధికారులతో ఆయన సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్వర్షన్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ కింద 251 ఆదర్శ ప్రాథ మిక ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి. సర్స్ ఉన్న 97 పోస్టులను ఖాళీలకు అనుగుణంగా కన్వర్ట్ చేశామన్నారు. కొత్తగా 86 హైస్కూల్ ప్రధానోపా ధ్యాయుల పోస్టులు, 957 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 406 ఎస్జీటీ పోస్టులు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలో 97 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హైస్కూళ్లుగా ఉన్నతీ కరించామన్నారు. ఖాళీలకు సంబంధించి తప్పుడు సమా చారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంపిస్తున్న వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బదిలీ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టేం దుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. నిన్న మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలు విద్యా భవన్ నందు విద్యా శాఖ సంచాలకులని కలవగా, ఉపాధ్యాయ బదిలీలు రేషనలైజేషన్ విషయమై పలు అంశాల గురించి వివరించారు. 👉 బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ప్రస్తావించినప్పుడు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మాట ఇచ్చాము డీఎస్సీ నియామకం ఉన్నందున బ్లాకింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఉండవు అని తెలిపారు. 👉01.09.2017 వ తేదీ పదోన్నతి పై జాయిన్ అయిన వారందరూ 8 సంవత్సరాల పూర్తి సర్వీస్ తో బదిలీ అవుతారు (కర్నూలు జిల్లా). 👉ప్రస్తుతం రేష్నలైజేషన్లో విల్లింగ్ తో పాల్గొంటున్న సీనియర్ ఉపాధ్యాయులు గత ఎనిమిది సంవత్సరాల్లో స్పెషల్ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడు కొననిచో ప్రస్తుతము వారికి కేటాయిస్తారు. 👉ప్రాథమిక పాఠశాలల్లో సమాంతర మీడియం ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యార్థుల నమోదు ప్రకారం ఎస్జీటీ తెలుగు పోస్టులు కేటాయిస్తారు. 👉అందరితో సమానంగా హియరింగ్ ఎంపైర్ వారికి కూడా 40 శాతం నుండి 55% వారికి ఐదు పాయింట్లు, above 55% నుండి 69 శాతం వరకు 7 పాయింట్లు కేటాయిస్తారు. 👉జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయ సంఘాల నుండి అందిన సమస్యలకు సమాధానాలతో రాతపూర్వకంగా సమస్యలు సమాధానం పేరిట వివరణలు వెలువడుతున్నవి. మరిన్ని వార్తలు విశేషాలు చదవండి 👈

  • డీజీపీపై వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు Naa Anveshana

    డీజీపీపై వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు Naa Anveshan ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు హైదరాబాద్‌ మెట్రోలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సైబర్‌క్రైమ్‌ ఠాణా కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వివరాలివీ..!  ‘ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్‌ క్రియేటర్‌ అన్వేష్‌ మీద చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్వేష్‌ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి విశేషాలతో వీడియోలు చేస్తూ విశేష ఆదరణ పొందారు.  అన్వేష్‌ గురించి అన్వేష్‌ ఒక ప్రముఖ యూట్యూబర్‌గా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి సంస్కృతీ, భాష, ఆహారం, పర్యాటక ప్రదేశాల గురించి వీడియోలు రూపొందిస్తూ విశేష ఆదరణ పొందారు. ఆయన వీడియోలు చాలామంది యువతకు ప్రేరణగా మారాయి. అయితే, ఇప్పుడు ఆయనపై నమోదైన ఈ కేసు, అతని కంటెంట్‌ క్రియేషన్‌ పద్ధతులపై ప్రశ్నలు రేపుతోంది. అన్వేష్‌ గతంలో చేసిన వీడియోలు, ఆయన వ్యక్తిత్వం, మరియు అతని పర్యటనల ద్వారా పొందిన అనుభవాలు, ఇప్పుడు ఈ కేసుతో పోలిస్తే, ప్రజల దృష్టిలో ఎలా మారతాయో చూడాలి. ఈ కేసు అన్వేష్‌కు మాత్రమే కాకుండా, యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేటర్లకు కూడా ఒక హెచ్చరికగా మారవచ్చు. సమాచారాన్ని సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా అందించాలి అనే అవసరం, ఈ సంఘటన ద్వారా మరింత స్పష్టమవుతోంది. Tags: Prapancha yatrikudu, naa anveshana, anvesh, anveshana, naaanveshana, anvesh youtuber, youtuber anvesh, case filed against prapancha yatrikudu anvesh, case on youtuber anvesh.

  • ఏపీ స్కూళ్లలో ఉపాధ్యాయుల రీ అప్పాయింట్మెంట్ సూచనలు జారీ: పోస్టుల కన్వర్షన్.. పోస్టుల సృష్టి..పూర్తివివరాలు సమగ్రంగా..

    AP Teachers Transfers 2025 latest updates పాఠశాల విద్య - వివిధ యాజమాన్యాల్లో ఉన్న పాఠశాలలైన ప్రభుత్వ, జిల్లా పరిషత్/మండల పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లో బోధన సిబ్బందిని పునర్వ్యవస్థీకరించడానికి నియమాలు - వివిధ పోస్టుల మార్పిడి మరియు సృష్టి - ఉత్తర్వులు జారీ చేయబడినవి. పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రామ్.I) విభాగం G.O.MS.No . 21 తేదీ: 13-05-2025 సూచించబడిన పత్రాలు: విద్యా హక్కు చట్టం 35, 2009 మరియు 2010లో జారీ చేయబడిన నియమాలు G.O.Ms.No .117, పాఠశాల విద్య (SER.II) శాఖ, తేదీ.10.06.2022 G.O.Ms.No .128, పాఠశాల విద్య (SER.II) శాఖ, తేదీ.13.07.2022 G.O.Ms.No .60, పాఠశాల విద్య (SER.II) శాఖ, తేదీ.23.06.2023 G.O.Ms.No .84, MA & UD(D1) శాఖ, తేదీ.24.06.2022 ప్రభుత్వ మెమో.No.2671542/Ser.II/A.2/2025-1, SE శాఖ, తేదీ.08.01.2025 DSE మెమో.No.ESE02-13021/4/2024-E-VII, తేదీ.09.01.2025 G.O.Ms.No .19, S.E. (ప్రోగ్.I) శాఖ, తేదీ.13.05.2025 G.O.Ms.No .20, S.E. (ప్రోగ్.I) శాఖ, తేదీ.13.05.2025 DSE, A.P., నుండి లేఖ.Rc.No.13/94/2025-EST3, తేదీ.06.05.2025 ఉత్తర్వు: భారత ప్రభుత్వం ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009ని అమలులోకి తెచ్చింది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో నియమాలను జారీ చేసింది. సెక్షన్ 19 ప్రకారం, ప్రభుత్వం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకానికి నియమాలను నిర్దేశించింది. పైన పేర్కొన్న 5వ సూచన ప్రకారం, ప్రభుత్వ & పంచాయతీ రాజ్ పాఠశాలలలో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించి మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ మరియు పరిపాలనా బాధ్యతలను విద్యా శాఖకు అప్పగించారు. 2వ నుండి 4వ సూచనలలో పేర్కొన్నట్లుగా, వివిధ యాజమాన్యాలైన ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలల మధ్య బోధన సిబ్బందిని పునర్వ్యవస్థీకరించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలల పునర్నిర్మాణం తరువాత, 4731 ప్రాథమిక పాఠశాలలలోని 3వ, 4వ మరియు 5వ తరగతులు 3,348 ఉన్నత ప్రాథమిక & హైస్కూళ్లకు 1 కి.మీ. పరిధిలో, తగిన తరగతి గదులు మరియు మౌలిక సదుపాయాలు ఉన్న చోట, స్కూల్ అసిస్టెంట్లను అందించడం ద్వారా మ్యాప్ చేయబడ్డాయి. దీని ప్రకారం, 3వ, 4వ మరియు 5వ తరగతుల నుండి 2,43,540 మంది విద్యార్థులు అటువంటి 3,348 ఉన్నత ప్రాథమిక మరియు హైస్కూళ్లకు మ్యాప్ చేయబడ్డారు. అయితే, ఇటువంటి పునర్నిర్మాణం వలన క్షేత్రస్థాయిలో ప్రతికూల ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వానికి తెలియవచ్చింది, ఎందుకంటే 2022-23 నుండి 2024-25 మధ్య లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు పాఠశాలలకు మారారు. అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలలలో డ్రాప్‌అవుట్ రేటు పెరిగింది మరియు ప్రీ-హైస్కూళ్లు మరియు హైస్కూళ్లలో ఉపాధ్యాయుల పని భారం కూడా పెరిగింది. గతంలో చేసిన పునర్నిర్మాణం వలన కలిగిన ప్రతికూల ప్రభావాల కారణంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వివిధ వ్యవస్థలతో విస్తృతమైన చర్చల తరువాత, ప్రభుత్వం, జిల్లా పరిషత్/మండల పరిషత్ మరియు మున్సిపల్/మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నడుస్తున్న పాఠశాలల ప్రస్తుత నిర్మాణంలో తగిన మార్పులు చేయాలని నిర్ణయించింది. దీని లక్ష్యం నమోదును పెంచడం, డ్రాప్‌అవుట్ రేట్లను తగ్గించడం, సబ్జెక్ట్ ఉపాధ్యాయుల పని భారాన్ని తగ్గించడం మరియు విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం. 6వ సూచన ప్రకారం, ప్రభుత్వం పాఠశాల విద్యా డైరెక్టర్‌ను జిల్లాలకు వివరమైన సిద్ధపాటు మార్గదర్శకాలను జారీ చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం, పాఠశాల విద్యా డైరెక్టర్ పాఠశాలల పునర్నిర్మాణానికి మార్గదర్శకాలను జారీ చేశారు, అంటే ప్రభుత్వ, జిల్లా పరిషత్/మండల పరిషత్ మరియు మున్సిపల్/మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు. 7వ సూచన ప్రకారం, పాఠశాల విద్యా డైరెక్టర్ వివిధ నిర్వహణలలో పునర్నిర్మించిన పాఠశాలలలో బోధన సిబ్బంది పునర్వ్యవస్థీకరణకు మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిలో వివిధ పాఠశాల స్థాయిలలో ఉపాధ్యాయుల కేటాయింపు వివరాలు ఉన్నాయి, అంటే ఫౌండేషనల్ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు మరియు హైస్కూళ్లు. ఈ వివరాలు అనుబంధం-I లో చేర్చబడ్డాయి. మెగా DSC-2025 కింద ప్రకటించిన 13,192 పోస్టులను చేర్చిన తరువాత మరియు బోధన సిబ్బంది పునర్వ్యవస్థీకరణ తరువాత, అన్ని జిల్లాలలో కొన్ని యాజమాన్యా లలో స్కూల్ అసిస్టెంట్స్ (SAs) మరియు సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGTs) పని చేస్తున్న మిగులు పోస్టులు ఉన్నట్లు గమనించారు. అలాగే, కొన్ని జిల్లాలలో ఖాళీ మిగులు పోస్టులు ఉండగా, మరికొన్ని జిల్లాలలో కొన్ని నిర్వహణలలో పోస్టుల కొరత ఉంది. 10వ సూచన ప్రకారం, పాఠశాల విద్యా డైరెక్టర్ (i) పని చేస్తున్న మిగులు 4706 స్కూల్ అసిస్టెంట్స్ (SAs)ని మోడల్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్స్ / స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడం; (ii) మిగిలిన పని చేస్తున్న మిగులు 2754 స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు సమాన పోస్టులను క్లస్టర్ స్థాయిలో ఉంచి వారి సేవలను క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్‌గా ఉపయోగించడం - వీరి సేవలను రెగ్యులర్ ఉపాధ్యాయులు ఒక వారం కంటే ఎక్కువ కాలం సెలవులో ఉన్నప్పుడు (ఉదా., వైద్య సెలవు, ప్రసూతి సెలవు, వ్యక్తిగత సెలవు, అధ్యయన సెలవు లేదా విదేశీ పర్యటనలు) వినియోగించడం; (iii) 615 స్కూల్ అసిస్టెంట్ (517)/సెకండరీ గ్రేడ్ టీచర్ (98) మరియు సమాన పోస్టులను అదే నిర్వహణలో అవసరమైన పోస్టులుగా మార్చడం; (iv) 4545 పోస్టుల సృష్టి, గ్రేడ్-II హెడ్ మాస్టర్ (534)/ స్కూల్ అసిస్టెంట్ (3086)/సెకండరీ గ్రేడ్ టీచర్ (925) పోస్టులను నిర్వహణలో లేదా అంతర్ నిర్వహణలలో ఖాళీ మిగులు పోస్టులను అప్‌గ్రేడ్/సప్రెస్ చేయడం ద్వారా; (v) 779 ఉన్నత ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయడం; (vi) పైన పేర్కొన్న 1902 ఖాళీ మిగులు పోస్టులను HOD కేడర్ స్ట్రెంత్ కి చేర్చి, భవిష్యత్తులో ఈ పోస్టులను ఏదైనా జిల్లాలో పోస్టుల కొరత ఉన్న సందర్భంలో వినియోగించడం/కేటాయించడానికి ప్రతిపాదనలు సమర్పించారు. 8వ సూచన ప్రకారం, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ మరియు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా నడుస్తున్న ప్రస్తుత వసతి రహిత పాఠశాలలను (i) శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (PP1 & PP2); (ii) ఫౌండేషనల్ స్కూల్ (PP1, PP2, క్లాస్ 1 & 2); (iii) బేసిక్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, క్లాస్ 1 నుండి 5); (iv) మోడల్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, క్లాస్ 1 నుండి 5); (v) అప్పర్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, క్లాస్ 1 నుండి 8); (vi) హైస్కూల్ (క్లాస్ 6 నుండి 10); (vii) హైస్కూల్ (క్లాస్ 1 నుండి 10); (viii) హైస్కూల్ ప్లస్ (క్లాస్ 6 నుండి 12); (ix) హైస్కూల్ ప్లస్ (క్లాస్ 1 నుండి 12 )గా మార్చడానికి అనుమతి ఇచ్చింది. దీని లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లల అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడం. ప్రభుత్వం విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, 7వ సూచన ప్రకారం పాఠశాల విద్యా డైరెక్టర్ జారీ చేసిన బోధన సిబ్బంది పునర్వ్యవస్థీకరణకు మార్గదర్శకాలను మరియు కాలానుగుణంగా జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థిస్తూ, 2వ నుండి 4వ సూచనలలో జారీ చేసిన గత ఉత్తర్వులను అధిగమిస్తూ, తుది ప్రతిపాదనను అంగీకరిస్తోంది. ప్రభుత్వం ఇందుమూలంగా పాఠశాల విద్యా డైరెక్టర్‌కు (i) 4706 స్కూల్ అసిస్టెంట్స్ (SAs) పోస్టులను మోడల్ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్స్ / స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడానికి అనుబంధం-II లో (ii) పని చేస్తున్న మిగులు స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు సమాన పోస్టులను క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్‌గా వారి సేవలను ఉపయోగించడానికి ఉంచడానికి (iii) 615 పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ (517)/సెకండరీ గ్రేడ్ టీచర్ (98) మరియు సమాన పోస్టులను అదే మేనేజ్మెంట్ లో అవసరమైన పోస్టులుగా మార్చడానికి అనుబంధం-III లో (iv) 3228 పోస్టుల సృష్టి అంటే 397 గ్రేడ్-II హెడ్ మాస్టర్స్, 2709 స్కూల్ అసిస్టెంట్స్ మరియు 122 సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులను నిర్వహణలో లేదా అంతర్ నిర్వహణలలో ఖాళీ మిగులు పోస్టులను (3980) సప్రెస్ చేయడం ద్వారా మరియు 1311 పోస్టులను HoD పూల్ నుండి సర్దుబాటు చేయడం ద్వారా అనుబంధం-IV లో (v) 779 ఉన్నత ప్రాథమిక పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుబంధం-V లో (vi) జిల్లాలలో 1902 ఖాళీ మిగులు పోస్టులను (అంటే 362 స్కూల్ అసిస్టెంట్స్, 1540 సెకండరీ గ్రేడ్ టీచర్స్) పాఠశాల విద్యా డైరెక్టర్ కేడర్ స్ట్రెంత్ కి చేర్చి, భవిష్యత్తులో ఏదైనా జిల్లాలో పోస్టుల కొరత ఉన్న సందర్భంలో వినియోగించడం/కేటాయించడానికి అనుమతి ఇస్తోంది. పాఠశాల విద్యా డైరెక్టర్, ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వులు ఆర్థిక(FMU-SE) శాఖ యొక్క సమ్మతితో, U.O.No .FIN01-HR0PDPP(RRD)/97/2022-HR-II (1778011), తేదీ.07.05.2025 ద్వారా జారీ చేయబడినవి. అనుబంధం-I ( G.O.Ms.No .21, SE శాఖ, తేదీ.13.05.2025) సిబ్బంది నమూనా ( స్టాఫ్ పేటర్న్ ) I. ప్రాథమిక పాఠశాలలు I (a). ఫౌండేషనల్ స్కూల్ (PP1, PP2, 1వ మరియు 2వ తరగతులు ): 1 నుండి 30 : 1 సెకండరీ గ్రేడ్ టీచర్. 31 నుండి 60 : 2 సెకండరీ గ్రేడ్ టీచర్స్ RTE ప్రకారం I (b). బేసిక్ ప్రైమరీ స్కూల్ (PP1, PP2, 1వ-5వ తరగతులు): 1 నుండి 20 : 1 సెకండరీ గ్రేడ్ టీచర్. 21 నుండి 60 : 2 సెకండరీ గ్రేడ్ టీచర్స్ RTE ప్రకారం I (c) . మోడల్ ప్రైమరీ స్కూల్స్ (PP1, PP2, 1-5 తరగతులు): నమోదు 59 వరకు : 1 MPS HM/SA మరియు 3 సెకండరీ గ్రేడ్ టీచర్స్ నమోదు 60 నుండి 150 : 1 MPS HM/SA మరియు 4 సెకండరీ గ్రేడ్ టీచర్స్ 150 తరువాత ప్రతి 30 నమోదులకు: అదనంగా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ కేటాయించబడతారు. II ప్రాథమిక ఉన్నత పాఠశాలలు (a) ప్రాథమిక ఉన్నత పాఠశాలలు (1-5 తరగతులు): నమోదు ప్రకారం బేసిక్ ప్రైమరీ స్కూల్ / మోడల్ ప్రైమరీ స్కూల్ నియమాలు పాటించబడతాయి. (b) ప్రాథమిక ఉన్నత పాఠశాలలు (6వ నుండి 8వ తరగతులు) i. 1 నుండి 10: 1 స్కూల్ అసిస్టెంట్ ii. 11 నుండి 30: 2 స్కూల్ అసిస్టెంట్ iii. 31 నుండి 140: 4 స్కూల్ అసిస్టెంట్ iv. 141 నుండి 175: 5 స్కూల్ అసిస్టెంట్ గమనిక: స్కూల్ అసిస్టెంట్ పని చేస్తున్న మిగులు పోస్టులు అందుబాటులో లేకపోతే, స్కూల్ అసిస్టెంట్ స్థానంలో సెకండరీ గ్రేడ్ టీచర్‌ను పోస్ట్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ ప్రాధాన్యత క్రమం: హిందీ/ ఇంగ్లీష్/ మ్యాథ్స్/BS/ SS/PS/తెలుగు. III. హైస్కూళ్లు హైస్కూల్‌లోని I నుండి V తరగతుల కోసం, I నుండి V తరగతుల నమోదు 60 కంటే ఎక్కువ ఉంటే, అనుబంధం - I లో పేర్కొన్న మోడల్ ప్రైమరీ స్కూల్ సిబ్బంది నమూనా (ప్రాథమిక పాఠశాల కోసం) పాటించబడుతుంది. I నుండి V తరగతుల నమోదు 60 కంటే తక్కువ ఉంటే, క్రింది సిబ్బంది నమూనా పాటించబడుతుంది. 1 నుండి 5 నమోదు 10 వరకు 2 సెకండరీ గ్రేడ్ టీచర్స్ 11 నుండి 30 3 సెకండరీ గ్రేడ్ టీచర్స్ 31 నుండి 59 1 MPS HM / SA మరియు 3 సెకండరీ గ్రేడ్ టీచర్స్ మిగతా వివరాలు కింది పీడీఎఫ్ కాపీలో చూడగలరు 👇

  • SSC 2025 - మార్కుల షార్ట్ మెమోలు విడుదల - ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

    AP SSC 2025 Marks Memos, 10th Class Marks Memos, AP 10th Class Marks certificates, Government Of Andhra Pradesh, Department Of Education, SSC Short Memos, 10th Class short memos SSC పరీక్షా ఫలితాలు 2025 - మార్కుల మెమోరాండం అందుబాటులో ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయం నుండి తాజా ప్రకటన తేదీ: 08-05-2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి నుండి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయబడింది. 2025 మార్చి నెలలో జరిగిన SSC పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోల వివరాలు ఈ ప్రకటనలో తెలియజేయబడ్డాయి. ముఖ్య వివరాలు పరీక్షలు 17.03.2025 నుండి 01.04.2025 వరకు నిర్వహించబడ్డాయి ఫలితాలు 23.04.2025న ప్రకటించబడ్డాయి విద్యార్థుల సబ్జెక్ట్ వారీ మార్కుల మెమోరాండం (షార్ట్ మెమో) 08.05.2025 నుండి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ఖాతా ద్వారా "సబ్జెక్ట్ వారీ షార్ట్ మెమో " ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలి. మార్కుల సవరణలకు సంబంధించిన విధానం ప్రధానోపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు షార్ట్ మెమోలో ఏవైనా తప్పులు గుర్తించినట్లయితే, వాటిని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయానికి తెలియజేయాలి. ఈ సవరణలు ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో చేర్చబడతాయి. సవరణల కోసం సమర్పించవలసిన పత్రాలు: అడ్మిషన్ రిజిస్టర్‌ ప్రకారం పాఠశాల రికార్డుల ధ్రువీకరణ ప్రధానోపాధ్యాయులచే ధ్రువీకరించబడిన షార్ట్ మెమో (సబ్జెక్ట్ వారీ మార్కుల మెమోరాండం) కాపీ పైన పేర్కొన్న పత్రాలను 25.05.2025 లోపు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయానికి , ఆంధ్రప్రదేశ్, విజయవాడకు పంపించాలి. సంప్రదించవలసిన చిరునామా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్,డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి,ఆంధ్రప్రదేశ్, అమరావతి ఈ సమాచారం విద్యార్థుల సౌకర్యార్థం అన్ని దినపత్రికలలో ప్రచురించబడుతుంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని విద్యాశాఖ అధికారులను సంప్రదించండి. గమనిక: ఈ బ్లాగ్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలనాలయం జారీ చేసిన అధికారిక ప్రకటన ఆధారంగా తయారు చేయబడింది. ( Rc.No : GE-CPROORSLTIDRPR)/1/2025-DGE, తేదీ: 08-05-2025) How to Download AP SSC 10th Class Marks Memos 2025 : AP SSC 10th Class Marks Memos 2025: >Go to https://www.bse.ap.gov.in/   > Click on SSC Public Examinations 2025 - School Wise Results and Memorandum or >click on the direct login link given below > Enter User Id (School SSC Code) and Password  >Click on Confirm School UDISE Code  >Click on March - 2025 SCHOOL WISE RESULT  >Click on Student Roll Number  > Now SSC Short marks Memo Opened  >Click on print Take print or >save to Your PC

  • టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు ప్రదానం Money Prizes to SSC and Intermediate Toppers

    ఏపీలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. Money prizes to SSC and Intermediate Toppers అమరావతి: ఏపీలో ఇటీవల విడుదలైన పది, ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, గిరిజన సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలల నుంచి ఆయా విభాగాల వారీగా రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.20 వేలు, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15 వేలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10 వేల చొప్పున ఇచ్చారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంబంధిత శాఖల మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మిడి సంధ్యారాణి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.  కష్టపడితే ఎవరైనా ఉన్నత శిఖరాల్ని చేరొచ్చు: మంత్రి డోలా సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్ని కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రతిభ ఎవరి సొంతమూ కాదన్న ఆయన.. కష్టపడితే ఎవరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ప్రతిభా పురస్కారాలను అందజేశారు.  ప్రభుత్వం సిలబస్ తగ్గించి గుణాత్మక విద్యను అందించాలని సంకల్పించిందని డోలా అన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్ని మరమ్మతులు చేసేందుకు, ఆధునీకరించేందుకు సీఎం చంద్రబాబు రూ.143 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఎక్స్‌లెన్సీ కేంద్రాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10కి పెంచుతామని తెలిపారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో శత శాతం వచ్చేందుకు అధికారులు కృషి చేయాలని.. అక్టోబరు నుంచి కాకుండా జులై, ఆగస్టు నుంచే ట్యూటర్లను పెడతామని చెప్పారు. విద్యార్థులకు త్వరలో కాస్మోటిక్స్‌ కిట్స్ ఇవ్వబోతున్నామని, వంట సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వబోతున్నామని చెప్పారు. నూతన విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్లకు, పాఠశాలలకు ప్రభుత్వం నాణ్యమైన బియ్యం ఇవ్వబోతోందన్నారు. అనంతరం మహిళా, శిశుసంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో గురుకులాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెడితే.. వాటిని చంద్రబాబు పూర్తిగా ఆధునీకరించారన్నారు.

  • త్వరలో ‘అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’

    Ambedkar Overseas Vidya Nidhi విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు ఈబీసీ, కాపులకు రూ.15 లక్షలు అందించేలా ప్రతిపాదనలు అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల్లోని ప్రతిభావంతులైన పేదల పిల్లలకు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే కలను నెరవేర్చేలా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు పథకం అమలుకు కసరత్తు ప్రారంభించారు. ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద రూ.5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి ‘అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి’గా పేరు పెట్టనున్నారు. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.  ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా.. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం అంబేడ్కర్, ఎన్టీఆర్‌ పేర్ల మీద ఈ పథకాన్ని అమలు చేయగా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడాలేని నిబంధనలు పెట్టి నిర్వీర్యం చేసింది. పథకానికి ఉన్న అంబేడ్కర్, ఎన్టీఆర్‌ పేర్లను తొలగించి జగనన్న పేరు పెట్టింది. ఆర్థికసాయం పెంచినట్టే చూపించి విద్యార్థుల సంఖ్య పెరగకుండా నిబంధనలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పథక లబ్ధి అందకుండా చేసింది. సబ్జెక్టుల వారీగా క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌-50 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికే సాయం అందేలా నిబంధన తెచ్చింది. ఇది ఆయా వర్గాల విద్యార్థులకు శరాఘాతంగా మారింది. తాజాగా అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం. ఇప్పుడు కూడా క్యూఎస్‌ ర్యాంకింగ్‌నే ప్రాతిపదికగా తీసుకుంటున్నా, టాప్‌-250 వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఆర్థికసాయం అందించేలా నివేదించారు. మరిన్ని వార్తలు విశేషాలు చదవండి 👈

  • ఉపాధ్యాయ సంఘాలతో సీఎస్ఈ సమావేశ వివరాలు

    ఈరోజు సీఎస్ఈ సమావేశ వివరాలు ఈరోజు అడిషనల్ డైరెక్టర్ శ్రీ ఏ సుబ్బారెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో వెబెక్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలు ✍️ బదిలీల ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని, బదిలీల చట్టంపై నిన్నటి రోజున కోర్టు ఇచ్చిన స్టే పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ✍️ పది రోజులలో బదిలీల షెడ్యూల్ ను ప్రారంభిస్తామన్నారు. ✍️ తెలుగు మీడియం, మైనర్ మీడియంలో ఎంపికైన ఉపాధ్యాయుల సీనియారిటీని కలిపి రూపొందించేటప్పుడు మార్కుల ఆధారంగా రూపొందిస్తామన్నారు. ✍️ రివర్షన్ పై వెళ్లిన ఉపాధ్యాయుల సీనియారిటీపై ఉపాధ్యాయసంఘాల ప్రాతినిధ్యాన్ని నిబంధనలను పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ✍️ ఫౌండేషన్ పాఠశాలలకు 1:20 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని కోరడం జరిగింది. ✍️ ఉన్నత పాఠశాలల్లోని ప్రాధమికోన్నత తరగతులకు 45 వద్ద రెండవ సెక్షన్, 75 వద్ద మూడో సెక్షన్ పరిగణించాలని కోరడం జరిగింది. ✍️ ఉన్నత పాఠశాలల్లో 9,10 తరగతులకు 50 వద్ద రెండో సెక్షన్, 90 వద్ద మూడో సెక్షన్ పరిగణించాలని కోరడం జరిగింది. ✍️ గుంటూరు నగర పాలక పరిధిలో ఇందిరానగర్ లోని ప్రాధమికోన్నత పాఠశాలను విద్యార్థుల సంఖ్యను, ఎస్ఎంసి తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోకుండా మోడల్ ప్రైమరీగా ప్రతిపాదించారని ప్రాథమికోన్నత పాఠశాల గానే కొనసాగించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ✍️ పోస్టుల పునర్విభజన ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన కొందరు ఉపాధ్యాయులు మెడికల్ క్యాంపులో దరఖాస్తు చేసుకో లేకపోయిన వారికి ఒకరోజు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ✍️ తెలుగు మాధ్యమం, ఉర్దూ మాధ్యమం గల ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాష ఆధారంగా అదనపు పోస్టుగా మంజూరు చేయబడిన ఉర్దూ, తెలుగు ఎస్.జి.టి పోస్టులను రద్దు చేయరాదని కోరడం జరిగింది. ✍️ ప్రాథమికోన్నత పాఠశాలల్లో మంజూరు చేసే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల క్రమంపై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగింది. ✍️ ప్రాధాన్యత కేటగిరీ కింద బదిలీ కొరకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ధ్రువపత్రాలు కొందరికి అప్లోడ్ కావడం లేదని వెంటనే అందరికీ అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. ✍️ పోస్టుల పునర్విభజన ప్రక్రియలో మిగులుగా గుర్తించబడే ఉపాధ్యాయులకు పాయింట్ల కేటాయింపు పై స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగింది. ✍️ ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంగ్లీష్ పదోన్నతులపై చర్చించడం జరిగింది. ✍️ విద్యార్థుల సంఖ్య కొరకు కటాఫ్ తేదీ మార్చి 31 కాకుండా మార్చాలని కోరడం జరిగింది. ✍️ కంపోజిట్ కోర్సుగా తెలుగు ఉర్దూ సంస్కృతం కొరకు గతంలో వలె పోస్టులను కొనసాగించాలని ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ✍️ మిగులుగా తేల్చబడిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయు ప్రక్రియపై చర్చించడం జరిగింది. ✍️ ప్లస్ టు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సర్దుబాటుపై చర్చించడం జరిగింది. ✍️ బదిలీలు, పోస్టుల పునర్విభజన ప్రక్రియలో పలు అంశాలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ✍️ మెగా డీఎస్సీ 2025, టెట్ నిర్వహణపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ✍️ 117 జీవో అమలు చేయునపుడు రద్దు పరచిన ప్రధానోపాధ్యాయ పోస్టులను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

  • May Month Salary: మే నెల జీతాల సమాచారం

    జీతాల సమాచారం: ఫండ్ క్లియరెన్స్ ఆలస్యం - ఈ రోజు జీతాలు జమ కాకపోవచ్చు నేను మీ తోటి ఉద్యోగి, ఒక టీచర్‌గా, టీచర్స్ బ్లాగర్‌గా మనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన అంశంపై ఈ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను. మన జీతాలకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం, మన జీతాల చెల్లింపు ప్రక్రియ "వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్" స్టేజ్‌లో ఉందట. అంటే, ఈ రోజు (మే 1, 2025) మన ఖాతాల్లో జీతాలు జమ కాకపోవచ్చు. ఏం జరుగుతోంది? మన స్కూల్/శాఖ ఆర్థిక లావాదేవీలలో కొన్ని టెక్నికల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ సమస్యల వల్ల ఫండ్ క్లియరెన్స్‌లో కాస్త ఆలస్యం అవుతోందని సమాచారం. ఇది బ్యాంకులు, గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లు లేదా ఇతర థర్డ్-పార్టీ సంస్థలతో సంబంధం ఉన్న ప్రక్రియ. ఈ ఆలస్యం మన చేతుల్లో లేనప్పటికీ, మన అడ్మినిస్ట్రేషన్ దీన్ని త్వరగా క్లియర్ చేయడానికి కృషి చేస్తోందని తెలిసింది. మనకు ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ ఆలస్యం వల్ల ఈ రోజు మన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు పడకపోవచ్చు. కానీ, ఇది తాత్కాలికమైన సమస్య మాత్రమే. ఫండ్ క్లియరెన్స్ పూర్తయిన వెంటనే జీతాలు జమ అవుతాయని నమ్మకంగా ఉంది. సాధారణంగా ఇలాంటి ఆలస్యం కొన్ని గంటల నుండి ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతుంది. అడ్మినిస్ట్రేషన్ దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. మనం ఏం చేయవచ్చు? ప్రస్తుతానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఒకవేళ మీకు అత్యవసర ఆర్థిక అవసరాలు ఉంటే లేజీపే, సింప్ల్ , స్మిటెన్ మరియు స్నాప్ మింట్ వంటి యాప్స్ ఉపయోగించుకోవచ్చు. లేజీ పే యాప్ లో సౌకర్యాలు సింపుల్ యాప్ ఉపయోగాలు మేము ఈ విషయంలో ఏదైనా అప్‌డేట్ తెలిస్తే మీతో వెంటనే షేర్ చేస్తాము. టీచర్స్‌గా మన ఫీలింగ్స్ టీచర్లుగా మనం ఎంత కష్టపడతామో, మన జీతం మనకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఇలాంటి ఆలస్యం కాస్త ఫ్రస్టేషన్ కలిగించవచ్చు, కానీ ఇది తాత్కాలికమని, త్వరలోనే పరిష్కారమవుతుందని నమ్ముతున్నాను. మనం ఎప్పటిలాగే సహనంతో, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ సమయాన్ని గడిపేద్దాం. మన స్టూడెంట్స్ కోసం, మన ప్రొఫెషన్ కోసం మనం ఎప్పుడూ అద్భుతంగా పని చేస్తాం కదా! మీరు కూడా షేర్ చెయ్యండి! మీలో ఎవరివద్దనైనా ఈ విషయంలో అదనపు సమాచారం ఉంటే లేదా ఏదైనా ఆలోచనలు, సలహాలు ఉంటే, కామెంట్స్‌లో షేర్ చేయండి. మనం అందరం కలిసి ఈ సమస్యను అర్థం చేసుకుని, ఒకరికొకరు సపోర్ట్ చేద్దాం. నేను కూడా ప్రభుత్వం నుండి కొత్త అప్‌డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. చివరిగా... ఈ ఆలస్యం వల్ల కలిగే అసౌకర్యం ఇబ్బందే కానీ, మన సహనం, సపోర్ట్‌తో ఈ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాను. మనం టీచర్స్, మనం ఎప్పుడూ బలంగా ఉంటాం! 💪 ప్రేమతో.. ఏపీ టీచర్స్ టీవీ తేదీ: మే 1, 2025

bottom of page