AP Teachers News,App demos,Software demos,G.Os,Agiations,
Govt meetings, Discussions & Opinion Blog
Search Results
663 results found with an empty search
- DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల పునర్నియామకం కోసం సూచనలు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల కోసం సూచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, మంగళగిరి నుండి డైరెక్టర్ శ్రీ విజయ్ రామ రాజు.V, IAS గారి అధ్యక్షతన జారీ చేయబడిన ఆదేశాలు: తేదీ: 18.06.2025 విషయం: 2025-26 విద్యా సంవత్సరానికి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల స్థానాల కేటాయింపు - సూచనలు జారీ. సూచనలు: 1. ప్రభుత్వ మెమో నెం.2809835/సర్వీసెస్-1/A2/2025, తేదీ: 06.05.2025. 2. ఈ కార్యాలయ మెమో నెం.20/24/2021-EST 3, తేదీలు: 15.05.2025 & 11.06.2025. 3. G.O.Ms.No. 22 SE, తేదీ: 20.05.2025. ఆదేశం: పైన పేర్కొన్న సూచనల ఆధారంగా, ప్రభుత్వం DSC 2008 మరియు DSC 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుల సేవలను 01.06.2025 నుండి 30.04.2026 వరకు 11 నెలల పాటు, ఒక నెల విరామంతో, "పని లేకపోతే జీతం లేదు" సూత్రం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి పునరుద్ధరించడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సజావుగా సాగేందుకు ఆర్థిక శాఖ సమ్మతితో జరిగింది. అదనంగా, G.O.Ms.No.22, తేదీ: 20.05.2025 ప్రకారం, పాఠశాల విద్యాశాఖ హెడ్ మాస్టర్/ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను చేపట్టి, ఆ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు క్రింది సూచనలను అనుసరించి DSC 2008 & 1998 మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులకు స్థానాలను కేటాయించాలని ఆదేశించబడింది: 1. ప్రాధాన్యత క్రమం: - మొదటి ప్రాధాన్యత DSC 2008 అభ్యర్థులకు, ఆ తర్వాత DSC 1998 అభ్యర్థులకు ఇవ్వాలి. 2. స్థానాల కేటాయింపు కోసం పాటించాల్సిన ప్రమాణాలు: i. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ SGT పోస్టులు మంజూరు చేయబడినా, ఒక్క ఉపాధ్యాయుడు కూడా పనిచేయని పాఠశాలలు. ii. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ SGT పోస్టులు మంజూరు చేయబడినా, కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్న పాఠశాలలు. iii. మోడల్ ప్రైమరీ పాఠశాలలు (4+1): 4+1 SGT పోస్టులు మంజూరు చేయబడి, ఒక SGT మాత్రమే పనిచేస్తున్న చోట రెండు మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులను కేటాయించాలి. iv. మోడల్ ప్రైమరీ పాఠశాలలు (3+1): 3+1 SGT పోస్టులు మంజూరు చేయబడి, ఒక SGT మాత్రమే పనిచేస్తున్న చోట ఒక మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయుడిని కేటాయించాలి. v. మూడు ఉపాధ్యాయుల పాఠశాలలు: 3 SGT పోస్టులు మంజూరు చేయబడినా, ప్రస్తుతం కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్న పాఠశాలలు. 3. అదనపు SGTల కేటాయింపు: - జిల్లాలో అదనపు SGTలు ఉంటే, వారిని కేటగిరీ IV నుండి I వరకు క్లస్టర్‌లకు అనుపాతంలో కేటాయించాలి. - ఇంకా అదనపు MTS SGTలు ఉంటే, మొదట కేటగిరీ IV క్లస్టర్‌లకు, ఆ తర్వాత కేటగిరీ III క్లస్టర్‌లకు కేటాయించాలి. అదనపు సూచనలు: రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారులు పైన పేర్కొన్న ఖాళీలను గుర్తించి, మినిమం టైమ్ స్కేల్ (MTS) ఉపాధ్యాయులను పాఠశాలలకు కేటాయించాలి. ఈ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా, ఈ కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాలి. ఈ ప్రక్రియను 20.06.2025 నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలి. సంతకం: విజయ్ రామ రాజు.V డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వీరికి: - రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు. - రాష్ట్రంలోని అన్ని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, పాఠశాల విద్యాశాఖ (సమాచారం కోసం). - DSE పేషీకి కాపీ.
- LEAP: School Attendance App New Update
LEAP App New Update The LEAP (Learning Excellence in Andhra Pradesh) App is a platform that consolidates digital tools for schools, teachers, students, and administrators. It includes features like student profile information, attendance tracking, and school resource details. The current version of the app is 3.1.3. What's new Added summary video module in student login About this app Learning Excellence in Andhra Pradesh, School Education Department Learning Excellence in Andhra Pradesh (LEAP) App is a revolutionary step by the School Education Department, Government of Andhra Pradesh by duly consolidating multiple digital tools into a single, efficient platform. This app provides multiple services related to Schools, Teachers, Students, and Administrators to improve governance through a detailed dashboard. Leap includes profile information of students, teachers, schools, school resources, fund allocation details, student attendance tracking, MDM function tracking, and other student entitlement functions, as well as maintenance of school infrastructure and more
- సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో)
సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో) IMMS App ఓపెన్ చేయండి User Name నమోదు చేయండి Password నమోదు చేయండి (PM Poshan) Mid Day Meals పై క్లిక్ చేయండి HM Services పై క్లిక్ చేయండి Rice Receipt పై క్లిక్ చేయండి Get Transit Details పై క్లిక్ చేయండి Transit Details downloaded successfully అనే సందేశం చూపబడుతుంది. ఈ సమయంలో Year మరియు Month ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది. Year మరియు Month ను ఎంచుకోండి. తరువాత ఈ విధంగా వివరాలు కనిపిస్తాయి: Truck chit No.: ABCDEF Truck Number: APXX AB XXXX Dispatch Date: XX/XX/XXXX Commodity Name Commodity Name పై క్లిక్ చేయండి (ఉదా: Jaggery / F Fine Rice) మీరు ఎంచుకున్న Commodity వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే Confirm చేయండి. ఈ దశలో ఒక సందేశం కనిపిస్తుంది: OTP will be sent to the selected Employee Aadhar tagged mobile number. Choose One Role for OTP Authentication పై క్లిక్ చేయండి. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల జాబితాలోంచి ఒకరిని ఎంపిక చేసుకోండి. Proceed పై క్లిక్ చేయండి. QR కోడ్ ఉన్న బస్తాల సంఖ్యను నమోదు చేయండి. QR కోడ్ లేని బస్తాల సంఖ్యను నమోదు చేయండి. Next పై క్లిక్ చేయండి. ఈ దశలో సందేశం వస్తుంది: Click here to scan Rice bags QR code (అన్ని బస్తాలపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేయండి). GET OTP పై క్లిక్ చేయండి. ఎంపిక చేసిన ఉపాధ్యాయుడి మొబైల్ నంబరుకు వచ్చిన OTP నమోదు చేయండి. Submit పై టాప్ చేయండి. ✅ Details Submitted Successfully
- Corona virus: దేశంలో 3,758కి చేరిన కొవిడ్ యాక్టివ్ కేసులు.. ఈ వైరస్‌పై WHO ఏం చెప్పిందంటే?
దేశంలో కొవిడ్(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్ 1న ఉదయం 8గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. Corona virus: దేశంలో 3,758కి చేరిన కొవిడ్ యాక్టివ్ కేసులు.. ఈ వైరస్‌పై WHO ఏం చెప్పిందంటే? దేశంలో కొవిడ్(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్ 1న ఉదయం 8గంటల వరకు దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగింది. వీటిలో అత్యధికంగా కేరళలోనే 1400 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 485, దిల్లీ 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటక 238, ఆంధ్రప్రదేశ్23, తెలంగాణ 3 చొప్పున.. ఇలా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 3758 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఈ ఏడాది కొవిడ్ సంబంధిత మరణాలు 28కి చేరాయి. డబ్ల్యూహెచ్‌వో ఏమందంటే? కొవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ( WHO )ఇటీవల స్పందించింది. వ్యాప్తిలో ఉన్న ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 సబ్ వేరియంట్లను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని మే 23న పేర్కొంది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్ మరోవైపు, ఐసీఎంఆర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నమూనాల ద్వారా ఈ కొత్త వేరియంట్లు ఒమిక్రాన్ జాతికి చెందిన ఉప రకాలుగా తేలింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ శరవేగంగా విస్తరించడానికి ఒమిక్రాన్ కారణమన్న విషయం తెలిసిందే. అయితే, ఎల్‌ఎఫ్.1, ఎక్స్‌ఎఫ్‌జీ, జేఎన్. 1, ఎన్‌బీ. 1.8.1 వంటి వేరియంట్లను మన దేశంలో గుర్తించగా.. వీటిలో మొదటి మూడు వేరియెంట్లే ప్రబలంగా ఉన్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ రాజీవ్ బహల్ ఇటీవల తెలిపారు. కొవిడ్ కేసుల పెరుగుదలపై ఇటీవల రాజీవ్ బెహల్ ‘పీటీఐ’వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తొలుత దక్షిణ భారతదేశం నుంచి నమోదైన కేసులు.. ఆ తర్వాత పశ్చిమం నుంచి, ఇప్పుడేమో ఉత్తర భారతం నుంచి వస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులన్నింటినీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మోనిటరింగ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ ఇన్‌ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉందన్న ఆయన.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఎప్పుడైనా ఇన్ఫెక్షన్లు పెరిగితే.. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వైరస్ వ్యాప్తి ఎంత మేరకు ఉంది అనేది మొదట చూడాలి. గతంలో కొవిడ్ 19 వచ్చినప్పుడు కేసులు రెండు రోజుల్లోనే రెట్టింపు కావడం మనం చూశాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక రెండోది, కొత్త వేరియంట్లు రోగనిరోధక శక్తిపై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనేది చూడాలి. మూడోది, వైరస్ తీవ్రత ఎంతో చూడాలి. గతంతో పోలిస్తే.. ఈ వేరియంట్‌లో అంత తీవ్రత కనబడటంలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదుగానీ, అప్రమత్తంగా, సర్వసన్నద్ధతతో ఉండాలి’’ అని సూచించారు. Read More...
- Ap news: ఇక మూల్యాంకన పుస్తకాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్‌తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి. పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం ఆరో తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు బ్రిడ్జి కోర్సు పదో తరగతి ప్రీఫైనల్ నాటికి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్‌తో కలిపి మూల్యాంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకాన్ని ఇస్తారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు ఆరు మూల్యాంకన పుస్తకాలు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించే నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ పరీక్షలకు సంబంధించిన జవాబులను ఈ మూల్యాంకన పుస్తకంలోనే రాయాల్సి ఉంటుంది. గతంలో విడివిడిగా జవాబుపత్రాలు ఇచ్చేవారు. ఒక పరీక్ష ముగిశాక మార్కులను నమోదు చేసి వాటిని మూలన పడేసేవారు. అలాకాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈసారి పుస్తక రూపంలో తెచ్చారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఎప్పటికప్పుడు ప్రశ్నపత్రాలనురూపొందిస్తుంది. వీటితోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక విద్యార్థి ఏ సబ్జెక్టులో పరీక్షలు ఎలా రాశారు? ఎన్ని మార్కులొచ్చాయనే దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పరీక్ష ముగిశాక ఉపాధ్యాయులు ఈ పుస్తకంలోనే మూల్యాంకనం చేసి ఓఎంఆర్ షీట్‌లో మార్కులు వేసి లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే విద్యార్థుల అభ్యాసాన్ని విశ్లేషిస్తారు. పునశ్చరణ తరగతులు అవసరమున్నవారిని గుర్తించి ఉపాధ్యాయులకు సమాచారమిస్తారు. అధికారులు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు ఈ మూల్యాంకన పుస్తకాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. ప్రాథమిక విద్య తర్వాత బ్రిడ్జి కోర్సు జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు ఒకటి వరకు ఆరో తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్య స్థాయిలో కొందరు విద్యార్థులు వెనుకబడి ఉండడం, మరికొందరికి బేసిక్స్‌పై పట్టు లేకపోవడం సహజం. ఇలాంటివారికి ఆరో తరగతిలో చేరిన వెంటనే బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. వారికి ప్రాథమిక స్థాయిలో 1-5 తరగతుల వరకు నేర్చుకోవాల్సిన అంశాలను బోధిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య-1,2 పూర్తి చేసి వచ్చే విద్యార్థులకు ఒకటో తరగతిలో ఆరు వారాలపాటు ప్రత్యేకంగా బోధిస్తారు. ఒకటో తరగతికి సన్నద్ధం చేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించారు. ముందుగానేసిలబస్ పూర్తి తొ మ్మిదో తరగతి విద్యార్థుల సిలబస్‌ను ముందుగానే పూర్తి చేసి వారికి నెలపాటు పదో తరగతి పాఠ్యాంశాలు బోధించేలా ప్రణాళిక రూపొందించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పడంతోపాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా సన్నద్ధమవ్వాలి? ఆయా పాఠాలకు అవసరమయ్యే వీడియోల రూపకల్పనలాంటి అంశాలపై అవగాహన కల్పించేలా టీచర్లకు హ్యాండ్‌బుక్‌ను తీసుకొచ్చారు. ఈ హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలకు సంబంధించి క్యూఆర్ కోడ్‌తో వీడియోలను ఉంచారు.
- AP Mega DSC: జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు
మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్ 30కి కుదించారు. ఆగస్టు రెండో వారంలో ఫలితాలు AP Mega DSC AP Mega DSC: అమరావతి: మెగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా.. అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున, దీన్ని జూన్ 30కి కుదించారు. మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) ప్రారంభమవుతాయి. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని పరీక్షలు మధ్యలో.. చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతాయి. మళ్లీ 12, 13, 16, 17, 29, 30 తేదీల్లో పరీక్షలుంటాయి. ఎస్జీటీలకు 13న మధ్యాహ్నం, 17న ఉదయం, 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీలకు జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు విడతల్లో కలిపి సుమారు 40 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులతోపాటు ఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు. ఇలాంటి వారికి ఎస్‌ఏ హాల్‌టికెట్లు జారీ చేయలేదు. కొంతమంది అభ్యర్థులు మొదట దరఖాస్తు సమర్పించి, ఆ తర్వాత ఎడిట్ చేసేందుకు ప్రయత్నించి, అది పూర్తికాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారమే హాల్‌టికెట్లు జారీ చేశారు. ఆగస్టులో ఫలితాలు : పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం ఆరు రకాల పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అత్యధికంగా 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టులకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తం 16,347 పోస్టుల్లో క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీరికి పోటీ పరీక్ష ఉండదు. వారు సాధించిన పతకాలే ప్రామాణికంగా శాప్ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాట్సప్‌లోనూ హాల్‌టికెట్లు: మంత్రి లోకేశ్ మెగా డీఎస్సీ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌తోపాటు వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు
- జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు
AP Mega DSC జూన్ 6 నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు అమరావతి:మే 31 ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూలు విడుదలైంది, ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది.. ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.. దీంతో ఏపీతో పాటు పొరు గురాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేయబోతు న్నారు..ఇక, జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షల్లో.. ప్రతిరోజు రెండు సెషన్లలో డీఎస్సీ నిర్వహించనున్నారు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.. అయితే, ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) ద్వారా నిర్వహించబోతోంది.
- LEAP Attendance App New Update V 3.1.0
What's new LEAP Application Version 3.1.0 About this app Learning Excellence in Andhra Pradesh, School Education Department: Learning Excellence in Andhra Pradesh (LEAP) App is a revolutionary step by the School Education Department, Government of Andhra Pradesh by duly consolidating multiple digital tools into a single, efficient platform. This app provides multiple services related to Schools, Teachers, Students, and Administrators to improve governance through a detailed dashboard. Leap includes profile information of students, teachers, schools, school resources, fund allocation details, student attendance tracking, MDM function tracking, and other student entitlement functions, as well as maintenance of school infrastructure and more.
- Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు!
Supreme Court: పోక్సో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అరుదైన తీర్పు ఇచ్చింది. ఇంటర్నెట్‌డెస్క్: ఓ పోక్సో కేసు (POCSO Case) విషయంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) అరుదైన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు. అందుకు ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితే కారణమని వ్యాఖ్యానించింది. కేసు పూర్వపరాలివీ.. బాలికతో లైంగిక సంబంధం కొనసాగించినందుకు బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఆ వ్యక్తికి ట్రయల్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానిని సవాల్ చేస్తూ అతడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. దానిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. 2023 అక్టోబరు 18న సంచలన తీర్పు వెలువరించింది. బాలిక అతడితో ఇష్టపూర్వకంగానే సాన్నిహిత్యాన్ని కొనసాగించిందన్న కారణంతో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంగా న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం చూసుకుంటే.. సమాజం దృష్టిలో బాలికలు పరాజితులుగా మిగిలిపోతారు. కిశోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి’’ అని సూచించింది. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో రిట్ పిటిషన్‌గా స్వీకరించింది. మరోవైపు, నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అత్యున్నత న్యాయస్థానంలో అప్పీలుకు దాఖలు చేసింది. దాంతో ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఆ కేసులో నిందితుడికి విధించిన శిక్షను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, బాధితురాలు.. అతడిని పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి, బాధితురాలితో చర్చించాలని సూచించింది. ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. కోర్టు విధించిన గడువులో నిపుణుల కమిటీ నివేదిక సీల్డ్ కవర్‌లో అందింది. ఈ ఏడాది ఏప్రిల్ 3న ధర్మాసనం బాధితురాలితో మాట్లాడింది. ఆమె పదోతరగతి పరీక్షలు రాసిన తర్వాత ఆమెకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తాజాగా తుది తీర్పు వెలువరించింది. ‘‘ప్రస్తుతం ఆమె మేజర్. చట్టప్రకారం ఆ ఘటనను నేరంగానే చూస్తున్నప్పటికీ.. ఆమె దానిని అలా చూడటం లేదు. ఆ నేరం వల్ల ఆమెపై మానసికంగా ఎలాంటి ప్రభావం పడనప్పటికీ.. కొన్ని ఇబ్బందికర పరిణామాలను మాత్రం ఎదుర్కొంది’’ అని పేర్కొంది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులు మరీ ముఖ్యంగా దోషి, ప్రస్తుత కుటుంబ జీవితంలో ఆమెకు ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ఆమెకు పూర్తి న్యాయం చేయడానికి విచక్షణాధికారాలను ఉపయోగిస్తున్నామని చెప్పింది. దాంతో పోక్సో కేసులో దోషికి ఏ శిక్షా విధించకుండా తీర్పు ఇచ్చింది. మరిన్ని పోస్టులు చదవండి.
- Microsoft: ఏఐ వ్యవస్థలు రూపొందించి.. వాటివల్లే ఉద్యోగాలు కోల్పోయిన మైక్రోసాఫ్ట్ సిబ్బంది!
Microsoft: ఏఐ వ్యవస్థలను రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పుడు వాటివల్లే తమ ఉపాధిని కోల్పోయారు. ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ( Microsoft ) తన సిబ్బందిలో మూడు శాతం మందికి ఇటీవల ఉద్వాసన పలికింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమమేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయి. అయితే, ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి (Microsoft layoffs). వాషింగ్టన్ ఆఫీసులో తొలగించిన 40శాతం ఉద్యోగుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే ఎక్కువగా ఉన్నారు. ఏఐ సాధనాల వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో వారు పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు. ఆ వ్యవస్థలతోనే ఇప్పుడు వారి ఉద్యోగాలను సంస్థ భర్తీ చేయడం గమనార్హం. 50శాతం మేర కోడ్ రాసేందుకు ఓపెన్ ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించుకోవాలని తన ఆధ్వర్యంలో ఉన్న 400 మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి జెఫ్ హల్స్ కొన్ని వారాల క్రితం సూచించారు. తాజా తొలగింపుల్లో ఆ బృందం కూడా ఉంది. అంటే వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకు వారే ఎసరు తెచ్చుకున్నట్లయింది. జూనియర్ కోడర్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉన్నవారు, ఏఐ ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న సిబ్బంది ఈ కొత్త లేఆఫ్‌ను ఎదుర్కొన్నారు. చివరకు మైక్రోసాఫ్ట్ స్టార్టప్‌లకు చెందిన ఏఐ డైరెక్టర్ గాబ్రియెలా డికీరోజ్ కూడా తన పదవిని కోల్పోవడం గమనార్హం. దీనిపై ఆమె స్పందిస్తూ.. చేదు రుచి కలిగిన తీపి ఇది అని పేర్కొన్నారు. సంస్థ కోసం ఎంతో కృషి చేసినవారు తమ ఉద్యోగాలను కోల్పోవడం విచారకమని వ్యాఖ్యానించారు. 2023లో 10 వేల మందికి మైక్రోసాఫ్ట్ ( Microsoft ) ఉద్వాసన పలికింది. అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. ‘‘మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూనే ఉంటాం’’ అని ఈ లేఆఫ్‌లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు.గత నెల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కృత్రిమ మేధ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ కంపెనీకి సంబంధించి 30 శాతం కోడింగ్‌ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్‌పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యల అనంతరమే 3 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది.
- ₹8 వేల్లోపు లావా నుంచి 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే : Lava Shark 5G
Lava Shark 5G: బడ్జెట్ ధరలో లావా కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇవే.. Lava Shark 5G | ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. లావా షార్క్ 5జీ (Lava Shark 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP54 రేటింగ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ +64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. UNISOC T765 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 ఎంపీ డ్యూయల్ కెమెరా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. విక్రయాలు ప్రారంభమయ్యాయని.. లావా ఇ-స్టోర్‌తో పాటు కంపెనీ రిటైల్ దుకాణాల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మరిన్ని పోస్టులు చదవండి 👈
- ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలు 2025: షెడ్యూల్ ,నియమావళి జారీ! పూర్తి వివరాలు తెలుగులో..
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలు 2025: కొత్త నియమావళి జారీ! పూర్తి వివరాలు పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమైన ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల (బదిలీల నియంత్రణ) నియమావళి, 2025" ను జి.ఓ.ఎంఎస్.నెం.22 ద్వారా తేది 20/05/2025న జారీ చేసింది. ఈ నూతన నియమావళి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక, మరియు పురపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉద్దేశించినది. ఈ ఉత్తర్వు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 (2025 సంవత్సరపు చట్టం నెం.9) మరియు ఇతర సంబంధిత చట్టాల ఆధారంగా రూపొందించబడింది. ఫౌండేషనల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరియు ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధమైన కేటాయింపు, హెడ్మాస్టర్లు గ్రేడ్-II, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు వారి సమాన కేడర్ల బదిలీలను సులభతరం చేయడం ఈ నియమావళి లక్ష్యం. నూతన నియమావళిలోని ముఖ్యాంశాలు: ఈ నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుంది మరియు ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలు మరియు పురపాలక సంస్థల యాజమాన్యం క్రింద ఉన్న ఫౌండేషనల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లు గ్రేడ్ II, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు సమాన కేడర్లకు వర్తిస్తుంది. 1. బదిలీల ప్రమాణాలు: తప్పనిసరి బదిలీ: ఒకే పాఠశాలలో ఐదు (5) విద్యా సంవత్సరాలు పూర్తిచేసిన హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) (ఆ విద్యా సంవత్సరం మే 31 నాటికి). ఒకే పాఠశాలలో ఎనిమిది (8) విద్యా సంవత్సరాలు పూర్తిచేసిన ఇతర ఉపాధ్యాయులు (ఆ విద్యా సంవత్సరం మే 31 నాటికి). గమనిక: నిషేధ కాలంలో అభ్యర్థనపై లేదా పరస్పర ప్రాతిపదికన బదిలీ అయితే, రెండు స్టేషన్లలో పనిచేసిన కాలాన్ని గరిష్ట కాలానికి లెక్కిస్తారు. బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న, మే 31 నాటికి 50 ఏళ్లలోపు వయసున్న పురుష హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయులు. అభ్యర్థన బదిలీకి అర్హత: బదిలీలు చేపట్టే సంవత్సరంలో మే 31 నాటికి ఒక పాఠశాలలో కనీసం రెండు (2) విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినవారు. విశ్రాంత ఉద్యోగులకు మినహాయింపు: రెండు (2) సంవత్సరాలలోపు (సంబంధిత సంవత్సరం మే 31 నాటికి) పదవీ విరమణ చేయబోతున్న వారికి వారి అభ్యర్థనపై తప్ప బదిలీ ఉండదు. ఇతర ముఖ్య నిబంధనలు: ఒక విద్యా సంవత్సరంలో కనీసం 9 నెలల సర్వీసును పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. NCC ఆఫీసర్లుగా 5/8 ఏళ్లు పూర్తిచేసినవారికి, వీలైనంతవరకు అదే NCC యూనిట్ ఉన్న పాఠశాలకు బదిలీ చేస్తారు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటుంటే సాధారణ ఖాళీకి బదిలీ చేస్తారు. POCSO చట్టం/బాలికల వేధింపుల కేసులలో ఆరోపణలు ఎదుర్కొన్నవారు అదే మండలం/మున్సిపాలిటీ లేదా బాలికల పాఠశాలలకు బదిలీ కారు. ఆరోపణలపై చర్యలు పెండింగ్‌లో ఉంటే అభ్యర్థన బదిలీకి పరిగణించరు. 2. మిగులు పోస్టుల (రేషనలైజేషన్) సర్దుబాటు: మిగులుగా తేలిన పోస్టును అవసరమైన పాఠశాలకు తరలిస్తారు. స్పష్టమైన ఖాళీ లేకపోతే, జూనియర్ ఉపాధ్యాయుడిని తరలిస్తారు. సీనియర్ ఉపాధ్యాయులు స్వయంగా ముందుకొస్తే, రేషనలైజేషన్ పాయింట్లు లేకుండా తరలించవచ్చు. దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది. 3. యాజమాన్యం వారీగా బదిలీలు: బదిలీలు ప్రస్తుత యాజమాన్యం లోపలే జరుగుతాయి. మాతృ యాజమాన్యానికి (స్వంత మ్యానేజ్‌మెంట్‌కి) వెళ్లాలనుకుంటే, అక్కడ ఖాళీలకు మాత్రమే ఆప్షన్ ఇవ్వాలి. సీనియారిటీ మాతృ యాజమాన్యంలోనే పరిగణిస్తారు. మిగులుగా తేలినా లేదా తప్పనిసరి బదిలీ అయినా, వేరే యాజమాన్యంలో పనిచేస్తుంటే, మాతృ యాజమాన్యానికి తప్పనిసరిగా బదిలీ చేస్తారు. (గతంలో ప్రభుత్వ ఇంటర్-మేనేజ్మెంట్ బదిలీల ద్వారా వెళ్లినవారికి ఇది వర్తించదు). 4. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు: బదిలీల షెడ్యూల్‌ను కమీషనర్/పాఠశాల విద్య సంచాలకులు https://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. పూర్వపు జిల్లాలనే (03.04.2022 నాటి పునర్‌వ్యవస్థీకరణకు ముందున్నవి) యూనిట్‌గా పరిగణిస్తారు. సర్వీస్, స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీ, పనితీరు, నెగటివ్ పాయింట్ల ఆధారంగా బదిలీలు జరుగుతాయి. 5. బదిలీల కమిటీలు: ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక పాఠశాలల్లోని హెడ్మాస్టర్లు మరియు ఉపాధ్యాయుల బదిలీల కోసం వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. జోనల్ హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ వంటి వారు ఈ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు. 1. పాయింట్ల కేటాయింపు: స్టేషన్ పాయింట్లు: ప్రాంతాన్ని బట్టి (కేటగిరీ I, II, III, IV) సంవత్సరానికి 1, 2, 3, 5 పాయింట్లు. ITDA ప్రాంతాల్లో అదనంగా 1 పాయింట్. (గరిష్టంగా 8 ఏళ్ళ సర్వీసుకు) సర్వీస్ పాయింట్లు: పూర్తిచేసిన ప్రతి విద్యా సంవత్సర సేవకు 0.5 పాయింట్లు. ప్రత్యేక పాయింట్లు: జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి అయితే (ఒకే జిల్లా/జోన్/రాష్ట్ర కేడర్): 5 పాయింట్లు (5/8 ఏళ్లలో ఒకసారి). 40 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళా ఉపాధ్యాయులు: 5 పాయింట్లు. దివ్యాంగులు (వైకల్య శాతాన్ని బట్టి): 5 లేదా 7 పాయింట్లు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర/జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు: 5 పాయింట్లు. చట్టబద్ధంగా విడిపోయిన మహిళలు (పునర్వివాహం చేసుకోకపోతే): 5 పాయింట్లు. మాజీ సైనికోద్యోగులు/వారి జీవిత భాగస్వాములు (ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారు): 5 పాయింట్లు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ (గత రెండేళ్లుగా క్రియాశీలంగా ఉంటే): 2 పాయింట్లు. రీ-అప్పోర్షన్‌మెంట్ పాయింట్లు: ప్రభావితమైనవారికి (షరతులకు లోబడి) 5+ లేదా 7+ పాయింట్లు. పనితీరు పాయింట్లు: ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ప్రాధాన్యత కేటగిరీలు: 100% దృష్టి లోపం లేదా 80% పైగా ఇతర వైకల్యం ఉన్నవారు: 1వ ప్రాధాన్యత. 75% దృష్టి లోపం లేదా 70-79% ఇతర వైకల్యం లేదా 70dB పైగా వినికిడి లోపం ఉన్నవారు: 2వ ప్రాధాన్యత. వితంతువులు (పునర్వివాహం చేసుకోకపోతే). తీవ్ర అనారోగ్యాలతో (క్యాన్సర్, గుండె/కిడ్నీ/న్యూరో సర్జరీలు మొదలైనవి) బాధపడుతున్నవారు. మానసిక వైకల్యం గల పిల్లలు/జీవిత భాగస్వామి ఉన్నవారు. జువెనైల్ డయాబెటిస్, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే పిల్లలున్నవారు. గమనిక: పై కేటగిరీలవారు తాజా మెడికల్ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ ప్రయోజనాలు 5/8 ఏళ్లలో ఒకసారి వర్తిస్తాయి. నెగటివ్ పాయింట్లు: అనధికార గైర్హాజరుకు నెలకు 1 పాయింట్ చొప్పున (గరిష్టంగా 10 పాయింట్లు) కోత విధిస్తారు. 7. టై అయితే: పాయింట్లు సమానంగా ఉంటే, కేడర్ సీనియారిటీ, పుట్టిన తేదీ (సీనియర్), తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. 1. ఖాళీల ప్రకటన మరియు దరఖాస్తు ప్రక్రియ: రిటైర్‌మెంట్, తప్పనిసరి బదిలీ, రేషనలైజేషన్, లాంగ్ లీవ్, స్టడీ లీవ్, కౌన్సెలింగ్ వల్ల ఏర్పడే ఖాళీలను ప్రకటిస్తారు. జిల్లాలోని ఖాళీలను మండలాల వారీగా దామాషా ప్రకారం బ్లాక్ చేసి, సమాన పంపిణీకి చర్యలు తీసుకుంటారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో https://cse.ap.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ప్రింటవుట్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాలి. తప్పనిసరి బదిలీ అయ్యేవారు అన్ని ఆప్షన్లు ఎంచుకోవాలి. దరఖాస్తు చేయకపోతే, మిగిలిన ఖాళీలలో కేటగిరీ IV లేదా III కి కేటాయిస్తారు. 1. అభ్యంతరాలు మరియు ఫిర్యాదుల పరిష్కారం: తాత్కాలిక జాబితాలపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో నిర్దేశిత సమయంలోగా సమర్పించవచ్చు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్లే ముందు అన్ని అప్పీల్ స్థాయిలను ఉపయోగించుకోవాలి. 1. క్రమశిక్షణ చర్యలు: తప్పుడు సమాచారం/పత్రాలు సమర్పిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు మరియు కేటగిరీ-IV పాఠశాలలకు బదిలీ చేసి 5/8 ఏళ్లు అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. ఈ నియమావళి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను మరింత పారదర్శకంగా, హేతుబద్ధంగా మార్చగలదని ఆశిద్దాం. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, పూర్తి వివరాలు, షెడ్యూల్ తెలుసుకోవాలని సూచన. బదిలీల జీవో నెంబర్ 22 ఖచ్చితమయిన తెలుగు అనువాదం డౌన్ లోడ్ చేసుకోండి,షేర్ చేయండి👇 బదిలీల జీవో నెంబర్ 22 ఖచ్చితమయిన తెలుగు అనువాదం చదవండి 👇 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల (బదిలీల నియంత్రణ) నియమావళి, 2025 సారాంశము పాఠశాల విద్య,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల (బదిలీల నియంత్రణ) నియమావళి, 2025 - ప్రకటన - ఉత్తర్వులు - జారీ చేయబడినవి. పాఠశాల విద్య (సర్వీసెస్.II) శాఖ, జి.ఓ.ఎంఎస్.నెం.22, తేది: 20/05/2025. ఈ క్రింది వాటిని చదవండి: 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 (2025 సంవత్సరపు చట్టం నెం.9). 2. ఎ.పి విద్యా చట్టం, 1982 (1982 సంవత్సరపు చట్టం 1). 3. ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం, 1965. 4. విశాఖపట్నం పురపాలక సంస్థ చట్టం, 1979. 5. విజయవాడ పురపాలక సంస్థ చట్టం, 1981. 6. ఆంధ్రప్రదేశ్ పురపాలక సంస్థ చట్టం, 1994. 7. జి.ఓ.ఎంఎస్.నెం.21 ఎస్.ఇ. (ప్రోగ్రాం.I) శాఖ, తేది. 13.05.2025. 8. పాఠశాల విద్య సంచాలకులు, ఎ.పి., వారి ఇ-ఫైల్ నెం.2821477 నుండి. 9. పాఠశాల విద్య సంచాలకులు, ఎ.పి., లేఖ ఆర్.సి.నెం.13/143/2024-EST 3, తేది.20.05.2025 నుండి. ఉత్తర్వు: పైన మొదట చదివిన సూచికలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 ప్రవేశపెట్టబడింది, మరియు ఇది పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక, మరియు పురపాలక సంస్థ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. 1. ఫౌండేషనల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, మరియు ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలు, మరియు పురపాలక సంస్థల యాజమాన్యాల క్రింద ఉపాధ్యాయుల హేతుబద్ధమైన కేటాయింపును నిర్ధారించడానికి, మరియు ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్లు గ్రేడ్-II మరియు స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు వారి సమాన కేడర్ల బదిలీలను సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి, ప్రభుత్వం అటువంటి బదిలీలను నియంత్రించే నియమాలను రూపొందించాలని నిర్ణయించింది. 2. దీని ప్రకారం, ఈ క్రింది ప్రకటన ఆంధ్రప్రదేశ్ గెజెట్‌లో ప్రచురించబడుతుంది. ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్టం, 2025 లోని సెక్షన్ 26 (1) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించి, మరియు ఉపాధ్యాయుల బదిలీపై గతంలో ఉన్న అన్ని ప్రకటనలు, నియమాలు మరియు మార్గదర్శకాలను రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ/జిల్లా పరిషత్/మండల పరిషత్/ పురపాలక సంఘాలు మరియు పురపాలక సంస్థల పాఠశాలల్లో హెడ్మాస్టర్ గ్రేడ్ II, స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు వారి సమాన కేడర్ల బదిలీలను నియంత్రిస్తూ ఈ క్రింది నియమాలను రూపొందిస్తుంది. 1. సంక్షిప్త శీర్షిక మరియు వర్తింపు (i) ఈ నియమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల (బదిలీల నియంత్రణ) నియమావళి, 2025 అని పిలుస్తారు. (ii) ఈ నియమాలు ఫౌండేషనల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక సంఘాలు మరియు పురపాలక సంస్థల యాజమాన్యం క్రింద ఉన్న హెడ్మాస్టర్లు గ్రేడ్ II, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు మరియు సమాన కేడర్లకు వర్తిస్తాయి. (iii) ఈ నియమాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. 2. బదిలీల ప్రమాణాలు (i) ప్రభుత్వ/ జిల్లా పరిషత్/మండల పరిషత్/ పురపాలక సంఘాలు మరియు పురపాలక సంస్థలలోని ఈ క్రింది కేటగిరీల హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయులు బదిలీ చేయబడతారు. (ఎ) ఆ విద్యా సంవత్సరం ముగింపు తేదీ నాటికి, అనగా ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి ఒక నిర్దిష్ట పాఠశాలలో ఐదు (5) విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. (బి) హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) కాకుండా, ఇతర ఉపాధ్యాయులు, ఆ విద్యా సంవత్సరం ముగింపు తేదీ నాటికి, అనగా ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి ఒక నిర్దిష్ట పాఠశాలలో ఎనిమిది (8) విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసినవారు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. గమనిక:- (ఎ) & (బి) కొరకు, ఏదైనా హెడ్మాస్టర్ గ్రేడ్ II లేదా ఉపాధ్యాయుడు నిషేధ కాలంలో అభ్యర్థనపై లేదా పరస్పర ప్రాతిపదికన బదిలీ చేయబడితే, అప్పుడు చట్టం ప్రారంభమైన తేదీ నుండి తప్పనిసరి బదిలీకి అర్హతను నిర్ణయించేటప్పుడు గరిష్ట కాలాన్ని లెక్కించడానికి రెండు స్టేషన్లలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. (సి) బదిలీలు చేపట్టాల్సిన సంవత్సరంలో మే 31వ తేదీ నాటికి ఒక పాఠశాలలో కనీసం రెండు (2) విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన హెడ్మాస్టర్లు గ్రేడ్ II/ ఉపాధ్యాయులు అభ్యర్థన బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గమనిక: (ఎ) నుండి (సి) వరకు, ఒక విద్యా సంవత్సరంలో కనీసం తొమ్మిది (9) నెలల సర్వీసును పూర్తి చేసిన హెడ్మాస్టర్లు గ్రేడ్ II/ఉపాధ్యాయులను ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి ఒక పూర్తి విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. (డి) అయితే, సంబంధిత సంవత్సరం మే 31వ తేదీన లేదా అంతకు ముందు రెండు (2) సంవత్సరాలలో పదవీ విరమణ చేయబోతున్న హెడ్మాస్టర్లు గ్రేడ్ II/ ఉపాధ్యాయులను వారి స్వంత అభ్యర్థనపై తప్ప బదిలీ చేయకూడదు. (ఇ) ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి యాభై (50) సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మరియు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పురుష హెడ్మాస్టర్ గ్రేడ్ II/ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు. (ఎఫ్) బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయడానికి మహిళా హెడ్మాస్టర్ గ్రేడ్ II/ ఉపాధ్యాయురాలు అందుబాటులో లేనట్లయితే, ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి యాభై (50) సంవత్సరాలు దాటిన పురుష హెడ్మాస్టర్ గ్రేడ్ II/ ఉపాధ్యాయుడిని అటువంటి పాఠశాలలకు పోస్టింగ్ కోసం పరిగణిస్తారు. (జి) ఐదు (5) విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన హెడ్మాస్టర్ గ్రేడ్ II, మరియు ఎనిమిది (8) విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన ఉపాధ్యాయుడు వారి సంబంధిత NCC యూనిట్లలో NCC ఆఫీసర్లుగా, సాధ్యమైనంత వరకు అదే NCC యూనిట్ అందుబాటులో ఉన్న పాఠశాలలో ఖాళీకి పోస్ట్ చేయబడతారు. అదే NCC యూనిట్‌తో మరొక పాఠశాలలో అటువంటి ఖాళీ అందుబాటులో లేనట్లయితే, వారి అభ్యర్థనపై వారిని అదే పాఠశాలలో కొనసాగించవచ్చు. అయితే, ఏదైనా NCC ఆఫీసర్ క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటున్నట్లయితే, NCC యూనిట్‌తో సంబంధం లేకుండా వారిని సాధారణ ఖాళీకి బదిలీ చేస్తారు. (హెచ్) పిల్లల లైంగిక నేరాల నుండి రక్షణ (POCSO) చట్టం, 2012/బాలికల దుర్వినియోగం కేసు క్రింద ఆరోపణలు ఎదుర్కొంటున్న/ఎదుర్కొన్న ఉపాధ్యాయులు మరియు గ్రేడ్ II హెడ్ మాస్టర్‌లను అదే మండలం/పురపాలక సంఘం లేదా ఏదైనా బాలికల ఉన్నత పాఠశాలకు ఎంచుకోకూడదు. పురపాలక కార్పొరేషన్ పాఠశాలల విషయంలో, ఉపాధ్యాయుడిని దూరపు క్లస్టర్‌లో పోస్ట్ చేస్తారు. (ఐ) హెడ్మాస్టర్ గ్రేడ్ II/ ఉపాధ్యాయునిపై ఆరోపణలపై చర్యలు పెండింగ్‌లో ఉంటే, అతని/ఆమెను అభ్యర్థన బదిలీకి పరిగణించరు. (ii) మిగులు పోస్టుల పునఃపంపిణీ కారణంగా తరలించాల్సిన ఉపాధ్యాయుల గుర్తింపు ప్రమాణాలు. (ఎ) ఒక పోస్టు మిగులుగా కనుగొనబడి, అవసరమైన పాఠశాలకు తరలించడానికి (రేషనలైజేషన్ కి) ప్రతిపాదించబడితే, అదే తరలించబడుతుంది. (బి) స్పష్టమైన ఖాళీ/ తప్పనిసరి బదిలీ ఖాళీ లేకపోతే, జూనియర్ మోస్ట్ ఉపాధ్యాయుడిని తరలిస్తారు. (సి) పాఠశాలలోని ఒక సీనియర్ ఉపాధ్యాయుడు రేషనలైజేషన్ కి సుముఖంగా ఉంటే, అతని/ఆమెను రేషనలైజేషన్ పాయింట్లు లేకుండా తరలించవచ్చు. (డి) బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులను మినహాయిస్తారు మరియు తదుపరి జూనియర్ మోస్ట్ రేషనలైజేషన్ (రీ అప్పాయింట్మెంట్ )క్రింద ప్రభావితమవుతారు. (ఇ) రూల్ 2-(i) (డి) & 2(ii) (డి) లేదా మరేదైనా క్రింద మినహాయించబడిన జూనియర్ మోస్ట్ ఉపాధ్యాయుడు అయితే, తదుపరి సీనియర్ ఉపాధ్యాయుడిని జూనియర్‌గా పరిగణిస్తారు మరియు రేషనలైజేషన్ పాయింట్లు ఇవ్వబడతాయి. (iii) (ఎ) హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ప్రస్తుత యాజమాన్యం లోపల బదిలీలు జరుగుతాయి . (బి) హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుడు అతని/ఆమె మాతృ యాజమాన్యానికి(స్వంత మ్యానేజ్మెంట్ కి) వెళ్లాలని కోరుకుంటే, అటువంటి హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుడు వారి మాతృ యాజమాన్యంలో అందుబాటులో ఉన్న ఖాళీలకు మాత్రమే బదిలీని ఎంచుకోవచ్చు. అటువంటి సందర్భాలలో, వారి సీనియారిటీని మాతృ యాజమాన్యంలో పరిగణనలోకి తీసుకుంటారు. (సి) ఒక హెడ్మాస్టర్ (గ్రేడ్ II) లేదా ఉపాధ్యాయుడు మిగులుగా గుర్తించబడినా లేదా తప్పనిసరి బదిలీ క్రిందకు వచ్చినా, మరియు ప్రస్తుతం వారి మాతృ యాజమాన్యం కంటే భిన్నమైన యాజమాన్యంలో పనిచేస్తున్నట్లయితే, వారు తప్పనిసరిగా వారి మాతృ యాజమాన్యానికి తిరిగి బదిలీ చేయబడతారు. అయితే, ప్రభుత్వం చేసిన అంతర్-యాజమాన్య (ఇంటర్ మేనేజ్మెంట్) బదిలీల క్రింద గతంలో బదిలీ చేయబడిన హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) మరియు ఉపాధ్యాయులు పై నిబంధన క్రిందకు రారు. 3. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు (i) కమీషనర్/పాఠశాల విద్య సంచాలకులు ప్రభుత్వ ఆమోదంతో అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in ద్వారా బదిలీ షెడ్యూల్‌ను జారీ చేస్తారు. (ii) పూర్వపు జిల్లాలు (జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు ముందు ప్రకటన తేది:03.04.2022 ద్వారా తెలియజేయబడినవి) బదిలీల కొరకు యూనిట్‌గా పరిగణించబడతాయి. (iii) హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయుల బదిలీలు మరియు పోస్టింగ్‌లు ఈ నియమాలలో పేర్కొన్న విధంగా సర్వీస్, స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీ, పనితీరు మరియు నెగటివ్ పాయింట్ల ఆధారంగా జరుగుతాయి. (iv) జాబితాల ఖరారు మరియు ఖాళీల ప్రకటన తర్వాత, హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా ఐచ్ఛికాల(ఆప్షన్ల)ను వినియోగించుకోవాలి. (v) ఆన్‌లైన్‌లో రూపొందించబడిన తుది జాబితాల ఆధారంగా, నిర్దేశించిన విధానాన్ని అనుసరించి, సంబంధిత కమిటీల ఆమోదంతో సమర్థ అధికారుల ద్వారా బదిలీ ఉత్తర్వులు జారీ చేయబడతాయి. 4. బదిలీలు మరియు కౌన్సెలింగ్ కోసం కమిటీ: రూల్ 12, 13 & 14 ప్రకారం తయారుచేసిన జాబితాకు అనుగుణంగా కౌన్సెలింగ్ నిర్వహించడానికి ఈ క్రింది కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. (i) ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్ల (గ్రేడ్ II) బదిలీ కోసం కమిటీ: (ఎ) జోనల్ హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్ (అంటే, విశాఖపట్నం (జోన్-1), కాకినాడ (జోన్-2), గుంటూరు (జోన్-3), మరియు వైఎస్ఆర్ కడప (జోన్-4)) కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. (బి) సంబంధిత ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. (సి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు (పూర్వపు జిల్లాలు) సభ్యులు. గమనిక: తయారుచేసిన జాబితా ఆధారంగా వెబ్ కౌన్సెలింగ్ వ్యవస్థ సహాయంతో ఈ కమిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. (ii) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్ల (గ్రేడ్ II) బదిలీ కోసం కమిటీ: (ఎ) ఛైర్మన్, జిల్లా పరిషత్/ప్రత్యేక అధికారి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. (బి) ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు - సభ్య కార్యదర్శి. (సి) ముఖ్య కార్యనిర్వహణాధికారి, జి.ప. సభ్యుడు. (డి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (పూర్వపు జిల్లా) సభ్యుడిగా. గమనిక: జిల్లాలోని అన్ని జెడ్.పి ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్ల (గ్రేడ్ II) బదిలీకి ఈ కమిటీ అధికారం కలిగి ఉంటుంది. (iii) పురపాలక సంఘాలు/ పురపాలక కార్పొరేషన్ ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్ల (గ్రేడ్ II) బదిలీ కోసం కమిటీ: (ఎ) జిల్లా కలెక్టర్ (పూర్వపు జిల్లా) - ఛైర్మన్. (బి) ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు - సభ్య కార్యదర్శి. (సి) పురపాలక కార్పొరేషన్లకు సంబంధించి మునిసిపల్ కమీషనర్/ సంబంధిత జోన్ యొక్క RDMA - సభ్యుడు. (డి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (పూర్వపు జిల్లా) సభ్యుడిగా. గమనిక: జిల్లాలోని పురపాలక సంఘాలు/ పురపాలక కార్పొరేషన్ ఉన్నత పాఠశాలల్లోని అందరు హెడ్మాస్టర్ల (గ్రేడ్ II) బదిలీకి ఈ కమిటీ అధికారం కలిగి ఉంటుంది.. (iv) ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కోసం కమిటీ (ఎ) జిల్లా కలెక్టర్ (పూర్వపు జిల్లా) - ఛైర్మన్. (బి) జిల్లా విద్యాశాఖాధికారి (పూర్వపు జిల్లా) - సభ్య కార్యదర్శి. (సి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు సభ్యులు. (v) జిల్లా పరిషత్ / మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కోసం కమిటీ. (ఎ) ఛైర్మన్, జిల్లా పరిషత్/ప్రత్యేక అధికారి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. (బి) జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి. - సభ్యుడు. (సి) జిల్లా విద్యాశాఖాధికారి (పూర్వపు) - సభ్య కార్యదర్శి. (డి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు సభ్యులు. (vi) పురపాలక సంఘాలు/ పురపాలక కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కోసం కమిటీ (ఎ) జిల్లా కలెక్టర్ (పూర్వపు జిల్లా) - ఛైర్మన్. (బి) జిల్లా విద్యాశాఖాధికారి (పూర్వపు జిల్లా) - సభ్య కార్యదర్శి. (సి) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు సభ్యులు. (డి) పురపాలక కార్పొరేషన్లకు సంబంధించి మునిసిపల్ కమీషనర్/ సంబంధిత జోన్ యొక్క RDMA - సభ్యుడు. 5. పోస్టింగ్‌లు & బదిలీల కోసం సమర్థ అధికారం సంబంధిత కమిటీ ఆమోదం తర్వాత హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయులు వినియోగించుకున్న వెబ్ ఐచ్ఛికాల యొక్క తుది జాబితా ఆధారంగా సంబంధిత సమర్థ అధికాఋఌ బదిలీ మరియు పోస్టింగ్ ఉత్తర్వులను జారీ చేస్తారు 6. స్టేషన్ పాయింట్లు (i) ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి సంబంధిత పాఠశాలలో సర్వీసు చేసిన సంవత్సరాల సంఖ్య (గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు) ఆధారంగా హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) / ఉపాధ్యాయులకు స్టేషన్ పాయింట్లు ఈ క్రింది విధంగా ఇవ్వబడతాయి. (ఎ) కేటగిరీ- I ప్రాంతం- సంవత్సరానికి 1 పాయింట్ (బి) కేటగిరీ- II ప్రాంతం - సంవత్సరానికి 2 పాయింట్లు (సి) కేటగిరీ- III ప్రాంతం - సంవత్సరానికి 3 పాయింట్లు (డి) కేటగిరీ- IV ప్రాంతం - సంవత్సరానికి 5 పాయింట్లు. ప్రారంభంలో ఒక కేటగిరీ క్రింద వర్గీకరించబడి, తరువాత మరొక కేటగిరీకి (HRA లేదా రహదారి పరిస్థితుల ప్రకారం) పునఃవర్గీకరించబడిన గ్రామాలు లేదా పట్టణాల విషయంలో, స్టేషన్ పాయింట్లు దామాషా ప్రకారం లెక్కించబడతాయి. అయితే, ITDA ప్రాంతాలలో పనిచేస్తున్న వ్యక్తులు, చట్టం ప్రారంభమైనప్పటి నుండి స్టేషన్ పాయింట్లతో పాటు సంవత్సరానికి అదనంగా 1 పాయింట్ పొందుతారు. (ii) సర్వీస్ పాయింట్లు: చేసిన సేవ(సర్వీస్)కు: ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి అన్ని కేడర్లలో పూర్తిచేసిన ప్రతి విద్యా సంవత్సర సేవకు, దామాషా ప్రకారం లెక్కించి, హెడ్మాస్టర్లు (గ్రేడ్-II)/ఉపాధ్యాయులందరికీ 0.5 పాయింట్లు ఇవ్వబడతాయి. 7.ప్రత్యేక పాయింట్లు (i)రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం/ప్రభుత్వ రంగ సంస్థలు/స్థానిక సంస్థలు లేదా ఎయిడెడ్ సంస్థలలో జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు మరియు రాష్ట్ర ప్రభుత్వం క్రింద నడుస్తున్న విద్యా సంస్థలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు మరియు అదే జిల్లా/జోనల్/రాష్ట్ర కేడర్‌లో పనిచేస్తున్నవారు. హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయులు జిల్లా/జోన్ లోపల లేదా పొరుగు జిల్లాకు సమీపంలోని మండలం/డివిజన్‌కు వారి జీవిత భాగస్వామి పనిచేసే స్థలానికి దగ్గరగా బదిలీని ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వామి అనగా స్పౌజ్ పాయింట్ల ప్రయోజనం 5/8 విద్యా సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జీవిత భాగస్వాములలో ఒకరికి వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నమోదు సంబంధిత హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుని SRలో సరైన ధృవీకరణతో నమోదు చేయబడుతుంది. వీరికి స్పౌజ్ పాయింట్లు 5 ఇద్దరు జీవిత భాగస్వాములు తప్పనిసరి బదిలీ లేదా పునఃపంపిణీ క్రింద ఉంటే, వారిలో ఎవరైనా జిల్లాలోని ఏ ప్రదేశానికైనా ఎంచుకోవచ్చు; అయితే, వారిలో ఒకరు మాత్రమే జీవిత భాగస్వామి పాయింట్లకు అర్హులు. ఒక జీవిత భాగస్వామి మాత్రమే తప్పనిసరి బదిలీ లేదా రేషనలైజేషన్ క్రింద ఉన్న సందర్భాలలో, కౌన్సెలింగ్ యొక్క మొదటి విడతకు హాజరయ్యే జీవిత భాగస్వామి జిల్లాలోని ఏ ప్రదేశానికైనా ఎంచుకోవడానికి అనుమతించబడవచ్చు, వారి జీవిత భాగస్వామి కూడా తప్పనిసరి బదిలీ లేదా రేషనలైజేషన్ క్రింద ఉంటే. ఈ కేటగిరీ క్రింద కేసులను పరిగణలోకి తీసుకోవడానికి సమర్థ అధికారులు జారీ చేసిన ధృవీకరణ పత్రం కాపీ చెక్‌లిస్ట్‌లో జతచేయాలి." (ii)ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి 40 ఏళ్లు పైబడిన అవివాహిత మహిళా ఉపాధ్యాయులకు 5 పాయింట్లు (iii)(ఎ) (i) 40% నుండి 55% వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులు, (ii) రెండు చెవులలో ప్రసంగ పౌనఃపున్యాలలో 60-70 డెసిబుల్స్ వినికిడి లోపం (51% నుండి 70%) ఉన్న వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 5 పాయింట్లు ,"(బి)(i) కనీసం 40% వైకల్యం ఉన్న దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకి 7 పాయింట్లు ,"(ii) 56% నుండి 69% వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులకి 7 పాయింట్లు (iv)గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర/జిల్లా స్థాయి (పూర్వపు జిల్లాలు) అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులకి 5 పాయింట్లు (v)చట్టబద్ధంగా విడిపోయిన మహిళలకు 5 పాయింట్లు (పునర్వివాహం చేసుకుంటే 5 పాయింట్లు రావు ) (vi)ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్/BSF/CRPF/CISFలో మాజీ సైనికోద్యోగులు ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు లేదా ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్/BSF/CRPF/CISF లో పనిచేస్తున్న వ్యక్తి యొక్క జీవిత భాగస్వామికి 5 పాయింట్లు బదిలీ సంవత్సరం మే 31వ తేదీ నాటికి గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్కి 2 పాయింట్లు గమనిక: స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి/ఛైర్మన్ ద్వారా ధృవీకరించబడాలి. (vii) రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లు: రీ అప్పోర్షన్ మెంట్లో ప్రభావితమైన ఒక హెడ్మాస్టర్ (గ్రేడ్ II) / ఉపాధ్యాయుడు రూల్ 7 మరియు 9 క్రింద పేర్కొన్న విధంగా ప్రస్తుత స్టేషన్ పాయింట్లతో పాటు వర్తించే ఏవైనా ప్రత్యేక పాయింట్లు/ ప్రాధాన్యత కేటగిరీ క్రింద ప్రయోజనాలతో రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లను క్లెయిమ్ చేయడానికి అర్హులు. (లేదా) మునుపటి స్టేషన్ పాయింట్లు, రూల్ 7 మరియు 9 క్రింద పేర్కొన్న విధంగా వర్తించే ఏవైనా ప్రత్యేక పాయింట్లు/ ప్రాధాన్యత కేటగిరీ క్రింద ప్రయోజనాలతో పాటు వర్తిస్తాయి. వీరికి 5 పాయింట్లు + ప్రస్తుత స్టేషన్ పాయింట్లు + రూల్స్ 7 మరియు 9 క్రింద ప్రత్యేక పాయింట్లు/ప్రాధాన్యత కేటగిరీ (లేదా) మునుపటి స్టేషన్ పాయింట్లు + రూల్స్ 7 మరియు 9 క్రింద ప్రత్యేక పాయింట్లు/ప్రాధాన్యత కేటగిరీ వర్తిస్తాయి ఒక నిర్దిష్ట పాఠశాలలో వరుసగా 5/8 విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ఉపాధ్యాయులు రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లకు అర్హులు కారు. 8 విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తికాకుండా రీ అప్పోర్షన్ మెంట్ క్రింద బదిలీకి సీనియర్ ఉపాధ్యాయుడు సుముఖత తెలిపితే, రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లు, ప్రత్యేక పాయింట్లు లేదా ప్రాధాన్యత కేటగిరీకి అర్హులు కారు. గమనిక: రీ అప్పోర్షన్ మెంట్ ద్వారా ప్రభావితమైన ఏదైనా హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకోకపోతే, అతనికి/ఆమెకు కేటగిరీ IV మాత్రమే కేటాయించబడుతుంది, కేటగిరీ IV ఖాళీలు అందుబాటులో లేకపోతే మిగిలిన ఖాళీలలో కేటగిరీ III కేటాయించబడుతుంది. "(viii)","రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లు: ఒక హెడ్మాస్టర్ (గ్రేడ్ II) / ఉపాధ్యాయుడు వరుసగా రెండుసార్లు రీ అప్పోర్షన్ మెంట్ ద్వారా ప్రభావితమైతే, వారు రూల్ 7 మరియు 9 క్రింద పేర్కొన్న విధంగా ప్రస్తుత స్టేషన్ పాయింట్లతో పాటు వర్తించే ఏవైనా ప్రత్యేక పాయింట్లు/ ప్రాధాన్యత కేటగిరీ క్రింద ప్రయోజనాలతో రీ అప్పోర్షన్ మెంట్ పాయింట్లను క్లెయిమ్ చేయడానికి అర్హులు. వీరికి 7 పాయింట్లు + ప్రస్తుత స్టేషన్ పాయింట్లు + రూల్స్ 7 మరియు 9 క్రింద ప్రత్యేక పాయింట్లు/ప్రాధాన్యత కేటగిరీ వర్తిస్తాయి 8. పనితీరు పాయింట్లు: - పనితీరు పాయింట్లపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయవలసివుంది. 9. ప్రాధాన్యత కేటగిరీలు: (ఎ) ఈ క్రింది కేటగిరీలు వారి అర్హత పాయింట్లతో సంబంధం లేకుండా, దిగువ ఇచ్చిన క్రమంలో సీనియారిటీ జాబితాలో ప్రాధాన్యతను తీసుకుంటాయి. (i) 100% వైకల్యం ఉన్న దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు లేదా 80% మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులు - 1వ ప్రాధాన్యత (ii) 75% వైకల్యం ఉన్న దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు లేదా 70% నుండి 79% వైకల్యం ఉన్న ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులు లేదా రెండు చెవులలో ప్రసంగ పౌనఃపున్యాలలో 70 DB కంటే ఎక్కువ వినికిడి లోపం (71% నుండి 100%) ఉన్న వినికిడి లోపం ఉన్న ఉద్యోగులు- 2వ ప్రాధాన్యత. (iii) వితంతువు (పునర్వివాహం విషయంలో వర్తించదు) (iv) హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు ఈ క్రింది వ్యాధులతో బాధపడుతున్నవారు, చికిత్స పొందుతున్నవారు: (ఎ) క్యాన్సర్; (బి) ఓపెన్ హార్ట్ సర్జరీ/ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ దిద్దుబాటు /అవయవ మార్పిడి; (సి) మేజర్ న్యూరో సర్జరీ; (డి) బోన్ టిబి; (ఇ) కిడ్నీ మార్పిడి/ డయాలసిస్; మరియు (ఎఫ్) వెన్నెముక శస్త్రచికిత్స. (v) మానసిక వైకల్యం ఉన్న మరియు చికిత్స పొందుతున్న ఆధారపడిన పిల్లలు మరియు జీవిత భాగస్వామి ఉన్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు. (vi) జువెనైల్ డయాబెటిస్/ థలసేమియా వ్యాధి/ హిమోఫిలియా వ్యాధి/ మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న మరియు చికిత్స పొందుతున్న పిల్లలు ఉన్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు. గమనిక:- (ఎ) పై కేటగిరీ క్రింద బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయులు జిల్లా/రాష్ట్ర వైద్య బోర్డు ద్వారా తాజాగా ధృవీకరించబడిన అన్ని వైద్య నివేదికలు/ధృవపత్రాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి మరియు పాత ధృవపత్రాలు అనుమతించబడవు. (బి) హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు ప్రాధాన్యత కేటగిరీలు లేదా ప్రత్యేక పాయింట్లను వరుసగా 5/8 సంవత్సరాలలో ఒకసారి పొందాలి మరియు అతని/ఆమె SRలో ఒక నమోదు చేయబడుతుంది మరియు అదే సంబంధిత DDO ద్వారా ధృవీకరించబడుతుంది. (సి) పుట్టుకతో వచ్చే గుండె లోపం (గుండెలో రంధ్రాలు)తో జన్మించిన మరియు శస్త్రచికిత్స చేయించుకున్న ఆధారపడిన పిల్లలు ఉన్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయునికి శస్త్రచికిత్స జరిగిన తేదీ నుండి (3) సంవత్సరాలలోపు ప్రాధాన్యత కేటగిరీ క్రింద ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. (సి) అయితే, ప్రాధాన్యత కేటగిరీలకు చెందిన అభ్యర్థుల కోసం: (i) సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGTల) కొరకు, ఒక నిర్దిష్ట పాఠశాలలోని ఖాళీలలో 40% అనుమతించబడతాయి. (ii) స్కూల్ అసిస్టెంట్స్ (SAల) కొరకు, ఒక నిర్దిష్ట పాఠశాలలోని ప్రతి సబ్జెక్టులోని ఖాళీలలో 50% అనుమతించబడతాయి. (iii) సింగిల్ సబ్జెక్ట్ టీచర్ ఉన్నత పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు ఈ నిబంధన క్రింద పరిగణించబడరు. 10. నెగటివ్ పాయింట్లు: - అనధికారిక గైర్హాజరు విషయంలో, చట్టం ప్రారంభమైన తేదీ నుండి క్రమశిక్షణా చర్యల క్రింద విధించిన శిక్షతో పాటు, ప్రతి నెల గైర్హాజరుకు ఒక (1) పాయింట్ గరిష్టంగా 10 పాయింట్లకు పరిమితం చేయబడి పాయింట్లు తీసివేయబడుతాయి 11. పొందిన పాయింట్లలో టై ఏర్పడినప్పుడు: ఒకవేళ, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తుదారుల అర్హత పాయింట్లు సమానంగా ఉంటే ఎ. కేడర్‌లోని సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. బి. పై నియమం (ఎ)తో పాటు పుట్టిన తేదీ (సీనియర్) పరిగణనలోకి తీసుకుంటారు. సి. మహిళలలైతే పై నియమాలు (ఎ)&(బి)తో పాటు). మహిళకు మొదటి ప్రాధాన్యత 12. ఖాళీల ప్రకటన: (i) ప్రభుత్వం ఈ క్రింది ఖాళీలను తెలియజేస్తుంది: (ఎ) ఆ సంవత్సరం మే 31వ తేదీ నాటికి పదవీ విరమణ ఖాళీలతో సహా స్పష్టమైన ఖాళీలు; (బి) రూల్ 2 ప్రకారం తప్పనిసరి బదిలీ క్రింద ఖాళీలు; (సి) రీ అప్పోర్షన్ మెంట్ ఖాళీలు; (డి) బదిలీ మార్గదర్శకాల జారీ తేదీ నాటికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం అధీకృత/అనధికార గైర్హాజరు కారణంగా ఏర్పడే ఖాళీలు; (ఇ) స్టడీ లీవ్ ఖాళీలు; (ఎఫ్) బదిలీ కౌన్సెలింగ్ సమయంలో జనించే (అరైజింగ్ )ఖాళీలు. (ii) ఖాళీల బ్లాక్ నిబంధన: జిల్లాలోని ప్రతి యాజమాన్యం క్రింద ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య అన్ని మండలాలకు దామాషా ప్రకారం పంపిణీ చేయబడుతుంది మరియు సంబంధిత పోస్టులు బ్లాక్ చేయబడతాయి. ఈ బ్లాక్ చేసిన ఖాళీలు అందుబాటులో ఉన్న ఖాళీలుగా చూపరు . ఉదాహరణ: ఒక పూర్వపు జిల్లాలో, మంజూరైన SGT పోస్టులు: 5,000 మరియు పనిచేస్తున్నవి: 4500, అప్పుడు బ్లాక్ చేసే ఖాళీలు 5000-4500=500. జిల్లాలో 40 మండలాలు ఉంటే, ఆ 500 ఖాళీలను కేటగిరీ-I, II మరియు III లలో దామాషా ప్రకారం బ్లాక్ చేస్తారు . 13. ఖాళీల ప్రచురణ మరియు కేటాయించిన పాయింట్ల ఆధారంగా జాబితా: (i) ఈ క్రింది జాబితాలు బదిలీల వెబ్‌సైట్‌లో మరియు సంబంధిత జోనల్ / జిల్లాల వెబ్‌సైట్‌లో కూడా సంబంధిత ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య డైరెక్టర్ / జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రచురించబడతాయి. (ఎ) కేటగిరీల వారీగా పాఠశాలల జాబితాలు (కేటగిరీ I, II, III మరియు IV), (బి) కౌన్సెలింగ్ కోసం హెడ్మాస్టర్ (గ్రేడ్ II) /స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు సమాన కేటగిరీల పాఠశాలల వారీగా ఖాళీల స్థానం. (సి) దిగువ ఉప నియమం (ii)లో నిర్దేశించిన విధానానికి లోబడి, స్టేషన్, సర్వీస్, ప్రత్యేక పాయింట్లు, పనితీరు, ప్రాధాన్యత కేటగిరీ మరియు నెగటివ్ పాయింట్లతో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న హెడ్మాస్టర్ (గ్రేడ్ II) / ఉపాధ్యాయుని పేర్ల జాబితా. (ii) షెడ్యూల్ ప్రకారం బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ తర్వాత, స్టేషన్ & ప్రత్యేక పాయింట్ల యాజమాన్యం వారీగా, కేటగిరీ వారీగా, సబ్జెక్ట్ వారీగా, మరియు మీడియం వారీగా రూపొందించడానికి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి జాబితా తయారు చేయబడుతుంది మరియు స్టేషన్, సర్వీస్, ప్రత్యేక పాయింట్లు మరియు నెగటివ్ పాయింట్లతో కూడిన జాబితా బదిలీల వెబ్‌సైట్‌లో మరియు వారి జిల్లాల వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించబడుతుంది. 14. ఆన్‌లైన్ దరఖాస్తు మరియు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ. (i) హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ఉపాధ్యాయుడు https://cse.ap.gov.in లో వెబ్ ఆధారిత కేటాయింపు కోసం నిర్దేశించిన ఆన్‌లైన్ సర్వీసులలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. (ii) వెబ్‌సైట్ ద్వారా స్వీకరించిన ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే బదిలీకి పరిగణించబడతాయి మరియు తదుపరి ప్రాసెస్ చేయబడతాయి. ఏ పరిస్థితులలోనూ భౌతిక/ మాన్యూవల్ దరఖాస్తు అంగీకరించబడదు. (iii) ఆన్‌లైన్ సమర్పణ పూర్తయిన తర్వాత, దరఖాస్తుదారులు నిర్దేశించిన వెబ్‌సైట్ నుండి దరఖాస్తు యొక్క ప్రింటవుట్‌ను పొంది, దానిపై సంతకం చేసి, వారి సంబంధిత అధికారులకు, అనగా, మండల విద్యాశాఖాధికారి/ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్/డిప్యూటీ విద్యాశాఖాధికారికి సమర్పించాలి. (iv) రూల్ 2లో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం అర్హులైన హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ ఉపాధ్యాయుడు నిర్దేశించిన ప్రొఫార్మాలో బదిలీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ప్రొఫార్మాలో సమర్పించిన వివరాలు అంతిమంగా ఉంటాయి మరియు ఎటువంటి మార్పు అనుమతించబడదు. (v) జీవిత భాగస్వామి కేటగిరీ /ప్రాధాన్యత కేటగిరీల క్రింద దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారుడు రూల్ 7(i) మరియు రూల్ 9(ఎ) యొక్క నోట్ ఎ లో పేర్కొన్న విధంగా సంబంధిత అధికారి జారీ చేసిన తాజా ధృవపత్రాన్ని కూడా అప్‌లోడ్ చేసి, దరఖాస్తుతో పాటు సమర్పించాలి. (vi) దరఖాస్తులు స్వీకరించిన తర్వాత, ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు/ జిల్లా విద్యాశాఖాధికారి సంబంధిత తాత్కాలిక జాబితాలను ప్రదర్శించి, ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని ఆహ్వానిస్తారు. అభ్యంతరాలు/ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాత, అధికారి తుది జాబితాను స్టేషన్, సర్వీస్, ప్రత్యేక పాయింట్లు, ప్రాధాన్యత కేటగిరీ మరియు నెగటివ్ పాయింట్లతో పాటు వెబ్‌సైట్/నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు (vii) హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ ఉపాధ్యాయుడు ఒకసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, అది అంతిమంగా ఉంటుంది. (viii) (ఎ) రూల్ 2 క్రింద తప్పనిసరిగా బదిలీ చేయదగిన హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ ఉపాధ్యాయుడు అన్ని ఐచ్ఛికాలను ఎంచుకోవాలి. (బి) తప్పనిసరి బదిలీ హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) మరియు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోకపోతే, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు వారికి గైర్హాజరీ పరిగణనలో జారీ చేయబడతాయి మరియు కేటగిరీ IV లోని మిగిలిన అవసరమైన ఖాళీలకు కేటాయించబడతారు. ఒకవేళ కేటగిరీ IV ఖాళీలు అందుబాటులో లేకపోతే, ఆ నిర్దిష్ట కేటగిరీ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కేటగిరీ III లో కేటాయించబడతారు. 15. అభ్యంతరాలు / ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారం: (i) రూల్ 6 నుండి 10 వరకు ప్రచురించబడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా, స్టేషన్, సర్వీస్, ప్రత్యేక పాయింట్లు, పనితీరు, ప్రాధాన్యత కేటగిరీ మరియు నెగటివ్ పాయింట్లు మొదలైన వాటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే, షెడ్యూల్‌లో బదిలీ కోసం నిర్దేశించిన సమయంలోపు ఏదైనా దరఖాస్తుదారుడు అటువంటి అభ్యంతరానికి సంబంధిత సాక్ష్యంతో పాటు ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. (ii) ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు/ జిల్లా విద్యాశాఖాధికారి, సందర్భానుసారంగా, అన్ని అభ్యంతరాలని ధృవీకరిస్తారు మరియు వాటిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అభ్యంతరాలు సమర్థించబడిన సందర్భాలలో, ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు/ జిల్లా విద్యాశాఖాధికారి తాత్కాలిక సీనియారిటీ జాబితాలో అవసరమైన దిద్దుబాట్లను చేసి, తుది సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. 16. బదిలీ ఉత్తర్వుల జారీ: (i) సంబంధిత అధికారులు హెడ్మాస్టర్లు (గ్రేడ్ II)/ ఉపాధ్యాయులందరికీ డిజిటల్‌గా రూపొందించిన బదిలీ ఉత్తర్వులను జారీ చేస్తారు. (ii) తప్పనిసరి బదిలీ హెడ్మాస్టర్లు (గ్రేడ్ II) మరియు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోకపోతే, వారికి పోస్టింగ్ ఉత్తర్వులు వారి గైర్హాజరీలో జారీ చేయబడతాయి మరియు కేటగిరీ IV లోని మిగిలిన అవసరమైన ఖాళీలకు కేటాయించబడతారు , ఒకవేళ కేటగిరీ IV ఖాళీలు అందుబాటులో లేకపోతే, ఆ నిర్దిష్ట కేటగిరీ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కేటగిరీ III లో కేటాయించబడతారు. (iii) కమిటీ ఆమోదంతో సంబంధిత అధికారులు ఒకసారి బదిలీ ఉత్తర్వులను జారీ చేసిన తర్వాత, కమిటీ లేదా సంబంధిత అధికారులు ద్వారా ఉత్తర్వుల సమీక్ష లేదా మార్పు పరిగణించబడదు. (iv) అన్ని బదిలీ ఉత్తర్వులలో పోస్టింగ్ గౌరవనీయ న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న కేసుల ఫలితానికి లోబడి ఉంటుందనే షరతు ఉంటుంది. (v) ప్రభావితమైన బదిలీలు కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వెబ్‌సైట్‌లో మరియు సంబంధిత జిల్లా వెబ్‌సైట్‌లో కూడా ప్రదర్శించబడతాయి. 17. రిలీఫ్ మరియు జాయినింగ్ తేదీ: (i) బదిలీ చేయబడిన హెడ్మాస్టర్ (గ్రేడ్ II) / ఉపాధ్యాయుడు బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే వారి ప్రస్తుత పోస్టింగ్ స్థలం నుండి రిలీవ్ చేయబడతారు మరియు బదిలీ ఉత్తర్వులో పేర్కొన్న తేదీన వారు పోస్ట్ చేయబడిన కొత్త పాఠశాలలో రిపోర్ట్ చేయాలి. రిలీవ్ అయిన తర్వాత, పాఠశాల దాని రెగ్యులర్ ఉపాధ్యాయుల సంఖ్య 50% కంటే తక్కువగా ఉంటే, ఏదైనా భిన్నం తదుపరి పూర్తి సంఖ్యకు లెక్కించి రిలీవ్ చేయబడిన ఉపాధ్యాయులలో జూనియర్ మోస్ట్ తిరిగి రిపోర్ట్ చేసి, ప్రత్యామ్నాయం చేరే వరకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యను నిర్వహించడానికి రిలీవింగ్ పాఠశాలలో కొనసాగాలి. స్కూల్ అసిస్టెంట్ల విషయంలో, సబ్జెక్టు వారీగా కనీసం 50% ఉపాధ్యాయులను నిర్ధారించాలి. (ii) బదిలీ చేయబడిన స్థలంలో చేరని హెడ్మాస్టర్ (గ్రేడ్ II)/ ఉపాధ్యాయుడు, ఏ కారణం చేతనైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి వెయిట్ క్లెయిమ్ చేయలేరు. 18. ఫిర్యాదు/అప్పీల్ యంత్రాంగం (i) జిల్లా/ జోనల్/ రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. 1. జిల్లా స్థాయి కమిటీ ఎ) ఛైర్మన్: పూర్వపు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) బి) సభ్య కన్వీనర్: పూర్వపు జిల్లా సహాయ సంచాలకులు (సర్వీసెస్) సి) సభ్యులు: కొత్తగా ఏర్పడిన జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు మరియు సహాయ సంచాలకులు (సర్వీసెస్) 1. జోనల్ స్థాయి కమిటీ ఎ) ఛైర్మన్: ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు (RJDSE) బి) సభ్య కన్వీనర్: RJDSE కార్యాలయంలో సహాయ సంచాలకులు సి) సభ్యులు: జోన్‌లోని సంబంధిత జిల్లాల DEOలు 2. రాష్ట్ర స్థాయి కమిటీ ఎ) ఛైర్మన్: కమీషనర్/ పాఠశాల విద్య సంచాలకులు బి) సభ్య కన్వీనర్: అదనపు సంచాలకులు (సర్వీసెస్) సి) సభ్యులు: సంయుక్త సంచాలకులు (సర్వీసెస్), పాఠశాల విద్యా శాఖ (ii) (ఎ) ఏదైనా హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయునికి బదిలీ ఉత్తర్వులపై ఏదైనా ఫిర్యాదు లేదా అభ్యంతరం ఉంటే, అతను/ఆమె బదిలీ ఉత్తర్వు అందిన తేదీ నుండి 3 రోజులలోపు సరైన ఛానెల్ ద్వారా సంబంధిత అధికారికి ఒక వినతిపత్రాన్ని సమర్పించవచ్చు. సంబంధిత ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు (హెడ్మాస్టర్ గ్రేడ్ II విషయంలో) /జిల్లా విద్యాశాఖాధికారి (ఉపాధ్యాయుల విషయంలో) 15 రోజులలోపు ఫిర్యాదు/అభ్యంతరాన్ని పరిష్కరించాలి. (బి) జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులపై అప్పీల్ కోసం, ఒక వ్యక్తి 3 రోజులలోపు ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులకు అప్పీల్ దాఖలు చేయవచ్చు. సంబంధిత ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు 15 రోజులలోపు అప్పీల్‌ను పరిష్కరించాలి. (సి) ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకుల ఉత్తర్వులపై అప్పీల్ కోసం, ఒక వ్యక్తి 3 రోజులలోపు కమీషనర్/పాఠశాల విద్య సంచాలకులకు అప్పీల్ దాఖలు చేయవచ్చు మరియు కమీషనర్/ పాఠశాల విద్య సంచాలకులు 30 రోజులలోపు అప్పీల్‌ను పరిష్కరించాలి. (డి) బదిలీ కౌన్సెలింగ్‌పై ఏదైనా ఫిర్యాదులు ఉన్న హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు ఇతర చట్టపరమైన మార్గాల ద్వారా వెళ్ళే ముందు అన్ని స్థాయిల అప్పీల్ నిబంధనలను వినియోగించుకోవాలి. (ఇ) హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు సరైన ఛానెల్ ద్వారా సంబంధిత అధికారికి ఫిర్యాదు/అభ్యంతరాన్ని సమర్పించకుండా మరియు వారి ఫిర్యాదులను పరిష్కరించకుండా గౌరవనీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అనుమతించబడరు. (ఎఫ్) బాధిత హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు AP ఉపాధ్యాయ బదిలీ చట్టం యొక్క నిబంధనల ప్రకారం డిపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్న తర్వాత మాత్రమే కోర్టుకు వెళ్లే ఎంపికను పరిగణించవచ్చు. (జి) ఒక హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు పైన పేర్కొన్న విధానాన్ని అనుసరించకుండా కోర్టు కేసు దాఖలు చేస్తే, సంబంధిత అధికారులు APCS (CC&A) రూల్స్, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్య తీసుకుంటారు (హెచ్) సంబంధిత అధికారులు నిర్దేశించిన వ్యవధిలో అన్ని ఫిర్యాదులు మరియు మనోవేదనలను పరిష్కరించాలి. 19. పునర్విమర్శ (i) కమీషనర్ /పాఠశాల విద్య సంచాలకులు స్వయంగా లేదా రూల్ 18 ప్రకారం అన్ని పరిష్కార కమిటీలను ఉపయోగించుకున్న తర్వాత, ఈ నియమాల క్రింద ప్రభావితమైన హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుని నుండి అందిన ఏదైనా ఫిర్యాదుపై సమర్థ అధికారం యొక్క ఉత్తర్వులను పిలిపించి, బదిలీకి సంబంధించిన ఏదైనా ప్రొసీడింగ్‌ల రికార్డులను దాని క్రమబద్ధత, చట్టబద్ధత లేదా యోగ్యత గురించి సంతృప్తి చెందడానికి పరిశీలించవచ్చు. ఏదైనా సందర్భంలో, అటువంటి ప్రొసీడింగ్‌లను పునర్విమర్శించడం, సవరించడం, రద్దు చేయడం లేదా తిప్పికొట్టడం లేదా పునఃపరిశీలన కోసం పంపడం అవసరమని ఆయనకు అనిపిస్తే, ఆయన తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయవచ్చు లేదా నియమాల ఉల్లంఘన లేదా వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఏదైనా ఆదేశంతో కేసును రిమాండ్ చేయవచ్చు. అటువంటి ఉత్తర్వులను సంబంధిత అధికారులు అమలు చేయాలి. (ii) కమీషనర్ /పాఠశాల విద్య సంచాలకులు, పైన రూల్ 19 (i) క్రింద తన అధికారాలను వినియోగించే వరకు, అటువంటి ప్రొసీడింగ్‌ల అమలును నిలిపివేయవచ్చు. 20. తప్పుడు సమాచారం సమర్పించినందుకు & నియమాల ఉల్లంఘనకు క్రమశిక్షణా చర్య. (i) ఏదైనా హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయుడు తప్పుడు సమాచారం /తప్పుడు పత్రాలు/ వైద్య నివేదికలను సమర్పిస్తే, APCS (CC&A) రూల్స్, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్యకు బాధ్యత వహిస్తారు మరియు వారిని కేటగిరీ-IV పాఠశాలలకు బదిలీ చేసి, ఎటువంటి బదిలీ లేకుండా 5/8 సంవత్సరాలు తప్పనిసరిగా పనిచేయాలి. (ii) తప్పుడు సమాచారం/ తప్పుడు పత్రాలు/ వైద్య నివేదికలపై ప్రతిసంతకం చేసిన ఏదైనా అధికారి APCS (CC&A) రూల్స్, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్యకు బాధ్యత వహిస్తారు, నియమాల ప్రకారం ప్రాసిక్యూషన్‌తో పాటు. (iii) ఏదైనా సంబంధిత అధికారులు ఈ చట్టం లేదా దాని క్రింద చేసిన నియమాల నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ లేదా నియామకం లేదా బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తే, అటువంటి అధికారి, సందర్భానుసారంగా, APCS (CC&A) రూల్స్, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్యకు బాధ్యత వహిస్తారు. (iv) తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన మరియు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోని ఏదైనా హెడ్మాస్టర్ గ్రేడ్ II/ఉపాధ్యాయునికి, ఆ నిర్దిష్ట కేటగిరీ ఉపాధ్యాయుల వెబ్ కౌన్సెలింగ్ ముగింపులో కేటగిరీ IV లోని మిగిలిన అవసరమైన ఖాళీలకు మాత్రమే పోస్టింగ్ ఉత్తర్వులు వారి గైర్హాజరీలో ఇవ్వబడతాయి, కేటగిరీ IV ఖాళీలు అందుబాటులో లేకపోతే కేటగిరీ III లో కేటాయించబడతాయి. 21. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియలో బదిలీ సంబంధిత సమస్యలపై స్పష్టత అందించడానికి కమీషనర్/పాఠశాల విద్య సంచాలకులు అత్యున్నత అధికారి 22. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా ఏదీ ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట సందర్భంలో, రాతపూర్వకంగా నమోదు చేయవలసిన కారణాలతో, అటువంటి సడలింపులను సమర్థిస్తూ మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా ప్రమాణాన్ని లేదా నియమాన్ని సడలించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. 23. పేర్కొన్న నియమాలలో ఏదైనా వైరుధ్యం ఉంటే, బదిలీల చట్టం ప్రాబల్యం వహిస్తుంది. 1. ఈ ఉత్తర్వు ఆర్థిక (HR-I) శాఖ, వారి U.O.No.FIN01-HR0PDPP/96/2025-HR-I (2752204), తేది.11.05.2025 ద్వారా ఆమోదంతో జారీ చేయబడింది. (ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఉత్తర్వు మరియు పేరు మీద) కోన శశిధర్ IAS ప్రభుత్వ కార్యదర్శి దీని కాపీలు దిగువన పేర్కొన్నవారికి : ప్రింటింగ్, స్టేషనరీ మరియు స్టోర్స్ పర్చేజెస్ డైరెక్టర్, ఎ.పి., విజయవాడ, (ఎ.పి అసాధారణ గెజెట్‌లో ప్రచురణ కోసం, మరియు 1500 కాపీల సరఫరా) కమీషనర్/డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎపి, అమరావతి. రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లు & జిల్లా మేజిస్ట్రేట్లు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్య సంచాలకులు. రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు. కాపీ: సాధారణ పరిపాలన (సర్) శాఖ / ఆర్థిక శాఖ / ఎంఏ & యుడి శాఖ / పిఆర్ & ఆర్‌డి శాఖ, వెలగపూడి, అమరావతి. డైరెక్టర్, పంచాయత్ రాజ్ / డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్/ డైరెక్టర్ గిరిజన సంక్షేమం. ఎ.పి., డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి. పాఠశాల విద్యా శాఖలోని అన్ని విభాగాలు. రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, డైరెక్టర్/కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎ.పి., అమరావతి ద్వారా. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి పి.ఎస్. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి ఓ.ఎస్.డి. కార్యదర్శి (ఎస్.ఇ)కి పి.ఎస్. ఎస్ఎఫ్/ఎస్సి (2711367). // ఫార్వార్డ్ చేయబడింది :: ఉత్తర్వు ద్వారా // సెక్షన్ ఆఫీసర్ అనువాదం మరియు సవరణ : ఏపీ టీచర్స్ టీవీ 🌐www.apttv.co.in and www.apttv.in YouTube: @apttv Email: AP Teachers TV










